(Telugu) పద్యం 1
[:te]ఒల్లనిసతి నొల్లనిపతి
నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే
గొల్లండు గాక ధరలో
గొల్లండును గొల్లడౌను గుణమున సుమతీ!
తాత్పర్యం: తన్ను ప్రేమించని భార్యను, యజమానిని, స్నేహితుడ్ని విడిచి పెట్టడానికి అంగీకరించనివాడే వెర్రి గొల్లవాడు గానీ జాతిచేత గొల్లవాడైనంత మాత్రాన గుణాల్లో వెర్రి గొల్లవాడు కాదు.
పైన చూసారుగా..! స్నేహమైనా, ప్రేమైనా, చివరికి ఉద్యోగం చేయాల్సిన చోట కూడా ఇరువైపులా నుండి పరస్పరఅంగీకారం, ఇష్టం ఉండాలని ఈ పద్యంలో చెప్తున్నారు.
ఈ విషయాన్ని ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా.. ఇంకా మన చుట్టూ ఉన్న సమాజంలో బలవంతపు ప్రేమలు,పెళ్ళిళ్ళు, లాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. ఏ మనిషికైనా ప్రతీ విషయంలో తనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలుఉంటాయి. ఏ రంగు డ్రెస్ వేసుకోవాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఏ సినిమా చూడాలి, ఏమి తినాలి... ఇలాచెప్పుకుంటూ పోతే.. ప్రతీ ఒక్క విషయంలో మనకి ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది. వీటిల్లో ఏ ఒక్క అభిరుచికి గానీ,అభిప్రాయానికీ గానీ కారణాలు అడిగితే మనమెవ్వరమూ సమాధానం చెప్పలేము. ఎందుకంటే మనిషి భావాలకు,మనసు స్పందనకు కారణాలు ఉండనవసరం లేదు.
యాధృచ్చికంగా దీనికి సంబంధించిందే ఈ రోజు పొద్దునే 'మధురవాణి' లో ఒక quotation పోస్ట్ చేశాను. మనలోఏదయినా ఒక అలవాటుని గానీ, అభిరుచిని గానీ మన ఇష్టానికి వ్యతిరేకంగా మార్చుకోవాలంటే ఎంత కష్టమోమనందరికీ తెలుసు. పెద్ద పెద్ద విషయాల దాక వెళ్లనవసరం లేదు కానీ.. పొద్దున్నే లేవడం, ఇష్టం లేని టిఫిన్చేయడం.. ఇలాంటి చిన్న చిన్నవాటిని కూడా మార్చుకోవాలంటే మన తల ప్రాణం తోకకి వస్తుంది. కానీ.. మరి మనంవేరే వాళ్ళయితే మార్చుకోవాలని బాగా expect చేస్తాము. చాలా అసహనానికి గురవుతుంటాం కూడా.. వేరే ఎవరిదగ్గరో కాదు గానీ, ఇది ఎక్కువగా మన కుటుంబ సభ్యుల దగ్గర గానీ, స్నేహితుల దగ్గర గానీ చేస్తూ ఉంటాం. వాళ్లు ఒకవిషయంలో మారట్లేదని విసుగు చెందేముందు ఒక్కసారి మన మార్పు గురించి ఆలోచిస్తే మనం వాళ్ళని వాళ్లుగానేసంతోషంగా స్వీకరిస్తాం. అసలు నిజమైన అభిమానం, ప్రేమ అంటే.. వారి సుగుణాలతో పాటు బలహీనతల్ని కూడాప్రేమించడమే.
మరో సంగతి ఏంటంటే.. వాళ్ల అభిప్రాయం మనకి నచ్చనంత మాత్రాన అది తప్పని కాదు కదా..! ఈ కోణంలో మాత్రంఎప్పుడూ ఆలోచించం అసలు. ఎందుకో ఒప్పుకోబుద్ది కాదు. కానీ.. దాన్ని మనం అధిగమించగలగాలి. అప్పుడేవిసుగు, చిరాకులాంటివి మన దరిచేరవు. మనమేదో గొప్పగా కష్టపడిపోయి వాళ్ళని భరిస్తున్నట్టు చాలాసార్లు భావిస్తూఉంటాం కూడా..! ముందు అసలు ఆ భావం మనకి రాకుండా ఉండాలి. అప్పుడు మనకి regrets ఉండవు ఏబంధంలోనైనా.. రోజు రోజుకీ మన సంతోషం నిల్వలు పెంచుకుంటూ పోవచ్చు.
అంచేత.. నేను చెప్పొచ్చేదేంటంటే.. అధ్యక్షా..! మనందరం మన మనసు గదుల్లో మనం ఇష్టపడేవారితో పాటు వారిఆసక్తులకీ, అనాసక్తులకీ, అభిప్రాయాలకీ, కోరికలకీ, ఇష్టాలకీ, అయిష్టాలకీ, భావాలకీ, ప్రేమకీ, బలహీనతలకీ,కోపతాపాలకీ, విసుగుకీ, చిరాకుకీ... అన్నీటికీ చోటుని పంచుదాం..! ఒకేసారి మహాత్ములం అయిపోలేం కానీ.. కనీసంప్రయత్నిద్దాం.. ఏదో ఒక రోజు పూర్తిగా ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకోగలమనే గమ్యం వైపు..![:]

Comments
Post a Comment