(Telugu) మంచి మాటలు : భాగం - 8

[:te]



  • ఊరికే దొరికిన పుస్తకాన్ని సాధారణంగా చదవరు. డబ్బు పెట్టికొంటే తప్పకుండా చదువుతారు - శామ్యూల్ జాన్సన్.

  • కఠిన పరిశ్రమకు ప్రత్యామ్నాయం అన్నది లేదు.

  • ధైర్యంగా ఉంటూ నిజం వివేకంల మార్గాన్ని అనుసరించండి. అప్పుడు ధర్మదేవత మిమ్మల్ని సంరక్షిస్తుంది.

  • మనోబలం లేకుండా గణనీయమైనదేదీ మనం సాధించలేము.

  • సమన్వయం నుండి నిజమైన ఆనందం పుట్టుకొస్తుంది.

  • ఇచ్చువారికి దేవుడు ఇవ్వకమానడు.

  • దూరం సోందర్యంనూ, దృశ్యాన్నీ మరింత సుందరం చేస్తుంది.

  • ఒక వస్తువు వినాశనం మరో ఉత్పత్తికి ఆలంబం.

  • నిజాయితీపరుడైన వ్యక్తి భగవంతుడి భవ్యసృష్టి.

  • ప్రపంచానికి మీ అవసం ఉండేలా చూసుకోండి. అప్పుడు ప్రపంచం మీకు ఆహారాన్ని ఇస్తుంది.

  • ఆశతో కూడా నిరాశ వస్తుంది

  • మంచి మిత్రుడు రెండు శరీరాలలో నివశించే ఒక ఆత్మ.

  • పని మనల్ని విసుగుదల, చెడ్దతనం, అవసరాలనే మూడు దుష్టశక్తుల నుండీ కాపాడుతుంది.

  • సాహసం అన్నది శారీరిస గుణం కాదు. ఆత్మగుణం.

  • పరిస్థితులు బలహీనుణ్ణి శాసిస్తాయి. కాని అవే వివేకి విజయానికి సాధనాలవుతాయి.

  • ప్రేమ పొందే వారిని, పంచే వారిని - ఇద్దరినీ బాగుపరుస్తుంది - డా. కార్ల్ మెన్నింజర్.

  • మూర్ఖుడి హృదయం నోటిలో ఉంటుంది. కానీ వివేకవంతుడి హృదయంలో నోరు ఉంటుంది.

  • గొప్ప హృదయం లేనప్పుడు సంపద. వికారమైన బిక్షగాడు అవుతుంది.

  • ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.

  • బాధ మనిషిని ఆలోచింపజేస్తుంది. ఆలోచనలు మనిషిని బుద్దిమంతుణ్ణి చేస్తాయి. వివేకం జీవితాన్ని ఓర్చుకునేలా చేస్తుందు.

  • పక్షపాత భావన అజ్ఞానపు శిశువు.

  • అన్ని ఆశలు అడియాసలైనప్పుడు మన ముందు భవిష్యత్తు అలానే స్థాణువుగా ఉంటుంది.

  • పాపం అనేది వేరే ఒకచోట ఆవిర్భవించదు. చేసే దుష్కర్మలోనే పొంచి ఉంటుంది.

  • సృష్టిలో ఎన్నో అందమైన వస్తువులు ఉన్నాయి. కాని అవన్నీ శిశువంత తియ్యనివి కావు.

  • సంతోషం మనిషి తీరు అవుతుందేకాని మనిషి దగ్గరున్న వస్తువు ఏమాత్రం కాదు

  • మంచి పుస్తకాలు ప్రపంచపు అందాన్ని చూడగలిగేలా చేసే కన్నులు.

  • మనసా వాచా కర్మణా పరిశుద్ధంగా ఉన్నప్పుడే మీరు మీ మనసును భగవంతుడి స్వరంతో ఏకం చేసుకోగలుగుతారు.

  • ఆశావాది గులబీను చూస్తే నిరాశావాది ముల్లును చూస్తాడు.

  • అన్ని విషయాలలో నిరాశ చెందకుండా ఆశతో జీవించడం మంచిది.

  • కొన్ని పట్టులాంటి ముఖాల వెనుక ముతక గుడ్డ ఉంటుంది.

  • గొప్పవాడిగా ఉన్నందువల్ల నింద అన్నది ప్రజలకు కట్టే పన్ను అవుతుంది.

  • తెలుసు కోవటం కంటే తెలుసుకున్న దానిని జీర్ణించుకోవటం ముఖ్యం.

  • పూజ, ఉపవాసాలు ఆత్మబలాన్ని పెంచే ఆధ్యాత్మిక వ్యాయామాలు.

  • అన్నింటికి సహనమే మూలం. గుడ్డును పొదిగినప్పుడే కోడిపిల్ల వస్తుంది కానీ పగులగొడితే కాదు.

  • తన దోషాలను గుర్తించకపోవటాన్ని మించిన పొరపాటు లేదు.

  • మీ తప్పులు మీ విజయానికి కావల్సిన కొత్త పాఠాలు.

  • పుష్పానికి సుగంధం - మనిషికి వ్యక్తిత్వం.

  • హంస అసమర్ధుడి ఆఖరి ఆశ్రయం.

  • ఙ్ఞానాన్ని మించిన శక్తి ప్రపంచంలో మరేదీ లేనే లేదు

  • చూస్తున్న పొరుగువాణ్ణి ప్రేమించలేనివాడు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు?

  • లోటు అనే పాఠశాలలో నిజం రోజు రోజుకూ బలం పుంజుకుంటుంది.

  • సమన్వయం నుండి నిజమైన ఆనందం పుట్టుకొస్తుంది.

  • పనిచేసే హక్కు నీకుందికానీ దాని ఫలితంపై హక్కులేదు.

  • ఆరోగ్యం నమ్మకాన్ని ఇస్తుంది. నమ్మకం అన్నింటినీ ప్రసాదిస్తుంది.

  • నేను యుద్ధాన్ని కోల్పోవచ్చును. కానీ ఒక నిమిషాన్ని మాత్రం పోగొట్టుకోలేను.



[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము