ఈరోజు ఉదయం ఒకరు నా మీసాలు పట్టుకొని లాగారు. వారికి ఏం శిక్ష వేయాలి
అక్బరుకి మనవలూ మనవరాళ్లంటే చాలా ఇష్టం. ఖాళీ దొరికితే వాళ్లతో సరదాగా కథలు చెబుతూ ఆట్లాడుతూ ఉండేవాడు.ఓరోజు అక్బర్ మనవల్లో చిన్నవాడొకడు వచ్చి ‘తాతయ్యా మీ మూతిమీద నల్లగా ఏదో ఉంది, కాస్త వంగండి తీస్తాను’ అన్నాడు అక్బరుతో. అక్బర్ ముందుకు వంగగానే… మీసాల్ని పట్టుకుని లాగేసి ‘హహ్హహ్హ’ అని నవ్వుతూ పరుగు తీశాడు.
‘హారి భడవా’ అనుకుంటూ దర్బారుకి దారితీశాడు అక్బరు. మంత్రులతో మాట్లాడుతూ… ‘ఈరోజు ఉదయం ఒకరు నా మీసాలు పట్టుకొని లాగారు. వారికి ఏం శిక్ష వేయాలి’ అని అడిగాడు. దానికి ఒక్కో మంత్రి ఒక్కోలా సమాధానమిచ్చారు. ఒకరు వంద కొరడా దెబ్బలు కొట్టాలని చెబితే… మరొకరు జైల్లో పెట్టించమని చెప్పారు.
ఇలా చాలా సమాధానాలే వచ్చాయి మంత్రుల నుంచి. కానీ బీర్బల్ మాత్రం ఏమీ మాట్లాడలేదు.
‘బీర్బల్ నీవేమంటావు’ అడిగాడు అక్బర్.
‘మీ మీసం లాగిన వారిని తప్పనిసరిగా ముద్దుపెట్టుకోవాల్సిందే’ అన్నాడు బీర్బల్.దర్బారులో అందరూ బీర్బల్ వైపు చూశారు.
‘ఎందుకలా చేయాల’ని అడిగాడు అక్బరు.
‘రాజా… మీ మీసాన్ని ఇతరులెవరైనా లాగి ఉంటే మీరు ఇప్పటికే ఆ వ్యక్తికి తగిన శిక్ష వేసి ఉండేవారు. అలా చేయలేదంటే… మీసాన్ని లాగింది మీ మనవడో మనవరాలో అయి ఉండాలి. లేకుంటే మీరిలా సభలో ఇంత ప్రశాంతంగా ఉండరు’ అన్నాడు బీర్బల్.
‘శభాష్, నీ తెలివికి మెచ్చాం. అందుకో బహుమానం’ అంటూ బీర్బల్‌కి పళ్లెం నిండా బంగారు కాసులు అందించాడు అక్బర్.

Comments
Post a Comment