Posts

Showing posts with the label నీతి కధలు

మతిలేని మృగరాజు

ఒక దట్టమైన అడవిలో ఒక సింహం నివసించేది. అడవికి రాజైన ఆ సింహం, ప్రతిరోజు జంతువులని తినేది, ఒకేసారి ఒక్కటి, ఒక్కోసారి రెండు లేదా మూడింటిని కూడా తింటూ ఉండేది. జంతువులన్నీ తమ రాజుతో విసిగిపోయాయి. అందుకని అవి ఒకరోజు సమావేశం ఏర్పాటుచేసి, ఒక నిర్ణయానికి వచ్చాయి. అదేమంటే, ఒకవేళ సింహం తన గుహనుండి బయటికి రాకుండా ఉండాలంటే అవి రోజుకి ఒక జంతువును ఆహారంగా ఆ సింహం వద్దకే పంపించాలి. రోజుకో జంతువు తనకి తానుగా సింహం దగ్గరికి వెళితే, మిగతావి మనశ్శాంతిగా అడవిలో జీవించగలవు. రోజులు గడుస్తున్నాయి. జంతువుల సంఖ్య తరిగిపోతూనే ఉంది. మృగరాజు తన గుహలోనే కుర్చుని తన దగ్గరకు వచ్చిన భోజనాన్ని ఆనందిస్తూ తినేది. ఒక రోజు ఒక కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు భయపడుతూనే గుహకు బయలుదేరింది. అది తాబేలులాగా నెమ్మదిగా నడుస్తూ గుహ చేరుకునేసరికి సాయంత్రం అయింది. ఆకలితో అలమటిస్తున్న సింహానికి కుందేలుపైన ఎంతగానో కోపం వచ్చింది. కుందేలు భయంతో ఏడవడం మొదలు పెట్టింది. "ఓ రాజా! ఇది నా తప్పు కాదు. మా జంతువుల సభ తప్పు కుడా కాదు. మా సభ వాస్తవానికి ఏడు కుందేళ్ళని పంపిందికానీ, మమ్మల్ని దారిలో ఒక దుర్మార్గుడు ఆపాడు. వాడు మిమ్మల్ని తిట్టాడు ...

టక్కరి నక్క

ఒక అడవిలో టక్కరి నక్క ఒకటి ఉండేది. ఆ అడవిలోనే ఓ పశువుల కాపరి గుడిసె వేసుకుని నివసించేవాడు. అతడికి కోళ్లు, కుక్కలు, బర్రెలు, ఆవులతో పాటు మేకలు కూడా ఉండేవి. వాటిని అడవిలో మేపి, పాలు పితికి జీవనం సాగించేవాడు కాపరి.ఆ గుడిసెలోని చిన్నవైన మేకపిల్లలపై టక్కరి నక్క కన్నుపడింది. ఎలాగైనా సరే వాటిని తినేయాలని అది చాలా కాలం నుంచి ప్రయత్నిస్తోంది. అయితే వాటికి ఎప్పుడూ తల్లి మేక కాపలాగా ఉండటం వల్ల దీనికి సాధ్యం కాలేదు. ఒకరోజు తల్లి మేక మేతకు అడవికి వెళ్ళటంతో చిన్నవైన పిల్లలు గుడిసెలోనే ఉండిపోయాయి. తల్లి మేక వెళ్తూ వెళ్తూ తాను తప్ప ఎవరు వచ్చి తలుపు తట్టినా తీయవద్దని పిల్లలకు జాగ్రత్త చెప్పి మరీ వెళ్ళింది. ఇదంతా ఓ చాటున దాక్కుని వింటోన్న టక్కరి నక్క, ఇదే మంచి సమయమని, ఎలాగైనా ఈరోజు తన పని కానిచ్చేయాలని పథకం వేసింది. తల్లిమేక వెళ్లిన కాసేపటికి నక్క గుడిసె వద్దకు వెళ్లి, "నేనే మీ అమ్మను, తలుపు తియ్యండర్రా. ..!" అని అరచింది.లోపల ఉన్న చిన్న పిల్లలకు అది తమ తల్లి గొంతులాగా అనిపించక పోవటంతో... "నువ్వు మా అమ్మవు కావు. మా అమ్మ గొంతు ఇంత కరుకుగా ఉండదు" అని అన్నాయి. తన పని సాధ్యం కాదని భావించి...

చేప ముందుచూపు

అనగనగా ఒక చెరువులో మూడు చేపలు ఉండేవి. అసలే ఎండాకాలం, చెరువులో ఎప్పటికప్పుడు నీళ్లు తగ్గిపోతుండటంతో చేపలన్నీ చచ్చిపోతున్నాయి. దీంతో కలత చెందిన మూడు చేపలు ఒకచోట సమావేశమైనాయి. అయ్యో.. ఈ సంవత్సరం ఇప్పటిదాకా వానలే పడటం లేదు. మన చెరువులో చూస్తే... నీళ్ళు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఈరోజు కొంతమంది జాలర్లు వచ్చి, ఇంకో పది రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయి. అప్పుడు వచ్చి ఈ చేపలన్నింటినీ వలవేసి పట్టుకెళ్లిపోవచ్చు అని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడే ఉంటే మనం చచ్చిపోవడం ఖాయం" అని అనుకున్నాయి. మొదటి చేప మాట్లాడుతూ... ఇక్కడికి దగ్గర్లోనే ఇంకో పెద్ద చెరువు ఉంది, మనందరం అక్కడికి వెళ్లిపోదాము అని అంది. ఇది విన్న రెండో చేప... "సర్లే ఆ జాలర్లు వచ్చినప్పుడు కదా మనకి అపాయం. అప్పటిదాకా ఖంగారు పడాల్సిందేమీలేదు" అని తేల్చి చెప్పింది. ఇక మూడో చేప... "నీళ్ళు ఇంకిపోయినప్పుడు, జాలర్లు వచ్చినప్పుడు కదా... ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఇప్పట్లో లేదంటూ" ఎంచక్కా వెళ్లిపోయింది. ఎంతచెప్పినా మిగతా రెండు చేపలు వినక పోవడంతో... మొదటి చేప ఆ రాత్రికి రాత్రే నెమ్మదిగా దొర్లుకుంటూ పక్కనే కొద్ది దూరంలో ఉన్న పె...

చిత్రకారుడి సమయస్ఫూర్తి

కొండవీడు రాజ్యానికి సుదర్శనుడు అనే రాజు ఉండేవాడు. చక్కని రూపం, ఎంచక్కని తెలివితేటలతో సుందరాంగుడు అనేట్టుగా వుండే ఆయనకు పుట్టుకతోనే చిన్న అవలక్షణం ఉండేది. ఎడమకన్ను కాస్త మెల్లగా ఉండటమే ఆ అవలక్షణం.ఆయన అందం గురించి అందరూ మెచ్చుకుంటూంటే పైకి సంతోషించినా మెల్లకన్ను గురించి కాస్త బాధపడేవాడు. అందరూ మెచ్చుకునే తన అందమైన రూపం చిత్రపటంలో చూసుకోవాలనిపించింది సుదర్శనుడికి. ఆ విషయమే మంత్రి మాధవుడితో చెప్పాడు. వెంటనే ‘రాజుగారి అందమైన చిత్రం గీసిన వారికి విలువైన బహుమతులు అందిస్తా’మంటూ రాజ్యమంతా దండోరా వేయించాడు మంత్రి. ఆ వార్త విన్న రాజ్యంలోని చిత్రకారులంతా ఎంతో ఆనందించారు. కాని రాజును చూడగానే వారి ఆనందం ఆవిరై పోయింది. రాజుకున్న మెల్లకన్ను చిత్రంలో చూపిస్తే ఆయన ఆగ్రహానికీ, ఆ పైన వేసే శిక్షను ఊహించుకుని వచ్చిన చిత్రకారులంతా ప్రాణభయంతో బతుకుజీవుడా అంటూ మళ్లీ వస్తామంటూ వెళ్లిపోయారు. చివరికి రాజాస్థానంలో ధైర్యంగా ముగ్గురు చిత్రకారులు ధైర్యంతో మిగిలారు. సింహాసనంపై ఠీవిగా కూర్చున్న సుదర్శనుణ్ని చూస్తూ బొమ్మలు గీయడానికి సిద్ధమయ్యారు ఆ ముగ్గురు చిత్రకారులు. గంటసేపు కష్టపడి ముగ్గురూ ఎవరికి వారు రాజుగారి చిత్ర...

వర్తకుడి సమయస్ఫూర్తి

ఒకసారి ఒక సామంతరాజు దగ్గరకు ఒక గుర్రాల వర్తకుడు వచ్చాడు. అతనితో పాటు ఒక గుర్రం కూడా ఉంది. ‘‘ప్రభూ! నా దగ్గర ఈ గుర్రంలాంటి మేలైన, నాణ్యమైన గుర్రాలున్నాయి. అవి మీ అశ్వశాలలో తప్పకుండా ఉండవలసినవి. వాటిలోంచి మీకోసం ఏరికోరి ఈ గుర్రాన్ని తీసుకువచ్చాను’’ అని విన్నవించుకున్నాడు. ‘‘అలాగా... దీని ధర ఎంత చెప్తున్నావు?’’ అని అడిగాడు రాజు.‘‘ఎంతో కాదు, మహారాజా... రెండువందల బంగారు నాణాలు ఇవ్వండి చాలు’’ అన్నాడు వర్తకుడు. ‘‘ధర చాలా ఎక్కువ? రెండువందల బంగారు నాణాలకి నేను పది గుర్రాలు కొంటున్నాను’’ అన్నాడు రాజు. ‘‘ప్రభూ! దీన్ని ప్రత్యేకించి మీకోసమే తెచ్చాను. మీకు ఇష్టమైన ధర ఇచ్చి ఈ ఒక్కదానిని తీసుకోండి’’ అని ప్రాధేయపూరకంగా అన్నాడు వర్తకుడు. రాజు ఇరవై బంగారు నాణాలకు బేరం కుదిర్చాడు. అప్పటికప్పుడే ధనం తెప్పించి వర్తకుడికి ఇచ్చాడు. వర్తకుడు తన చేతిలో ధనం పడగానే గబుక్కున గుర్రం ఎక్కి పారిపోసాగాడు. ఆ సంఘటనతో రాజు బిత్తరపోయాడు. అక్కడే ఉన్న సైనికాధికారులు గుర్రాలను అధిరోహించి వర్తకుడిని పట్టుకోవడానికి అతని వెంటే పరుగెత్తారు. చాలాసేపటికి సైనికాధికారులు ముఖాలు వేలాడేసుకుని ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు. రాజు వర్తకుడ...

కుందేలుకు గుణపాఠం

కుందేలు, తాబేలు స్నేహితులు. కుందేలుకు తను తెల్లగా అందంగా ఉంటానని, వేగంగా పరుగెత్తగలనని గర్వంగా ఉండేది. ఒకరోజు కుందేలుకు తాబేలును ఏడ్పించాలని పించింది. ‘‘మిత్రమా! రేపు మా ఇంటికి వస్తావా? నీ కోసం రుచికరమైన ఆహారం సిద్ధం చేస్తాను. సరిగ్గా భోజనాల వేళకు రావాలి’’ అంది. ‘సరే’ అంది తాబేలు. తాబేలు వేగంగా నడవలేకపోవడంతో, కుందేలు ఇంటికి ఆలస్యంగా చేరుకుంది. ‘‘నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు మిత్రమా! ఇంతసేపూ చూసి నేను తినేశాను’’ అంది కుందేలు నవ్వు బిగపట్టుకుంటూ. తాబేలుకు కుందేలు ఉద్దేశ్యం అర్థమైంది. ఎలాగైనా దానికి గుణపాఠం చెప్పాలనుకుంది. కొద్దిరోజుల తరువాత తాబేలు కుందేలును తన ఇంటికి విందుకు పిలిచింది. కుందేలు... తాబేలు చెప్పిన సమయం కంటే ముందే వెళ్ళింది. ‘‘కాళ్ళు కడుక్కుని రా నేస్తం. భోజనం సిద్ధంగా ఉంది’’ అంది తాబేలు. గుమ్మం అవతల నల్లటి తారును పూసి ఉంచింది తాబేలు. కుందేలు నుయ్యి దగ్గర కాళ్ళు కడుక్కుని, గడప దాటి లోపలికి అడుగుపెట్టగానే ‘‘అయ్యో! నీ కాళ్ళకు నల్లగా ఏదో అంటుకుంది. శుభ్రం చేసుకునిరా!’’ అంది. కుందేలు అలాగే చేసింది. ఈసారి కూడా దాని కాళ్ళకు తారు అంటుకుంది. తాబేలు మళ్ళీ పంపించింది. ఇలా చాలాసార్లు జ...

చిట్టెలుక ఉపకారం

ఒక అడవిలో పెద్ద సింహం ఒకటి ఉండేది. ఆ అడవికి రాజుగా అది పెత్తనం చెలాయిస్తూ ఉండేది. ఆ అడవిలోనే చిట్టెలుక కూడా ఉండేది. ఒకరోజు సింహం చెట్టు క్రింద పడుకొని ఉండగా, పక్క ఉన్న కన్నంలోనుంచి చిట్టెలుక అటూ, ఇటూ పరుగెత్తుతూ సింహం కాలును తొక్కింది.అంతే.. సింహానికి పట్టరాని కోపం వచ్చి పంజా విదిలించి, తన కాలుకింద చిట్టెలుక అదిమిపట్టింది. బాగా భయపడిపోయిన చిట్టెలుక గజగజా వణుకుతూ.. మృగరాజా... నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు, ఎప్పుడో ఒకప్పుడు తమరికి ఉపకారం చేసి పెడతానని దీనంగా వేడుకుంది. చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా విరగబడి నవ్వుతూ... "ఏమన్నావు.. నువ్వు నాకు సాయం చేస్తావా..? నా కాలివేలు గోరంత కూడా లేవు. పిసరంత ప్రాణం కలిగిన నువ్వు నాకు ఉపకారం చేస్తావా...? ఎంత విచిత్రం..." అని నవ్వుతూ.. సర్లే బ్రతికిపో.. అంటూ చిట్టెలుకను వదిలిపెట్టింది. దీంతో బ్రతుకుజీవుడా అనుకుంటూ చిట్టెలుక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయింది. కాలం అలా గడవసాగింది. ఒకరోజు అనుకోకుండా సింహం ఒక వేటగాడి వలలో చిక్కుపోయి గింజుకుంటూ కనిపించింది చిట్టెలుకకి. ఎంత గింజుకున్నా వలలోంచి తప్పించుకోలేని సింహం... కొంత సేపట్లో వేటగాడు వచ్చి,...

అహం ఉంటే పైకి రాలేవు మిత్రమా!

Image
ఒక మహానగరం లో ఒక గొప్ప శిల్పి వుండేవాడు. ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే, పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ పట్టలేక పోయేవారు. ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గది లోకి వెళితే, అవన్నీ ప్రాణమున్న వాటివిగా, మన పక్కన వున్నట్టు, మనకు చేయి అందిస్తున్నట్టు, మనతో మాట్లాడుతున్నట్టు…సజీవంగా వుండేవి…ఎటూవంటివారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే! ఆ అసాధారణ ప్రతిభ, నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని [ Ego ] నింపాయి. ఇదిలావుండగా, ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని, జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి ‘మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా!” అని చెప్పాడు. శిల్పికి చెమటలు పట్టాయి, ఆయన ఇలా అనుకొన్నాడు, నేను బ్రహ్మ లాంటివాడిని కదా! ఆయన [ బ్రహ్మ ] మనుషులను సృష్టిస్తే, ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా….అనిపించే శిల్పాలు సృష్టిస్తాను…కాబట్టి, నేను అపర బ్రహ్మ అవుతాను. మృత్యువు వచ్చిన రోజున నాలాగే వున్న మరో ఏడు శిల్పాలను చెక్కి వుంచుతాను. అపుడు మృత్యు దేవత ప్రాణమున్న శిల్పి ఎవరో, బొమ్మ ఏదో కనుక్కోలేక వెళ్ళిపోతుంది. నేను మృత్యువుకు దొరకను అని ఉపాయం పన్నాడు. అచ్చు తనలాగా వున్న శిల్పాలు ఏడు చెక...

బిర్బాల్ ఖిచాడి

Image
  ఒకసారి చల్లని శీతాకాలపు రోజున, అక్బర్ మరియు బీర్బల్ ఒక సరస్సు మీదుగా వెళుతున్నారు. అక్బర్ ఆగి, గడ్డకట్టే నీటిలో వేలు పెట్టి, “ఈ చల్లని నీటిలో ఎవరైనా రాత్రి గడపగలరని నేను అనుకోను” అని చెప్పి వెంటనే దాన్ని బయటకు తీశాడు. బీర్బల్ దానిని ఒక సవాలుగా తీసుకున్నాడు మరియు అలా చేయగల వ్యక్తిని కనుగొంటానని చెప్పాడు. సరస్సు యొక్క చల్లని నీటిలో ఒక రాత్రి గడపగలిగిన వారికి 1000 బంగారు నాణేల మొత్తాన్ని అక్బర్ వాగ్దానం చేశాడు. త్వరలో, 1000 బంగారు నాణేల కోసం సవాలును స్వీకరించడానికి అంగీకరించిన ఒక పేద వ్యక్తిని బిర్బల్ కనుగొన్నాడు. ఇద్దరు రాజ కాపలాదారుల రక్షణలో, పేదవాడు రాత్రంతా గడ్డకట్టే నీటిలో నిలబడ్డాడు. ఉదయం, పేదవాడిని బహుమతి కోసం కోర్టుకు తీసుకువెళ్లారు. గడ్డకట్టే నీటిలో ఎలా నిలబడగలరని రాజు అడిగినప్పుడు, ఆ వ్యక్తి, “నా ప్రభూ, నేను దూరం వద్ద కాలిపోతున్న దీపం వైపు చూస్తూనే ఉన్నాను, నా రాత్రంతా దాన్ని చూస్తూనే ఉన్నాను” అని సమాధానం ఇచ్చాడు. ఇది తెలుసుకున్న చక్రవర్తి, "ఈ వ్యక్తి సరస్సులో నిలబడగలిగినందున అతను దీపానికి వెచ్చదనం పొందుతున్నందున బహుమతికి అర్హుడు కాదు" అని చెప్పాడు. పేదవాడు విచారకరంగ...

అహంకరిస్తే అవమానం తప్పదు!

మనిషి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి! అలా కాకుండా తన అదృష్టాన్ని చూసి విర్రవీగుతూ ఇతరులను చులకన చేయాలని చూస్తే మాత్రం భంగపాటు తప్పదు. తలెత్తుకుని తిరిగినచోటే, అవమానభారంతో తలదించుకోకా తప్పదు. అందుకు ఉదాహరణగా మహాభారతంలో ఒక కథ కనిపిస్తుంది. పూర్వం ఓ ధనిక వర్తకుడు ఉండేవాడు. అతగాడికి ముగ్గురు పిల్లలు. ఆ ముగ్గురు పిల్లలూ ఓ కాకిని ముద్దుచేయసాగారు. వారు విదిలించే ఎంగిలి ఆహారాన్ని తిని ఆ కాకి గుండ్రంగా తయారైంది. రోజూ మృష్టాన్నం దొరకడంతో దాని అతిశయానికి అంతులేకుండా పోయింది. అసలు తనలాంటి పక్షి ఈ భూమ్మీదే లేదన్నంతగా దాని పొగరు పెరిగిపోయింది. ఆ పొగరుకి తగినట్లుగానే మిగతా పక్షులని చులకన చేయసాగింది. కాలం ఇలా సాగుతుండగా ఒక రోజు ఓ హంసల గుంపు వినువీధిలో ఎగురుతూ కాకికి కనిపించాయి. ‘మీ వాలకం చూస్తుంటే నాకు జాలి వేస్తోంది. ఎలాంటి కదలికలూ లేకుండా నిదానంగా సాగడం మాత్రమే మీకు తెలసు. అదే నేనైతేనా.. నూటొక్క రకాలుగా ఎగరగలను. ఒకో భంగిమలోనూ వందల యోజనాలు ప్రయాణించగలను. కావాలంటే నాతో పోటీ పడి చూడండి!’ అంటూ ఆ హంసలను రెచ్చగొట్టింది కాకి. కాకి మాటలను విన్న ఓ హంస, దాని దగ్గరకు వచ్చింది. ‘మేము ఎక్కడో మానససరోవరం నుంచీ ప్రయాణిస...

పైపై మెరుగుల కోసం పాకులాడితే

అనగనగా ఓ రెండు గుర్రాలు ఉండేవి. దేవతా గుర్రాలంటే మాటలా! పాలరాతి తెలుపుతో, నురగలాంటి జూలుతో మహా అందంగా ఉండేవి. వాయువేగంతో ముల్లోకాలూ చుట్టిపారేసేవి. జనం ఆ గుర్రాలను చూసినప్పుడల్లా ముక్కున వేలేసుకునేవారు. అంత అందమైన గుర్రాలను చూడటంతో తమ జన్మ ధన్యమైపోయిందని మురిసిపోయేవారు. కానీ ఆ గుర్రాల మనసులో ఏదో చింత! రెండు గుర్రాలనీ అంతా సమానంగా చూస్తున్నారు. రెండూ అందమైనవే అనీ, రెండూ వేగమైనవే అనీ పొగుడుతున్నారు. ‘అలా జరగడానికి వీల్లేదు! ఈ ప్రపంచంలో అన్ని గుర్రాలకంటే నేనే అందంగా ఉండాలి,’ అన్న ఆలోచన రెండు గుర్రాలలోనూ కలిగింది. అంతే వాటిలో ఒక గుర్రం నిదానంగా దేవుడి దగ్గరకి చేరింది. ‘భగవంతుడా! నన్ను ఇంత అందంగా అద్భుతంగా సృష్టించినందుకు కృతజ్ఞతలు. దేవతా గుర్రంగా నా జన్మ ధన్యమైపోయింది. కానీ నాదో చిన్న కోరిక,’ అంది ఆ గుర్రం. దాని మనసులో మాట గ్రహించినట్లుగా భగవంతుడు ఓ చిరునవ్వు నవ్వి- ‘నువ్వు దేవతా గుర్రానికి. నీ కోరికని తీర్చాల్సిందే! ఏం కావాలో కోరుకో!’ అన్నాడు. ‘నేను అందంగా ఉన్న మాట నిజమే కానీ ఇంకాస్త అందంగా ఉంటే బాగుండు అన్న దుగ్థ నన్ను తెగ వేధిస్తోంది. ఆలోచించి చూస్తే నాలో చాలా అవకరాలే కనిపిస్తున్నాయి. అ...

ఎదిగిన మనిషి

అతను కోట్ల రూపాయల విలువ చేసే సంస్థకు అధిపతి. కానీ ఆ సంస్థను ఆయన తరువాత చేపట్టేందుకు పిల్లలు లేరు. అయినా ఆయన పెద్దగా బాధపడేవాడు కాదు. తన ఉద్యోగులలో సమర్థమైనవాడికే ఆ సంస్థ పగ్గాలు అందించాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. ఆ రోజు రానేవచ్చింది. తనకు వారసుడిగా ఆ కంపెనీని ఎవరి చేతిలో ఉంచాలా అని నిశ్చయించేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి ఒక పదిమంది ఉద్యోగులు హాజరయ్యారు. ‘‘సుదీర్ఘకాలంగా నా సంస్థలోని ఉద్యోగులందరినీ గమనించిన మీదట, వందలాది మంది ఉద్యోగులలలో మీరు అత్యంత సమర్థులు అని తేలింది. ఇక మీలో ఎవరో ఒకరికి నా కంపెనీ బాధ్యతలని అప్పచెప్పబోతున్నాను,’’ అన్నాడు యజమాని. యజమాని మాటలకి ఉద్యోగుల మనసులు సంతోషంతో గంతులు వేశాయి. కానీ ‘‘మీ అందరిలోకి ప్రతిభావంతుడు ఎవరా అని తేల్చేందుకు నేను ఒక పరీక్షను పెట్టాలనుకుంటున్నాను,’’ అని యజమాని చెప్పేసరికి అప్పటిదాకా సంతోషంతో ఎగిరిన వారి మనసులు కాస్తా బిక్కచచ్చిపోయాయి. ఈలోగా యజమాని తన ముందున్న ఒక పెట్టేలోంచి పది గింజలను బయటకు తీశాడు. ‘‘సంస్థ అనేది ఒక మొక్కలాంటిది. ఆ మొక్కను పెంచి పెద్దచేయాలంటే ఎంతో శ్రమ, మరెంతో పట్టుదల అవసరం. మీలో అలాంటి లక్షణాలు ఎంతవ...

చీమలు నేర్పే జీవితపాఠాలు

గ్రహించే మనసు ఉండాలే కానీ మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని అణువణువూ ఓ జీవితపాఠాన్ని నేర్పుతుందంటారు పెద్దలు. ఇందుకు చీమలనే ఓ ఉదాహరణగా తీసుకోవచ్చునేమో. విశ్లేషించడం అంటూ మొదలుపెడితే, చీమల నుంచి ఎన్నో విలువైన పాఠాలు కనిపిస్తాయి. వాటిలో కొన్ని... పూర్తిస్థాయి సామర్థ్యం తాము అల్పంగా ఉన్నాం కదా అని చీమలు వెనకడుగు వేయవు. ఎంతబరువు మోయగలవో అంత బరువునీ మోసేందుకు సిద్ధంగా ఉంటాయి. అందుకేనే చీమలు తమ బరువుకంటే దాదాపు 5000 రెట్లు అధికబరువుని మోయగలిగే సామర్థ్యాన్ని అలవర్చుకుంటాయని తాజా పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. కానీ మనుషులు అలా కాదు! ఎన్నో ఆలోచనలు చేయగల సామర్థ్యం, వాటిని అమలుపరిచే సత్తా ఉన్నా లేనిపోని పరిమితులను ఊహించుకుని గిరగీసుకుని తిరుగుతూ ఉంటారు. అలాంటివారికి చీమలు ఓ గొప్ప గుణపాఠం కదా! వెనకడుగు వేసేది లేదు ఆహారం కోసం బారులుగా బయల్దేరిన చీమలకి దారిలో ఏదన్నా అడ్డు వచ్చిందనుకోండి... అవి వెనక్కి వెళ్లడం జరగదు. ముందుకు వెళ్లేందుకు మరో మార్గం ఏముంటుందా అని అన్వేషిస్తాయి. అటుతిరిగీ ఇటుతిరిగీ ఎలాగొలా గమ్యానికి చేరుకుంటాయి. ఒకటి రెండు అడ్డంకులకు బెంబేలెత్తిపోయి చేతులెత్తేసే మనకి ఇలా నిరంతరం లక్ష్యం వైపుగా ...

తనదాకా వస్తే కానీ

అది ఓ మారుమూల పల్లెటూర్లోని చిన్న పెంకుటిల్లు. పెద్దగా సంపద లేకపోయినా ఆ ఇంట్లో సంతోషానికి మాత్రం లోటు లేదు. ఓ భార్యాభర్తా, వారికి ఓ కొడుకూ కూతురు... ఇలా నలుగురూ హాయిగా ఆ ఇంట్లో జీవిస్తుండేవారు. వాళ్లు మిగిల్చిన చిన్నా చితకా ఆహారం మీద ఓ ఎలుక బతుకుతూ ఉండేది. ఇలా ఉండగా ఓ రోజు ఆ ఇంటి యజమాని ఏదో కొత్త వస్తువుని తీసుకురావడం ఆ ఎలుక గమనించింది. అదేమిటా అని తన కన్నంలోంచి చూసిన దాని గుండె పగిలిపోయింది. తనని పట్టేసేందుకు యజమాని ఒక బోను తీసుకువచ్చాడు. ఎలుక లబోదిబోమంటూ పెరట్లోకి పరుగులెత్తింది. ఆ ఇంటి పెరట్లో ఒక కోడి, మేక, పొట్టేలు ఉన్నాయి. ముందుగా కోడి దగ్గరకి వెళ్లి ‘మీ యజమాని నాకోసం ఒక బోను తీసుకువచ్చాడు. అది ఎవరికైనా హాని చేయవచ్చు జాగ్రత్త! వీలైతే దాన్ని నీ కాళ్లతో లాగి అవతల పారేయ్‌,’ అంటూ హెచ్చరించింది ఎలుక. ఎలుక మాటలకు కోడి నవ్వేస్తూ- ‘నీ కోసం తెచ్చిన బోనుతో నాకు ప్రమాదం ఎలా ఉంటుంది. నేను దాని జోలికే పోను. నువ్వే జాగ్రత్త!’ అంది. అయినా ఎలుక తన పట్టు విడవకుండా పక్కనే ఉన్న మేక, పొట్టేలు దగ్గరకు కూడా వెళ్లి ఇదే హెచ్చరికను చేసింది. కానీ వాటి నుంచి కూడా కోడి చెప్పిన జవాబులాంటి సమాధానమే వినిపించింద...

బూరుగు చెట్టుకి గర్వం వస్తే!

నీతి కథల గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు అందరూ పంచతంత్రం గురించే మాట్లాడతారు. నిజానికి మానవస్వభావాల గురించీ, ఆ స్వభావాల మధ్య మసులుకునే ఉపాయాల గురించీ మన ఇతిహాసాలలో సైతం బోలెడు కథలు కనిపిస్తాయి. మహాభారతంలోని శాంతిపర్వంలో అయితే ఇలాంటి కథలు అడుగడుగునా కనిపిస్తాయి. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తరువాత భీష్ముడు తదితర పెద్దలు, ధర్మరాజుకి చేసిన బోధల సారమే శాంతిపర్వం! పంచతంత్రంలాగానే ఇందులో కూడా జంతువులూ, చెట్లూ, పక్షులూ పాత్రలుగా కనిపిస్తాయి. అందులోని ఒక కథలో ఓ బూరుగు చెట్టుకి ఎలా గర్వభంగం అయ్యిందో చూడండి. అనగనగా హిమాలయ పర్వత శిఖరాల మీద ఒక బూరుగు చెట్టు ఉండేది. విశాలమైన శాఖలతో, విస్తారమైన కాండంతో... ఆ బూరుగు చెట్టు తన తెల్లటి దూదితో మరో మంచుకొండను తలపిస్తూ ఉండేది. ఒక రోజు అటువైపుగా వెళ్తున్న నారదుని దృష్టి ఆ బూరుగు చెట్టు మీద పడనే పడింది. ‘వేల అడుగుల ఎత్తున ఇంతటి మహావృక్షం మనుగడ సాగించడం సాధ్యమేనా!’ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా బూరుగు చెంతకు వెళ్లి... ‘‘నువ్వు అల్లంత ఎత్తున ఇంతగా విస్తరించి ఉన్నావు కదా! మరి నీకు ఏనాడూ ఆ వాయుదేవుని వల్ల నష్టం వాటిల్లలేదా? ఆయన తన పవనాలతో నిన్ను విరిచేందుకు ప్ర...

ఎందుకు సంపాదించాలి!

చాలా రోజుల క్రితం ఓ పిసినారి ఉండేవాడు. అతని యావంతా డబ్బు మీదే! సాయంత్రమయ్యేసరికి ఇంకొకరితో కన్నీళ్లు పెట్టించయినా, తన కడుపు కొట్టుకుని అయినా వీలైనంత డబ్బుని పోగుచేసుకోవాలన్నదే అతని తాపత్రయం! రోజురోజుకీ ఇంట్లో డబ్బు మూటలు పోగవుతున్న కొద్దీ పిసినారికి వాటిని పెంచుకోవాలన్న యావ పెరగసాగింది. ఇలా కాలం గడిచేకొద్దీ ఒకటి కాదు, రెండు కాదు... పదుల కొద్దీ నాణెపు మూటలు పోగవడం మొదలయ్యాయి. ఇంతవరకూ బాగానే ఉంది! కానీ ఎక్కడైతే నిధి ఉంటుందో అక్కడ అశాంతి తప్పదు కదా! ఎప్పుడు ఎవరి కన్ను పడుతుందా? ఎవరు వచ్చి తన నెత్తిన ఒక దెబ్బ వేసి ఆ మూటలను దోచుకుపోతారా? అని బిక్కుబిక్కుమంటూ పిసినారి కాలం గడపడం మొదలుపెట్టాడు. ఈ భయంతో అతనికి రాత్రిళ్లు కూడా సవ్యంగా నిద్ర పట్టేది కాదు. తన ఆస్తంతా ఇలా దోచుకుపోవడానికి సిద్ధంగా ఉండటమే... తనలోని అశాంతికి కారణం అని అర్థమైంది పిసినారికి. దాంతో అతను ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. ఒకరోజు తన నాణెపు మూటలన్నీ తన బండిలో వేసుకుని పట్నానికి బయల్దేరాడు. అక్కడ నేరుగా ఒక బంగారపు దుకాణానికి చేరుకున్నాడు. తన వద్ద ఉన్న నాణెలకు బదులుగా బంగారాన్ని ఇవ్వమని బేరం పెట్టాడు. దుకాణం యజమానికి ఇదంతా చాలా సాధారణ...

సమయస్ఫూర్తి

ఇది అన‌గా అన‌గానాటి మాట. అప్పట్లో ఓ మారుమూల గ్రామంలో... పార్వత‌మ్మ అనే ముస‌ల‌మ్మ ఉండేది.  ఆమెకి పాపం రానురానూ క‌ళ్లు మ‌స‌క‌బారిపోయాయి. ఓ రోజు త‌న గ్రామంలోకి ఒక వైద్యుడు వ‌చ్చాడ‌నీ, ఆయ‌న హ‌స్తవాసి చాలా మంచిద‌నీ పార్వత‌మ్మ విన్నది. ఆ వైద్యుడి వ‌ల్ల త‌న క‌ళ్లు బాగుప‌డి తిరిగి ఈ అంద‌మైన లోకాన్ని చూసే భాగ్యం క‌లిగితే బాగుండు అనుకుంది. అనుకున్నదే త‌డువుగా, త‌న‌ పక్కింటి కుర్రవాడిని బ‌తిమాలుకుని, అత‌ని చేయిప‌ట్టుకుని ఆ వైద్యుని వద్దకు చేరుకుంది. ‘బాబూ నాకు నా ఇంటినీ, ఆ ఇంటి చుట్టూ ఉండే తోట‌నీ, ఆ తోట‌లో పూల‌నీ, వాటిపై వాలే సీతాకోక‌చిలుక‌ల్నీ... తిరిగి ఈ క‌ళ్లతో చూడాల‌ని ఆశ‌. అందుకోసం నా ద‌గ్గర దాచుకున్న డ‌బ్బంతా ఇవ్వ...

ఎలా స్పందిస్తారో మీ ఇష్టం!

అనగనగా ఓ అమ్మాయి. ఆ అమ్మాయికి చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి నిబ్బరంగా సంసారాన్ని నెట్టుకొస్తూ ఉంది.  కానీ కూతురు మాత్రం ప్రతి చిన్న కష్టానికీ కంగారుపడిపోయేది. ఏం చేయాలో పాలుపోక తెగ బాధపడిపోయేది. ‘ఇక ఈ కష్టాలను భరించడం నా వల్ల కాదమ్మా!’ అని ఓ రోజు తన తల్లితో తెగేసి చెప్పింది కూతురు. తల్లి, కూతరి వంక ఒక్క నిమిషం చూసింది. ఆ తరువాత మారుమాట్లాడకుండా ఆమెను వంటింట్లోకి తీసుకువెళ్లింది. తల్లి తనకేం చెప్పాలనుకుందో తెలియని అయోమయంలో కూతురు ఆమెను అనుసరించింది. వంటింట్లోకి వెళ్లిన తల్లి ఒక మూడు పాత్రలు తీసుకుంది. ఒకదానిలో బంగాళదుంప, మరోదానిలో కోడిగుడ్డు, ఇంకోదానిలో కాఫీ గింజలు వేసి వాటిని పొయ్యి మీద పెట్టింది. తల్లి చేస్తున్న పని చాలా అసంబద్ధంగా తోచింది కూతురికి. అయినా మారు మాటాడకుండా చూస్తూ నిల్చొంది. ఒక పది నిమిషాలు అయిన తరువాత... ‘ఒకో గిన్నెలో ఏం జరిగిందో గమనించు’ అంటూ అడిగింది తల్లి. ‘గమనించడానికి ఏముంది! బంగాళదుంప వేడి నీటికి మెత్తబడిపోతుంది. కోడిగుడ్డు గట్టిపడిపోతుంది. కాఫీ గింజలతో కాఫీ తయారవుతుంది’ అంది కూతురు ఎగతాళిగా. ‘కదా! పైకి గట్టిగా కనిపించే బంగాళదుంప కాస్త వేడినీరు తగలగానే ఇ...

స్వేచ్ఛకి సాటేది!

అనగనగా ఓ అందమైన చిలుక! అడవిలో తన నేస్తాలతో కలసి ఆడుతూ పాడుతూ ఉండే ఆ చిలుక కాస్తా ఆ దారిన పోతున్న ఓ వర్తకుడి కంట్లో పడింది. అంతే! అదను చూసి దాన్ని తన సంచిలో వేసుకుని ఇంటికి పట్టుకుపోయాడు ఆ వర్తకుడు. వర్తకుడి ఇంట్లో చిలుకకి అన్నీ ఉండేవి… ఒక్క స్వేచ్ఛ తప్ప! వెండి పంజరంలో దాన్ని బంధించి, బంగారు పళ్లెంతో దానికి ఆహారాన్ని అందించేవాడు వర్తకుడు. అయినా చిలుక మనసంతా అడవి మీదే ఉండేది. ఇదిలా ఉండగా ఆ వర్తకుడు వ్యాపారం చేసేందుకు మళ్లీ బయల్దేరాల్సిన సమయం ఆసన్నమైంది. ‘చూడూ! నేను మళ్లీ నీ కుటుంబం ఉండే అడవిగుండానే వెళ్తున్నాను. అక్కడ నీ నేస్తాలతో ఏదన్నా సందేశాన్ని అందించాల్సి ఉంటే చెప్పు!’ అన్నాడు వర్తకుడు. ‘సరే! నా కుటుంబం ఉండే ఆ మామిడి చెట్టు మీకు గుర్తే కదా! అక్కడికి వెళ్లి మీ తోటి చిలుక చాలా బాధలో ఉంది అని చెప్పండి. ఏదో తిండీ తిప్పలూ వెల్లమారిపోతున్నాయే కానీ స్వేచ్ఛ కరువైందని చెప్పండి. తను ఎక్కడున్నా తన మనసు మీతోనే ఉంటుందనీ, మిమ్మల్ని కలిసే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటుందనీ చెప్పండి.’ అంది చిలుక. చిలుక చెప్పిన సందేశాన్ని తీసుకుని వర్తకుడు అడవిగుండా ప్రయాణాన్ని సాగించాడు. అక్కడ అతనికి చిలుక కుటుంబం ని...

ముసలి ఆవుని తరిమేస్తే!

అనగనగా ఒక గురువుగారు తన శిష్యునితో కలిసి హిమాలయాలలో సంచరిస్తున్నారు. ఒకరోజు వాళ్లు అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా చీకటి పడిపోయింది. ఎటు చూసినా చిమ్మచీకటి. ఈ చీకటివేళలో తలదాచుకునేందుకు చోటు దొరికితే బాగుండు దేవుడా అని వాళ్లు ప్రార్థిస్తుండగా, కాస్త దూరంలో ఒక చిన్న దీపపు వెలుగు మిణుకుమిణుకుమంటూ కనిపించింది. ఆ వెలుగుని అనుసరిస్తూ వెళ్లిన గురుశిష్యులకి ఒక చిన్న గుడిసె కనిపించింది. ఏ సమయంలోనైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ గుడిసెలోకి అడుగుపెట్టిన వాళ్లిద్దరికీ అందులో ఏ మూల చూసినా పేదరికం సాక్షాత్కరించింది. ఈ పేదరికం మధ్య బతుకుతున్న ఓ కుటుంబమూ కనిపించింది. ఒక భార్యాభర్తా, వారి ఇద్దరు పిల్లలూ చిరిగిన బట్టలతో చలికి వణుకుతూ కనిపించారు. ‘మేం దారి తప్పిపోయి ఇటువైపుకి వచ్చాం. మీరు కనుక ఈ రాత్రికి ఇక్కడ ఉండనిస్తే, ఉదయాన్నే వెళ్లిపోతాము.’ అని అభ్యర్థించాడు శిష్యుడు. ‘ఓ దానిదేం భాగ్యం’ అన్నాడు గృహస్థు. ఆ రాత్రి మాటల మధ్యలో ‘మీకు జీవనోపాధి ఎలా?’ అని అడిగారు గురువుగారు. దానికి ఇంటి పెరట్లో కట్టేసి ఉన్న ఓ ముసలి ఆవుని చూపిస్తూ ‘అదిగో ఆ ముసలి ఆవే మాకు జీవనాధారం. అది రోజూ కాసిని పాలు ఇస్తుంది. ఆ పాలు తాగి, ద...