‘‘వారెవ్వా’’ బఫెట్.. ఏం చెప్పారు..
[:en]

మదుపు మారాజు చెప్పే మంచి సూక్తులు..
ప్రపంచ ప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కంపెనీ బెర్క్‌షైర్ ఏజీఎం త్వరలో జరగనుంది.
ఈ సందర్భంగా వివిధ సందర్భాల్లో ఆయన చెప్పిన కీలక కొటేషన్స్ ఒకసారి చూద్దాం...
- కంపెనీ ఏ వ్యాపారం చేస్తుంది అన్నదే పెట్టుబడికి కీలక అంశమని వెల్లడించిన బఫెట్.. భవిష్యత్తులో ఈ వ్యాపారానికి ఉన్న అవకాశాలను అంచనావేయడం ద్వారా పెట్టుబడులను కొనసాగించాలని తెలియజేశారు. మార్కెట్ పడిపోయి ఉన్నప్పుడు నాణ్యమైన షేర్లను కొనడమే అత్యుత్తమ పెట్టుబడి.
- నలుగురి దోవలో నడవాలని ప్రయత్నించాల్సిన పనిలేదు. మార్కెట్లో అంతా భయపడేటప్పుడు మీరు ధైర్యంగా కొనండి.. అంతా ఎగబడి కొనేటప్పుడు భయపడండి(అంటే అమ్మేయండి).
- రూల్ నంబర్ 1: . ఎప్పుడూ నష్టపోకండి.రూల్ నంబర్ 2 : ఎప్పుడూ రూల్ నెంబర్ 1ను మరువకండి.
- ఏంచేస్తున్నామో తెలియకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్లు ప్రవర్తించడం వల్లనే రిస్కులు వస్తాయి. ఒక తప్పటడుగు మొత్తం జీవితాన్నే ముంచేస్తుంది.
- మీ కన్నా గొప్పవారితో కాలం గడపండి. జీవన విధానంలో, ఆర్జనలో, వ్యక్తిత్వంలో, మేధస్సులో మీకన్నా అధికులతో ఎక్కువ కాలం గడపడం మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది.
- మంచి కంపెనీ షేరును అద్భుతమైన ధరకు కొనడం కన్నా అద్భుతమైన కంపెనీ షేరును మంచి ధరకు పట్టేయడం బెటర్..
- 20 ఏళ్లు సంపాదించిన గౌరవమర్యాదలు కోల్పోయేందుకు 5 నిమిషాలు పట్టదు. ఇది వంటపడితే ఇతరులతో మన ప్రవర్తన తీరే మారిపోతుంది. మీ గౌరవాన్ని కాపాడుకోండి. సంఘంలో పరపతి కోల్పోతే, మీదగ్గర ఎంత డబ్బున్నా ఉపయోగం ఉండదు. ఒకసారి మీ పరువుమర్యాద కోల్పోతే తిరిగి సంపాదించడం చాలా కష్టమని గుర్తుంచుకోండి.
- నేను ధనవంతుణ్ని అవుతాననే విషయంపై ఒక్కసారికూడా సందేహపడలేదు.(అంటే మనపై మనకు నమ్మకం చాలా అవసరం అని అర్ధం.)
- ఒక వస్తువుకు మనం చెల్లించేది ధర, మనకు గిట్టేది విలువ. విలువను ఆధారంగా చేసుకొని ధరను నిర్ణయించుకోవాలి.
- మార్కెట్లు పదేళ్లు మూతపడ్డా ఏమీ కాని(పతనం కాని) కంపెనీల షేర్లను కొనాలి.(అంటే ఒడిదుడుకులతో ప్రభావితం కాని కంపెనీలని అర్దం.)
- నిజాయితీ అత్యంత ఖరీదైన వస్తువు. ఇతరుల నుంచి దాన్ని ఆశించకండి.
- ఇవాళ మీరొక చెట్టునీడలో ఉన్నారంటే గతంలో ఎవరో ఆ చెట్టును నాటబట్టేనని గుర్తించండి.
- వర్తమానంలో అనవసర వస్తువులను ఎడాపెడా కొనిపారేస్తే, భవిష్యత్‌లో అవసరమైన వస్తువులను అమ్ముకోవాల్సివస్తుందని గుర్తుంచుకోండి. ఇన్వెస్టర్ అంటే స్వల్ప అవకాశాలతో జీవితకాల రాబడి పొందేలా ఆలోచించాలి.
- ఒక షేరును అవసరమైతే కనీసం పదేళ్లు అట్టిపెట్టుకోలేమని భావిస్తే కనీసం పదినిమిషాల కోసమైనా కొనొద్దు. ( హోల్డింగ్ సమయం అనంతం అని ..అంటే మంచి లాభాలు వచ్చే వరకు వేచిచూడాలి అని అర్ధం).
- ఇతరులు మనకు ఆశ ఎక్కువ అంటారన్న భయంతో మనం ప్రేమించే పనిని చేయలేకపోవడం కన్నా పెద్ద శిక్ష ఇంకోటి ఉండదు. అనవసర మొహమాటాలకు గురికాకుండా, మీకవసరంలేని సందర్భాల్లో ‘నో’ చెప్పడం నేర్చుకోండి.
- జీవితంలో విజయవంతమైన వాళ్లు తమకు సంబంధం లేని విషయాలను దగ్గరకు రానివ్వరు. మనపై మనం నమ్మకం ఉంచడమే మనం పెట్టే అత్యంత కీలక పెట్టుబడి.
- మార్కెట్ పండితులు చెప్పేవి వంద శాతం నిజం కావాలని లేదు. ఎవరూ భవిష్యత్‌లో ఏమి జరుగుతుందో చెప్పలేరు. తెలివైన వాళ్లు ఆరంభిస్తారు, మూర్ఖులు అనుసరిస్తారని గుర్తించండి. ఒకరిని అనుసరించేకన్నా, మీదైన శైలిలో జీవితాన్ని ఆరంభించండి.
- రెండు పెట్టుబడి సాధనాలుంటే వేటిపై పన్ను తక్కువో గుర్తించి దాన్నే ఎంచుకోవాలి.
- అవకాశం తక్కువసార్లే తలుపుతడుతుంది. అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉండాలి.కాలం, సమయాలను తెలివిగా వాడుకోండి. మీరు ఎందుకోసం కాలం వెచ్చిస్తున్నారో, ఎందులో మీ కష్టార్జితం ఉంచుతున్నారో క్షుణ్ణంగా అధ్యయనం చేసి ముందడుగు వేయండి. బంగారు వాన కురుస్తుంటే దోసిట్లతో పట్టాలని చూడకూడదు, బక్కెట్‌తో నింపుకోవాలి.
- మీ గురించి, మీ నిర్ణయాల గురించి, మీ అవసరాల గురించి ఆలోచించుకునేందుకు సమయం కేటాయించండి. వ్యాపారంలో ముందు చూపు కన్నా, గతాన్ని గుర్తుంచుకోవడం అత్యవసరం.
[:]

మదుపు మారాజు చెప్పే మంచి సూక్తులు..
వారెన్ బఫెట్ చెప్తే ప్రపంచం చెవులప్పగించి వింటుందంటారు..
నిజమే..
బఫెట్ అంటే ఒక బ్రాండ్..
ప్రపంచ ఇన్వెస్టర్లకు గురువైన బఫెట్ ఏమి మాట్లాడినా ఒక ఆణిముత్యమే..

Comments
Post a Comment