Posts

Showing posts with the label కాళిదాసు

కాళిదాసు గర్వభంగం

మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయల్దేరాడు. మిట్ట మధ్యాహ్న సమయానికి ఒక కుగ్రామానికి చేరుకున్నాడు. బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు. ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంటుంది. ఆమెను చూసి... ‘బాలికా! నాకు దాహంగా ఉంది. నీళ్లు ఇవ్వమ’ని అడిగాడు కాళిదాసు. అప్పుడా బాలిక... ‘మీ రెవరో నాకు తెలియదు.. నీళ్లు ఎలా ఇచ్చేద’ని బదులిచ్చింది. కాళిదాసు: ‘నేను ఎవరో తెలియక పోవడం ఏంటి? పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతార’ని అన్నాడు.* అహంకార పూరిత మైన ఆ మాటలు విని బాలిక నవ్వి... ‘మీరు అసత్య మాడుతున్నారు. ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు. వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను’ అంటుంది. అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి... ‘నాకు తెలియదు. గొంతు ఎండి పోతోంది. ముందు నీళ్లు ఇవ్వమ’ని బతిమాలుకుంటాడు. అయినా ఆ బాలిక కనికరించదు. ‘ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి, దాహం. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?’ అని అడుగు తుంది. బాలిక.* ‘నేను బాటసారి’ని అన్నాడు కాళిదాసు. ‘మళ్లీ అసత్య మాడుతున్నారు. బాటసారి అంటే ఒకచోటి నుంచి మరోచోటికి బడలిక లేకుండా వెళ్లాలి. మీరేమో అలిసి పోయారు కదా. ఈ లోకం లో అలా అలసి ...