(Telugu) వృత్తిపట్ల ఇష్టం కలిగి వుండాలి

[:te]విజయపరంపరలను సాధించేవారు తమ వృత్తికి ఇచ్చిన ప్రాధాన్యతను కుటుంబానికి ఇవ్వరు. కుటుంబ సభ్యులతో గడిపే సమయం క్రమక్రమంగా తగ్గిపోతుంది. కుటుంబాన్ని అశ్రద్ద చేస్తున్నామనే అప రాధభావం విజయం ద్వారా లభించే సంతో షాన్ని సంతృప్తిని తగ్గిస్తుంది. వృత్తిలో ఎదుర యిన సమస్యల ప్రభావం ఇంటిలోని ప్రవర్త నను ప్రభావితం చేస్తుంది. పర్యవసానంగా కోపతాపాలు ప్రదర్శించి కుటుంబ వాతావర ణాన్ని కలుషితం చేసుకొంటారు.

అనేకులు మానసిక ఒత్తిడులను తగ్గించుకోవడానికి మత్తుమందులకు, మత్తుపానీయాలకు దాసు లౌతారు. పర్యవసానంగా కుటుంబంలో కల తలు ఏర్పడతాయి. విజయాన్ని పోటీతో మిళి తం చెయ్యడం మూలంగా,తమ వ్యక్తిత్వ లోపాలను సమర్థించుకొంటారు. వాటిని సరి దిద్దుకోవడానికి ప్రయత్నించరు.

సంతోషం, సంతృప్తి మానసిక స్థితి, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యం వంటి భౌతిక అంశాలు కొంత వరకు సంతోషాన్ని, సంతృ ప్తిని ప్రభావితం చేస్తాయి. కానీ కనీస అవస రాలకు సరిపడిన ఆర్థిక స్తోమత ఉంటే, జీవి తాన్ని సంతోషంగా గడపవచ్చు .అప్పుడు విజయం సంతృప్తిని, ఆనందాన్ని కలుగ జేస్తుంది.

కాని అత్యాశ, మితిమీరిన కోరిక లు, నిర్హేతుక వాంఛలు విజయాల వల్ల సంక్ర మించిన ప్రయోజనాన్ని అనుభవించనివ్వవు. చివరకు అనారోగ్యాన్ని కూడా తెచ్చిపెడ్తాయి. విజయావకాశాలను మెరుగుపరచుకోవడా నికి, విజయాన్ని ఆనందించటానికి వృత్తిపట్ల మన వైఖరే ముఖ్యభూమికను నిర్వహిస్తుంది. వృత్తిపట్ల ఇష్టాన్ని పెంచుకుంటే, ఉత్సాహం పెల్లుబికి వస్తుంది.

విజయాలు సంతోషాన్ని సంతృప్తిని కలుగజేస్తాయి. అట్లాగే మానవ సంబంధాల అభివృద్ధికి కృషి చేస్తే జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. విజయాన్ని పోటీగా భావించేవారు మానవ సంబంధాలను వృద్ధి చేసుకోలేరు. పర్యవసానంగా సుఖసంతోషా లకు దూరమవుతారు.[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము