(Telugu) తెలుగు సూక్తులు

[:te]

  1. విశ్వాసం, అఖండ విశ్వాసం, మనమీద మనకే విశ్వాసం, దేవుడి మీద కూడా అంతే విశ్వాసం. ఇవే గొప్పతనంలోని రహస్యాలు.


2. విషయం సమగ్రంగా తెల్సుకోకుండానే తృణీకరించకండి. నిర్ణయించకండి.

3. విస్తరించడం జీవితం అవుతుంది, ముడుచుకుని పోవడం మరణం అవుతుంది.

4. వెంట వచ్చేది సంసారం కాదు, సంస్కారం.

5. వెయ్యి మంది మిత్రులున్న వ్యక్తి ఒక్కరిని కూడా వదులుకోలేడు. ఒకే ఒక శత్రువున్న వ్యక్తి అతన్ని ప్రతిచోట కలుస్తాడు.

6. వెలుతురు వైపు చూడడం నేర్చుకో. ఇక నీకు నీలినీడలు కనిపించవు.

7. వేగంగా వాగ్ధానం చేసేవారు నిదానంగా నెరవేరుస్తారు.

8. వేదన అనేది రానున్న కష్టానికి చెల్లించే ముడుపు.

9. వేదనలకు కుంగిపోక చేతినిండా పని కల్పించుకుంటే ఆనందసుమం దానంతటదే వికసిస్తుంది.

10. వ్యక్తి శీలం నిర్ణయించేది అతని నడవడిక గానీ, వేషంకాదు.

11. శక్తి అన్నిటిని జయిస్తుంది. కానీ ఆవిజయాలు కొద్దికాలం మాత్రమే ఉంటాయి.

12. శతృత్వం అన్నది మూర్ఖుల వృత్తి.

13. శాంతంగా ఉండండి. అప్పుడు ప్రతివారిని అదుపు చేయగల్గుతారు.

14. శాంతి కొరవడినప్పుడు సమాజంలో ప్రగతి ఉండదు.

15. శాంతిని ఎవ్వరూ దానం చేయరు, ఎవరికి వారు సాధించుకోవాలి.

16. శారీరక రోగాల కంటే మానసిక రుగ్మతలు ఎక్కువ హానిని కలిగిస్తాయి.

17. శోకస్య కారణం మోహం మీలో దుర్గణాలన్నీ మోహాలే. వాటి ఫలితం ధుఃఖం. వాటిని వదిలించుకోండి.

18. శ్రద్ధగా వినడం అలవాటు చేసుకో. బాగా మాట్లాడలేనివారి నుండి కూడా మీరు లాభం పొందుతారు.

19. శ్రమ శరీరాన్ని బలపరచినట్లే కష్టాలు మనస్సును బలపరుస్తాయి.

20. శ్రమకు ఫలితంగా పొందే గొప్ప పారితోషికం మనిషిలో వచ్చే మార్పే కాని అతనికి వచ్చే ప్రతిఫలం కాదు.

21. శ్రమవల్ల లభించేది గొప్ప బహుమానం కానే కాదు. శ్రమవల్ల వచ్చే మార్పే గొప్ప బహుమానం.

22. శ్రమించు, అన్వేషించు, గ్రహించు కానీ, లోబడకు.

23. సంకల్పబలం ఉన్న హృదయానికి సంభవం కానిదంటూ ఏదీ ఉండదు.

24. సంఘటనలు కావు కాని వాటి వెనుకనున్న కారణాలు ఆసక్తికరంగా ఉంటాయి.

25. సంతృప్తి పేదవానికి సంపద ఇస్తుంది. అసంతృప్తి ధనవంతుణ్ణి పేదవానిగా చేస్తుంది.

26. సంతృప్తి శత్రువులు దాడిచేసి వశపరచుకోలేని కోటలాంటిది. మీలో ఈ సంతృప్తిని బలపరుచుకోండి.

27. సంతోషం అన్నది మీరు పొందే వస్తువుపై కాకుండా మీరు ఇచ్చే వస్తువుపై ఆధారపడి ఉంటుంది.

28. సంతోషం మనిషి తీరు అవుతుందేకాని మనిషి దగ్గరున్న వస్తువు ఏమాత్రం కాదు

29. సంతోషం మిత్రుల సంఖ్యలో కాదు వారి యోగ్యతలో మరియు ఎన్నికల్లో ఉంది

30. సంపద ఉప్పు నీటి లాంటిది ఎంత తాగితే అంత దప్పిక పెరుగుతుంది.

31. సజీవమైన నమ్మకం లేనిదే ఈ ప్రపంచంలో మనం ఏమి సాధించలేము.

32. సజ్జనులతో మైత్రి చిరకాలం నిలిచి ఉంటుంది.

33. సత్యం అంతా శాశ్వతమైనది. సత్యం ఎవరిసొత్తూ కాదు. ఏ జాతికి, ఏ వ్యక్తికి సత్యంపై ప్రత్యేక హక్కు లేదు.

34. సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, క్షమ - ఈ ఆరే ఆప్తులైన బంధువులు.

35. సత్యదేవతకు మనం చూపగల భక్తి, ఆ వెలుగులో నడవగలగడమే.

36. సత్యమే జయిస్తుంది కానీ అసత్యం కాదు.

37. సత్యమే సర్వరక్ష దానికి మించిన రక్ష వేరొకటి లేదు.

38. సత్యానికి దూరంగా ఉండడం అంటే శాంతి నుండి దూరంగా ఉండడం.

39. సత్యాన్ని గూర్చిన సిద్దాంతాలు మారిన అసలు సత్యం ఎప్పటికీ మారదు.

40. సత్యాన్ని మించిన ధర్మం లేదు, పరోపకారాన్ని మించిన దైవప్రార్థన లేదు.

41. సమదృష్టి గల మనస్సు అన్ని దు:ఖాలకు ఉత్తమ ఔషధము.

42. సమదృష్టి గల మనస్సు అన్ని దుఃఖాలకు ఉత్తమ ఔషధము.

43. సమన్వయం నుండి నిజమైన ఆనందం పుట్టుకొస్తుంది.

44. సమయాన్ని వ్యర్థం చేయడం చాలా సర్వసాధారణమైన నేరం.

45. సమాజం నేరాన్ని తయారుచేస్తుంది, దాన్ని నేరస్తుడు చేస్తాడు.

46. సరి క్రొత్త అవకాశానికి కాలంతో నిమిత్తం ఉండదు.

47. సరిగా ఉండటం కంటే విమర్శించటం అతి తేలిక.

48. సరివారితో స్నేహం చేసి, తక్కువ వారిపై కరుణ చూపి, అధికులతో ఆనందించి, చెడ్డవారికి దూరంగా ఉండాలి.

49. సరైనదేదో తెలుసుకుని దాన్ని చేయకపోవడం అన్నది పిరికితనం అవుతుంది.

50. సర్వేజనా సుఖినో భవంతు అని ప్రార్ధించండి, మనకు ఏది మంచిదో భగవంతుడికి బాగా తెలుసు.

51. సహజత, సరళత జీవితాన్ని తియ్యగా చేస్తాయి.

52. సహనం అందరికి అవసరం. మొదట మనకు అవసరం.

53. సహనం ప్రతిభకు అవసరమైన ముడి పదార్ధం.

54. సహించగలిగిన వ్యక్తే సంపదలను పొందగలడు.

55. సాధించిన విజయం కంటే అభిలాష ఎంతో గొప్పది.

56. సాహసించని వాడు గెలుపును సాధించలేడు.

57. సిద్దమైన వ్యక్తి సగం యుద్దం జయించినట్లే.

58. సుఖదుఃఖాల బంగారు ఇనుప తీగలు మన జీవితంలో విడదీయలేనంతగా కలిసిపోయి ఉన్నాయి.

59. సుగుణమే నిజమైన గొప్పదనం.

60. సులభంగా నేర్చుకున్న పాఠాలు సులభంగా మరచిపోబడతాయి.

61. సూర్య కిరణాల లాగా మంచి నడవడిక కాంతిని నలుమూలలా ప్రసరింపజేస్తుంది.

62. సూర్యకాంతి వైపు మీ ముఖాన్ని పెట్టుకోండి, నీడలు మీ వెనుక ప్రక్కపడతాయి.

63. సూర్యుడి వైపు ముఖం చేయండి. అప్పుడు చెడు మీకు కనిపించదు.

64. సోమరి తనం మూర్ఖుల సెలవు రోజు.

65. సోమరితనం, దుబారాగుణం, చెడు ప్రవర్తనలే మనుషుల అనేక దురదృష్టాలకు కారణాలు.

66. స్ధిరమైన మీ న్యాయబుద్ది మీ ప్రతి వ్యవహారంపై తన చెరగని ముద్రను వేస్తుంది

67. స్నేహాన్ని క్రమం తప్పకుండా నిరంతరంగా మరమ్మత్తు చేస్తూ ఉండాలి.

68. స్వతంత్రంగా ఆలోచించడాన్నీ, స్వతంత్రంగా బ్రతకడాన్ని నేర్పేదే విద్య.

69. స్వర్గం - నరకం రెండూ మనలోనే ఉన్నాయి.

70. స్వార్ధం చిట్టచివర్లో ఉన్నప్పుడే సేవ ఉత్తమంగా ఉంటుంది.

1. రెండు దుఃఖముల మధ్య విరామమే సుఖం.

2. రేపన్నది సోమరులు ఎక్కువగా పని చేయవలసిన రోజు.

3. రోజుకు 5 ముఖ్యమైన పనులు నిర్ణయించుకొని వాటిని పూర్తి చేసేందుకు పట్టుదల వహించండి.

4. రోజూ తాను చేస్తున్న పనితో సంతృప్తి పొందినవాడే గొప్ప ధనవంతుడు.

5. లక్ష్యం పెద్దదైతే త్యాగమూ పెద్దదే కావాలి.

6. లెండి! మేల్కొండి! గమ్యాన్ని చేరుకునే వరకూ విశ్రమించకండి! - స్వామి వివేకానంద.

7. లోకమనే ఉద్యానవనంలో పూచిన పువ్వులు పిల్లలు.

8. లోకానికి అవసరమైనవి చేతలే కాని, మాటలు కావు.

9. లోభికి నాలుగు దిక్కులా నష్టం.

10. వంతెనలను కాకుండా గోడలను కట్టుకునేందువల్ల ఒంటరితనానికి ప్రజలు లోనవుతున్నారు.

11. వంద ఉదార భావాల కన్న ఒక్క అందమైన పని మిన్న - జేమ్స్ రసెల్ లోవెల్.

12. వయసు మళ్ళిన వారివి వెనుకటి కాలపు గాధలు, వయసులో ఉన్న వారివి ముందున్న స్వప్నాలు.

13. వయసు వివేకం ఈ రెండూ కలిసి సంచరించవు.

14. వయసులో రోజులు పొట్టి, ఏళ్ళు పొడవు, పెద్దయ్యాక ఏళ్ళు పొట్టి, రోజులు పొడవు.

15. వయస్సులో నేర్చుకున్నది రాతి మీద చెక్కిన చెక్కడంతో సమానం.

16. వస్తువ విలువ అవసరాన్ని బట్టితెలుస్తుంది.

17. వస్తువుకాదు వస్తువు పరమైన ఆలోచనే దాన్నిమంచిగానూ లేదా చెడ్డగానూ మారుస్తుంది.

18. వాడని ఇనుము తుప్పు పడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్దకం మెదడును నిస్తేజం చేస్తుంది.

19. వాడి అయిన ముళ్ళే తరచుగా నాజూకైన గులాబీని ఇస్తాయి.

20. వాత్సల్యం బుద్దిని మందగిస్తుంది.

21. వాయిదా వేయడం అన్నది కాలాన్ని హరించే దొంగ.

22. వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయండి.

23. వికారమైన మనస్సు కంటే వికారమైన ముఖమే మంచిది.

24. విచక్షణ రాహిత్యం మానసిక అంధత్వం.

25. విజయం అన్నది ఒక మనోభావన, అది మీ మనోబలంతో ప్రారంభమవుతుంది.

26. విజయం గురించే ఎక్కువగా ఆలోచించండి.

27. విజయాల నుండి వినయాన్ని, పరాజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకొన్నవాడే గొప్పవాడు.

28. విజేత ఎన్నడూ విడిచిపెట్టడు, విడిచి పెట్టేవాడు ఎన్నడూ జయించడు.

29. విత్తొకటి నాటిన మొక్కొకటి రాదు.

30. విద్య ఇచ్చిన తేజస్సు అందరినీ ఆకర్షిస్తుంది.

31. విద్య ఐశ్వర్యంలో ఆభరణము వంటిది; దారిద్ర్యంలో ఆశ్రయం వంటిది.

32. విద్య యొక్క అర్ధం, పరమార్ధం రెండూ వ్యక్తిని ఉత్తమమైన వానిగా రూపొందింపచేయడమే.

33. విద్య యొక్క నిజమైన పరమార్ధం ఉత్తమ వ్యక్తిని రూపొందింప చేయడమే.

34. విద్య లేని వారికి కీర్తి లేదు.

35. విద్య సౌభాగ్యానికి ఒక ఆభరణం మరుయు ప్రతి కూలతలో ఒక అభయస్ధానం.

36. విద్యను ఆర్జించడం కంటే కూడా అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడం చాలా కష్టం

37. విద్యను పొందడం సులభమే కాని వివేకం పొందడం కష్టతరమైన కార్యం.

38. విద్యాధికుడై, తన పాండిత్యాన్ని ఉపయోగించుకోని మనిషి - పుస్తకాల బరువు మోసే మృగం.

39. విధేయత మాత్రమే ఆజ్ఞాపించే హక్కు ఇస్తుంది.

40. వినయం గొప్పతనాన్ని ప్రకటిస్తుంది.

41. వినయం నీవు ధరించే విలువైన వజ్రం.

42. వినయం ప్రతిష్ఠకు సులభ మార్గం.

43. విమర్శలను చూసి భయపడకూడదు. గాలిపటం ఎప్పుడూ ఎదురు గాలిలోనే పైకి లేస్తుంది.

44. విరగడం కంటే వంగడం మంచిది.

45. వివేకవంతులతో సాహచర్యం నిన్నుకూడా వివేకవంతుణ్ణి చేస్తుంది - మినాండర్.

46. వివేకవంతులైన వారెప్పుడూ గతంలో కాకుండా వర్తమానంలో జీవిస్తారు.

47. వివేకానికి మొదటి అడుగు ఏది అసత్యమో తెలుసుకోవడమే.

48. వివేకాన్ని పాటించే చోట శాంతి పుష్కలంగా లభిస్తుంది.

49. విశ్వాసం పరమ బంధువు.

50. విశ్వాసం వ్యక్తిత్వాన్ని వైభవోజ్వలం చేస్తుంది.

1. మనోవికారాలకు గురి అయిన జీవితం ఆత్మవినాశనంతో ముగుస్తుంది.

2. మన్నించడం మంచిది, మర్చిపోవడం ఇంకా మంచిది - బ్రౌనింగ్.

3. మహనీయులకు ఆనందం ఇచ్చేది విజయం కాదు పోరాటం.

4. మహాపురుషుల జీవితాలే మానవాళికి ఉత్తమ ఉపాధ్యాలు

5. మాట ఇవ్వటానికి తొందరపడకు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తొందరపడు.

6. మాటల కంటే చేతలు బిగ్గరగా మాట్లడతాయి.

7. మాటలు కాదు మనసు ముఖ్యం.

8. మానవుని ప్రయత్నం దైవ విశ్వాసం కార్యసాధనకు మార్గం.

9. మానసిక శక్తి క్షీణిస్తే మనిషి యొక్క పవిత్రత క్షీణిస్తుంది.

10. మారణాయుధాలు మనల్ని నాశనం చేయకముందే మనం వాటిని నాశనం చేయటం అవసరం.

11. మార్పు అన్నది జీవితానికి రుచినిచ్చే మసాలా లాంటిది.

12. మార్పు తప్ప ఈ ప్రపంచంలో శాశ్వతమైనది మరేదీ లేదు.

13. మితము తప్పితే అమృతమైనా విషమే.

14. మితిమీరిన అభిలాష కలిగిన వాడే దరిద్రుడు.

15. మిత్రుడిని ఎన్నుకున్నట్లే రచయితను కూడా ఎన్నుకోండి.

16. మిత్రులకు పరస్పర విశ్వాసం ఉంటే చావు బ్రతుకులు ఆలోచించరు. మిక్కిలి ఒంటరిగా నిలబడే వాడే మిక్కిలి బలశాలి - ఇబ్బెన్.

17. మిమ్మల్ని మీరు నిందించికోవడం మహాపాపం.

18. మీ ఆలోచనా సరళి మార్చుకుంటే ఆ మీ జీవన సరళి తానుగా మారుతుంది - డా. నార్మన్ విన్సెంట్ పీలే.

19. మీ కళ్ళద్దాలు సరిగ్గా తుడుచుకోక ఈ ప్రపంచం మురికిగా ఉందని అనకండి.

20. మీ కష్టాలను కాదు మీ దీవెనలను లెక్కపెట్టుకోండి.

21. మీ కొడుకుకు మీరు ఇవ్వగలిగిన ఒకే ఒక కానుక ఉత్సాహం.

22. మీ కోరికలు అంతులేనివైతే, మీ చింతలూ, భయాలూ కూడా అంతులేనివే - థామస్ పుల్లర్.

23. మీ తప్పులను ఇతరులు అతిశయోక్తిగా చెప్పేముందే మీరు ఒప్పుకోండి.

24. మీ తప్పులు మీ విజయానికి కావల్సిన కొత్త పాఠాలు.

25. మీ పట్ల మీ అభిప్రాయం గొప్పదై వుండాలి. ఈ ప్రపంచంలో మీ గురించి ఆలోచించే మొదటి వ్యక్తి మీరే.

26. మీ పెదవుల ద్వారా కంటే మీ జీవితం ద్వారానే మీరు ఒక మేలైన నీతివాక్యాన్ని బోధించవచ్చు.

27. మీతోటి వారి కష్టాలను గట్టెక్కించండి. మీ కష్టాలు తాముగా గట్టెక్కుతాయి.

28. మీరు ఆపలేని పనిని ప్రారంభించకండి.

29. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థిలో ఉన్నప్పుడు మౌనం అన్నది అతి సురక్షమైన నీతి.

30. మీరు మంచి వారు మాత్రమే కాదు మంచికి కూడా కారకులు.

31. మీరు మీరుగా ఉండండి. పక్షపాత రహితంగా సీదాసాదాగానూ, నిజాయితీతోనూ ఉండండి.

32. మీలోని మంచితనం మరింత మంచితనంగా, మరింత మంచితనం అతి మంచితనంగా మారనంత వరకు విశ్రమించండి.

33. మూగవాడు మాట్లాడగల భాష చెవిటివాడు వినగల భాషే దయ.

34. మూర్ఖుడితో స్నేహం కన్నా బుద్దిమంతుడితో విరోధం మంచిది.

35. మూర్ఖుడు కూడా శాంతంగా ఉంటే వివేకి క్రిందే లెక్క - ఓల్డ్ టెస్ట్ మెంట్.

36. మూర్ఖుడు చివర చేసేదాన్ని వివేక వంతుడు వెంటనే చేస్తాడు.

37. మూర్ఖుల వల్ల వివేకులకు లాభమే మూర్ఖులు చేసే తప్పులు తాము చేయకుండా వారు జాగ్రత్తపడతారు.

38. మూర్ఖులు విజయాన్ని, యోగ్యులు కీర్తిని పొందుతారు.

39. మృదువైన సమాధానం ఆగ్రహాన్ని పోగొడుతుంది.

40. మేథశక్తిని చూపగానే సరికాదు. హృదయ వైశాల్యం కూడా కనబరచాలి.

41. మౌనం మనిషికి ఉత్తమోత్తమ ఆభరణం.

42. యదార్థవాది లోకవిరోధి.

43. యధార్థం తెలియని వారితో వాదించి ప్రయోజనం లేదు.

44. యుద్ధ భూమిలో విజయాన్ని సాధించిన వారికి మాత్రమే కాకుండా ప్రశాంతతను శాంతిని కాపాడిన వారికి కుడా కీర్తి దక్కుతుంది.

45. యుద్ధానికి ఏమాత్రం తీసిపోని గొప్ప జయాలను శాంతి కూడా సాధించింది - జాన్ మిల్డన్.

46. యౌవనంలో కూడబెట్టు వార్ధక్యంలో వాడుకో.

47. రహస్యంగా ద్వేషించటం కంటే బహిరంగముగా చివాట్లు పెట్టటం ఉత్తమం.

48. రాజకీయాల్లో మతం ఉండదు - లెబనీస్.

49. రుజువులతో నిమిత్తం లేకుండా ఒక విషయాన్ని సత్యంగా భావించడం నమ్మకం.

50. రూపొందిచబడిన మనిషి దేవుడు అయితే చిక్కుకున్న దేవుడు మనిషి అవుతాడు.

మందగించక ముందు అడుగెయ్ వెనుకబడితే వెనకేనోయ్ - గురజాడ.

2. మతం భయాన్ని జయిస్తుంది. అది అపజయానికీ, మరణానికీ కూడా విఱుగుడు మందు.

3. మన అవసరాలు ఎంత తగ్గితే దేవుడికి మనం అంత చేరువ అవుతాము.

4. మన కర్తవ్యాన్ని ఉపేక్షిస్తే, మనమే స్వయంగా నష్టపోతాము.

5. మన దురదృష్టాలకు మూలకారణం ఇతరులలో తప్పులు వెదకడం మనలోని తప్పులను తెలుసుకోగలిగితే అనేక సుగుణాల ద్వారాలు తెరుచుకుంటాయి.

6. మన మాటలు చెప్పేదానికన్న మన జీవితం చెప్పేది ఉత్తమమైనది.

7. మనం అభ్యుదయాన్ని పొందాలంటే చరిత్ర తిరిగి రానివ్వకుండా కొత్త చరిత్రను సృష్టించాలి.

8. మనం ఇతరులలో లోపాన్ని ఎత్తి చూపే ముందు మనలో ఆ లోపం ఉండకుండా చూసుకోవాలి.

9. మనం ఎంత ఎక్కువ కృషి చేస్తే, అంత ఎక్కువగా అదృష్టం మనల్ని వరిస్తుంది.

10. మనం ఎంత చదివితే మన అజ్ఞానం అంత బయటపడుతుంది.

11. మనం ఏ పని చేసినా సర్వశక్తులను, మనస్సును దానిపై స్థిరంగా కేంద్రీకరించినప్పుడే ఆ పనిని సక్రమంగా చేయగలుగుతాము.

12. మనం చదివినదంతా మరచిపోయినప్పుడు చదువే వెనుక నుండి మనల్ని బలపరిచేందుకు మిగులుతుంది.

13. మనం చేసే పనిని ఎవ్వరూ విమర్శించకుండా ఉండేలా చేయాలంటే ఆ పనిని ఎన్నటికీ చేయలేం.

14. మనం చేసే పనిని పదిమందీ పంచుకుంటే, చేసే పని ఎంతో తేలికైపోతుంది.

15. మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చుకాని, ఏ పనీ చెయ్యకుండా మాత్రం మనం ఆనందం పొందలేం.

16. మనం చేసేవి చిన్న ప్రయత్నాలైనా వ్యర్ధం కావు.

17. మనం ప్రేమించలేని వ్యక్తులను ప్రేమించడమే జీవితపు నిజమైన కష్టం అవుతుంది.

18. మనం ప్రేమించే దాన్నిబట్టి మనం తీర్చిదిద్దబడతాము, రూపు దిద్దుకుంటాము.

19. మనం సమాధానంలో భాగం కావాలి కాని, సమస్యలో భాగం కాకూడదు.

20. మనకు ఉన్నదాన్నే ఉత్తమంగా రూపొందించుకుంటామని తీర్మానించుకుందాము.

21. మనకు ఎదురయ్యే అపజయాలన్నింటికీ ప్రధాన కారణం మనలో ఆత్మవిశ్వాసం లేకపోవడమే.

22. మనకు ఎదురయ్యే అవరోధాల వెనుక అనంతమైన విజయాలు దాగి ఉంటాయి.

23. మనకు జరిగేది కాదు మనలో జరిగే మార్పు గొప్పది.

24. మనకు తక్కువ జ్ఞానం ఉన్నప్పుడే విషయాలు బాగా అర్థం అవుతాయి. అధికజ్ఞానంతో పాటు సందేహం కూడా పెరుగుతుంది.

25. మనలను మనం జయించగలగడం మాత్రమే చిరకాలం నిలుస్తుంది. ఈ విజయం ఎలాంటి విచారాన్ని కలిగించదు.

26. మనలో ఉండే ఆనందాన్ని గ్రహించక బయట ప్రపంచంలో ఉందని భ్రమించడం అజ్ఞానం.

27. మనలో తప్పులు లేకపోతే ఇతరుల తప్పులను ఎత్తిచూపడానికి అంత ఉత్సాహపడము

28. మనలో లోపాలే లేవనుకోవడానికి మించిన తప్పిదం లేదు.

29. మనల్ని మనం మన శత్రువుకంటే ఎక్కువ నిశితంగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే మనలో మనకు కనిపించే మిత్రుడి కంటే గొప్ప మిత్రుడు ఇంకెక్కడా లేడు.

30. మనసు భగవంతుడికి అప్పగించి హస్తాలను పనికి అప్పగించెయ్ - స్వామి ఓంకార్.

31. మనసునిండా నిజాయతీ పెల్లుబకాలే కాని, అటువంటి మనిషి తక్కిన ఎంతోమందికన్నా మిన్నగా దేశానికి సేవలు అందించగలుగుతాడు - పండిట్ మోతీలాల్ నెహ్రూ.

32. మనసును ఎంత అదుపులో పెట్టుకోగలడో మనిషి అంత గొప్ప వాడవుతాడు.

33. మనస్సు గాలిగొడుగు లాంటిది. తెరచినప్పుడే అది పనిచేస్తుంది.

34. మనస్సును చెదిరించడం బలహీనత, మనసు లగ్నం చేయడమే శక్తి.

35. మనస్సులో అలజడి ఉన్నప్పుడు ముఖంలో ప్రశాంతత కనిపించదు.

36. మనిషి అనామకునిగా మారటానికి అహంకారం అనేది ప్రధాన కారణమవుతుంది.

37. మనిషి ఎప్పుడైతే అధికంగా వినడం నేర్చుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు.

38. మనిషి చేసే అనేక తప్పులకు కారణం అతనిలోని అహంకారమే.

39. మనిషి నుండి ఎన్నటికీ వేరు చేయలేని ఒకే ఒక్క సంపద విద్య.

40. మనిషి ముసలివాడై చావుకు సిద్దమై ఉన్నా అతని ఆశ మాత్రం అణగదు.

41. మనిషి యొక్క అతి విలువైన సంపదే కాలం.

42. మనిషి శరీరం కంటే ముందుగా ఆత్మని శుద్ది చేయడం ఎంతైనా అవసరం. ఎందుకంటే వ్యర్ధమైన జీవితం కంటే మృత్యువు శ్రేయస్కరం.

43. మనిషికి నాలుక ఒకటే చెవులు మాత్రం రెండు. దీనర్ధం తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. అని - అబ్రహన్ హస్ దాయ్.

44. మనిషికి విజ్ఞానం కన్నా మంచిమిత్రుడు లేడు, అఙ్ఞానం కన్నా పరమశత్రువు లేడు.

45. మనిషికి సాధించగలనన్న ఆత్మవిశ్వామే అన్ని విషయాలకు మూలం.

46. మనిషిపట్ల మనిషికున్న అమానుషత్వం లెక్కలేనంత వేల మందిని విచారపడేలా చేస్తుంది.

47. మనిషిలో ఉన్న పరిపక్వతకు బాహ్యరూపమే చదువు.

48. మనిషిలో జ్ఞానం అనేది పెరిగేకొద్ది తనలోని అజ్ఞానం తెలిసివస్తుంది.

49. మనుషుల వద్ద లేనిది ఆత్మబలమే కాని శరీర బలం మాత్రం కాదు.

50. మనోబలం లేకుండా గణనీయమైనదేదీ మనం సాధించలేము.

ప్రేమ సన్నపడ్డప్పుడు తప్పులు బలపడతాయి.

2. ప్రేమించిన వారే భగవంతుణ్ణి కనుగొనగలిగారు.

3. ప్రేమింపబడడం కంటే కూడా నమ్మకస్తుడిగా ఉండడం అన్నదే ప్రశంసనీయం.

4. ప్రేమే ద్వేషాన్ని దూరం చేస్తుంది కానీ ద్వేషం చేయలేదు - బుద్ద.

5. బంగారంలోని ప్రతి పోగూ ఎంత విలువైనదో గడచిపోతున్న కాలంలోని ప్రతి ఘడియ కూడా అంతే.

6. బందిపోటు దొంగలకంటే భ్రష్ట సాహిత్యం భయంకరమైనది.

7. బలమే జీవనం, బలహీనతే మరణం.

8. బలమే ప్రధానమైతే తేలును చూసి పులి భయపడవలసిన అవసరం లేదు.

9. బలవంతుణ్ణి బలహీనపరచి, బలహీనుణ్ణి బలవంతుడిగా మార్చలేము.

10. బాకీ లేకుండా, అప్పు ఇవ్వకుండా ఉన్నప్పుడే మీ స్నేహం కలకాలం నిలుస్తుంది.

11. బాగా అలసట పొందినవాడిని కొంచెం పొగడ్త ఉత్సాహపరుస్తుంది.

12. బాగా చెప్పడం కంటే బాగా చెయ్యడమే మెరుగైనది.

13. బాధపడటం అనేది సోమరి లక్షణం దాన్ని వదిలేయండి.

14. బాధలను తట్టుకోగల అనంత సామర్ధ్యాన్నే ప్రతిభ అంటారు.

15. బాధలలో సుఖమయమైన రోజులను గుర్తు చేసుకోవడానికి మించిన గొప్ప దుఃఖం లేదు.

16. బాధ్యత తెలిసిన వ్యక్తి ఏనాడు ముందుగా నిద్రపోడు, అలాగే ఆలస్యంగా సైతం నిద్రలేవడు.

17. బాధ్యతలే గొప్పతనానికి మనం ఇచ్చే ధర - విన్‌స్టన్ చర్చిల్.

18. బావి లోతుకన్న మనసు లోతు మిన్న.

19. భక్తికున్న గొప్ప సుగుణం మనసును శుభ్రం చేయగలగడమే.

20. భగవంతుడి విషయం భక్తుడికి, భక్తుని విషయం భగవంతునికి మాత్రమే తెలుస్తాయి.

21. భగవంతుడు + కోరిక = మనిషి, మనిషి - కోరిక = భగవంతుడు.

22. భయం అనేది ఒక శారీరికమైన జబ్బు కాకపోవచ్చు. కానీ అది ఆత్మను చంపేస్తుంది.

23. భవిష్యత్తు పై నమ్మకం కలిగి ఉన్న వ్యక్తి భవిష్యత్తు ఎప్పుడూ ఉత్తమంగా ఉంటుంది.

24. భవిష్యత్తుతో వచ్చిన చిక్కేమిటంటే అది మనం సంసిద్ధులు కాకముందే వస్తుంది.

25. భావం, సాధన ఈ రెండూ చాలా దూరమైనవి.

26. భుజబలం కంటే బుద్ధిబలం గొప్పది.

27. మంచి అలవాట్ల తరువాత మీరు మీ పిల్లలకు ఇవ్వగలిగినది మంచి జ్ఞాపకాలే - సిడ్నీ హరిస్.

28. మంచి ఆరోగ్యం, మంచి తెలివి అన్నవి జీవితపు అతి గొప్ప వరాలు.

29. మంచి ఆలోచన, మంచి ఆరోగ్యం, అవగాహన అన్నవి గొప్ప వరాలు.

30. మంచి ఉదాహరణే మనం ఇతరులకు ఇవ్వగలిగిన గొప్ప బహుమతి.

31. మంచి గుణానికి మించిన సంపద, ధర్మానికి మించిన తపస్సు లేదు.

32. మంచి చెడులను ఎంచగలిగే వివేకమే మానవాళి మనుగడుకు రక్ష.

33. మంచి జ్ఞాపకశక్తి మంచిదే, కాని ఇతరులు మీకు కలిగించిన హానిని మరచిపోయే సామర్ధ్యం అన్నదే గొప్పతనపు పరీక్ష అవుతుంది.

34. మంచి దస్తూరి అలవాటు చేసుకోవటం విద్యాభ్యాసంలో ఒక భాగం.

35. మంచి పనులు ఆలస్యాన్ని సహించవు.

36. మంచి పనులు ఎప్పుడూ శూన్యం నుంచి పుట్టుకురావు. నిరంతర ఆలోచనల ఫలితంగానే అవి ఊపిరి పోసుకుంటాయి.

37. మంచి పనే మంచి ప్రార్ధన.

38. మంచి పుస్తకంలా మంచివాడి స్నేహం కలకాలం తాజాగా ఉంటూ రోజూ ఆనందాన్ని ఇస్తుంది.

39. మంచి పుస్తకాలు ప్రపంచపు అందాన్ని చూడగలిగేలా చేసే కన్నులు.

40. మంచి మిత్రుడు రెండు శరీరాలలో నివశించే ఒక ఆత్మ.

41. మంచి విషయాలను పొందేందుకు ఉపయోగపడే పనిముట్లుగా దేవుడు మనకు కష్టాల్ని ఇస్తాడు.

42. మంచి శ్రోతలే మంచి వక్తలు. వినడం నేర్చుకోండి.

43. మంచి సంకల్పాలు మంచి ప్రవర్తనకు బీజాలు.

44. మంచి సభ్యత అన్నది చిన్న త్యాగాల ఫలితమే.

45. మంచికి ఉన్న స్వేచ్చ చెడుకు లేదు. చెడుకు ఉన్న ఆకర్షణ మంచికి లేదు.

46. మంచితనానికి మించిన మతమే లేదు.

47. మంచితనాన్ని మించిన గుణం లేదు. మంచితనంలోనే మర్యాద, మమత.

48. మంచిమనుషుల మనసులు వెన్నలా ఉంటాయి - తులసీదాసు.

49. మంచివారు కలుగజేసుకోకపోతే చెడు పెరుగుతుంది.

50. మంచీ, చెడూ అనేదేదీ లేదు, కానీ ఆలోచన అలా తయారు చేస్తుంది.

1. పిరికి మాటలు మాట్లాడకండి. వినకండి.

2. పుష్పానికి సుగంధం - మనిషికి వ్యక్తిత్వం.

3. పుస్తక పఠనం వల్ల కలిగే అమితానందం, లాభలు మనకు జీవిత చరిత్రలను చదవటం వల్లే సాధరణంగా మనకు లభిస్తుంది.

4. పుస్తకం విలువను ధరకాదు దాని ఉపయోగం నిర్ణయిస్తుంది.

5. పుస్తకాలను చదవాలనే కోరిక ఉన్నవారు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండగలుగుతారు.

6. పూచిన పువ్వులన్నీ కాయలైతే పట్టడానికి స్థలం ఉండదు.

7. పూజ, ఉపవాసాలు ఆత్మబలాన్ని పెంచే ఆధ్యాత్మిక వ్యాయామాలు.

8. పూలలో సువాసన, మనుష్యులలో యోగ్యత అనేవి దాచినా దాగని వస్తువులు.

9. పెరిగే అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఎక్కువ అపాయకరం.

10. పెరుగుతున్న వయస్సుతో కాదు. చేసే సత్క్రియలతో జీవితం సార్ధకం అవుతుంది.

11. పైన ఉన్న స్వర్గాన్నీ, క్రింద ఉన్న భూమినీ ప్రేమ నింపుతుంది. ప్రేమ ఒక్కటే కలకాలం నిలుస్తుంది.

12. పైన సమజాంలో కులమత బేధాలు శాంతిని దూరం చేస్తాయి.

13. పైసాకు కొరగాని పనులతో సతమతమవడం కంటే ఏమీ చేయకుండా ఉండడమే నయం.

14. పొందే ప్రశంస కంటే కూడా చేసే ప్రయత్నమే విలువైనది.

15. పొగిడే ప్రతివాడు, పొగడ్తను వినేవాడి ఖర్చుతో జీవిస్తాడు.

16. పొదుపు చేయగలిగినవాడు వేదనకు గురికాడు.

17. పొరపాటు సహజమే కాని అవివేకి అందులోనే విహరిస్తాడు.

18. పొరపాట్లను సరిదిద్దుకోవడం వివేకానికి గుర్తు.

19. పోరాడక పోవడం కన్నా, పోరాడి ఓడిపోవడమే గొప్పతనం.

20. ప్రకృతిలో బహుమతులు లేవు, దండనలూ లేవు. ఉన్నవన్నీ ఫలితాలే - ఆర్.జి. ఇంగర్‌సాల్.

21. ప్రగతికి తగిన ఉన్నతి, ఉన్నతికి తగిన ఉదారతే ఉత్తమ పురుష లక్షణం.

22. ప్రగల్బాలు పలికేవారు పిసరంత కూడా సాధించలేరు.

23. ప్రజలు దుర్బలులు కారు - వారికి లేనిది సంకల్ప బలం -విక్టర్ హ్యూగో

24. ప్రజాసమూహం సానుభూతితో ఆలోచిస్తుంది కానీ వివేకంతో కాదు.

25. ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు.

26. ప్రతి ఒక్కరు చాలాకాలం జీవించాలనుకుంటారే కానీ ఏ ఒక్కరూ ఎదగాలని కోరరు.

27. ప్రతి ధ్వని ఎప్పుడూ ధ్వనిని వెక్కిరిస్తూ ఉంటుంది.

28. ప్రతి పరాజయం విజయాన్ని మరి కాస్త సన్నిహితం చేస్తుంది.

29. ప్రతి మందలోనూ, ఒక మోసగాడు ఉంటాడు.

30. ప్రతి మనిషిలోను దివ్యత్వం గర్భితంగా ఉంది. ఆ దివ్యత్వాన్ని వ్యక్తం చేయడమే జీవిత పరమావధి.

31. ప్రతికారం ద్వారా పగ నిర్మూలనం కాదు -రాజాజీ.

32. ప్రపంచ శాంతిని, తమ షరతుల ప్రకారం ఆశించే దేశాలే యుద్ధ బీజాలను నాటుతున్నాయి.

33. ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత కష్టమైన విషయం, ఎదుటి మనిషిని అర్ధం చేసుకోవడమే.

34. ప్రపంచంలో ఉన్న ఏ గొప్ప వస్తువు కూడా ఎప్పటికీ మంచి స్నేహితునికి సమానం కాదు.

35. ప్రపంచంలో ప్రతి మనిషీ ఏదో ఒక విధంగా పనికి వస్తాడు. ప్రతి జీవితానికి ఓ అర్ధం ఓ ప్రయోజనం ఉండి తీరుతాయి.

36. ప్రపంచంలోని అందరు మేథావులకన్నా ఒక మంచి హృదయం గల వ్యక్తి ఎంతో గొప్పవాడు.

37. ప్రపంచంలోని ఏ వ్యక్తుల విజయాలను తీసుకున్నా, వాటికి కారణం ఆ వ్యక్తుల తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే.

38. ప్రమాదానికి సిద్దపడితే తప్ప ప్రమాదాన్ని దాటలేరు.

39. ప్రలోభాలకు లోనై ఏకాగ్రతను పోగొట్టుకుంటే లక్ష్యాన్ని సాధించలేరు.

40. ప్రవర్తన అనే అద్దంలో ప్రతి ఒక్కరి ప్రతిబింబం కనబడుతుంది. సమయాన్ని పాటించడం అన్న పునాది పైనే మీ వృత్తి ఆధారపడి ఉంటుంది.

41. ప్రశంస అనేది మనిషి ప్రగతికి శత్రువు.

42. ప్రారంభ వస్తువులన్నీ (విషయాలన్నీ) ఉత్తమంగానే ఉంటాయి - లార్డ్ ఛెస్టర్‌ఫీల్డ్.

43. ప్రార్ధన చేసే పెదవులు కన్నా సేవ చేసే చేతులు మిన్న.

44. ప్రార్ధన వల్ల దేవుడు మారడు; ప్రార్ధించే వాడే మారుతాడు.

45. ప్రేమ అనేది అమృతం, దాన్ని పంచి ఇస్తే అంతా నీవాళ్ళు అవుతారు.

46. ప్రేమ కలిగిన వ్యక్తి దేవునికి సన్నిహితుడు. ఎందుకంటే - దేవుడే ప్రేమ.

47. ప్రేమ గాఢమైతే తప్పులు పలుచనౌతాయి.

48. ప్రేమ ద్వారా ప్రేరేపింపబడినదీ, చదువు ద్వారా దారి చూపబడినదే మంచి జీవితం.

49. ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును - గురజాడ.

50. ప్రేమ పొందే వారిని, పంచే వారిని - ఇద్దరినీ బాగుపరుస్తుంది - డా. కార్ల్ మెన్నింజర్.

1. నిమిషాలను జాగ్రత్తగా వాడుకోండి. గంటలు తమ జాగ్రత్తని తాము చూసుకోగలవు.

2. నిరాడంబరమైన, యదార్ధమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి.

3. నిరాడంబరమైన,.యదార్థమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి.

4. నిర్భాగ్యునికి నిద్ర, అభాగ్యునకు ఆకలి ఎక్కువ.

5. నిర్మలమైన మనసు కలిగి ఉండటం కన్నా గొప్ప శాంతి లేనేలేదు.

6. నిస్వార్ధంగా తన జీవితాన్ని ఇతరులకు అంకితం చేయగలిగిన వాడికి ఏ నాడూ ఏ లోటూ ఉండదు.

7. నీ అంగీకారం అనేది లేకుండా నీ ఆత్మగౌరవాన్ని ఎవ్వరూ తగ్గించలేరు.

8. నీ ఆలోచనలను, శీలాన్ని, స్వభావాన్ని పవిత్రం చేసుకో; ప్రగతి పొందు.

9. నీ ఇరుగు పొరుగువారిని నీ వలెనే ప్రేమించు. నీ దేశాన్ని నీకంటే అధికంగా ప్రేమించు.

10. నీ తప్పును ఒప్పుకోవడం వలన నిన్నటి కంటే నేడు నీవు వివేకవంతుడవని తెలుస్తుంది.

11. నీ పట్ల ఇతరులు ఆసక్తి చూపాలనుకోవడం కంటే ఇతరుల పట్ల నీవు ఎక్కువ ఆసక్తి చూపినప్పుడు ఎక్కువ స్నేహితులను పొందవచ్చు.

12. నీ భార్యా పిల్లలను ప్రేమించినంతగా నీతల్లి తండ్రులను ప్రేమించు.

13. నీకై నీవు మంచిగా ఉండటం - ఎంతమాత్రం ప్రయోజనం లేనిది.

14. నీటితో శరీరం శుద్ది పొందినట్లే -, సత్యం చేత మనస్సు, జ్ఞానంచే బుద్ది, విద్యచే ఆత్మశుద్ధి కలుగుతాయి.

15. నీతిగల వానికి నిందాభయం లేదు.

16. నీతో వ్యర్ధ ప్రసంగం చేసేవాడు నిన్ను గురించి కూడా వ్యర్ధ ప్రసంగం చేస్తాడు.

17. నీవు ఎలా కావాలనుకుంటే అలాంటి భావాలను, నీ మనస్సులో నాటుకో.

18. నీవు ఒక పొరబాటు చేసి, మరో కొత్త పొరబాటు చేసేందుకు అనుభవం సంపాదించుకుంటావు.

19. నూనె లేని దీపం వెలగనట్లే భగవంతుడు లేని మనిషి జీవించలేడు.

20. నెరసిన జుట్టు వయస్సుకు చిహ్నమే కాని, వివేకానికి కాదు.

21. నేడు మీదగ్గర ఉన్న ఉత్తమమైన దాన్ని అందివ్వండి. అది రేపటి మంచి చిట్కాగా మారుతుంది.

22. నేను గెలుస్తాను అనే నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నీ అపనమ్మకమే నీ అపజయానికి దారి తీస్తుంది.

23. నేను జీవించి ఉన్నంతవరకు నేర్చుకుంటూనే ఉంటాను

24. న్యాయం గెలుస్తుందన్న మాట నిజమేకాని గెలిచేదంతా న్యాయం కాదు.

25. పంచుకున్న రహస్యం అందరికి తెలుస్తుంది - అర్బిక్

26. పంచుకున్న సంతోషం సంతోషాన్ని రెండింతలుగా పెంచుతుంది.

27. పంతులు లేని బడి, దేవుడు లేని గుడి, మనసులేని మనిషి ఒకటే -బాబా.

28. పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడితే, మనుషులు నాలుకలు కారణంగా చిక్కుల్లో పడతారు.

29. పగ - ప్రతీకారం - ఈర్ష్య అసూయ - అసహ్యం విజయానికి శత్రువులు.

30. పతకాన్ని గెలుచుకోవడంలో కాదు పందెంలో పాల్గొనడంలోనే గెలుపు ఉంది.

31. పతనానికి సోపానాలు మూడు - నిర్లక్ష్యం, అజాగ్రత్త, పొరపాటు.

32. పదిమంది దుర్మార్గులు కలిసికట్టుగా చేయగల హానికంటే మూర్ఖుడి మూఢవిశ్వాసం ఎక్కువ హాని చేయగలదు.

33. పదేళ్ళపాటు పుస్తకం చదవడం కంటే విజ్ఞులైన వారితో గంటసేపు ముచ్చటించడం మేలు.

34. పనిచేయని వాడికి తినే హక్కులేదు.

35. పనిచేసే హక్కు నీకుందికానీ దాని ఫలితంపై హక్కులేదు.

36. పనిని బాగా ప్రారంభించినప్పుడే ఆ పని సగం పూర్తి అవుతుంది.

37. పనిలేని మంగలి పిల్లి తల గొరిగెనంట.

38. పరిపూర్ణత అనేది ఎప్పుడూ ఆచరణ నుంచి మాత్రమే వస్తుంది.

39. పరిపూర్ణత మానవునకు ఆదర్శం మాత్రమే సిద్దించుకోలేడు. అపరిపూర్ణుడు కాబట్టి. - గాంధీజీ

40. పరిస్థితులను మన అదుపులో ఉంచుకోవడంలోనే మగతనం ఉంది.

41. పరిస్థితులనేవి మన చేతుల్లో లేకపోయినా మన ప్రవర్తన మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది.

42. పరిస్థితులు బలహీనుణ్ణి శాసిస్తాయి. కాని అవే వివేకి విజయానికి సాధనాలవుతాయి.

43. పరులకు సౌభాగ్యం సాధించడంలో సాయపడేవాడే ఆదర్శవాది - హెన్రీ ఫోర్డ్

44. పరులను జయించినవాడు విజేత, తనను తాను జయించినవాడు మహా విజేత

45. పవిత్రమైన మనస్సు గలవారికి, ప్రతిదీ పవిత్రంగానే కనిపిస్తుంది.

46. పసిబిడ్డ నింపవలసిన కలశం కాదు. వెలిగించ వలసిన నిప్పు.

47. పాప భీతి, దైవ ప్రీతి, సంఘనీతి అభివృద్ధి పరచుకోవాలి - బాబా.

48. పాపం అనేది వేరే ఒకచోట ఆవిర్భవించదు. చేసే దుష్కర్మలోనే పొంచి ఉంటుంది.

49. పాలల్లో వెన్నవలే, ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు ఉన్నాడు.

50. పిడికెడు లోకజ్ఞానం తట్టెడు చదువుతో సమానం.

1. దూరపు కొండలు నునుపుగా తోచు.

2. దృఢనిర్ణయం అన్నది విజయపథంపై మనం మొదటి అడుగు అవుతుంది.

3. దృఢమైన హృదయమే దురదృష్టాన్ని ధ్వంసం చేయగలదు.

4. దృశ్యాన్ని దూరమే మోహింపచేస్తుంది

5. దేని స్థానంలో అది ఉంటేనే ఉపయోగం ఉద్యానవనంలో ఆవు ఉండడం వల్ల ఏం లాభం?

6. దేన్ని చూసైనా సరే భయపడవద్దు! మీరు అద్భుతాలు సాధిస్తారు! భయపడిన మరుక్షణo, మీరు ఎందుకూ కొరగాని వారయిపోతారు.

7. దేవుడికీ, మనిషికీ మధ్య ఉన్న అద్భుత వంతెనే ప్రార్ధన.

8. దేవుడు సత్యం. దేవుడు బ్రహ్మానందం. దేవుడు సౌందర్యం.

9. దేవుని ప్రేమించటం జీవిత లక్ష్యం, దేవునితో ఐక్యం చెందటం జీవిత గమ్యం.

10. దేశకాల పరిస్థితులకు అతీతమైనది సంస్కృతి.

11. దైన్యం రకరకాల వ్యక్తులతో పరిచయం కలిగిస్తుంది.

12. దైవ భక్తికి అర్ధం - ఆదర్శాల పట్ల ప్రేమ.

13. దైవకార్యంలో పాల్గొనే అవకాశం కలిగిన వాడే అందరినీ మించిన అదృష్టవంతుడు.

14. ద్వేషం కంటే కూడా ప్రేమ అన్నది చాలా శక్తివంతమైనది.

15. ద్వేషాన్ని పోషించే వారిని ద్వేషం హతం చేస్తుంది.

16. ధనమే ఆనందం కాదు. ధనవంతులందరూ ధనం కారణంగా ఎప్పుడూ ఆనందంగా ఉండలేరు.

17. ధనవంతుడి జోకులు ఎల్లప్పుడూ తమాషాగానే ఉంటాయి.

18. ధనవంతుడిగా మరణించడం కంటే ధనవంతుడిగా జీవించడం హాయి.

19. ధృడమైన మనస్సును కలిగి ఉన్నవారు అంధకారంలో కూడా కాంతిరేఖను చూడగలరు.

20. ధైర్యం కేవలం పురుషుడి సొత్తు కాదు. మగవారిలాగా స్వతంత్రులం అని స్త్రీలు భావించాలి.

21. ధైర్యంతో పనులను చేపట్టేవారినే విజయలక్ష్మి వరిస్తుంది.

22. నమ్మకమే ఒకరు ఇంకొకరికి ఇచ్చుకోగల ఉత్తమోత్తమ కానుక అవుతుంది.

23. నమ్మిన సిద్దాంతాలకోసం ప్రాణం బలిపెట్టడానికి సిద్దంగా ఉండేవారికి ఓటమి ఉండదు.

24. నలుగురి ముందు ఇవ్వబడిన స్నేహపూర్వకమైన హెచ్చరిక బహిరంగ మందలింపుతో సమమైంది.

25. నలుగురు నడిచిందే బాట - నలుగురు పలికిందే మాట.

26. నవ్వండి మీతో ప్రపంచం కూడా నవ్వుతుంది. ఏడవండి మీరు మాత్రమే ఏడవాలి.

27. నవ్వని దినం పోగొట్టుకున్న దినం.

28. నవ్వలేని వాడికి ప్రపంచమంతా పగలే చీకటిగా మారుతుంది.

29. నష్టంలో కష్టంలో దేవుడు గుర్తొస్తాడు.

30. నా అదృష్ట దురదృష్టాలకు భాధ్యుడను నేనే.

31. నాకు గతాలు లేవు. కాలం వాటిని కబలించింది. రేపు అన్నది లేకపోవచ్చు. కానీ ఈ రోజు మాత్రం నా దగ్గరుంది.

32. నాకు నచ్చని వాటిని మరచిపోవడం, నాకు నచ్చిన వాటిని ఆచరించడం నా అలవాటు.

33. నాలుకా, నాలుకా వీపుకు దెబ్బలు తేకు.

34. నిగ్రహించడమే ఆత్మ నిగ్రహం బాటపై మనం వేసే మొదటి అడుగు అవుతుంది.

35. నిఘంటువులో మాత్రమే విజయం, సాధనకు ముందు వస్తుంది.

36. నిజం ఉన్నతమైనది కాని నిజాయితీతో జీవించడం అన్నది అంతకంటే ఉత్తమమైనది.

37. నిజం కానిది నిజంగా గొప్పది కాదు.

38. నిజం తరచుగా కనుమరుగవుతుందే కాని నిర్మూలించబడదు.

39. నిజంగా విజయాలను సాధించాలనుకొనేవారు తమ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు.

40. నిజము నిలకడ మీద తెలియును.

41. నిజమే ఎప్పుడూ బలమైన వాదన అవుతుంది.

42. నిజమైన స్నేహం మంచి ఆరోగ్యం లాంటిది. పోగొట్టుకోనంతవరకూ దాని విలువ తెలుసుకోలేము.

43. నిజానికి మించిన మతం ఈ ఇలలో లేదు.

44. నిజాన్ని ఆమోదించని వారితో ఏం వాదించి లాభం ఉండదు.

45. నిజాయితీని కోల్పోయిన వ్యక్తి వద్ద కోల్పోవడానికి మరేమీ మిగిలి ఉండదు.

46. నిజాయితీని మించిన వంశపారంపర్య ఆస్తి మరొకటి లేదు.

47. నిజాయితీపరుడైన వ్యక్తి భగవంతుడి భవ్యసృష్టి.

48. నిన్న సత్యమై నేడు అసత్యమయ్యేది సత్యం కాదు.

49. నిన్నటి గురించి మదనపడకుండా రేపటి గురించి భయపడకుండా ఆలోచించగలిగిన మనిషికి విజయసోపానాలు అందినట్లే.

50. నిన్ను గురించి నీవు తెలుసుకోవడం ధ్యానంలో ఒక భాగం.

1. జీవితాన్ని విఫలం చేసే ప్రమాదకర లక్షణం తొందరపాటు.

2. తన అఙ్ఞానాన్ని గురించి గ్రహించినవాడే నిజంగా తెలివైనవాడు

3. తన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం.

4. తన జానెడు పొట్టకు బానిస అయిన వ్యక్తి భగవంతుణ్ణి ససేమిరా పూజించలేడు.

5. తన తోటివారికి ఎంతవరకు సహాయపడతాడో అంతవరకే మనిషి గొప్పవాడవుతాడు.

6. తన తోటివారికి చేసిన మంచే మనిషి నిజమైన సంపద

7. తన దోషాలను గుర్తించకపోవటాన్ని మించిన పొరపాటు లేదు.

8. తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ప్రతివ్యక్తి ఒక వాస్తుశిల్పే.

9. తనకు అర్ధం కాని వాటిలో మనిషికి మరింత నమ్మకం.

10. తనకు ఇష్టమైన పనిని గొప్ప మూర్ఖుడు కూడా పూర్తిచేయగలడు.కానీ బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని తనకు ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు.

11. తనకు నచ్చిన పనిని ప్రతివాడు చేస్తాడు. కానీ చేస్తున్న పనిని ఇష్టపడేవాడికే నిజమైన సంతోషం లభిస్తుంది.

12. తనకోసం పాటు పడటం సంతృప్తిని ఇస్తుంది. కాని ఇతరుల కోసం పాటు పడటం ఉత్తేజం కలిగిస్తుంది.

13. తనను తానే నమ్మని వ్యక్తి ఎవరినీ నమ్మలేడు.

14. తనలోని పసి హృదయాన్ని పోగొట్టుకోని వ్యక్తే గొప్పవాడు.

15. తను పోవలసిన దారిని మొదట వెతుక్కున్నవాడే ఇతరులకు దారి చూపగలడు.

16. తప్పు చేయని వారు ధరణిలో లేరు.

17. తప్పులను చేయని వ్యక్తి సాధారణంగా ఏమి చేయలేడు.

18. తప్పులు ఎవరైనా చేస్తారు. కానీ మూర్ఖుడు తప్పులు చేస్తూనే ఉంటాడు.

19. తప్పులు పట్టవద్దు. తప్పులు దూరం చేయగల మార్గాలను వెతుకు.

20. తమ చావుకు ముందే పిరికివాళ్ళు అనేకసార్లు మరణిస్తారు.

21. తమ విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చడానికి మించిన కర్తవ్యం ఎవరికీ లేదు.

22. తమకాలాన్ని దుర్వినియోగం చేసేవారు కాలం తక్కువగా ఉన్నదని ఎక్కువగా ఫిర్యాదు చేస్తారు.

23. తమకు తామే సహాయాన్ని చేసుకునేవారికే దేవుడు సహాయపడతాడు.

24. తలమీద జుట్టు అందాన్నిస్తుంది. తలలోని జ్ఞానం గొప్పదనాన్ని కలిగిస్తుంది.

25. తాను పుట్టిన నేలనీ, దేశాన్ని ప్రేమించలేని వాడు దేనీని ప్రేమించలేడు.

26. తాను లూటీ చేసిన పుష్పాన్నే తేనెటీగ ఫలవంతం చేస్తుంది.

27. తాను శ్రమించిన పనివల్ల అతడికి లభించే ఫలితమే కాకుండా అతడు మారిన విధమే అతిగొప్ప బహుమతి అవుతుంది.

28. తినుటకై జీవించు వాడు బుద్దుడు. జీవించుటకై తినువాడు ముక్తుడు.

29. తీరిక లేకుండా పనిచేసే వ్యక్తే అతి సంతోషంగా ఉన్న వ్యక్తి.

30. తీర్మానాలు చేస్తే చాలదు. వాటిని ఆచరణలో పెట్టాలి.

31. తీసిన కొద్దీ చెలమలో నీరు ఊరినట్టు చదివిన కొద్దీ మనిషి వివేకం పెరుగుతుంది.

32. తుఫానులో చేసిన ప్రమాణాలను ప్రశాంతంలో మరచిపోతాం.

33. తృప్తి అమూల్యమైన ముత్యం. పదివేల కోరికలకు బదులుగా ఈ ముత్యాన్ని పొందినవాడు వివేకాన్ని, ఆనందాన్ని పొందుతాడు.

34. తృప్తి కలిగినప్పుడే మానవునికి సంతోషం లభిస్తుంది.

35. తృప్తితో నిన్ను నీవు బలపరచుకో, అది ఎవరూ జయించలేని కోట.

36. తెలియని మూర్ఖుని కంటే అన్ని తెలిసిన మూర్ఖుడు అవివేకుడు.

37. తెలివితక్కువతనాన్ని తెలుసుకోలేనంత తెలివితక్కువతనం మరొకటి ఉండదు.

38. తెలివితేటలంటే విన్నదాంట్లో సగాన్ని మాత్రం విశ్వసించడం.

39. తెలివితేటలు ఉన్నంత మాత్రాన ఎవరూ రచయితలు కాలేరు. ప్రతి పుస్తకం వెనుక ఒక వ్యక్తి ఉన్నప్పుడే అతడు రచయిత అవుతాడు.

40. తెలుసు కోవటం కంటే తెలుసుకున్న దానిని జీర్ణించుకోవటం ముఖ్యం.

41. తెలుసుకోడం కాదు, ఆచరించడమే కష్టం - షూకింగ్.

42. తొందరపడకండి. విజయానికి అవసరమైనవి చిత్తశుద్ధి - ఓర్పు - పట్టుదల.

43. త్యాగమయ జీవితం మహత్తర జీవితం.

44. త్వరగా ఇచ్చేవాడు రెండు పర్యాయాలు ఇచ్చినట్లే.

45. దయ అనబడే బంగారు గొలుసుతో మనుషులు ఒకటిగా చేర్చబడ్డారు.

46. దయ తాళం వేయబడ్డ హృదయాల్ని తెరవగల సరైన తాళం చెవి.

47. దయార్థ హృదయంకు ధర చెల్లించవలసిన అవసరం లేదు.

48. దారి మాత్రం తెలిసి వాహనం నడిపే కళతెలియని వ్యక్తిని విమర్శకుడు అంటారు.

49. దారిద్య్రం దుర్గుణం కాదు, అసౌకర్యం మాత్రమే.

50. దీపపు వెలుగు నూనెపై ఆధారపడి ఉంటుంది.

1. చదవకుండా ఉండడం కంటే పుట్టకుండా ఉండడమే మేలు కారణం అజ్ఞానమే దురదృష్టానికి మూలం.

2. చదివిన దానిని, విన్న దానిని ఆచరించడం సాధన.

3. చదివిన పుస్తకాల నుండి జ్ఞానాన్ని పొంది పాఠాలను నేర్చుకోవడమే చదువు ఉద్దేశ్యం.

4. చదువు సారం కంటే కల్పన చాలా ముఖ్యమైనది.

5. చదువుకోవడానికి మనిషి ఎప్పుడూ వృద్దుడు కాడు.

6. చదువులేని ఉత్సాహం గుర్రపుశాల నుండి పరిగెత్తిన గుర్రం లాంటిది

7. చరిత్ర చదవడం కాదు! చరిత్ర సృష్టించాలి.

8. చలువరాతికి శిల్పం ఎలాగో ఆత్మకు విద్య అలాగు.

9. చాలా కొంచెంను గురించి చాలా ఎక్కువ తెలుసుకున్న వ్యక్తి నిపుణుడు.

10. చాలా తక్కువగా తినిన వారికంటే చాలా ఎక్కువగా తిన్నవారే ఎక్కువ మంది చనిపోయారు.

11. చాలామంది ఇతరులకంటే బాగా చేయగలిగిన పని తమ చేతివ్రాతను తామే చదువుకోగలగడమే.

12. చాలామంది సలహాలు తీసుకుంటారు, కానీ వివేకవంతులే దాని నుంచి లాభం పొందుతారు.

13. చింత ఎల్లప్పుడూ చిన్న వస్తువుకు పెద్ద నీడ ఇస్తుంది.

14. చితి శవాన్ని దహిస్తుంది, చింత ప్రాణాన్ని దహిస్తుంది.

15. చిత్తశుద్దిలేని విద్య ప్రమాద భరితమూ, భయానకమూ అవుతుంది

16. చిన్న అవకాశాలే తరచుగా గొప్పసాహస కార్యాలకు ప్రారంభాలు అవుతాయి.

17. చిన్న గొడ్డలి పెట్లు మహా వృక్షాలను కూల్చగలవు.

18. చిన్న చిన్న పనులే విశిష్టతను దారి తీస్తాయి. కానీ విశిష్టత చిన్నది కాదు.

19. చిన్న పని కదా అని అలక్ష్యం చేయకండి. చిన్న విత్తనం నుండే మహావృక్షం ఉద్భవిస్తుందని మరువకండి.

20. చిరునవ్వు ప్రతికూల పరిస్ధితులను కూడా అవకాశాలుగా మార్చగలదు

21. చీకటిలో మీరు వ్యవహరించే తీరే మీ గుణం.

22. చూస్తున్న పొరుగువాణ్ణి ప్రేమించలేనివాడు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు?

23. చెట్టు పైకి ఎక్కాలనుకున్నప్పుడు పూలను కాదు, కొమ్మలను పట్టుకోండి.

24. చెడును విస్మరించి, మంచిని స్మరించి సంరక్షించుకోవటం యోగ్యతకు లక్షణం.

25. చెడ్డను నాటితే దక్కేది దుఃఖమే.

26. చెదరిపోయిన మనసు సంపూర్ణంగా దర్శించ లేదు.

27. చెప్పులు కుట్టేవాడు చెప్పులు అందంగా చేస్తాడు. కారణం అతను ఇంకేమి చేయడు.

28. చెసే పనిలో సంతోషాన్ని వెతుక్కోండి. డబ్బును తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.

29. చేటు కాలమునకు చెడు బుద్ది పుట్టును.

30. చేసిన తప్పుడు పనులను గురించి చెప్పి పశ్చ్యాత్తాప పడటం అన్నది మంచి పనికి శ్రీకారం చుట్టే మంచి పని అవుతుంది.

31. చేసిన తప్పును సమర్ధించుకోవడంతో అది రెండింతలు అవుతుంది.

32. చేసిన మేలు ఎన్నడూ గుర్తుంచుకోకు, పొందిన మేలు ఎన్నడూ మరచిపోకు.

33. జనన మరణాల మధ్యంతర కాలం జీవితం.

34. జాతికి సంపద వెండి, బంగారాలు కాదు - సజ్జనులు.

35. జాలి లేనివారే నిజమైన అంటరానివారు.

36. జీర్ణించుకోలేనన్ని నమ్మకాలు మింగకూడదు.

37. జీవించడం అన్నది ముఖ్యంకాదు ఈ కొద్ది జీవితంలో మనం ఏమి చేసామన్నది ముఖ్యం.

38. జీవించడం అన్నది ముఖ్యంకాదు. ఈ కొద్ది జీవితంలో మనం ఏమి చేసామన్నదే ముఖ్యం.

39. జీవిత పరిజ్ఞానంలేని గ్రంధాలు నిష్ప్రయోజనాలు.

40. జీవితం అంటే గడిచిన ఏళ్ళు కాదు సాధించిన సత్కార్యాలు.

41. జీవితం అనేక సంఘటనల గొలుసు. జీవించడం అనేక అనుభవాల గొలుసు.

42. జీవితం ఎడతెరిపి లేకుండా ప్రవహించే అనుభవాల సారం.

43. జీవితం నాకు ఆలోచించడం నేర్పింది. కానీ ఆలోచనలు ఎలా జీవించాలో తెలియజేయలేదు.

44. జీవితం నుండి ఆశిస్తే ఎక్కువ నిరాశే మిగులుతుంది. అందుకే జీవితాన్ని శాసించటం నేర్చుకో.

45. జీవితంలో అపూర్వ ఆభరణం వినయం.

46. జీవితంలో విజయాలు సాధించటానికి ఏకాగ్రత, తదేకదీక్ష అత్యంత అవసరం.

47. జీవితంలో సంఘర్షణ లేనప్పుడు కాదు, ఆ సంఘర్షణతో సర్దుకుని పోయినప్పుడే శాంతి లభిస్తుంది.

48. జీవితపు గొప్ప ముగింపు తెలుసుకోవడంలో లేదు. చేయడంలోనే ఉంది.

49. జీవితపు గొప్ప విజయాలన్నవి తరచుగా బాజాలతో కాక ప్రశాంతంగా సాధించినవే అవుతాయి.

50. జీవితానికి అత్యున్నత లక్ష్యం ఏర్పరుచుకోవడం కష్టం. ఏర్పరుచుకుంటే దాన్ని సాధించడం సులభం.

1. కళ్ళద్దాలు తుడుచుకోవటం మర్చిపోయి, ఈ ప్రపంచం మురికిగా ఉందని ఫిర్యాదు చేయవద్దు.

2. కవి అన్నవాడు ఎప్పుడూ ఆకలితో అలమటించే వాడుగా గాని లేదా భగ్న ప్రేమికుడిగా గాని ఉండాలి.

3. కష్టపడి పనిచేసేవారికి అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి.

4. కష్టాలను జయించడానికి నిస్పృహకంటే చిరునవ్వు చాలా బలవంతమైనది.

5. కష్టాలను తప్పించుకోవడం కాదు, వాటిని అధిగమించడమే నిజంగా గొప్పదనం.

6. కష్టాలు మన జీవితాలను మెరుగుదిద్దేందుకే కాని నాశనం చేయడానికి కాదు.

7. కామంనకు మించిన వ్యాధీ, బ్రాంతికి మించిన శత్రువూ, కోపానికి మించిన అగ్నీ, విద్యకు మించిన ఆనందం వేరొకటి లేదు.

8. కార్యశూరుడి వలె ఆలోచించు, అలోచనాపరుడిగా వ్యవహరించు.

9. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడపకుండా జీవితాన్ని దాటలేడు.

10. కావలసిన దానికంటే ఎక్కువ వివేకం కలిగి ఉండడం వివేకం అనిపించుకోదు.

11. కావలసిన దానికన్నా ఎక్కువ తీసుకొని దాస్తే మనం దొంగలం.

12. కీర్తి పొందని పుట్టుక నిష్ఫలము.

13. కుంటివాని వద్ద నడక, మూగవాని వద్ద మాటలు నేర్వడం కుదరదు.

14. కుక్కకు ఎముక వేయడం దానం కాదు. కుక్కకున్నంత ఆకలి నీకున్నప్పుడు ఆ కుక్కతో ఎముకను పంచుకోవడం నిజమైన దానం.

15. కృతజ్ఞత అనేది ఒకరిపట్ల చూపవలసిందే కాని ఒకరి నుండి ఆశించవలసింది కాదు.

16. కొద్ది కోరికలతో, చిన్న విషయాలతో తృప్తి పడటమే ఉత్తముని లక్షణం.

17. కొన్ని పట్టులాంటి ముఖాల వెనుక ముతక గుడ్డ ఉంటుంది.

18. కోపం పాపానికి ధూపం. రోషం దోషానికి మూలం.

19. కోపం యమధర్మరాజు లాంటిది.తృష్ణ వైతరణిలాంటిది. విద్య కామధేనువులాంటిది. ఇక సంతృప్తి దేవరాజైన ఇంద్రుడి నందనవనం లాంటిది.

20. కోపానికి కారణమైన గాయంకంటే అణచుకోని కోపం ఎక్కువ హాని కలిగిస్తుంది.

21. కోరిక ముగించిన చోట శాంతి ప్రారంభిస్తుంది.

22. కోరికల యొక్క యదార్థ స్వరూపం దుఃఖం.

23. క్రమబద్దతను పాటించకుండా సంపద, పరాక్రమం లేకుండా విజయం, ఉపకార గుణం లేకుండా పేరు, ఆధ్యాత్మిక ఙ్ఞానం లేకుండా ముక్తి లభించవు.

24. క్రోధాన్ని జయించిన వ్యక్తి అందరినీ జయిస్తాడు.

25. క్షణిక కోపాన్ని అణుచుకోగల వ్యక్తి ఒక రోజు దు:ఖాన్ని దూరం చేసుకోగలడు.

26. గంపెడు చదువుకంటే పిడికెడు లోకజ్ఞానం విలువైనది.

27. గతం త్రవ్వకండి. వర్తమానంలో పనిచేస్తూ భవిష్యత్తు నిర్మించండి.

28. గతం నుండి నేర్చుకోండి, కాని దాని కారణంగా దిగులుపడకండి.

29. గతమే వర్తమానానికి మార్గం.

30. గమ్యం చేరుకోవటం కంటే, నమ్మకంతో ప్రయాణం చేయటమే మేలైనది.

31. గర్వం వినాశనానికి ముందు పోతుంది. అహంకారం పతనానికి ముందు పోతుంది.

32. గుండెలోని భావాలను చెప్పని మాట వట్టి కళేబరం.

33. గుడ్డివాడికి మరో గుడ్డివాడు దారి చూపితే ఇద్దరూ గోతిలో పడతారు.

34. గురి వల్ల గొప్ప విలుకాడు అవుతాడే కాని పొదలో ఉన్న బాణాల వల్ల కాదు - ధామస్ ఫుల్లర్

35. గెలుపు అందవిహీనతను మరుగుపరిచే అరుదైన రంగు.

36. గొప్ప అంశాలు రూపొందేదే కర్మాగారం.

37. గొప్ప అణుకువ గల వ్యక్తి గొప్పకు చేరువవుతాడు.

38. గొప్ప ఆలోచనలను కలిగి ఉన్నవారు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు.

39. గొప్ప గొప్ప కార్యాలను సాధించటానికి ఉత్సాహమే ప్రధాన కారణం.

40. గొప్ప పనుల సుగంధమే పేరు ప్రతిష్టలు.

41. గొప్పపనలు చేయడానికి కావలసింది ముఖ్యంగా శక్తికాదు - ఓపిక.

42. గొప్పవారి యొక్క గొప్పతనం, వారు చిన్నవారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుంది.

43. గొప్పవారిలోని గొప్పగుణాలు గుర్తించండి. వాటి గురించి రోజూ కాసేపు మననం చేసుకోండి.

44. గౌరవాలు పొందడం కాదు గొప్ప - వాటికి తగిన అర్హత సాధించడం గొప్ప.

45. ఙ్ఞాన, తప, యోగ మార్గాలకన్న సేవామార్గం మిన్న.

46. ఙ్ఞానం అనేది మనం సంపాదిస్తే వచ్చేది కాదు. మనలోని అఙ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది.

47. ఙ్ఞానం అమాంతంగా పొంగి పొర్లిపోదు, అది అంచెలంచెలుగ అభివృద్ధి చెందుతుంది.

48. ఙ్ఞానాన్ని మించిన శక్తి ప్రపంచంలో మరేదీ లేనే లేదు

49. చక్కగా తీర్చిదిద్దబడిన ఒక మంచి వ్యక్తి జీవితమే ఈ ప్రపంచంలో అతి పరిపూర్ణం అయిన అందమైన వస్తువు.

50. చక్కటి ఆలోచన, సరైన ముందుచూపు లేని మనిషి జీవితంలో అడుగడుగునా ఆపదలు చుట్టుముడతాయి.

1. ఎప్పుడూ ప్రయత్నించని వ్యక్తి కంటే ప్రయత్నించి విఫలమైన వ్యక్తే మేలు.

2. ఎప్పుడూ ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న.

3. ఎప్పుడైనా తనమీద తనకు విశ్వాసం ఉన్నవారు బలవంతులైతే, సందేహాలతో సతమతమయ్యేవారు బలహీనులు.

4. ఎలా చదవాలో తెలియాలే కాని ప్రతి మనిషీ ఒక మహా గ్రంధమే.

5. ఎల్లప్పుడూ వెలుగుని చూడటం నేర్చుకొన్నవారికి అసలు చీకటనేదే కనిపించదు.

6. ఎవరి పని వారుచేసుకోవడం ఉత్తమ ధర్మం.

7. ఎవరిమీదా ఆధారపడకు, నీవు చేసే సత్కర్మలపై ఆధారపడు.

8. ఏ ఆదర్శాలూ లేనివాళ్ళు తెడ్డులేని పడవలాంటి వారు.

9. ఏ గొప్పవ్యక్తి వ్యర్ధంగా జీవించడు. ప్రపంచ చరిత్ర అంతా గొప్ప వ్యక్తుల జీవిత (ఆత్మ) కథలే - థామస్ కార్లెల్.

10. ఏ దేశానికైన ఆ దేశ సంస్కృతి అనేది ఆత్మలాంటిది.

11. ఏ పనిలోనైనా విజయం సాధించాలి అని అనుకుంటే అందుకు పద్దతిగా వ్యవహరించడం చాలా ముఖ్యం.

12. ఏ సగాన్ని నమ్మాలో తెలుసుకోవడమే ప్రతిభ.

13. ఏదైనా ఒక అవకాశం చేజారిపోయినప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకోకుండా మరొక అవకాశం చేజారిపోకుండ జాగ్రత్తపడాలి.

14. ఏదైనా ఒక పనిని చేసే ముందు దాని పర్యవసానం ఏమిటో ఒక్క క్షణం ఆగి ప్రశ్నించుకొని అప్పుడు ఆ పనిని ప్రారంభించడం అత్యుత్తమం.

15. ఏదో ఒక వ్యక్తిగా ఉండడంలో కాదు. ఇతరులకు సహాయపడే వ్యక్తిగా ఉండడంలోనే గొప్పతనం దాగుంది.

16. ఏమి జరిగినా ఏమి జరగనట్లే ఎప్పుడూ ప్రవర్తించు.

17. ఐకమత్యం లేని బహుసంఖ్యాకులకు వ్యతిరేకంగా అల్పసంఖ్యాకులు కలిసికట్టుగా పనిచేస్తారు కాబట్టే రాజకీయ యంత్రాంగం గెలుస్తుంది.

18. ఒంటరిగా నిలబడిన మనిషే ప్రపంచంలో దృఢమైన వ్యక్తి.

19. ఒక కళాకారుడు ప్రతిచోట జీవిస్తాడు.

20. ఒక కోపిష్టి మనిషి తన నోరు తెరచి, కళ్ళు మూసుకుంటాడు.

21. ఒక మనిషి అంతః సౌందర్యం అతను మంచి ఆలోచనలు కలిగి ఉండటమే.

22. ఒక మనిషి దిగజారినా, అభివృద్ధి చెందినా అది అతని స్వయంకృతమే.

23. ఒక మనిషికి సహనం కనుక ఉంటే అతను ఏమి అనుకున్నా దానిని సాధించుకొంటాడు.

24. ఒక మనిషిలోని ప్రతిభను, ప్రావీణ్యాన్ని ఎవ్వరూ దాచలేరు. అవి ఎప్పటికైనా బయటపడతాయి.

25. ఒక మూర్ఖుడు తన పని మానుకుని ఇతరుల యొక్క (వ్యవహారపు) పని ఒత్తిడిలో ఉంటాడు.

26. ఒక మేలైన మానవుడు తన మాటల్లో నమ్రతగా ఉంటాడు, కానీ తన పనుల్లో అధికంగా ఉంటాడు.

27. ఒక మొక్కను నాటడం సంవత్సరమంతా చేసే ప్రార్థనకు సమానం.

28. ఒక వస్తువు మరో ఉత్పత్తికి ఆలంబం.

29. ఒక వస్తువు వినాశనం మరో ఉత్పత్తికి ఆలంబం.

30. ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించి చూడాలంటే అతనికి అధికారం ఇచ్చి చూస్తే చాలు.

31. ఒక వ్యక్తి యొక్క జయాపజయాలు అతను సమయాన్ని ఎలా ఖర్చు చేస్తాడన్న విషయం పైనే ఆధారపడి ఉంటాయి.

32. ఒక వ్యక్తి యొక్క విలువ అతని మాటలలోని నిలకడను బట్టి తెలుస్తుంది.

33. ఒక శిశు హృదయాన్ని కోల్పోనివాడే గొప్పవాడు.

34. ఒకచోట ఏకాంతంగా ప్రశాంతమైన మనసుతో గడపలేకపోవడం చేతనే అందరూ బాధలకు గురి అవుతున్నారు.

35. ఒకటిగా చేరడం ప్రారంభం, ఒకటిగా ఉండడం ప్రగతి, ఒకటిగా పనిచేయడం విజయం.

36. ఒకరి పొరపాటు ఇంకొకరికి గుణపాఠం.

37. ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు. కానీ ఒకరు మనకు మేలు చేస్తే మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు.

38. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.

39. ఒక్క సంతోషం వంద విచారాలను తరిమికొడుతుంది.

40. ఒక్క సిరాచుక్క వేల, లక్షల మనుషులను ఆలోచింపజేస్తుంది.

41. ఒప్పుకున్న తప్పు సగం సరిదిద్దబడుతుంది.

42. ఓపిక ఉత్తమోత్తమమైన ఔషధం.

43. ఓపికతో వేచి ఉన్న వారు కూడా భగవంతుడికి సేవ చేయగలరు.

44. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.

45. ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటివాడు.

46. ఓర్పుకు మించిన తపస్సు లేదు.

47. కఠినమైన పనులను తేలికగా చేయగల వాడు - విద్యాబోధకుడు.

48. కదలకుండా నిలిచిన వాడే ఎక్కువ అలసిపోతాడు.

49. కర్తవ్యం విస్మరించి, జీవుని బాధించి, దేవుని పూజించిన లాభముండదు.

50. కలల స్ధానంలోకి శోకం, క్షోభ వచ్చేవరకు మనిషి వృద్ధుడు కాడు -జాన్ బారీమోర్.

1. ఇచ్చే వస్తువ కంటే కూడా ఆవస్తువును ఇచ్చే విధానమే దాత గుణానికి అద్దం పడుతుంది.

2. ఇతరుల కోసం జీవించబడే జీవితమే సార్ధకమైనది.

3. ఇతరుల తప్పులను ఎత్తిచూపే ముందు మీసొంత తప్పులను గురించి తెలుసుకోండి.

4. ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చేసే పనులు అనర్ధహేతువులు.

5. ఇతరుల పట్ల స్నేహంగా ఉండండి. అప్పుడే స్నేహితులు మీ చుట్టూ చేరుతారు.

6. ఇతరుల సహకారం తీసుకోండి. ఎవరిపై పూర్తిగా ఆధారపడకండి.

7. ఇతరులకు మీరిచ్చే సలహాలను పాటించటమే అతి ఉత్తమంగా, జీవితంలో విజయాన్ని సాధించే ఉత్తమ మార్గం అవుతుంది.

8. ఇతరులకు హాని చేసే ముందే క్రోధం నీకు హాని కలిగిస్తుంది.

9. ఇతరులతో పంచుకున్నప్పుడూ తరగకుండా పెరిగేది ప్రేమ ఒక్కటే - రికార్డా హక్.

10. ఇతరులను అర్థం చేసుకున్న వాడు జ్ఞాని, తనను తాను అర్ధం చేసుకున్న వాడు వివేకి.

11. ఇతరులను చూసి మనం అసూయపడుతున్నామంటే, వారికన్నా మనం తక్కువని మనమే ఒప్పుకొని బాధపడుతున్నామని అర్ధం.

12. ఇతరులను జయించాలనుకోకు. నిన్ను నీవు జయించు. అప్పుడు ప్రపంచం నీచే జయింపబడుతుంది.

13. ఇతరులపై ఆధారపడకుండా మీమీద మీరే ఆధారపడండి.

14. ఇతరులు నడచిన బాటలో నడిచేవడు తనకాలి జాడలను వదలలేడు.

15. ఇతురుల తప్పులను క్షమించడం, మరచిపోవడం అనేవి మంచితనానికి అసలు సిసలైన నిదర్శనాలు.

16. ఇతురుల సంక్షేమంలో ఆనందాన్ని పొందేవాడు మనుషుల చేత ఎన్నుకోబడిన విశిష్ట వ్యక్తి అవుతాడు.

17. ఇనప్పెట్టెలోని డబ్బుకంటే బజారులోని మిత్రుడు చాలా విలువైనవాడు.

18. ఈ పని తర్వాత ఏం చెయ్యాలని ఆలోచించకూడదు. ఆచరిస్తూ ఉంటే ఒకదాని వెంట మరొకటి అవే వస్తూ ఉంటాయి.

19. ఈ ప్రపంచం బాధపడేవారికి దుఃఖదాయకమైతే ఆలోచనాపరులకు సుఖదాయకం అవుతుంది.

20. ఈ రోజు చేయగల పనిని రేపటికి వాయిదా వేయవద్దు.

21. ఈ రోజు దొరికే గుడ్డుకంటే రేపు దొరికే కోడి మంచిది.

22. ఈరోజు నీవు చేస్తున్నదే రేపు నీకు రక్షణను ఇస్తుంది.

23. ఉజ్వల భవిష్యత్తు పై అచంచల విశ్వాసమే ఆస్తికత్వం.

24. ఉత్తమ గ్రంధాల సేకరణే ఒక నిజమైన విశ్వవిద్యాలయం.

25. ఉత్తమ మానవుని యొక్క లక్షణం నీతి గడించి, నియమంగా జీవించటమే .

26. ఉత్తమమైన పుస్తకాలను మొదట చదవండి. లేకపోతే అవి చదివే అవకాశమే దొరక్కపోవచ్చు.

27. ఉత్సాహం క్రియాశీలతలను వెయ్యి రెట్లు పెంచుతుంది.

28. ఉత్సాహం లేనిదే ఏగొప్ప పనిని సాధించలేము.

29. ఉత్సాహశీలికి ఎప్పుడూ విరామం అనేది ఉండదు.

30. ఉదార బుద్దితో చేయబడిన పని ఎప్పటికీ నశించదు.

31. ఉద్రేకాలకు లొంగినవాడు అందరినీ మించిన బానిస.

32. ఉన్నత భావాలు తోడుగా ఉన్నవారికి ఒంటరితనమంటూ లేదు.

33. ఉపదేశం తరువాత మీరు చేసేదే మీ మతం.

34. ఉపదేశం తేలిక. ఆచరణ అతి కష్టం.

35. ఉపదేశం పూర్తి అయిన తరువాత మీ ప్రవర్తనను సూచించేదే మీ మతం.

36. ఉపదేశాలకు మించి ధారాళంగా ఇవ్వబడేది వేరొకటి లేదు.

37. ఊరికే దొరికిన పుస్తకాన్ని సాధారణంగా చదవరు. డబ్బు పెట్టికొంటే తప్పకుండా చదువుతారు - శామ్యూల్ జాన్సన్.

38. ఎంత పంచుకుంటే అంత పొందగలం.

39. ఎక్కడైతే నిస్వార్ధత ఎంత ఎక్కువగా ఉంటుందో అక్కడ విజయం అంత ఎక్కువగా ఉంటుంది.

40. ఎక్కడైనా భయపడే వ్యక్తి ఎక్కడా సురక్షితంగా ఉండలేడు.

41. ఎక్కువగా నమ్మడం వల్ల మోసపోవచ్చు, కానీ నమ్మకమే ఉంచకుండా బతకడం దుర్భరం.

42. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మంచి పనికి తమ చేతనైనంత సహాయం చేసే వారే గొప్పవారు.

43. ఎదుటి వారిని సంతోషింపజేయడంలోనే సంతోషం ఉంది.

44. ఎదురైన కష్టం ఎంత గొప్పదైతే దాన్ని అధిగమించడం వల్ల వచ్చే ఘనత అంత ఎక్కువ.

45. ఎన్నడూ నిరాశ చెందనివాడే నిజమైన సాహసి.

46. ఎన్ని సంవత్సరాలు జీవించారని కాదు. మీ జీవితానికి ఎంత ప్రాణం పోశారన్నదే ముఖ్యం.

47. ఎప్పుడు చిరునవ్వు నవ్వుతుంటే భగవంతునికి సన్నిహితముగా ఉంటావు.

48. ఎప్పుడూ క్రొత్తనే కోరుకుంటుంది మానవత.

49. ఎప్పుడూ జయమే సాధించే ఎదురులేని అస్త్రం ప్రేమ.

50. ఎప్పుడూ నిజాయితీపై విశ్వాసం ఉన్నవారే అందరిచేత గౌరవింపబడుతారు.

1. అవసరానికి మించి ఒక్కమాట కూడా అదనంగా మాట్లాడకండి.

2. అవివేకి హృదయం అతని నోటిలో ఉంటే, వివేకి నోరు అతని హృదయంలో ఉంటుంది.

3. అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడూ చేస్తూనే ఉంటారు.

4. అసమానత్వం వల్ల హింస పెరుగుతుంది.

5. అసమ్మతితో కూడుకున్న చిరునవ్వు అందాన్ని చెరుపుతుంది. ఇది కోపానికంటే ఎక్కువ చిరాకును పుట్టిస్తుంది.

6. అసాధారణమైన ప్రతిభ ఎప్పటికైనా తాను చేయవలసిన దానిని చేసి తీరుతుంది.

7. అసూయ ఆత్మకు పచ్చకామర్లు.

8. అహం నశించినప్పుడు ఆత్మ మేల్కొంటుంది.

9. అహంకారం అఙ్ఞానానికి అనుంగు బిడ్డ.

10. అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు - మహాత్మాగాంధి.

11. ఆంతరంగిక అనుభవంలోనే నిజమైన ఆనందం దాగుంది.

12. ఆకర్షణలు తిరుగుబోతుల వంటివి. ఒకదాన్ని ఆదరిస్తే, తన మిత్రులతో తిరిగి వస్తుంది.

13. ఆకలిగొన్న వాడితో న్యాయాన్ని గురించి మాట్లాడకు. ఆకలి తీర్చిన తరువాత అతడి అంతరాత్మతో వ్యవహరించు.

14. ఆగ్రహం అనేది ఎప్పుడూ తప్పిదంతో ఆరంభమై పశ్చాత్తాపంతో ముగుస్తుంది.

15. ఆత్మ బలం లోపించిన వ్యక్తిలో శ్రద్ద స్థిరపడదు.

16. ఆత్మ విశ్వాసమే విజయానికి ప్రధమ సూత్రం.

17. ఆత్మకు తెలియకుండా ఇంద్రియాలు ఏపనీ చేయలేవు.

18. ఆత్మను కోల్పోయాక లోకాన్నంతా జయించినా శాంతి సమకూరదు.

19. ఆత్మవిశ్వాసం నిజమైన సంతోషానికి గీటురాయి - మనుధర్మ శాస్త్రం.

20. ఆత్మవిశ్వాసంతో అడుగు వేయలేని మనిషి దేనినీ నమ్మడు.

21. ఆత్మాభిమానం అన్ని సుగుణాలకు ఆధారం.

22. ఆదర్శం అనేది లేని వ్యక్తి ఎన్నటికీ ఎదగలేడు.

23. ఆదర్శవాదికి అందరూ విరోధులే.

24. ఆదర్శాలు నక్షత్రాల లాంటివి. మనం వాటిని చేరలేము. కాని వాటిని అనుసరించి మనం ఒక ప్రణాళికను తయారు చేసుకోగలం.

25. ఆదర్శాలు లేని మనిషి - ఒక విషాద దృశ్యం వంటివాడు.

26. ఆదేశం కంటే అనుకరణ ద్వారానే పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు.

27. ఆనందం సుగంధం లాంటిది. మీపైన కొన్ని చుక్కలు పడకుండా ఇతరులపై చల్లలేరు.

28. ఆనందానికి మార్గం మీ హృదయంలో ద్వేషం లేకుండా మనసులో చికాకు లేకుండా ఉంచుకోవడమే - హెచ్.జి.

29. ఆపదలందు ధైర్యం ప్రదర్శించే వాడే వీరుడు.

30. ఆపదలు ప్రతిభను వెలుగులోకి తెస్తే సంపద దాని కప్పి పుచుతుంది.

31. ఆరాధన భావంతో సేవను చేయండి.

32. ఆరోగ్య పోషణకు రోజూ కొంత సమయం వెచ్చించకపోతే జబ్బుపడి చాలా సమయం కోల్పోవలసి రావచ్చు.

33. ఆరోగ్యం నమ్మకాన్ని ఇస్తుంది. నమ్మకం అన్నింటినీ ప్రసాదిస్తుంది.

34. ఆరోగ్యం పరమ ప్రయోజనం.

35. ఆరోగ్యానికి, ఆనందానికి నీతిసూత్రాలే బలమైన పునాదులు.

36. ఆలోచన అనేది - ఒక మొగ్గ, భాష అనేది - చిగురు, కార్యం అనేది - దాని వెనుకనున్న ఫలం.

37. ఆలోచన లేని చదువు వృధాగా శ్రమించడం లాంటిది.

38. ఆలోచన లేని చదువు వ్యర్థం. చదువులేని ఆలోచన ప్రమాదభరితం.

39. ఆలోచన, ఏకాగ్రత ద్వారానే నైపుణ్యం అబ్బుతుంది.

40. ఆలోచనలపై అంకుశమే ఏకాగ్రత.

41. ఆలోచించకుండా చదివే చదువు జీర్ణించుకోకుండా తినడం లాంటిది.

42. ఆవేశం చెలరేగినప్పుడు మేధావికి మౌనమే శరణ్యం.

43. ఆవేశం వల్ల కలిగే ఫలితం మనల్ని తప్పుదారి పట్టించడమే - ఆస్కార్ వైల్డ్.

44. ఆశ జీవితం జీవితమే ఆశ.

45. ఆశలేని వాని కగచాట్లులేవు.

46. ఆశించడం వల్ల కాక, అర్హత సంపాదించడం వల్ల దేనినైనా పొందవచ్చు.

47. ఆశ్చర్యంలో నుంచే తత్త్వశాస్త్రం పుడుతుంది - సోక్రటీస్.

48. ఇంటిలో శాంతి నెలకొల్పాలన్నప్పుడు పక్కింటి తలుపులను బాది ప్రయోజనం లేదు.

49. ఇంద్రియాలను తన వశంలో పెట్టుకున్నవాడే వివేకి.

50. ఇచ్చువారికి దేవుడు ఇవ్వకమానడు.

1. 20 ఏళ్ళ అనుభవం నేర్పే పాఠాలను ఏడాది గ్రంధ పఠనం నేర్పుతుంది.

2. అంకెలతో దేన్నయినా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప.

3. అంతరంగంలో ఉన్న ప్రేమ కంటే బహిరంగంగా మందలించడం మంచిది.

4. అంతరాత్మ మనలను మందలించే పనులు మనం చెయ్యకూడదు.

5. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు.

6. అందం అన్నది సత్యం యొక్క శోభ.

7. అందమైన వస్తువు ఎప్పుడూ ఆనందాన్నిస్తుంది.

8. అందమైనది మంచిగా ఉంటుంది. మంచిగా ఉన్నవాడూ అందాన్ని పొందుతాడు.

9. అందరి సంతోషంలో నీ సంతోషాన్ని వెతుక్కో.

10. అందరిపట్ల విధేయత కనపరచండి. కాని మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి.

11. అందానికీ, కళ్ళకీ అవినాభావ సంబంధం ఉంటుంది - ప్రేంచంద్.

12. అక్షరరూపం దాల్చిన ఒక్కసిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక.

13. అఙ్ఞానం అనేది అభివృద్దికీ, మార్పుకూ ఎప్పుడూ అడ్డుగోడే.

14. అఙ్ఞానాన్ని కప్పిపెడితే మరింత ఎక్కువవుతుంది. నిజాయితీగా అంగీకరిస్తే ఎప్పటికైనా దాన్ని తొలగించుకోగలమన్న ఆశ ఉంటుంది.

15. అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడతారు.

16. అడిగిన వెంటనే ఇవ్వబడిన దానం గొప్పది.

17. అణుకువ అనేది లేకుంటే అందం అనేది కూడా అసహ్యంగా, వికారంగా కనిపిస్తుంది.

18. అతి ఉత్తమమైన ఆదర్శాన్ని ఎన్నుకొని దానికి తగ్గట్టుగా జీవించండి.

19. అతి వివేకవంతుడి బుర్రలో వేపకాయంత వెఱ్ఱి ఉంటుంది.

20. అత్యాశకు గురికాని వారు చిన్న విషయాలలో గొప్ప విజయాన్ని సాధిస్తారు.

21. అదుపులో ఆనందం, పొదుపులో భాగ్యం.

22. అదృష్టం సంసిద్దంగా ఉన్న మనస్సునే వరిస్తుంది.

23. అదృష్టం సాహసవంతులను వరిస్తుంది.

24. అధైర్యానికి అవకాశమివ్వకు, ఆనందాన్ని చేజార్చుకోకు.

25. అధ్యాయం ప్రారంభించిన తరువాత కాని మన అజ్ఞానం తెలిసి రాదు.

26. అనవసరమైనదాన్ని వదలివెయ్యడంలోనే చదువు యొక్క కళ ఆధారపడి ఉంది.

27. అనుబంధం లేకుండా ఏ అనుభవం రాదు.

28. అనుభవమే అన్ని విజయాలకూ మూలం.

29. అన్ని ఆశలు అడియాసలైనప్పుడు మన ముందు భవిష్యత్తు అలానే స్థాణువుగా ఉంటుంది.

30. అన్ని విషయాలలో నిరాశ చెందకుండా ఆశతో జీవించడం మంచిది.

31. అన్ని సాక్షాలు కంటే ఆత్మ సాక్షం అధికం.

32. అన్ని సుగుణాలకు పట్టుదలే పట్టుకొమ్మ - థామస్ కార్ల్

33. అన్నింటికి సహనమే మూలం. గుడ్డును పొదిగినప్పుడే కోడిపిల్ల వస్తుంది కానీ పగులగొడితే కాదు.

34. అన్నింటిని గురించి ఎంతో కొంత తెలుసుకోవడం తేలికే. కానీ అన్నింటిని గురించి అంతా తెలుసుకోవడం చాలా కష్టం

35. అన్నింటినీ నమ్మేవాడూ నష్టపోతాడు ఏదీ నమ్మనివాడూ నష్టపోతాడు.

36. అన్నీ కళలలోకి గొప్ప కళ అందమైన నడవడి.

37. అన్నీ భగవంతుడిపైనే ఆధారపడ్డాయన్నట్లు ప్రార్ధించు. అన్నీ నీపైనే ఆధారపడ్డాయన్నట్లు శ్రమించు.

38. అపజయం అంచులవరకు పోకుండా లభించే విజయంలో పులకింత ఉండదు.

39. అప్రయత్నంగా సాధించే గెలుపుకంటే, మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.

40. అభినందన పొందాలనే వాంచే ప్రతి హృదయంలోని గాఢమైన కోరిక.

41. అభిప్రాయానికి, ఆచరణకి మధ్య ఉన్న విరామం, కాలం.

42. అభిమానం అనేది అసాధారణ ధర్మంగా పరిణమిస్తే అహంకారం అవుతుంది.

43. అమృతం దొరకలేదని విషం తాగుతామా? మీ కోరిక తీరేవరకూ శ్రమించండి.

44. అరకొఱగా ఏ పనినీ చేయవద్దు.

45. అర్హతను సంపాదించండి. ఆ తరువాత కోరికను పెంచుకోండి.

46. అలవాటు మానవ స్వభావాన్ని నియత్రించే చట్టం - కార్లెయిల్.

47. అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్ర వలే ఉండాలి, కాని ఆధారపడే ఊతకర్రలుగా ఉండకూడదు - ఏ.జి. గార్డెనర్.

48. అవకాశం అనేది రాదు. అది ఇక్కడే ఉంటుంది.

49. అవకాశాలు గ్రుడ్లలాంటివి. ఒకసారి ఒకటే వస్తుంది.

50. అవతలివాడు తప్పు చేస్తున్నాడని చెప్పకు. నీవు తప్పు చేస్తే ఒప్పుకో.[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము