(Telugu) మిత్రలాభం

[:te]చిత్రగ్రీవుడు, మిగతా పావురాలు వలలో చిక్కుకొనడం, హిరణ్యకుడి సాయంతో తప్పించుకుని ఎగిరిపోవటం వీటిని గమనించిన లఘుపతనకము అనే కాకి కి మిత్రుల వలన కలిగే లాభం తెలిసింది.
హిరణ్యకుడితో స్నేహం చేయాలనుకొని హిరణ్యకుడి కలుగు వద్దకు వెళ్ళి నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను, దయచేసి నాతో స్నేహం చేయి అంటూ కలుగులోంచి బయకు రమ్మని అడిగింది.
హిరణ్యకుడు కాకి పిలుపులకి కలుగులోంచి బయటకి రాకుండా ఎవరు నీవు? అని అడిగింది.

నాపేరు లఘుపతనకం, నేను ఒక కాకిని. అంది కాకి.

నీతో నాకు స్నేహమా? ఎలుకలకు కాకుకు జాతివైరం. నీవల్ల నాకు ప్రమాదం. ఇలాగే పూర్వం ఒక జింక ఒక నక్కను నమ్మి మోసపోయి చివరి క్షణంలో తన స్నేహితుడైన కాక సహాయంతో ప్రాణాపాయం తప్పించుకుంది.

జింక ఏమిటి? నక్క ఏమిటి? కాకి ఏమిటి? ఆ కథ నాకు చెప్పు. అని అడిగింది లఘుపతనకము.
దానికి హిరణ్యకుడు కాకి కథను ఈ విధంగా చెప్పసాగాడు.[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము