(Telugu) వయసుతోపాటు ప్రవర్తనా మారాలి
[:te]ప్రతివారి జీవితంలో చరమదశ వృద్ధాప్యం. ఆ వయస్సులో, బాధ్యతలన్నీ తీరిపోయి విశ్రాంతి తీసుకోవలసిన ప్రాయమది. ఆ సమయంలో సుఖంగా, ప్రశాంతంగా ఉండకపోగా మానసిక సంఘర్షణకు, ఒత్తిడికి గురవుతుంటారు కొందరు మహిళలు. వృద్ధాప్య దశలో పెద్దల ప్రవర్తన తమ ఆలోచనలకు, పిల్లల అభిప్రాయాలకు మధ్య కొంత అంతరం ఏర్పడుతుంది. పెద్దలు తమ గత అనుభవాల తోను, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మాట్లాడుతుంటారు. పిల్లల అభిప్రాయాలకు, నిర్ణయాలకు, పెద్దల ఆలోచనలకు మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. తాము చెప్పినదే పిల్లలు వినాలనుకునే పెద్దలకు పిల్లలనుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది. తమ ఆలోచనల కనుగుణంగా తాము స్వేచ్ఛగా ప్రవర్తించాలని పిల్లలు కోరుకుంటారు. ఆ సమయంలోనే తరాల అంతరాల ఘర్షణ కుటుంబంలో ఆరంభమవుతుంది.
ముసలివయసులో పెద్దలు విశ్రాంతి తీసుకుంటూ తమ తరానికి, ఈ తరానికి మధ్య ఉన్న బేదాభిప్రాయాలను, మారుతున్న కాలాన్ని, పరిస్థితులను గుర్తించాలి. తమ మాటే నెగ్గించుకోవాలని పెద్దలు పట్టుపట్టకుండా గృహ నిర్వహణను కొడుకులకు అప్పగించి నిశ్ఛింతగా విశ్రాంతి పొందుతూ కాలం గడపాలి. అప్పుడే పిల్లలు వారిని గౌరవిస్తారు, ఆదరిస్తారు. జీవితానుభవాలతో పరిమితి చెందిన పెద్దవారు పిల్లలకు పెద్దదిక్కుగాను, మార్గదర్శకంగాను
ఉండాలి. పిల్లలు అడిగితేనే సలహాలను ఇవ్వాలి. తమ సలహాలను పాటించమని నిర్బంధించకూడదు. వారి ఇష్టానుసారంగా పిల్లలు నిర్ణయాలు తీసుకుంటున్నారని తమను లక్ష్యపెట్టడంలేదని ఆగ్రహాన్ని పెంచుకోకూడదు. తోటివారితో పిల్లలు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శిస్తూ మాట్లాడకూడదు. పెద్దలకు, పిల్లలకు మధ్య దూరం ఏర్పడుతుంది. ఆ పరిస్థితి ఏర్పడకుండా పెద్దలు జాగ్రత్తపడాలి.
వయసుకు తగ్గట్టుగా పెద్దల ప్రవర్తన ఉండాలి. తమ వయ సును తగ్గించేట్లుగాను, దాచేట్లుగాను అలంకరణ చేసుకుంటే చూసే వారికి ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ఏ వయసుకు తగిన సహజ సౌందర్యం ఆ వయసుకు ఉంటుంది. వయసుకు తగిన వస్త్రధారణ, అలంకరణ స్త్రీలకు అందాన్ని, గౌరవాన్ని కలిగిస్తాయి. వారి వయ సుకు విలువ, ఆదరణ లభిస్తాయి. వయసుకు, ఆరోగ్యానికి తగిన విధంగా ఆహారం తీసుకుంటే వ్యాయామం చేస్తూ మనుమలు, మనుమరాండ్రతో ఆనందంగా కాలక్షేపం చేయాలి. పిల్లలకు సహాయం చేస్తూ అండదండలుగా ఉంటే ఆ కుటుంబంలో కలతలు ఏర్పడవు.
వయసు పెరుగుతున్నప్పుడు ఆ విషయాన్ని స్వీకరిస్తూ వయసుకు తగ్గట్లుగా అన్ని విషయాల్లోనూ తమనుతాము మార్చు కోవాలి. వయసుతో వచ్చే మార్పులను హుందాగా స్వీకరించాలి. వయసు పెరగడమన్నది శరీరానికేగాని, మనసుకు కాదు. మనసును ఉత్సాహంగా ఉంచుకోవచ్చు. తమ మనసుకు నచ్చిన వ్యాపకాలతో కాలక్షేపం చేయవచ్చు. తమ పెద్దరికాన్ని నిలబెట్టుకుంటూ పిల్లల స్వవిషయాల్లో జోక్యం కలిగించుకోకూడదు. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు అరుదైపోయాయి.
పిల్లలు తల్లి దండ్రులకు దూరంగా ఇతర రాష్ట్రాలలోనేకాక వేరే దేశాల్లో కూడా ఉద్యోగరీత్యా ఉంటున్నారు. గృహమేకదా స్వర్గసీమగా ఒక కుటుంబం మారాలంటే పిల్లలు, పెద్దలు మధ్య సరైన అవగాహన ఉండాలి. తమకు ప్రాధాన్యత, ప్రాముఖ్యత తగ్గిపోయాయని పెద్దలు ఆత్మన్యూనతా భావాన్ని పెంచుకోకూడదు. పిల్లలు కూడా తమ కన్నవారి వయసును గౌరవిస్తూ వారిని ఆదరించాలి. తమకు జీవితాన్నిచ్చి పెంచి పెద్దచేసి తమను తీర్చిదిద్ది ప్రయోజకులను చేసిన తల్లిదండ్రుల బాధ్యతలను సంతోషంగా ఆమోదించాలి. ప్రతి రోజు కొంత సమయం పెద్దలతో సన్నిహితంగా గడుపుతూ పెద్దలు, పిల్లల మధ్య ఐక్యత, ఆదరణ, ఆప్యాయతానురాగాలు వృద్ధి చెందుతాయి.
పెద్దలు పిల్లల సరదాలకు, ఆశలకు అడ్డుతగులకూడదు. పిల్లలు అడగనిదే ఉచిత సలహాలనివ్వకూడదు. పిల్లలు తీసుకున్న నిర్ణయాలు పెద్దలకు నచ్చకపోతే మౌనంగా ఉండటమే ఉత్తమమైన పద్ధతి. అలాఉంటే వాదనలు రాకుండా నివారించవచ్చు. ఆధ్యాత్మిక బావాన్ని, జ్ఞానసముపార్జనను పెంచుకునే ప్రయత్నం చేయాలి. కోడల్ని ఉద్యోగానికి పంపటమేకాక ఆమె శ్రమను, అలసటను గ్రహించి కోడలికి ఇంటిపనుల్లో సాయపడుతూ అండగా ఉండాలి. అత్తగారి అభిమానాన్ని, మంచితనాన్ని, ఔదార్యాన్ని కోడలు అర్థం చేసుకోగలుగుతుంది. అత్తాకోడళ్ళ మధ్య ఎటువంటి బేదాబి óప్రాయాలు రావు. పెద్దలు, పిల్లలు సఖ్యతగా ఉంటే సాన్నిహిత్యాన్ని పెంచుకుంటూ ఆదరాభిమానాలు పంచుకుంటే ఆ కుటుంబంలో ప్రశాంతత, ఆనందం నెలకొంటాయి.[:]

Comments
Post a Comment