(Telugu) మంచి మాటలు : భాగం - 4

[:te]



  • ఆత్మాభిమానం అన్ని సుగుణాలకు ఆధారం.

  • పరిస్థితులను మన అదుపులో ఉంచుకోవడంలోనే మగతనం ఉంది.

  • భక్తికున్న గొప్ప సుగుణం మనసును శుభ్రం చేయగలగడమే.

  • చెడు చేయాలన్న గునం మనలో నిండి ఉన్నదువల్లే ఇతరులను గురించి అతి చెడుగా ఆలోచించడంను విశ్వసించే అవకాశాలు ఉన్నాయి.

  • మానవ చరిత్ర రోజురోజుకూ చదువుకూ. దుర్గతికీ మధ్య నడిచే పరుగుపందెంగా తయారవుతోంది.

  • అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్ర వలే ఉండాలి, కాని ఆధారపడే ఊతకర్రలుగా ఉండకూడదు - ఏ.జి. గార్డెనర్.

  • గొప్ప అంశాలు రూపొందేదే కర్మాగారం.

  • ఓర్పుకు మించిన తపస్సు లేదు.

  • మనిషిలో ఉన్న పరిపక్వతకు బాహ్యరూపమే చదువు.

  • ప్రేమకు కట్టుపడి ఉన్న ప్రతి ఇల్లూ, స్నేహాన్ని అతిధిగా స్వీకరించిన ఇల్లూ నిజంగానే స్వర్గసీమ. కారణం అక్కడ హృదయం నివసిస్తుంది.

  • మీ దగ్గరున్న పరికరం సుత్తి మాత్రంమే అయితే ప్రతి ఒక్కదాన్ని మీరు మేకుగా భావించవలసి వస్తుంది.

  • ముందుకు ఎదగనిది వెనక్కు ఎదిగి కుళ్ళిపోతుంది.

  • ఇతురుల తప్పులను క్షమించడం, మరచిపోవడం అనేవి మంచితనానికి అసలు సిసలైన నిదర్శనాలు.

  • నీ తప్పును ఒప్పుకోవడం వలన నిన్నటి కంటే నేడు నీవు వివేకవంతుడవని తెలుస్తుంది.

  • అవసరంలో ఆదుకునేవాడే అసలైన స్నేహితుడు.

  • తప్పులు ఎవరైనా చేస్తారు. కానీ మూర్ఖుడు తప్పులు చేస్తూనే ఉంటాడు.

  • అవకాశాలు గుడ్ల లాంటివి. వాటిని తాజాగా ఉన్నప్పుడే పొదగాలి.

  • చేటు కాలమునకు చెడు బుద్ది పుట్టును.

  • మీ న్యాయనిర్ణేతగా మీరే వ్యవహరంచండి. అప్పుడు మీరు సంతోషంగా ఉండగలుగుతారు.

  • ఎప్పుడైనా తనమీద తనకు విశ్వాసం ఉన్నవారు బలవంతులైతే, సందేహాలతో సతమతమయ్యేవారు బలహీనులు.

  • తెలివితక్కువతనాన్ని తెలుసుకోలేనంత తెలివితక్కువతనం మరొకటి ఉండదు.

  • ప్రేమకు కట్టుపడి ఉన్న ప్రతి ఇల్లూ, స్నేహాన్ని అతిధిగా స్వీకరించిన ఇల్లూ నిజంగానే స్వర్గసీమ. కారణం అక్కడ హృదయం నివసిస్తుంది.

  • సోమరితనం మనదేశాన్ని పట్టి పీడిస్తున్న ప్లేగు.

  • మీరు మంచి వారు మాత్రమే కాదు మంచికి కూడా కారకులు.

  • మనిషిలో జ్ఞానం అనేది పెరిగేకొద్ది తనలోని అజ్ఞానం తెలిసివస్తుంది.

  • భావం, సాధన ఈ రెండూ చాలా దూరమైనవి.

  • కేవలం రెండు విషయాలను-తాను తాగిన విషయాన్ని. తాను ప్రేమలో పడ్డ విషయాన్నీ- మనిషి దాచుకోలేడు.

  • ప్రజలు దుర్బలులు కారు - వారికి లేనిది సంకల్ప బలం -విక్టర్ హ్యూగో

  • జీవితంలో అపూర్వ ఆభరణం వినయం.

  • అదృష్టం మూర్ఖుడి వద్దకు రానైతే వస్తుంది. కానీ అతడితో తిష్టవేసుకుని కూచోదు.

  • నవ్వగలిగినంత వరకూ మనిషి పేదవాడు కానే కాదు.

  • మనం ఏ పని చేసినా సర్వశక్తులను, మనస్సును దానిపై స్థిరంగా కేంద్రీకరించినప్పుడే ఆ పనిని సక్రమంగా చేయగలుగుతాము.

  • మందగించక ముందు అడుగెయ్ వెనుకబడితే వెనకేనోయ్ - గురజాడ.

  • వాత్సల్యం న్యాయాన్ని గుడ్డిదానిగా మారుస్తుంది.

  • తెలుసు కోవటం కంటే తెలుసుకున్న దానిని జీర్ణించుకోవటం ముఖ్యం.

  • మీకున్న శత్రువులనే తన శత్రువులుగా ఉన్నవాడే మీ మిత్రుడు.

  • లక్ష్యం పట్ల ఉన్న స్ధిరత్వం పైనే గెలుపు రసహ్యం దాగుంటుంది.

  • మనసన్నది బంగారం గనితోపాటు ఒక చెత్తకుండి కూడా.

  • భయం అనేది ఒక శారీరికమైన జబ్బు కాకపోవచ్చు. కానీ అది ఆత్మను చంపేస్తుంది.

  • సిరి సంపదలతో తులతూగుతున్నప్పుడు స్నేహితుల మనల్ని తెలుసుకుంటారు. కష్టాలలో మనం స్నేహితులను తెలుసుకుంటాము.

  • మన తప్పులను ఇతరులతో చూచినప్పుడు అవి మనకు కోపాన్ని తెప్పిస్తాయి.

  • పొరపాటు సహజమే కాని అవివేకి అందులోనే విహరిస్తాడు.

  • చిన్న గొడ్డలి పెట్లు మహా వృక్షాలను కూల్చగలవు.

  • మీరు మాట్లాడే విషయాన్ని గురించి ఆలోచించండి. అంతేకాని మీరు ఏమి ఆలోచించారో దాన్ని గురించి మాట్లాడకండి.

  • ఉదయం రోజుకు అద్దం పట్టినట్లే బాల్యం మనషికి అద్దంపడుతుంది.



[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము