(Telugu) రామయ్య-రంగయ్యల కథ
[:te]ఒక నగరంలో రామయ్య, రంగయ్య అనే వర్తకులిద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. ఒకసారి రామయ్యవ్యాపార నిమిత్తం దూర దేశాలకు వెళ్తూ తన వద్దనున్న వంద టన్నుల లోహమును తన స్నేహితుడైన రంగయ్యకు ఇచ్చి జాగ్రత్తగా దాచి ఉంచమని చెప్పి తాను ఊరు వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత రామయ్య సొంత ఊరుకి తిరిగి వచ్చి మిత్రుని ఇంటికి పోయి "మిత్రమా! నాకు విదేశీ వ్యాపారం కలిసి రాలేదు. అందుకని తిరిగి మన ఊరిలోనే మునుపటి లోహ వ్యాపారం చేయదలచాను. నేను నీ వద్ద దాచి ఉంచిన లోహం నాకు ఇమ్ము" అని అడిగాడు. "అయ్యో మిత్రమా! ఈ ఏడు ఎలుకల బాధ ఎక్కువైంది. మా ఇంటిలోని వస్తువులతో పాటు నీ లోహమంతయు అవితిని పొట్టన పెట్టుకొన్నవి. ఈ మాట నీకు చెప్పటానికి నోరు రాలేదు. నేనెంతగానో చింతించాను" అది ఆ దేవునికే తెలుసు అంటూ ఆ రంగయ్య కంటతడి పెట్టాడు. మిత్రుడు తనను మోసం చేశాడని రామయ్య గ్రహించి "వీనితో తగువు పడుట కంటే సమయం చూచి దెబ్బకు దెబ్బ తీయుట మంచిది" అని భావించి, "నా దురదృష్టమునకు నీవేమి చేయగలవు రంగయ్య! జరిగిన దానికి చింతించి లాభం లేదు. నా దురదృష్టం నన్ను వెంటాడుతూనే ఉంది" అని పలికి ఇంటికి వెళ్ళిపోయాడు. తరువాత అతడు ...