(Telugu) మంచి మాటలు : భాగం - 12

[:te]



  • జీవితపు గొప్ప విజయాలన్నవి తరచుగా బాజాలతో కాక ప్రశాంతంగా సాధించినవే అవుతాయి.

  • ఇంద్రియాలను తన వశంలో పెట్టుకున్నవాడే వివేకి.

  • ఎవ్వరికీ తెలియని విషయంను గురించి కొంత తెలుసుకోవడలోనే విజయవంతమైన వ్యాపార రహస్యం దాగుంది.

  • బాధ మనిషిని ఆలోచింపజేస్తుంది. ఆలోచనలు మనిషిని బుద్దిమంతుణ్ణి చేస్తాయి. వివేకం జీవితాన్ని ఓర్చుకునేలా చేస్తుందు.

  • ఇతరుల సంక్షేమంలో ఆనందాన్ని పొందేవాడు మనుషుల చేత ఎన్నుకోబడిన విశిష్ట వ్యక్తి అవుతాడు.

  • నవ్వండి మీతో ప్రపంచం కూడా నవ్వుతుంది. ఏడవండి మీరు మాత్రమే ఏడవాలి.

  • సమదృష్టి గల మనస్సు అన్ని దు:ఖాలకు ఉత్తమ ఔషధము.

  • చదివిన దానిని, విన్న దానిని ఆచరించడం సాధన.

  • ఆవిష్కారాలు దుస్సంఘటనలు కావు. అవి విసుగు చెందని శ్రమకు లభించే బహుమతులు.

  • ఈ ప్రపంచలో సేవ ఉత్తమమైన ప్రార్ధన. మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించడమే ఉత్తమమైన ఆరాధన.

  • చేసిన తప్పుడు పనులను గురించి చెప్పి పశ్చ్యాత్తాప పడటం అన్నది మంచి పనికి శ్రీకారం చుట్టే మంచి పని అవుతుంది.

  • పుస్తకాలను చదవాలనే కోరిక ఉన్నవారు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండగలుగుతారు.

  • తెలివితేటలంటే విన్నదాంట్లో సగాన్ని మాత్రం విశ్వసించడం.

  • ఒక మూర్ఖుడు తన పని మానుకుని ఇతరుల యొక్క (వ్యవహారపు) పని ఒత్తిడిలో ఉంటాడు.

  • ప్రతి కష్టంలో గొప్ప లాభాలను ఆర్జించి పెట్టే విత్తులుంటాయి.

  • నమ్మిన సిద్దాంతాలకోసం ప్రాణం బలిపెట్టడానికి సిద్దంగా ఉండేవారికి ఓటమి ఉండదు.

  • సామాన్యులు ప్రార్ధించరు. యాచిస్తారు.

  • ఆపదలందు ధైర్యం ప్రదర్శించే వాడే వీరుడు.

  • మనుషుల చేతలు ఒక పుస్తకపు సూచికలాంటివి. పుస్తకంలో ఉన్న అతి చెప్పుకోదగ్గ విషయాన్ని అవి చాటి చెబుతాయి.

  • నడవడిక అనబడే అద్దం ప్రతి ఒక్కరి ప్రతిబింబాన్ని ప్రతిబింబిస్తుంది.

  • భుజబలం కంటే బుద్ధిబలం గొప్పది.

  • జీర్ణించుకోలేనన్ని నమ్మకాలు మింగకూడదు.

  • పవిత్రమైన మనస్సు గలవారికి, ప్రతిదీ పవిత్రంగానే కనిపిస్తుంది.

  • రహస్యాన్ని కాపాడడం, తగిలిన గాయాన్ని మరచిపోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవదం- ఈ మూడూ చాలా కష్టతరమైన పనులు.

  • ప్రతి కష్టంలో గొప్ప లాభాలను ఆర్జించి పెట్టే విత్తులుంటాయి.

  • మనిషి మనసు గొడుగులాంటిది. తెరవబడినప్పడే గొడుగు బాగా పనిచేస్తుంది.

  • కొన్ని పట్టులాంటి ముఖాల వెనుక ముతక గుడ్డ ఉంటుంది.

  • పైన ఉన్న స్వర్గాన్నీ, క్రింద ఉన్న భూమినీ ప్రేమ నింపుతుంది. ప్రేమ ఒక్కటే కలకాలం నిలుస్తుంది.

  • వినయ విధేయతలున్నప్పుడు మీరు పూర్తిగా బీదవారు కాలేరు. వినయ విధేయతలు లేని పక్షంలో మీరు నిజంగా ధనవంతులు కాలేరు.

  • సుఖదుఃఖాల బంగారు ఇనుప తీగలు మన జీవితంలో విడదీయలేనంతగా కలిసిపోయి ఉన్నాయి.

  • ఒక మనిషి మరొక మనిషి కోసం చేషే త్యాగంతోనూ, పదిమంది కోసం పడే కష్టంతోను ఈ సమాజం నిర్మతమవుతోది.

  • ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చేసే పనులు అనర్ధహేతువులు.

  • కళ్ళద్దాలు తుడుచుకోవటం మర్చిపోయి, ఈ ప్రపంచం మురికిగా ఉందని ఫిర్యాదు చేయవద్దు.

  • జీవితం నాకు ఆలోచించడం నేర్పింది. కానీ ఆలోచనలు ఎలా జీవించాలో తెలియజేయలేదు.

  • జీవితాన్ని విఫలం చేసే ప్రమాదకర లక్షణం తొందరపాటు.

  • తన కోరుకలనూ, వాంఛలనూ జయించిన వ్యక్తి తన అతి పెద్ద శత్రువును జయించిన వ్యక్తి అవుతాడు.

  • బలహీనులు అవకాశం కోసం ఎదురుచూస్తే బలవంతులు అవకాశాన్ని సృష్టించుకుంటారు .

  • సరి క్రొత్త అవకాశానికి కాలంతో నిమిత్తం ఉండదు.

  • మానవుని ప్రయత్నం దైవ విశ్వాసం కార్యసాధనకు మార్గం.

  • తినుటకై జీవించు వాడు బుద్దుడు. జీవించుటకై తినువాడు ముక్తుడు.

  • ఆలస్యంగా చెప్పబడే న్యాయం న్యాయం కాదు.

  • మంచి సలహాకూ, చెడు సలహాకూ మధ్యనున్న వ్యత్యాసాన్ని చెప్పగలిగితే సలహా అవసరమే మీకుండదు.

  • విశ్వాసం పరమ బంధువు.

  • ఐకమత్యం లేని బహుసంఖ్యాకులకు వ్యతిరేకంగా అల్పసంఖ్యాకులు కలిసికట్టుగా పనిచేస్తారు కాబట్టే రాజకీయ యంత్రాంగం గెలుస్తుంది.

  • సత్యానికి దూరంగా ఉండడం అంటే శాంతి నుండి దూరంగా ఉండడం.



[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము