(Telugu) మంచి మాటలు : భాగం - 2

[:te]



  • విద్య ఇచ్చిన తేజస్సు అందరినీ ఆకర్షిస్తుంది.

  • మంచివారితో కలిసి ఉండండి. కానీ ఇతరులను ఇష్టపడకున్నా వారిని ద్వేషించడం మాత్రం చేయకండి.

  • సకాలంలో కావలసినంత వరకు సరైన వ్యక్తులపైన, సరైన విషయంలో కోపం చేసుకునే వ్యక్తి ప్రశంసింపబడతాడు.

  • కామంనకు మించిన వ్యాధీ, బ్రాంతికి మించిన శత్రువూ, కోపానికి మించిన అగ్నీ, విద్యకు మించిన ఆనందం వేరొకటి లేదు.

  • తృప్తితో నిన్ను నీవు బలపరచుకో, అది ఎవరూ జయించలేని కోట.

  • అనుభవమే అన్ని విజయాలకూ మూలం.

  • చిన్న పాఠకుడిగానే ప్రతి పెద్ద రచయిత ప్రారంభిస్తాడు.

  • రహస్యమనేది మీలో మీరు దాచుకున్నంతసేపూ అది మీకు బానిస; బయటకు వొదిలారా, అది మీకు యజమాని.

  • మీరు తప్పనిసరిగా చేయాల్సిన పనిని చిరునవ్వుతో చేయడం అన్నది సహకారం అవుతుంది.

  • నిజాయితీని కోల్పోయిన వ్యక్తి వద్ద కోల్పోవడానికి మరేమీ మిగిలి ఉండదు.

  • క్షమతో కోపాన్నీ, వినయంతో గర్వాన్నీ, ముక్కుకు సూటీగా పోయే గుణంతో మోసాన్నీ, సంతృప్తితో దురాశను జయించండి.

  • జీవించడం అన్నది ముఖ్యంకాదు ఈ కొద్ది జీవితంలో మనం ఏమి చేసామన్నది ముఖ్యం.

  • దిగులు, దౌడు తీసే గుర్రంలాంటిది. దౌడు తీస్తూనే ఉంటుందే కాని అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకవెళ్ళదు.

  • మనిషిపట్ల మనిషికున్న అమానుషత్వం లెక్కలేనంత వేల మందిని విచారపడేలా చేస్తుంది.

  • కళ పొడవైనది జీవితం కురచైనది.

  • విశ్వాసం. ఉత్సాహం అన్నవి గెలుపు రెక్కలవుతాయి.

  • అజ్ఞానం నుండే భయం అన్నది ఎల్లప్పుడూ మొలకెత్తుతుంటుంది.

  • చేసిన తప్పుడు పనులను గురించి చెప్పి పశ్చ్యాత్తాప పడటం అన్నది మంచి పనికి శ్రీకారం చుట్టే మంచి పని అవుతుంది.

  • మీ హృదయాన్ని కరుణ, ప్రేమతో ఉప్పొంగించుకోండి.

  • ఒంటరిగా నిలబడిన మనిషే ప్రపంచంలో దృఢమైన వ్యక్తి.

  • శారీరక రోగాల కంటే మానసిక రుగ్మతలు ఎక్కువ హానిని కలిగిస్తాయి.

  • పుస్తకాలను చదవాలనే కోరిక ఉన్నవారు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండగలుగుతారు.

  • రాబోయే కష్టాన్ని దర్శించండి, అదే దానిని సగం దూరం చేసుకోవడం అవుతుంది.

  • వినయం గొప్పతనాన్ని ప్రకటిస్తుంది.

  • వివిధ విషయాలకు సంబంధించినంతవరకూ అందరూ అవివేకులే.

  • నూనె లేని దీపం వెలగనట్లే భగవంతుడు లేని మనిషి జీవించలేడు.

  • పుస్తకం విలువను ధరకాదు దాని ఉపయోగం నిర్ణయిస్తుంది.

  • చెడ్డను నాటితే దక్కేది దుఃఖమే.

  • ఈ రోజు దొరికే గుడ్డుకంటే రేపు దొరికే కోడి మంచిది.

  • మీరు మంచి వారు మాత్రమే కాదు మంచికి కూడా కారకులు.

  • మంచివాడు బతకడానికి తింటే చెడ్డవాడు తినడానికి బతుకుతాడు.

  • నిరాడంబరమైన,.యదార్థమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి.

  • మనిషి వలన దేవుడు ఇంకా నిరుత్సాహపడలేదన్న దేవుడి సందేశాన్ని ప్రతి శిశువు తనతో తీసుకవస్తుంది.

  • అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు - మహాత్మాగాంధి.

  • విజయం గురించే ఎక్కువగా ఆలోచించండి.

  • దారి మాత్రం తెలిసి వాహనం నడిపే కళతెలియని వ్యక్తిని విమర్శకుడు అంటారు.

  • కొద్ది కోరికలతో, చిన్న విషయాలతో తృప్తి పడటమే ఉత్తముని లక్షణం.

  • ఓటమి అన్నది గెలుపుకు మీరు చెల్లించే ట్యూషన్‌ ఫీజు.

  • తుఫానులో చేసిన ప్రమాణాలను ప్రశాంతంలో మరచిపోతాం.

  • ఆశావాది గులబీను చూస్తే నిరాశావాది ముల్లును చూస్తాడు.

  • అనుభవమే అన్ని విజయాలకూ మూలం.

  • అలవాటు మానవ స్వభావాన్ని నియత్రించే చట్టం - కార్లెయిల్.

  • మనలో తప్పులు లేకపోతే ఇతరుల తప్పులను ఎత్తిచూపడానికి అంత ఉత్సాహపడము

  • లోభికి నాలుగు దిక్కులా నష్టం.

  • సమకాలికులు మనిషి అర్హతను కాదు మనిషిని ప్రశంసిస్తారు. కానీ భావితరాలు మనిషిని కాదు మనిషి అర్హతను ప్రశంసిస్తాయి.



[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము