(Telugu) మంచి మాటలు - భాగం - 1

[:te]

  • కష్టాల నుండి గట్టెక్కే ఉత్తమ మార్గం కష్టాలను భరించడమే.

  • క్రమశిక్షణ అన్నది ఆపద అనే పాఠశాలలో నేర్చుకోబడుతంది.

  • క్రమబద్దతను పాటించకుండా సంపద, పరాక్రమం లేకుండా విజయం, ఉపకార గుణం లేకుండా పేరు, ఆధ్యాత్మిక ఙ్ఞానం లేకుండా ముక్తి లభించవు.

  • కృతజ్ఞత అనేది ఒకరిపట్ల చూపవలసిందే కాని ఒకరి నుండి ఆశించవలసింది కాదు.

  • గొప్పవాటినీ,చిన్నవాటిని- ఇలా రెండింటిని ప్రేమించేవాడే ఉత్తమమైన ప్రార్ధన చేసేవాడు.

  • పక్షపాత భావన అజ్ఞానపు శిశువు.

  • ప్రతికారం ద్వారా పగ నిర్మూలనం కాదు -రాజాజీ.

  • ప్రేమింపబడడం కంటే కూడా నమ్మకస్తుడిగా ఉండడం అన్నదే ప్రశంసనీయం.

  • పుస్తకం విలువను ధర కాదు దాని ఉపయోగం నిర్ణయిస్తుంది.

  • పూజ, ఉపవాసాలు ఆత్మబలాన్ని పెంచే ఆధ్యాత్మిక వ్యాయామాలు.

  • మదలింపు తరువాత ప్రోత్సహించడమన్నది వాన తరువాత వచ్చే ఎండలాంటిది.

  • మన అవసరాలు ఎంత తగ్గితే దేవుడికి మనం అంత చేరువ అవుతాము.

  • మంచి సంకల్పాలు మంచి ప్రవర్తనకు బీజాలు.

  • మరొకరి జీవితంలో సంభవిస్తున్నంత వరకు ప్రతి ఒక్కటి తమాషాగానే ఉంటుంది.

  • మీ మనసుకు శిక్షణనిచ్చి అభివృద్ధి పరచడం అన్నది మీ కర్తవ్యం.

  • దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు.

  • ఎప్పుడూ ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న.

  • ఏమాత్రం ఉత్పత్తి చేయకుండా ఆరగించే జీవి మనిషి మాత్రం.

  • జీవిత పరిజ్ఞానంలేని గ్రంధాలు నిష్ప్రయోజనాలు.

  • రహస్యాన్ని కాపాడడం, తగిలిన గాయాన్ని మరచిపోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవదం- ఈ మూడూ చాలా కష్టతరమైన పనులు.

  • విద్యను ఆర్జించడం కంటే కూడా అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడం చాలా కష్టం

  • మనం సమాధానంలో భాగం కావాలి కాని, సమస్యలో భాగం కాకూడదు.

  • గతం నుండి నేర్చుకోండి, కాని దాని కారణంగా దిగులుపడకండి.

  • మరమ్మత్తు చేయలేని దాన్ని గురించి బాధపడరాదు.

  • మంచి చెట్టు చెడుఫలాన్ని ఇవ్వనట్లే కుళ్ళిన చెట్టు మంచి ఫలాన్ని ఇవ్వదు.

  • ధైర్యం కేవలం పురుషుడి సొత్తు కాదు. మగవారిలాగా స్వతంత్రులం అని స్త్రీలు భావించాలి.

  • కవి అన్నవాడు ఎప్పుడూ ఆకలితో అలమటించే వాడుగా గాని లేదా భగ్న ప్రేమికుడిగా గాని ఉండాలి.

  • అదృష్టం సంసిద్దంగా ఉన్న మనస్సునే వరిస్తుంది.

  • మీ మనసును లగ్నం చేసే ప్రయత్నాన్ని మీరు కొనసాగిస్తే మీరు అన్నింటిని సాధించవచ్చును.

  • చెసే పనిలో సంతోషాన్ని వెతుక్కోండి. డబ్బును తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.

  • నవ్వగలిగినంత వరకూ మనిషి పెదవాడు కనేకారు.

  • జూదంతో పోగొట్టుకున్న డబ్బు జూదరిని ఆటతో ఎలా కట్టిపడేస్తుందో అదేవిధంగా అనారోగ్యం ,దుఃఖం అన్నవి జీవితం పట్ల ప్రేమను పెంచుతాయి.

  • చదివిన పుస్తకాల నుండి జ్ఞానాన్ని పొంది పాఠాలను నేర్చుకోవడమే చదువు ఉద్దేశ్యం.

  • ప్రేమ సన్నపడ్డప్పుడు తప్పులు బలపడతాయి.

  • ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చేసే పనులు అనర్ధహేతువులు.

  • గొప్ప అంశాలు రూపొందేదే కర్మాగారం.

  • మనలో తప్పులు లేకుండా ఉంటే ఇతరులలో తప్పులను చూసినప్పుడు మనకు ఆనందం కలుగదు

  • ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు.

  • చిన్న చిన్న గొడ్డలి పెట్లే మహావృక్షాన్ని సహితం పడదోస్తాయి.

  • నాకు గతాలు లేవు. కాలం వాటిని కబలించింది. రేపు అన్నది లేకపోవచ్చు. కానీ ఈ రోజు మాత్రం నా దగ్గరుంది.

  • ఎప్పుడూ క్రొత్తనే కోరుకుంటుంది మానవత.

  • పంచుకున్న రహస్యం అందరికి తెలుస్తుంది - అర్బిక్

  • సొందర్యంతో కూడిన వస్తువు నిరంతరమైన ఆనందాన్ని ఇస్తుంది.

  • సంతృప్తి పేదవానికి సంపద ఇస్తుంది. అసంతృప్తి ధనవంతుణ్ణి పేదవానిగా చేస్తుంది.

  • మనిషిలో ఇదివరకు ఉన్న పరిపక్వతను వ్యక్తపరిచేదే విద్య.

[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము