(Telugu) ఎండాకాలం - పిల్లలు

[:te]వేసవి సెలవులు వచ్చాయంటే చాలు, పిల్లలు ఎంతో ఉత్తేజితులు అవుతుంటారు. హాయిగా బయట ఆడుకునేందుకు ఇష్టపడుతుంటారు. ఎండాకాలం కాబట్టి ఆ పిల్లల విషయంలో తల్లిదండ్రులు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే, పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటు పలు రకాల జబ్బులనూ అది మోసుకొస్తుంది. నమ్ముతారో లేదోగానీ, శీతాకాలంతో పోల్చుకుంటే ఎండాకాలంలోనే ఎక్కువగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు అంటారు. అంతేకాదు, మీరు గమనించకపోతే పిల్లలు ఎండలోనే ఉండిపోతారు. చాలాసేపు బయటే ఆడుకున్నట్లయితే ముక్కు నుండి రక్తం కారడం, మలబద్దకం, తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. అందుకే, ఈ సలహాలు.

మీ చిన్నారుల ఆరోగ్యం కోసం నిపుణులు సూచించిన ఆరోగ్య చిట్కాలు

తాజా పండ్లు
సిట్రస్ జాతికి చెందిన తాజా పండ్లు తీసుకుంటే అవి పిల్లల శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. తప్పనిసరిగా ఈ సీజన్‌లో మీ పాప లేదా బాబుకు రోజూ ఒక పండైనా తినిపించాలి.

నీరే నేస్తం
పిల్లలు రోజుకి కనీసం 2 లీటర్ల నీళ్ళు తాగేలా జాగ్రత్తపడాలి. శుభ్రమైన మంచి నీళ్ళు తాగడం వల్ల ఈ కాలంలో వచ్చే పలు రకాల వ్యాధుల నుండి వారు తప్పించుకోవచ్చు.
నిద్ర
వేసవి తాపాన్ని తప్పించుకునే మరో మంచి చిట్కా ఎక్కువగా నిద్రపోవడం. అవును. మీ పిల్లలు పగలు ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల ఎండలో తిరిగే అవకాశం ఉండదు. దాంతో వేసవి సమస్యల బారిన పడే ఛాన్సూ ఉండదు. నిజానికి, పిల్లలైనా పెద్దలైనా సమ్మర్‌లో పరిమితంగా తినడం ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా ఫ్రైడ్ ఫుడ్స్ తినకూడదు. అవి తీసుకోవడం వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. అందుకే, మీ పిల్లలను వాటికి దూరంగా ఉంచండి.
స్మిమ్మింగ్
ఎండాకాలానికి మరో అద్భుతమైన చిట్కా స్విమ్మింగ్. పిల్లలు కూడా దీనిని ఎంతో ఇష్టపడతారు. మరింకేం! ఆలస్యం చేయకుండా వెంటనే స్విమ్మింగ్ క్యాంప్‌లో మీ పిల్లల పేర్లు నమోదు చేయించండి. ఈత కొట్టడం వల్ల శారీరకంగా మీ పిల్లలు బలంగా తయారవుతారు. అలాగే, పలు రకాల వ్యాధులకు దూరంగా ఉండగలుగుతారు.
పాలు
చల్ల (మజ్జిగ), పాలు -ఈ రెండింటిలో ఏదైనా సరే తప్పనిసరిగా వేసవిలో ఇస్తూ ఉండండి. ఇవి మీ చిన్నారులను దఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
తలస్నానం
పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళేముందు, ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా తలస్నానం చేయించండి. దీనివల్ల ఎండ బారిన పడిన వారి శరీరాలు చల్లబడి చురుకుదనాన్ని పొందుతాయి.
భోజనం
మరో ముఖ్యమైన విషయం ఎండాకాలం పిల్లలు భోజనం చేయడానికి అంతగా ఇష్టపడరు. కానీ, వారు భుజించేలా చూసుకోవాలి. సరిగా ఆహారం తీసుకోకపోవడంతో శక్తిని కోల్పోయి నీరసపడే ప్రమాదముంది.
డాక్టర్‌ని కలవండి!
వేసవిలో పిల్లలు రకరకాల ఎలర్జీలతో బాధపడుతుంటారు. సీజన్ మొదట్లోనే డాక్టర్‌ని సంప్రదిస్తే మీకు కొంత అవగాహన కూడా కలుగుతుంది. డాక్టరు అవసరం లేకుండా పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే మీ పిల్లలు ఈ ఎండాకాలం సెలవులను మరింత ఎంజాయ్ చేస్తారు. ఆల్ ది బెస్ట్.[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము