(Telugu) మంచి మాటలు : భాగం - 10

[:te]



  • కళ సుదీర్ఘం, జీవితం అల్పం.

  • ఎదుటి వారిని సంతోషింపజేయడంలోనే సంతోషం ఉంది.

  • లోభికి నాలుగు దిక్కులా నష్టం.

  • పెద్ద విషయాలకు సంబధించి ప్రణాళికను తయారు చేసుకోవడం

  • మనిషి వలన దేవుడు ఇంకా నిరుత్సాహపడలేదన్న దేవుడి సందేశాన్ని ప్రతి శిశువు తనతో తీసుకవస్తుంది.

  • తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ప్రతివ్యక్తి ఒక వాస్తుశిల్పే.

  • సహనం తియ్యటి ఫలాన్నిచ్చే చేదు మొక్క.

  • మంచి పుస్తకాలు ప్రపంచపు అందాన్ని చూడగలిగేలా చేసే కన్నులు.

  • సంఘటన జరిగిన తరువాత తెలివిగా ప్రవర్తించడం తేలిక.

  • ప్రవర్తన అనే అద్దంలో ప్రతి ఒక్కరి ప్రతిబింబం కనబడుతుంది. సమయాన్ని పాటించడం అన్న పునాది పైనే మీ వృత్తి ఆధారపడి ఉంటుంది.

  • సాహసవంతుడి వరకూ అదృష్ట దురదృష్టాలు కుడి ఎడమల లాంటివి. అతడు రెండింటినీ వాడుకుంటాడు.

  • సరివారితో స్నేహం చేసి, తక్కువ వారిపై కరుణ చూపి, అధికులతో ఆనందించి, చెడ్డవారికి దూరంగా ఉండాలి.

  • గెలుపు అందవిహీనతను మరుగుపరిచే అరుదైన రంగు.

  • కీర్తి పొందని పుట్టుక నిష్ఫలము.

  • పరిస్ధితులు బలహీనులను ఏలుతాయి. కానీ అవే వివేకవంతుల పాలిటి పరికరాలవుతాయి.

  • మనలో చాలామంది ఇతరులకంటే కూడా గొప్పగా చేయగలిగిన వారై ఉంటారు. అది తమ చేతివ్రాతను తామే చదవగలిగినవారై ఉంటారు.

  • మీరు సరి అయినప్పుడు మీరు ఒప్పుకోని విషయాలకు సంబంధించిన చర్చను మానేయండి.

  • మనం ప్రేమించే దాన్నిబట్టి మనం తీర్చిదిద్దబడతాము, రూపు దిద్దుకుంటాము.

  • గెలుపు అందవిహీనతను మరుగుపరిచే అరుదైన రంగు.

  • ఉపదేశం పూర్తి అయిన తరువాత మీ ప్రవర్తనను సూచించేదే మీ మతం.

  • తృప్తి అమూల్యమైన ముత్యం. పదివేల కోరికలకు బదులుగా ఈ ముత్యాన్ని పొందినవాడు వివేకాన్ని, ఆనందాన్ని పొందుతాడు.

  • ఏదైనా ఒక పనిని చేసే ముందు దాని పర్యవసానం ఏమిటో ఒక్క క్షణం ఆగి ప్రశ్నించుకొని అప్పుడు ఆ పనిని ప్రారంభించడం అత్యుత్తమం.

  • సమయాన్ని వ్యర్థం చేయడం చాలా సర్వసాధారణమైన నేరం.

  • దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి.

  • ఎల్లప్పుడూ వెలుగుని చూడటం నేర్చుకొన్నవారికి అసలు చీకటనేదే కనిపించదు.

  • ఆత్మ నియంత్రణకు మించిన సంపద ఈ ప్రపంచంలో మరేదీ లేదు.

  • ఒకచోట ఏకాంతంగా ప్రశాంతమైన మనసుతో గడపలేకపోవడం చేతనే అందరూ బాధలకు గురి అవుతున్నారు.

  • సందర్బోచితమైన మౌనం మాటలు కంటే ఎక్కువ వాగ్ధాటిని గలిగి ఉంటుంది.

  • పుస్తకం నుండి మనం గ్రహించగల వాటిపైన పుస్తకం విలువ ఆధారపడి ఉంటుంది.

  • పూజ, ఉపవాసాలు ఆత్మబలాన్ని పెంచే ఆధ్యాత్మిక వ్యాయామాలు.

  • మనిషిలో జ్ఞానం అనేది పెరిగేకొద్ది తనలోని అజ్ఞానం తెలిసివస్తుంది.

  • మనిషి చేసే అనేక తప్పులకు కారణం అతనిలోని అహంకారమే.

  • ఒక కళాకారుడు ప్రతిచోట జీవిస్తాడు.

  • లెక్కించేందుకు ఇంకేమీ లేనప్పుడు, మనిషి తన వ్రేళ్ళను లెక్కిస్తాడు.

  • సత్ర్పవర్తనకు విలువలేని చోట పుట్టుక ఎందుకూ పనికిరానిదవుతుంది.

  • కర్తవ్యం మన చేత పనులను బాగా చేయిస్తుంది. కానీ ప్రేమ ఆ పనులను అందంగా చేయడంలో సహాయపడుతుంది.

  • శుభ్రత దైవత్వానికి తరువాతది.

  • మిత్రుడిని ఎన్నుకున్నట్లే రచయితను కూడా ఎన్నుకోండి.

  • మందగించక ముందు అడుగెయ్ వెనుకబడితే వెనకేనోయ్ - గురజాడ.

  • తప్పు చేయడం తప్పుకాదు. దానిని మళ్ళీ చేయడమే తప్పు.

  • ఆకలే అన్నానికి పనికొచ్చే అతి మంచి పచ్చడి.

  • అహంకారం అఙ్ఞానానికి అనుంగు బిడ్డ.

  • నిజమైన అందం పవిత్రమైన హృదయమై ఉంటుంది.

  • వివేకం అన్నది మెదడులో ఉంటుంది. కానీ గడ్డంలో కాదు.

  • అక్కరకు మించిన తెలివి వివేకం అనిపించుకోదు.



[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము