(Telugu) మాహాత్ముల సూక్తి రత్నావళి

[:te]1)తల్లితండ్రుల తమ సంతానానికి అందించిన వాటికి  ప్రతిఫలం యీ సృష్టిలోనే లేదు.

-వాల్మికి

2)సంతృప్తి అనే వంతెన విరిగిపోయిందంటే యిక, మనిషి జీవితంలో కోరికల ప్రవాహానికి అడ్డూ, ఆపూవుండవు.

-ప్రేమచంద్

౩)మనుషుల్లో వైరానికి అయిదు కారణాలుంటాయి -స్త్రీలు, ఆస్తీపాస్తులు, కఠోరమైన వాక్కులు,కులమత ద్వేషాలు, ఎప్పుడో  తెలిసో తెలియకో చేసిన అపరాధాలు.

-మహాభారతం

4)మనిషి జీవితంలో అన్నిటికన్నా ముక్యమైన విషయ౦  ప్రతి మనిషి తన  పని తాను నిజాయితీతో వ్యవాహరించగలగడం .

                                                                  -షేక్ స్పియర్

5)మంచి పనులు చేసేవారు ఎంత గొప్పవారైనా, వారి గురించి పూర్తిగా తెలిసేదాకా, ప్రజలు వారు చెప్పేది ఒక్క ముక్కయినా వినరు .

                                                                                            -వినోబాభావే

6)అందమైన వస్తువు నిరంతరం ఆనందాలు జలపాతాలని అందిస్తూ వుంటుంది.అందం తాలూకు ఆనందం నానాటికీ ఎదుగుతుండే జీవన మాధురి.అది ఎన్నటికీ శూన్యంగా వాడిపోదు.

-జాన్  కీట్స్

7)ఈ ప్రపంచం మనతో చిత్రాల ద్వారా మాట్లాడుతుంది......అప్పుడు మన ఆత్మ సంగీతం ద్వారా సమాదానాలిస్తుంది.

-రవీంద్రనాథ్ ఠాగూర్

8)ప్రపంచంలో ఎన్నో  రకాల యుద్దాలుంటాయి.అయితే మనిషి తన మనసుతో చేసే యుద్ధం అన్నిటినీ మించిన మహాస౦గ్రామంలాంటిది.

-స్వామి శివానందుడు

9)మంచి మనుషుల మనసులు వెన్నెలా వుంటాయి.

                                                                        -తులసీదాసు

10)వైరం అంతమయ్యేది మృత్యువుతోనే.

-వాల్మీకి

11)ఆలోచనల యుద్దంలో పుస్తకాలే అసలైన అస్త్రాలు.

-జార్జి బెర్నార్డ్ షా

12)మనం మంచివారితో సాంగత్యం చేస్తూ జీవనం సాగిస్తుంటే, చెడు గుణాలు సైతం మంచి గుణాలుగా పరిగణి౦చబడుతుంటాయి. గొల్ల వారింట్లో కూర్చుని, కల్లు తాగినా, పాలే తాగామనుకుంటుంది లోకం.

-విదురుడు

13)సరసహృదయం వున్నవారు సాధారణంగా మృదువైన స్వభావం కలిగి వుంటారు.

-కాళిదాసు

14)అందానికీ, కళ్ళకీ అవినాభావ సంబంధం  వుంటుంది.

-ప్రేంచంద్

15)కలసిమెలసి జీవించే మానవాళి మనుగడ వికాసంలోని సహజపరిణామమే - అంతర్జాతీయ స్థాయిలో సైతం దశదిశల నుంచి లభించే సంపూర్ణ సహకారం.

-ఇందిరా గాంధీ

16)మనిషికి తన జీవితంలో సత్యం పలకాలి.....ప్రియమైన మాటలు  పలకాలి.అయితే ప్రియంకానప్పుడు, ఆ సత్యాన్ని పలకకుండా ఉండడమే శ్రేయస్కరం.

      -మనుస్క్రతి

17)సౌందర్యమే సత్యం..... సత్యమే సౌందర్యం.

-జాన్ క్రిట్స్

18)సత్యమార్గం ఎంతో సులభం...... సుఖ ప్రయాణానికి ఎంతో యోగ్యం.

-ఋగ్వేదం

19)భగవంతుడి చల్లనిచూపు లభించకపోతే, మంచి వారితో మైత్ర్హీబంధం అసలే దొరకదు.

-తులసిదాసు

20)మన వాకిట నిలిచినా మంచివారినీ, మహాపురుషులనీ దర్శించుకుంటే చాలు, పుణ్యక్షత్రల్లో చేసిన కోట్లాది తీర్థస్నానాలకి మించిన ఫలం లభిస్తుంది.

-సూరాదాసు

21)బంగారంలోని ప్రతి అణువు ఎంతోవిలువైనది. గడిచే కాలంలోని ఒక్కోక్య ఘడియ సైతం అంతే!

-జె.మేసన్

22)హృదయం నిండా పరులపట్లసానుభూతి పొంగి పొరలే మనిషికే, ఇతరులని విమర్శించే అధికారం వుంటుంది.

-అబ్రహం లింకన్

23)వివేకానికి మారుపేరుగా నిలిచిపోయే హంసపక్షి స్మశానంలో వుండదు. అలాగే, మంచివారు చెడ్డవారితో కలసి మెలసి వుండలేరు.

    -కౌటిల్యుడు

24)ప్రేమగుణం బాగా పెరిగితే, లభించే సంపద పవిత్రత.

-రవీంద్రనాథ్ ఠాగూర్

25) మనిషికి మంచి మనసుండాలే గాని, నానావిదాల సంపదలూ వాటంతట అవే కూరుస్తుంటాయి.

          -తులసీదాస్

26)కలసి మెలసి జీవించడానికి బదులుగా చెయ్యగలిగింది- పరస్పర సంపూర్ణ వినాసమే!

-జవహర్లాల్ నెహ్రు

27)మనసునిండా నిజాయితీ పెల్లుబుకుతుండాలే గాని, అటువంటి మనిషి తక్కిన ఎంతోమందికన్నా మిన్నగా దేశానికి సేవలు అందించగలుగుతాడు.

-పండిట్ మోతీలాల్ నెహ్రు

28)మన పూర్వీకులు ఎంతోమంది అనుసరించి, పునీతం చేసిన బాట పైన మనంగూడా ప్రయాణం చేయాలి.ఎందుకంటే ఆ మంచి బాట పై పయనించిన వరికేన్నాడు చలనం వుండదు.

-మనుస్క్రతి

29)అంతులేని బంధనాల్లో మనిషిని యిరికించివేసి, ఎన్నోవిధాలుగా యిబ్బంది పెట్టే ఆశలపశాలని తునాతునకలు చెయ్యగలిగేది వైరాగ్యం అనే పదునైనా కత్తి ఒక్కటే.

-భాగవతం

30)కోపం యమధర్మరాజులాంటిది.తృష్ణ వైతరణి లాంటిది.విద్య కామధేనువు లాంటిది.ఇక సంత్రుప్తి దేవరాజైన ఇంద్రుడు నన్ధనవనం లాంటిది.

-చాణక్యుడు[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము