పిట్ట ఆత్మ స్తైర్యం
ఒక రోజు ఒక సాధువు దేవుని గురించి తపస్సు చెయ్యటం మొదలు పెట్టాడు .కానీ కొన్నిరోజుల తరువాత అతనిలో ఆత్మ స్తైర్యం చాలక మధ్యలోనే మానేసాడు ,అంతేకాక దేవుడు ఉన్నాడా ఏంటి ఉంటే నేను చేసిన తప్పసుకు ఏనాడో ప్రత్యక్షం అయ్యే వాడు అనడం ప్రారంభించాడు . అటుగా వెళుతున్న ఆ సాధువుకు చెరువులో ఉన్న నీటిని తోకతో తోడటం మొదలు పెట్టిన పిట్ట కనిపించింది. అది చూసిన సాధువు ఆ పిట్టను ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని ప్రస్నించాడు . దానికి సమాధానంగా పిట్ట కోపంతో ఈ చెరువు వడ్డున ఉన్న చెట్టుఫైన గూటిలో నుంచి జారి పడ్డ నా పిల్లలను మింగేసింది అందుకే ఈచెరువును తోకతో తోడి ఎండ పెట్టేస్థా. అని చెప్పింది . దానితో అతనికి గ్య్యానోదయo అయ్యింది . తిరిగి వెళ్లి తపస్సుచేయ్యటం మొదలుపెట్టాడు అలా చేసిన కొన్ని రోజులకి అతనికి దేవుడు ప్రత్యక్షం అయ్యాడు . నీకు మోక్ష సిద్ధిని ప్రసాదిస్తాను అని వరంఇచ్చాడు . తరువాత ఆ చెరువు దగ్గరనుంచి వెళుతున్న అతనిని పిలిచింది పిట్ట. చూసావా నేను ఈ నీటిని తోదలేఖ పోతున్నానని దేవుడు ఈ చెరువును ఎండగట్టాడు అని చెప్పిన్ధి. (అది వేసవి కాలం).
మనం ప్రయత్నం చేస్తే దేవుడు కూడా సాయం చేస్తాడు.
మనం ప్రయత్నం చేస్తే దేవుడు కూడా సాయం చేస్తాడు.
Comments
Post a Comment