(Telugu) పిల్లల అభివృధ్ధిలో తల్లిదండ్రుల పాత్ర
[:te]ఈరోజుల్లో చాలా ఇళ్ళలో తల్లిదండ్రులు ఉదయం నుండి సాయంత్రం వరకూ ఉద్యోగానికో, పనికో వెళ్ళి తీరికలేని సమయం గడుపుతున్నారు. సాయంత్రం ఇంటికి చేరిన తర్వాత మిగిలిన సమయాన్నిఇంటిపనులకూ, టీ.వీ. చూడడానికీ వెచ్చిస్తున్నారు. అలాగే ప్రొద్దున్నే బడికి వెళ్ళి సాయంత్రం ఇంటికి చేరిన పిల్లలు కూడా టీ.వీ. చూస్తూనో, సెల్ ఫోనుల్తో ఆడుకొంటూనో సమయాన్ని గడిపేస్తున్నారు. దీనివలన తల్లిదండ్రులకూ పిల్లలకూ మద్య కొంత 'దూరం' ఏర్పడుతుంది. ఈదూరం భౌతికమైనదికాదు, శారీరకమైనది, మానసికమైనది. పక్కపక్కనే ఉంటూ, ఒకరినొకరు చూసుకొంటూ స్పందించని వస్తువులతో గడపడం వలన ఏర్పడుతుంది. ఈ దూరంవలన తల్లిదండ్రులూ, బిడ్డలూ తమ మద్య ప్రేమను అనుభవించడం లేదు. క్రమేణా 'నేనుఒంటరిని’ అనే భావన బిడ్డలలో కలుగుతుంది. అది అభద్రతా భావనకు దారి తీస్తుంది. తల్లిదండ్రులు తమ బిడ్డలలో జరుగుతున్నపెరుగుదలను గ్రహించలేరు, అవసరాలను గుర్తించలేరు. బాల్యం యొక్క తీయదనాన్ని, అనుభవాలనూ ఇరువురూ ఆనందించలేరు. పిల్లలు తాము పగటి సమయంలో అనుభవించిన భావోద్వేగాలు అంటే - ఆనందం, దుఃఖం, భయం మొదలైనవి వ్యక్తపరచలేకపోవడం వలన అవి గుప్తంగా ఉండిపోయి భవిష్యత్తులో...