(Telugu) సుమతీ శతక సూక్తులు
[:te]
కనకపు సింహాసనమున
శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం
దోసంగ బట్టము కట్టిన
వెనకటి గుణమేల మాను వినరా సుమతీ
భావం: ఒమంచి బుద్ధి గలవాడ! కుక్కది హీనగుణము దానిని మంచి ముహుర్తమునాడు బంగారపు సింహాసనమున కూర్చుండ బెట్టినను హీనబుద్ధి విడవడు. అట్లే హీనుని ఉన్నత స్తానమున కూర్చుండబెట్టినను అతని బుద్ధి మారదు.
చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైన యట్లు పామరుడు దగన్
హేమంబు గూడబెట్టిన
భూమీశుల పాలజేరు భువిలో సుమతీ !
ఓ సుమతీ! భూమిలో చీమలు కష్టపడి పెట్టిన పుట్టలలో పాములు చేరును. అట్లే మూర్ఖుడు దాచి ఉంచిన బంగారం రాజులపాలై అతనికి ఉపయోగపడక పోవును.
తలనుండు విషము ఫణికి
వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్
తలతోక యనక యుండును
ఖలునకు నిలువెల్లా విషము గదరా సుమతీ!
భావం: ఓ సుమతీ! పామునకు తలయందు విషము ఉందును.తేలుకు విషము తోకలో ఉండును. కానీ, దుర్మాగుడైన మనిషికి తల ,తోక యనక శరీరమంతయు విషము ఉందును.
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినప్పుడే పుట్టాడు జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబునాడు పోదుర సుమతీ!
భావం: ఓ సుమతీ! కొడుకు పుట్టగానే తండ్రికి సంతోషము కలగదు కాని ఆ కొడుకు గొప్పవాడై ప్రజలు అతనిని పొగడుతున్నప్పుడు ఆ తండ్రికి నిజమైన సంతోషము కలుగును.
మాటకు ప్రాణము సత్యము
కోటకు ప్రాణంబు సుభటకోటి ధరిత్రిన్
బోటికి ప్రాణము మానము
చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!
భావం: ఓ మంచిబుద్ది గలవాడా! మాటకు సత్యమే ప్రాణము. ఈ ప్రపంచమున కోటకు ప్రాణము వీరులైన సైనికులే అగుదురు. స్త్రీకి శీలమే ప్రాణము అట్లే చీటికి సంతకమే ప్రాణము. అనగా సంతకం లేని చీటీ వ్యర్ధము.
తన కోపమే తనకు శత్రువు
తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమే స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ!
భావం: ఎవరికైననూ తన కోపమే తనకు శ్త్రువగును. తన శాంతమే తనకు రక్షగా నిలచును తను చూపెడి దయాగునమే బంధువు లవలె సహకరించును తానూ సంతోషముగా నుండగలిగినచో అది స్వర్గముతో సమానము. తానూ దుఃఖమును చేతులారా తెచ్చుకోనినచో అదియే నరకమగుట తధ్యము||
ఉపాకారికి నుపకారము
విపరీతము గాడు సేయ వివరింపంగా
నపకారికి సుపకారము
నెపమెన్నకఁజేయువాడె నేర్పరి సుమతీ!
భావం:మనకు ఉపకారము చేసిన వారిని తిరిగి ఉపకారము చేయుట మంచి లక్షణము అంతేగాని అందులో ప్రత్యేకత లేదు . కాని అపకారము చేసిన వారిపై నేపములేన్నాక తిరిగి వారికే ఉపకారము చేయగలిగినవాడే “నేర్పరి” అన్పించుకోనును.
ఉపమింప మొదలు తియ్యన
కపటం బెడనెడను జెఱుకు కైవడినే పో
నెపములు వెదకును గడపటఁ
గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ!
భావం: చెఱకుగెడ మొట్ట మొదట తియ్యగా నుండి, చివరకు పోయిన కొలది మధ్యమధ్య చప్పగా నేవిధముగా నుండునో ఆ విధము గానే పోల్చి చూడగా మొనగాడైన దుర్మార్గునితోడి స్నేహము మొదట ఇంపుగా నున్నను చివరకు తప్పులకు వెదకుటకు ప్రారంభించును గదా.
పాలసునకైన యాపద
జాలింబడి తీర్పఁదగదు సర్వజ్ఞునకుం
దే లగ్నిఁబడగఁ బట్టిన
మేలెఱుఁగునే మీటుఁగాక మేదిని సుమతీ!
భావము: తేలు నిప్పులో పడినప్పుడు. దానియందు జాలిపడి దానిని బయటకు తీయుటకు పట్టుకోనినచో కుట్టును. కాని మనము చేయఁబోవు మేలును తెలుసుకోనఁ జాలదు. ఆ విధముగానే జాలిపడి మూర్ఖునకు ఆపద యందు అడ్డుపడఁజాచిన తిరిగి మనకపకారము చేయును కావుననట్లు చేయరాదు.
కూరిమిగల దినములలో
నేరము లెన్నడును గలుగనేరవు మరియా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!
భావము: స్నేహము బాగుగా నున్న రోజులలో ఆ స్నేహితులకు ఒకరు చేసిన పనులలో మరొకరికి తప్పులు కనిపించవు. అదే స్నేహితులకు విరోధము వచ్చినపుడు ఒకరి చేష్టలు మరొకరికి దోషముగా కనుపించును.
ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగఁ జెఱువు నిండినఁ
గప్పలు పదివేలుఁ జేరుఁగదరా సుమతీ!
భావం: మనకు ఎప్పుడైతే ఎక్కువగా సంపదలు చేకూరునో అప్పుడు బంధువులు అధికముగా వచ్చెదరు అదేట్లనగా చెఱువు నిండా నీరు జేరి అలలు వచ్చునట్టి సమయన వేల కొలది కప్పలు వచ్చి చేరును కదా!
అప్పిచ్చువాఁడు వైద్యుఁడు
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుఁడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ!
భావం: ఋణమునిచ్చువాడును వైద్యుడును. ఎల్లప్పుడును ఆగకుండా ప్రవహించు నదియును, బ్రాహ్మాణుఁడును గల గ్రామమందు నివసింపుము, వారు లేనట్టి గ్రామమందు నివసింపకుము.[:]

Comments
Post a Comment