(Telugu) 2018 ఫిబ్రవరిలో హైదరాబాద్ లొ ప్రపంచ తొలి ఐటి సదస్సు

[:te]2018 పిబ్రవరి లొ హైదరాబాద్ లొ ప్రపంచ తొలి ఐటి సదస్సు జరుగుతుందని మాజీ చైర్మన్ల సిపి గర్నానీ, బివి ఆర్ మొహన్ రెడ్ది ప్రకటించారు. భారత్లో జరుగుతున్న తొలి ప్రపంచ ఐటి సదస్సు ఇదేనని గర్నాని చెప్పారు.
2018 సంవత్సరంలో రెండు ప్రధాన సదస్సులు హైదరాబాద్ లొ జరగనున్నాయంటూ వాటిలో ఒకటి ప్రపంచ సదస్సు కాగా రెండోది నాస్కామ్ ఇండియా లీడర్ సదస్సు (ఎన్ఐఎల్ఎఫ్) అని ఆయన అన్నారు. కూడా హైదరాబాద్లో నిర్వహించడం ఇదే మొదటి సారి అని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 19 నుంచి 21 తేదీ మధ్యన జరిగే మూడు రోజుల ప్రపంచ ఐటి సద సకు 35 దేశాల నుంచి ఐదు వేల మంది ప్రతినిధులు హాజరవతారని ఫార్చూన్ 500 కంపెనీల సిఇఒలు కుడా 20 మంది వరకు వస్తారని ఆశిస్తున్నామని యన చెప్పారు. ప్రపంచంలో త్వరిత గతిన టెక్నాలజీ పరివర్తన చెందుతున్నదని డిజిటల్ టెక్నాలజీల హవా నా పెరుగుతున్నదని చెబుతూ వాటితో పాటు భవిష్యత్తులొ నైపుణ్యాల అవసరాలు, కనెక్టివిటీ ఐటి రంగం భౌగోళిక రాజకీయ పరిణామాలు ప్రభావం అంశాలపై ఈ మూడు రోజుల సదస్సులో విస్తృతంగా చర్చలు జరుగుతాయని ఆర్గనైజింగ్ కమిటీ హెడ్ సుమన్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం డిజిటల్ అందరూ ధృష్టి కేంద్రీకరిస్తున్నారని భిన్న రంగాల్లో పరస్పర ఆధారనీయత పెరిగిందని గర్నాని అన్నారు. ఉదాహరణకి టాక్స్ అగ్రిగేటింగ్ సర్వీసుల్లోని ఉబర్ నే తీసుకొంటె ఫినెటెక్ రంగం లోని పేటీఎం మద్దతు లేక పొతే అది విజయం సాధించేది కాదని ఆయన చెప్పారు. ఇది పరిశ్రమ, విధానకర్తలు, కొత్త టెక్నాలజీల తొ అనుబంధం ఉన్న వ్యక్తులకు చర్చా వెదికగా నిలుస్తుందని తెలిపారు. ప్రతిషాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు కోసం నాస్కామ్ 20 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నదని మోహన్రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం స్పాన్సర్షిప్ ఫీజుగా ఈ సదస్సు నిర్వహణకు ఐదు కోట్ల రూపాయలు చెల్లించిందని రాష్ట ప్రభుత్వ ఐటి శాఖ కార్యదర్శి జైయెష్ రంజన్ తెలిపారు.

నాస్కామ్ అంచనాలను దాటేస్తాం.

పరిశ్రమ వృద్ధిపై నాస్కామ్ అంచనాలను మించి టెక్ మహీంద్రా వృద్ధిని సాధించగలదన్న విశ్వాసం గుర్నానీ ప్రకటించారు. ఈ ఏడాది తాము 500 కోట్ల డాలర్ల (రూ. 82500 కోట్ల) ఆదాయం మైలురాయిని చేరగలమని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఐటి రంగం వృద్ధి 6 నుంచి 8 శాతం ఉండవచ్చునని నాస్కామ్ అంచనా వేసింది. గత ఏడాది తాము డాలర్ విలువలొ 7.8 శాతం వృద్ధితో 435.11 కోట్ల డాలర్లు 10 శాతం వృద్ధితో 29,141 కోట్ల రూపాయలు ఆదాయం ఆర్థించామని గర్నానీ తెలిపారు.
[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము