ఆస్థానకవి

ఉజ్జయిని పాలకుడు విజయేంద్రవర్మ పటా ఉగాదికి కవి సమ్మేళనం ఏర్పాటుచేసే వాదు, ఆ సమ్మేళనంలో ఉజ్జయినితోపాటు దాని పరిధి లొని సామంత రాజ్యాలకు చెందిన అనేకమంది కవులు పాల్గొనేవారు. సమ్మేళనంలో కవులమధ్య పోటీకూడా ఉండేది.ఆ పోటీలో ప్రధమసానంలో నిలిచినవారిని విజయెంద్రవర్మ తన ఆస్థానకవిగా పెట్టుకునేవాడు. మళ్లీ ఏడాదిపోటీలవరకూ మాత్రమే ఆ సంవత్సరం విజేత
ఆస్థానకవిగా ఉండేవాడు. పదాది పొదుగునా ఆస్థానకవికి ఎన్నో రాచమర్యాదలుచేసేవారు. కొత్త విజేత వచ్చేసరికి మునుపటి విజేత స్థానం నుంచి తప్పుకోవాల్సిందే. ఎప్పటిలాగే ఆసారి ఉగాది వచ్చింది. కవిసమ్మేళనం, దాంతోపాటు ప్రారంభమ య్యాయి. ఒక సామంత రాజ్యానికి ఆస్థానకవి అయిన రామనాథశర్మ విజేతగా నిలిచాడు. ఆనవాయితీ ప్రకారం అతడిని ఉజ్జయినికి ఆస్థానకవిగా ఉందమని విజయేంద్రవర్మ ఆహ్వానం పంపాడు. కానీ రామనాథశర్మ ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాడు. మునుపటి సామంతరాజ్యానికే తిరిగి ఆస్థానకవిగా వెళ్లేందుకు నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఇంతపెద్ద రాజ్యానికి ఆస్థాన కవినిచేస్తానన్నా కాదని, తన
రాజ్యంలోని ఓ చిన్నభాగానికే రామనాధశర్మపరిమితమవుతాన నదం విజయేంద్రవర్మకు ఆశ్చర్యం కలిగించింది. అందుకు కారణం ఏమిటని రామనాధ శర్మను పిలిచి అడిగాడు. రాజా, నేను ఉజ్జయినిలో ఉంటేనా ప్రతిభతో సOబOధo లేకుండా ఏడాది వరకే ఆస్తానకవి హోదాలో ఉండగలను. అదే చిన్నదైనా కూడా సామంత రాజ్యంలో ఉంటే నా పాండిత్యంతో ఎన్నాళ్లయిన ఆస్థాన కవిగా కొనసాగవచ్చు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాడు రామనాథశర్మ మాటలు విన్నాక విజయేంద్రవర్మ తన ఆలోచనను మార్చుకొని ఆస్థానకవి పదవిని ఏడాది కాలానికి పరిమితం చేయకుందా ప్రతిభ చూపినంతకాలం పదవిలో కొనసాగించాలని నిరయం తీసుకున్నాడు.

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము