(Telugu) మంచి మాటలు : భాగం - 3

[:te]



  • బాగా బతకాలని కోరుకో. ఎక్కువ రోజులు బతకాలని కోరుకోకు.

  • సమాజం నేరాన్ని తయారు చేస్తే నేరస్తుడు నేరం చేస్తాడు.

  • ఏ సగాన్ని నమ్మాలో తెలుసుకోవడమే ప్రతిభ.

  • తినుటకై జీవించు వాడు బుద్దుడు. జీవించుటకై తినువాడు ముక్తుడు.

  • అన్ని సాక్షాలు కంటే ఆత్మ సాక్షం అధికం.

  • ప్రారంభ వస్తువులన్నీ (విషయాలన్నీ) ఉత్తమంగానే ఉంటాయి - లార్డ్ ఛెస్టర్‌ఫీల్డ్.

  • సుఖదుఃఖాల బంగారు ఇనుప తీగలు మన జీవితంలో విడదీయలేనంతగా కలిసిపోయి ఉన్నాయి.

  • మన వద్ద ఉన్న వస్తువును పోగొట్ట్టుకోనంతవరకు ఆ వస్తువు విలువను మనం తెలుసుకోలేము.

  • బాగా చెప్పడం కంటే బాగా చెయ్యడమే మెరుగైనది.

  • గంపెడు చదువుకంటే పిడికెడు లోకజ్ఞానం విలువైనది.

  • కష్టాలను తప్పించుకోవడం కాదు, వాటిని అధిగమించడమే నిజంగా గొప్పదనం.

  • తాను పుట్టిన నేలనీ, దేశాన్ని ప్రేమించలేని వాడు దేనీని ప్రేమించలేడు.

  • వస్తువుకాదు వస్తువు పరమైన ఆలోచనే దాన్నిమంచిగానూ లేదా చెడ్డగానూ మారుస్తుంది.

  • ఒకచోట ఏకాంతంగా ప్రశాంతమైన మనసుతో గడపలేకపోవడం చేతనే అందరూ బాధలకు గురి అవుతున్నారు.

  • పిడికెడు లోకజ్ఞానం తట్టెడు చదువుతో సమానం.

  • అవకాశం అనేది రాదు. అది ఇక్కడే ఉంటుంది.

  • పదిమంది దుర్మార్గులు కలిసికట్టుగా చేయగల హానికంటే మూర్ఖుడి మూఢవిశ్వాసం ఎక్కువ హాని చేయగలదు.

  • కరుణే ఉత్తమమైన ఆవేశం.

  • మృదువైన సమాధానం ఆగ్రహాన్ని పోగొడుతుంది.

  • ఖాళీ పాత్రలే ఎక్కువ శబ్దాన్ని చేస్తాయి.

  • ప్రేమగుణం కలిగిన వారు ఎదుటివారి నుంచి ఏమీ ఆశించరు.

  • ఙ్ఞానాన్ని మించిన శక్తి ప్రపంచంలో మరేదీ లేనే లేదు

  • పంతులు లేని బడి, దేవుడు లేని గుడి, మనసులేని మనిషి ఒకటే -బాబా.

  • మతం అన్నది చదవడంలో కాదు చేయడంలోఉంది.

  • ఆరోగ్య పోషణకు రోజూ కొంత సమయం వెచ్చించకపోతే జబ్బుపడి చాలా సమయం కోల్పోవలసి రావచ్చు.

  • జూదంతో పోగొట్టుకున్న డబ్బు జూదరిని ఆటతో ఎలా కట్టిపడేస్తుందో అదేవిధంగా అనారోగ్యం ,దుఃఖం అన్నవి జీవితం పట్ల ప్రేమను పెంచుతాయి.

  • వయసు మళ్ళిన వారివి వెనుకటి కాలపు గాధలు, వయసులో ఉన్న వారివి ముందున్న స్వప్నాలు.

  • విజయవంతమైన వ్యక్తి కావడం కంటే విలువైన వ్యక్తి అవడానికి ప్రయత్నించండి.

  • భావం, సాధన ఈ రెండూ చాలా దూరమైనవి.

  • కఠినమైన పనులను తేలికగా చేయగల వాడు - విద్యాబోధకుడు.

  • ఊరటను కలిగించే సానుభూతితో కూడిన మాటలు బాధ, దుఃఖాల గాయాన్ని తగిస్తాయి.

  • ఒక కళాకారుడు ప్రతిచోట జీవిస్తాడు.

  • ఒంటరిగా ఉండగల సామర్ధాన్ని పొందండి. ఏకాంతపు లాభాలను పోగొట్టుకోకండి.

  • అన్నీ కళలలోకి గొప్ప కళ అందమైన నడవడి.

  • వినయం నీవు ధరించే విలువైన వజ్రం.

  • ఆత్మవిశ్వాసంతో అడుగు వేయలేని మనిషి దేనినీ నమ్మడు.

  • సూర్యకాంతి వైపు మీ ముఖాన్ని పెట్టుకోండి, నీడలు మీ వెనుక ప్రక్కపడతాయి.

  • చదవదగ్గ విషయాలు రాయండి లేదా రాయదగ్గ పనులను చేయండి.

  • నవ్వండి, ప్రపంచం మీతో కలిసి నవ్వుతుంది.

  • మనం దయను అర్ధించేంత నిజాయితీతో, దయను పొందినప్పుడు కూడా అంతే నిజాయితీతో దయకు ధన్యవాదాలు తెలియజేయాలి.

  • భవిష్యత్తు పై నమ్మకం కలిగి ఉన్న వ్యక్తి భవిష్యత్తు ఎప్పుడూ ఉత్తమంగా ఉంటుంది.

  • మనకు తెలిసినది చాలా స్వల్పమని తెలుసుకునేందుకు ఎంత తెలుసుకోవాలో.

  • సర్వసంగ పరిత్యాగం చేయనిచే మనిషి తన హృదయాన్ని ఇతరుల కోపం పని చేయడంలో లగ్నం చేయలేడు.

  • సుగుణం వెలకు అతీతమైనది.

  • ఉద్రేకాలకు లొంగినవాడు అందరినీ మించిన బానిస.



[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము