(Telugu) వేమన పద్యాలు
[:te]
[:]
తల్లిదండ్ర్రుల గౌరవాన్ని సమాజంలో కుటుంబ ప్రతిష్టని కాపాడాల్సిన బాధ్యత బిడ్డలదే. దాన్ని గుర్తెరగకపోతే మొత్తం వంశమే అప్రతిష్టపాలవుతుందని ఈ పద్యం ద్వారా చక్కని ఉపమానంతో వేమన ఎలా వివరించారో చూడండి
ఉత్తముని కడుపున ఓగు జన్మించిన
ఓగు అంటే మూర్ఖుడు, చెడ్డవాదని అర్ధం. ఉత్తముని ఇంట్లో చెడ్డవాడు పుడితే కుటుంబ గౌరవమంతా మట్టికలుస్తుంది. అంతే కాదు, అలాంటివాడివల్ల మొత్తం వంశానికే చెడ్డపేరు వస్తుంది. అదెలా అన్నదానికి చెఱకుతో చక్కగా పోల్చి చెప్పాడు వేమన. చెఱకుకి కంకిలా ఒక పువ్వు పూస్తుంది. దాన్ని వెన్ను అంటారు. కాటుక తెగులు వెన్నుకే వస్తుంది. కాని, దాని వల్ల చెఱకుగడ మొత్తం బెండులా మారి తీపంతా పోతుంది. కాబట్టి పిల్లలు ఎంత బాద్యతగా మెలగాలన్నది ఈ పద్యం ద్వార తెలుసుకోవచ్చు.
ఉత్తముని కడుపున ఓగు జన్మించిన
వాడు చెరచు వాని వంశమెల్ల
చెఱకు వెన్ను పుట్టి చెరచదా తీపెల్ల
విశ్దాభిరామ వినురవేమ.
ఓగు అంటే మూర్ఖుడు, చెడ్డవాదని అర్ధం. ఉత్తముని ఇంట్లో చెడ్డవాడు పుడితే కుటుంబ గౌరవమంతా మట్టికలుస్తుంది. అంతే కాదు, అలాంటివాడివల్ల మొత్తం వంశానికే చెడ్డపేరు వస్తుంది. అదెలా అన్నదానికి చెఱకుతో చక్కగా పోల్చి చెప్పాడు వేమన. చెఱకుకి కంకిలా ఒక పువ్వు పూస్తుంది. దాన్ని వెన్ను అంటారు. కాటుక తెగులు వెన్నుకే వస్తుంది. కాని, దాని వల్ల చెఱకుగడ మొత్తం బెండులా మారి తీపంతా పోతుంది. కాబట్టి పిల్లలు ఎంత బాద్యతగా మెలగాలన్నది ఈ పద్యం ద్వార తెలుసుకోవచ్చు.
Comments
Post a Comment