(Telugu) మంచి మాటలు : భాగం - 29

[:te]



  • నలుగురి ముందు ఇవ్వబడిన స్నేహపూర్వకమైన హెచ్చరిక బహిరంగ మందలింపుతో సమమైంది.

  • వాడని ఇనుము తుప్పు పడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్దకం మెదడును నిస్తేజం చేస్తుంది.

  • ప్రపంచంలోని ఏ వ్యక్తుల విజయాలను తీసుకున్నా, వాటికి కారణం ఆ వ్యక్తుల తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే.

  • ఆశావాది గులబీను చూస్తే నిరాశావాది ముల్లును చూస్తాడు.

  • శాంతగుణంతో కోపాన్నీ, చెడును మంచితో, పిసినిగొట్టుతనాన్ని ఉదార గుణంతో, అతి వాగుడుతనాన్ని నిజంతో అధిగమించండి.

  • ప్రేమించిన వారే భగవంతుణ్ణి కనుగొనగలిగారు.

  • ఇచ్చువారికి దేవుడు ఇవ్వకమానడు.

  • వివేకం అన్నది మెదడులో ఉంటుంది. కానీ గడ్డంలో కాదు.

  • ప్రమాదానికి సిద్దపడితే తప్ప ప్రమాదాన్ని దాటలేరు.

  • ప్రలోభాలకు లోనై ఏకాగ్రతను పోగొట్టుకుంటే లక్ష్యాన్ని సాధించలేరు.

  • జాతికి సంపద వెండి, బంగారాలు కాదు - సజ్జనులు.

  • చిన్న చిన్న పనులే విశిష్టతను దారి తీస్తాయి. కానీ విశిష్టత చిన్నది కాదు.

  • ధనవంతుడిగా మరణించడం కంటే ధనవంతుడిగా జీవించడం హాయి.

  • రోజులు తెలుసుకోలేనిదాన్ని సంవత్సరాలు ఎక్కువగా బోధిస్తాయి.

  • 'అంతా తనదే' అన్నది మమకారము.'అంతా తనే' అన్నది అహంకారము.

  • అన్నింటికీ మించిన నేరం అన్యాయంతోనూ, అక్రమాలతోనూ రాజీ పడటమే.

  • ఏ విషయాన్నైనా స్పష్టంగా చూడగలిగిన వ్యక్తే నిజమైన మేధావి.

  • ఓటమి లేనివాడికి అనుభవం రాదు. అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు.

  • ఓడిపోయేవారు ఒక్కసారే ఓడిపోతారు.గెలిచేవారు తొంబైతొమ్మిదిసార్లు ఓడిపోతారు.వందసార్లు ప్రయత్నిస్తారు కాబట్టి.

  • గమ్యం చేరుకోవటం కంటే, నమ్మకంతో ప్రయాణం చేయటమే మేలైనది.

  • గెలిచినపుడు గెలుపును స్వీకరించు,ఓడినపుడు పాఠాన్ని స్వీకరించు.

  • గౌరవాలు పొందడం కాదు గొప్ప - వాటికి తగిన అర్హత సాధించడం గొప్ప.

  • తపన, పట్టుదల ఉన్న వారి దగ్గరికే విజయం వస్తుంది.

  • నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే,నువ్వు తప్పు చేస్తునావని కాదు.నువ్వు చేస్తున్నపని వారికీ నచ్చలేదన్నమాట.

  • బలీయమైన ప్రతిపక్షం లేనిదే ప్రభుత్వం ఎంతోకాలం సుస్థిరంగా వుండజాలదు.

  • మన కష్ట సుఖాలకు తరచూ కారణమయ్యేది మన మాట తీరే.

  • ''విజ్ఞానం అంటే తనకు అంతా తెలుసునన్న అహంకారం. వివేకం అంటే తనకు ఏమీ తెలియదన్న వినమ్రత''

  • ప్రియంగా, హితంగా, సత్యంగా మాట్లాడటం ఓ తపస్సు.

  • విజేత వెనుక ఉండేది అదృష్టమో మంత్ర దండమో కాదు. చక్కని ప్రణాళిక , కటిన శ్రమ , అంకిత భావం.

  • శిఖరం అంచుకు చేరుకున్నాక కూడా పడదోసేవారుండచ్చు. కాని శిఖరం అంత ఎత్తుకు ఎదిగిన వారిని పడదోయడం ఎవరి తరమూ కాదు.

  • మీ కష్టాలను ఇతరులతో ఏకరువు పెట్టుకోకండి. చాలామంది వాటిని పట్టించుకోరు. మిగతావారు మీ కష్టాలను విని సంతోషిస్తారు.

  • నీ అంగీకారం అనేది లేకుండా నీ ఆత్మగౌరవాన్ని ఎవ్వరూ తగ్గించలేరు.

  • మీరు శిఖరాన్ని చేరాలనుకుంటే మీ ప్రయాణాన్ని కింద నుండీ ప్రారంభించండి.

  • వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయండి.

  • దేశకాల పరిస్థితులకు అతీతమైనది సంస్కృతి.

  • ప్రేమ పొందే వారిని, పంచే వారిని - ఇద్దరినీ బాగుపరుస్తుంది - డా. కార్ల్ మెన్నింజర్.

  • దైవకార్యంలో పాల్గొనే అవకాశం కలిగిన వాడే అందరినీ మించిన అదృష్టవంతుడు.

  • పతనానికి సోపానాలు మూడు - నిర్లక్ష్యం, అజాగ్రత్త, పొరపాటు.

  • మనసును ఎంత అదుపులో పెట్టుకోగలడో మనిషి అంత గొప్ప వాడవుతాడు.

  • ఆకలే అన్నానికి పనికొచ్చే అతి మంచి పచ్చడి.

  • ఈ రోజు మనం గతం శిఖరాలపై నిలుచుంటాము. కానీ ఇవి రేపటి పర్వత పద ప్రాంతాలవుతాయి.

  • మన తప్పులను ఇతరులతో చూచినప్పుడు అవి మనకు కోపాన్ని తెప్పిస్తాయి.

  • పూలలో సువాసన, మనుష్యులలో యోగ్యత అనేవి దాచినా దాగని వస్తువులు.



[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము