(Telugu) విజేత ప్రథమ లక్షణం మంచి మాటతీరు
[:te]మనం జీవితంలోనెగ్గాలంటే అందర్నీ కలుపుకుని పోవల్సిందే...! మనిషిది సంఘజీనం...! ఒకరికొకరు తోడుగా నీడగా సహాయంగా ఉంటేనే అభివృద్ధి సాధించగలం...!మనిషికీ మనిషికీ మధ్య ఉండే స్నేహబంధాన్ని లేదా అనుబంధాలను పటిష్ఠంచేసేది మనమాట తీరే !
మాటతీరు మంచిగా ఉంటే మనుషుల్ని దగ్గర చేస్తుంది...! మాటతీరుకటువుగా ఉంటే మనుషుల్ని దూరం చేస్తుంది...! మంచి మాటతీరున్న వ్యక్తిని అందరూ అభిమానిస్తారు...! ప్రేమిస్తారు...! అతను జీవితంలోఎదగడానికితమవంతు సహకారాన్ని మనస్ఫూర్తిగా అందిస్తారు......! ఎవరి సహాయమూ తీసుకోకుండా ఎవరూ విజయం సాధించలేరు...! మంచిమాటతీరు వల్ల మాటలో వందనం వస్తుంది...!ఎదుటివ్యక్తి పట్ల గౌరవం, అభిమానం ఆపేక్షవ్యక్తమవుతుంది...!తద్వారా ఆవ్యక్తి మనల్ని కూడా గౌరవంతో, అభిమానంతో పలకరిస్తాడు...! చదువులో ఉద్యోగంలో వ్యవహారాల్లో మంచిమాటతీరువల్లే అనేకమంది విజయపధంలో పురోగమిస్తున్నారు...!కొంతమంది మాటతీరు కొట్టినట్టుగా ఉంటుంది...!దాంతో వారితో మాట్లాడాలంటేనే భయమేస్తుంది...!చిరాకు వస్తుంది...!అదే సౌమ్యంగా అపేక్షతో మాట్లాడేవ్యక్తి మాటల్ని మళ్ళీమళ్ళీ వినాలనిపిస్తుంది ...! మంచి మాటతీరుతో బాటు విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తికి సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది...!మంచి మాటతీరు నాయకత్వలక్షణం మరి!
కాలేజీలో చదివే విద్యార్ధికి అనేక అవసరాలుంటాయి...!చదువుకు సంబంధించి కోర్సులు కావాలి. సబ్జెక్టులో బిట్స్ వస్తే లెక్చరర్లు క్లారిఫై చెయ్యాలి...!కొట్టినట్లుగా పొగరుగా మాట్లాడే విద్యార్ధికి ఇటు విద్యార్థులుగానీ, లెక్చరర్లుగానీ ఓపెన్ మైండ్‌తో సహకరించరు. అప్పుడు అతని పురోగతి ఎలా సాధ్యమౌతుంది...? ఆలోచించండి...
ఆర్నెల్లు సహవాసం చేస్తే వారు వీరవుతారన్నది. ఓ నీతి వాక్యం...! మనం చిన్నప్పట్నుంచీ ఎవరితో స్నేహ చేస్తూ ఉంటామో ... మన ఆలోచనా తీరుకూడా ఆవిధంగానే పరుగులు తీస్తుంది...! ఎప్పుడూ బూతులుమాట్లాడేవ్యక్తితో కలసి తిరిగేవ్యక్తి నోటి వెంట బూతులేవస్తాయన్నది సత్యం...! అందుకే -మనం ఎప్పుడూ మంచి వాళ్ళతోనే స్నేహం చెయ్యాలంటారు...! చదువులో నెంబర్ వన్ గాఉండే వాళ్ళతో స్నేహం చేస్తు మనకీ చదువంటే ఇష్టం కలుగుతుంది...! వినయ విధేయతలు కలిగిన వాళ్ళతో స్నేహం చేస్తే మనకూ ఆ మంచి లక్షణాలు అబ్బుతాయి. వారానికి నాలుగు రోజులు కాలేజీకి డుమ్మాకొట్టి సిన్మాలకూ, షికార్లకూ తిరిగే వాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా కాలేజీ ఎగ్గొట్టి సిన్మాకెళ్ళిపోవడం గ్యారెంటీ...! ఎందుకంటే మనసు అనేది చంచలమెనది...!మంచికంటే చెడే మనల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది..! అందుకే -క్లాసులో ముందు బెంచీలో కూర్చోవడం...బాగా చదువుకునే విద్యార్థులతోనే స్నేహం చెయ్యడం...లెక్యరర్లతో సౌమ్యంగా వందనంగా మాట్లాడటం కుటుంబసభ్యులతో ఆప్యాయతతో మెలగడం మనకు మంచి మాట తీరు అబ్బేటట్లుగా చేస్తుంది...! మంచి నీతికథలు చదవడం వల్ల కూడా మన జీవనశైలి మారుతుంది...!తద్వారా మనం కూడా విజయపథంలో పురోగమిస్తూ అసాధ్యాలను సుసాధ్యం చెయ్యగలం...!
[:]

Comments
Post a Comment