(Telugu) వ్యక్తిత్వ లోపాలను సమర్ధించుకోకూడదు

[:te]మిగిలిన జీవరాశుల కంటే మానవు లకు బాల్యదశ ఎక్కువ.పరిణితి చెంది స్వతం త్రంగా వ్యవహరించటానికి చాలా కాలం పడ్తుంది.ఈ దశలో అనేక పరస్పర విరుద్ధ మయిన అంశాలు ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. స్పష్టత లోపిస్తుంది. సూటిగా ఆలోచించే నేర్పును సంతరించుకోరు. ప్రతి సమ స్యకు అనేక ప్రత్యామ్నాయ పరిష్కారాలు ఉండటం మూలం గా, వ్యూహాలను రూపొందించు కునేటప్పుడు పూర్వాను భవాలు జ్ఞప్తికి వస్తా యి.

తమ అనుభవంలోకి వచ్చిన వ్యక్తుల ప్రవర్తనను అను కరించటానికి అలవాటు పడతారు. ఆ దశలో పోటీ మన స్తత్వాన్ని సంతరించు కొంటారు పర్యవసానంగా విజయానికి, పోటీ పర్యాయ పదంగా కనిపిస్తుంది.

కార్యకారణ సంబంధాలను హేతు బద్ధంగా తెలుసుకోగల్గినప్పటికీ, అసంకల్పిత ప్రేరణలు నిర్హే తుక ప్రవర్తనను బహిర్గతం చేస్తాయి. స్ఫురణ లో మెదిలే అనేక ఆలోచనలకు మూల కారణాలు స్పష్టంగా కనిపించవు. కాని అనేక అలవాట్లు సహేతుకతను ఓడించి ఆవేశానికి ప్రోత్సాహాన్నిస్తాయి.

ముఖ్యంగా బద్ధకం, కోపం, భయం, ద్వేషం వంటి ఆవే శాలు అలవాటుగా స్థిరపడి పోయి సమస్య లను సమయస్ఫూర్తితో, సమయ బద్ధంగా పరిష్కరించుకోనివ్వవు. వ్యక్తిత్వ లోపాలను సమర్థించటానికి ప్రోత్సాహాన్ని అందిస్తాయి. అట్లాగే పోటీ మనస్తత్వాన్ని పెంపొందించి, విజయాలను ఆనందించ నివ్వవు.

ఇట్టి పరిస్థితి సమస్య అని చాల మందికి తెలియదు. చిన్నతనం నుండి తల్లిదండ్రులు పిల్లల సమస్యా పరి ష్కార శక్తిని వృద్ధి చెయ్యడానికి కృషి చెయ్యాలి.[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము