(Telugu) పర్యావరణ పరిరక్షణ కోసం...

[:te]* కొందరు వంటిట్లో పనిచేస్తుంటారు హాల్లో టీవీ నడుస్తూనే ఉంటుంది. టేప్‌రికార్డర్ మోగుతూనే ఉంటుంది. హాల్లో ఉంటారు, బెడ్‌రూమ్‌లో ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల తెలియకుండానే బొలెడు విద్యుత్ వృధా అవుతుంది. ఈ అనవసర విద్యుత్ వాడకాన్ని తగ్గించుకోండి.

* తక్కువ విద్యుత్‌తో వెలిగే ఫ్లోరోసెంట్ బల్బులను ఉపయోగించండి.

* నీటి వృధాను అరికట్టండి. కారు, టూ వీలర్‌ను కడుగుతున్నట్లయితే లాన్‌లో పెట్టి కడగండి. మీ పెట్‌ను కడుగుతున్నాసరే లాన్‌లో పెట్టి కడగండి. దీనివల్ల పచ్చికకు ప్రత్యేకంగా నీరు పట్టే అవసరం తప్పుతుంది.

* ట్రాఫిక్ తక్కువగా ఉంటే కాలుష్యం, పెట్రోల్ వినియోగం తక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి.

*ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగించండి. టూ వీలర్ , కార్‌లో ఒక్కరే వెళుతున్నట్లయితే మరొకరిని ఎక్కించుకోండి. మిత్రుల ఆఫీసు ఒకే రూట్‌లోఉన్నట్లయితే ఒకే వెహికిల్ వాడటం మంచిది.

* ట్రాఫిక్ సిగ్నల్స్ పడినచోట ఇంజన్ ఆఫ్ చేయండి.

* పేపర్‌పై ఒకేవైపు రాసి పడేయకుండా రెండు వైపులా ఉపయోగించండి. ఎన్‌వెలాప్స్‌ను తిరిగి ఉపయోగించండి.

* ఇన్విటేషన్ కార్డులు, ఎన్‌వెలాప్స్, లెటర్‌ప్యాడ్స్‌కి రీ సైక్లబుల్ పేపర్‌ను ఉపయోగించండి.

*డిస్పోపజబుల్ నాప్స్ స్థానంలో వాషబుల్‌వి వాడండి.

* పని ముగిసిన తరువాత మానిటర్స్, ప్రింటర్స్‌కు పవర్ ఆఫ్ చేయండి. స్టాండ్ బైలో ఉన్నా విద్యుత్ వినియోగం అవుతుంది. కాబట్టి లంచ్ సమయంలో, మీటింగ్‌కు వెళుతున్న సమయంలో పూర్తిగా పవర్ ఆఫ్ చేయండి.

* ప్లాస్టిక్ బ్యాగులకు బదులుగా పేపర్, జ్యూట్ బ్యాగులను ఉపయోగించండి.

* సోలార్ హీట్ వాటర్, సోలార్ ఫెన్సింగ్, సోలార్ లైట్స్...ఇలా ఇంట్లో సోలార్ వినియోగాన్ని పెంచండి.[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము