(Telugu) చిన్న వయసులోనే రిటైర్మెంట్ కోసం ప్రణాలిక
[:te]మహేష్ కి కవల పిల్లలు. కొడుకు హరి, కూతురు లావణ్య. ఇద్దరిలో కొడుకు అంటే ఎక్కువ ప్రేమ మహేష్ కి. ఆ సంగతి తెలిసినా లావణ్య అదేం పెద్ద విషయం కానట్టు వుండేది. ఎప్పుడూ తన చదువులు, ఇంట్లో పనులే తప్ప ఇలాంటివి అసలు పట్టించుకునేది కాదు. హరి అలా కాదు. తండ్రికి తనంటే ఇష్టమని తెలుసు కాబట్టి అదే అదనుగా ప్రతి దానికీ మారాం చేసి తనకు కావాల్సినవన్నీ సాధించుకునేవాడు. హరి వల్ల ఎక్కువసార్లు లావణ్యే నష్టపోతుండేది.
పిల్లలు ఇద్దరూ ఏడో తరగతికి వచ్చినప్పటి నుంచీ వాళ్ళకి డబ్బులు అవసరం అవుతాయని ఇద్దరికీ పాకెట్ మనీ ఇచ్చేవాడు మహేష్. అందులో కూడా కొడుకుకి నెలకి ఐదొందలు ఇస్తే, కూతురికి రెండు వందలే ఇచ్చేవాడు. లావణ్య అందుకు బాధపడకుండా, ఇచ్చిన డబ్బుని పొదుపుగా వాడుకుంటూ మిగిలిన డబ్బుని దాచిపెట్టుకునేది. హరి చేతికి అందిన డబ్బు మొత్తం ఖర్చు పెట్టి ఇంకా కావాలని గొడవ చేస్తుండేవాడు. ప్రతి సంవత్సరం హరి పాకెట్ మనీ రెండింతలు అయితే, లావణ్యకి ఇచ్చే డబ్బు చాలా స్వల్పంగా పెరిగేది. ఇలా ఒక పది సంవత్సరాలు గడిచాయి. హరి అప్పులు చెయ్యడం మొదలుపెట్టాడు. అవి కూడా పెరిగిపోయి వ్యవహారం పీకల్దాకా వచ్చింది. దాంతో మళ్ళీ డబ్బు కావాలని తండ్రి దగ్గర గొడవ చేయడం మొదలుపెట్టాడు.
“ఈ నెల నీకు ఇప్పటికే ఐదువేలు ఇచ్చాను. కాబట్టి ఇక ఇవ్వను” అన్నాడు మహేష్. కోపంతో హరి ఇంట్లో ఉన్న వస్తువులన్నింటి కాళ్ళతో తన్నాడు, చేతికి అందినవి అందినట్లు విసిరేశాడు. అలా విసురుతున్నప్పుడు, లావణ్య బ్యాగ్ లో నుంచి ఒక బ్యాంక్ పాస్ బుక్ బయటపడింది. చూస్తే అప్పటికి ఎనిమిది సంవత్సరాలుగా లావణ్య సంవత్సరానికి వెయ్యి రూపాయల చొప్పున డిపాజిట్ చేస్తూ వస్తోంది. సాలీనా పది శాతం వడ్డీ ఇచ్చే పథకం. హరి అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. తనకు ఆ డబ్బు కావాలని పట్టుపట్టాడు. లావణ్య ఎంతో ఓర్పుగా అతనికి సమాధానం చెప్పింది.
“ఈ డబ్బు మొత్తం నీకు ఇచ్చేస్తాను. అయితే నువ్వు ఒక పని చెయ్యాలి. ఈ సంవత్సరం నుంచి నేను నా బ్యాంక్ లో డబ్బులు వెయ్యడం ఆపేస్తాను. వున్న డబ్బు మీద వడ్డీ వస్తూ వుంటుంది. నీకోసం ఒక బ్యాంక్ ఎకౌంట్ తెరుస్తాను. అందులో నువ్వు సంవత్సరానికి వెయ్యి రూపాయలు వెయ్యాలి. అంత కన్నా తక్కువ వెయ్యకూడదు, ఎక్కువ కూడా వెయ్యకూడదు. అలా నువ్వు ఆదా చేస్తూ వచ్చే సొమ్ము నేను ఆదా చేసిన సొమ్ముతో (వడ్డీతో సహా) సమానం అయిన రోజు రెండు ఎకౌంట్లలో వున్న డబ్బు నువ్వే తీసుకోవచ్చు.” అని చెప్పింది. హరి ఒప్పుకున్నాడు.
హరి మొండితనం గురించి తెలుసు కదా, అయినా లావణ్య అలాంటి పిచ్చి ప్రతిపాదన ఎందుకు పెట్టింది. ఎనిమిది సంవత్సరాలుగా ఆమె దాచిన సొమ్ము ఎనిమిది వేలే కదా? మరో ఎనిమిది సంవత్సరాల కాకపోయినా పదో పన్నెండో సంవత్సరాలలో హరి అంత డబ్బు సంపాదించి మొత్తం తీసేసుకుంటాడు కదా? ఈ ఎనిమిది సంవత్సరాలలో హరిలో ఏం మార్పు వస్తుందని లావణ్య ఇలాంటి షరతు పెట్టింది? అసలు ఇందులో వున్న ఆర్థిక రహస్యం ఏమిటి?
లావణ్య ఎనిమిది సంవత్సరాలుగా సంవత్సరానికి వెయ్యి రూపాయలు పది శాతం వడ్డీ వచ్చే పథకంలో దాచిపెడుతోంది. అంటే మొదటి సంవత్సరం చివరికి ఆమె దాచిపెట్టిన వెయ్యి మీద వడ్డీ కలిసి పదకొండు వందలు అవుతుంది. రెండో సంవత్సరం మరో వెయ్యి కలిపి మొత్తం మీద వడ్డీ లెక్క వేస్తే 2310 అవుతుంది. ఎనిమిది సంవత్సరాల తరువాత చూస్తే లావణ్య దాచిపెట్టిన మొత్తం డబ్బు వడ్డీతో కలిపి రూ 12579 వుంటుంది.
కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ పన్నెండు వేల చిల్లర డబ్బు డిపాజిట్ చెయ్యడానికి హరికి మరో ఎనిమిదేళ్ళు పడుతుంది. కానీ అప్పటికి లావణ్య దాచి పెట్టిన డబ్బు విలువ ఇరవైరెండు వేలు దాటుతుంది. ఇలా చూసుకుంటే హరి దాచిపెట్టే డబ్బు ఎన్ని సంవత్సరాలైనా లావణ్య డబ్బుకి సమానం కాలేదు. కేవలం ఎనిమిది సంవత్సరాల ముందుగా మొదలుపెట్టినందుకు, ఇక డబ్బులు వెయ్యడం ఆపేసినా లావణ్యని చేరుకోవడం హరికి జీవితంలో సాధ్యపడదు.
ఈ కథలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాఠం చాలా స్పష్టంగానే వుంది. ఆర్థిక ప్రణాలికలో చెయ్యాలనుకున్న పొదుపు ఏ మాత్రం ఆలస్యమైనా దాని వల్ల కలిగే నష్టం చాలా ఎక్కువగా వుంటుంది. ముఖ్యంగా చక్రవడ్డీ వున్న చోట, కాల వ్యవధి ఎక్కువగా వున్నప్పుడు ఈ నష్టం లక్షల్లో వుండే అవకాశం వుంటుంది. అందువల్ల డబ్బు పొదుపు చెయ్యాలి అనుకున్న వెంటనే ఆ పని మొదలుపెట్టాలి. కాలం గడిచే కొద్ది సంపద సాధించే లక్ష్యం మరింత దూరం, మరింత కష్టం అవుతుందని గ్రహించాలి.
కొత్తగా ఉద్యోగంలో చేరిన ఇరవై – ఇరవై ఐదు మధ్య వయసు వున్న యువకులు ఈ విషయాన్ని తెలుసుకోవటం చాలా అవసరం. ఎంత త్వరగా ఈ రహస్యాన్ని తెలుసుకుంటారో, అంత త్వరగా సంపద సాధించే లక్ష్యాన్ని అందుకోగలుగుతారు. ఉద్యోగం వచ్చిన కొత్తల్లో వుండే సరదాలు, ఖర్చులు రాబోయే కాలంలో లక్షల రూపాయల నష్టంగా మారబోతున్నాయని తెలుకున్న యువకులే త్వరగా ఆర్థిక స్వావలంబనని సాధించగలుగుతారు.
ఇందులో మరో కోణం కూడా వుంది. ఆలస్యమైన పొదుపు కలిగించే నష్టం కాల పరిమితి మీద ఆధారపడి వుంటుందని ముందే చెప్పుకున్నాం కదా. మన ఆర్థిక ప్రణాలికలో అత్యధిక కాల పరిమితి వుండేది రిటైర్మెంట్ కోసం డబ్బుని దాచుకోవడమే. దాదాపు ఉద్యోగం వచ్చిన దగ్గర్నుంచి రిటైర్ అయ్యేదాకా మనం దాచిపెట్టే సొమ్ము చక్రవడ్డీలో పెరుగుతూ వుంటుంది. చివరికి అదే డబ్బు రిటైర్మెంట్ తరువాత వాడుకోడానికి అందుబాటులో వుంటుంది. అంటే సుమారు ముఫై నుంచి నలభై ఏళ్ళపాటు అన్నమాట. ఇంత కాలంపాటు దాచాల్సిన డబ్బుని ఆలస్యం చేస్తే ఏమౌతుందో ఊహించచ్చు. ఆ నష్టం కోటి రూపాయలదాకా వుండచ్చు.
అసలు ఆర్థిక ప్రణాలికలో చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సింది రిటైర్మెంట్ గురించే. ఒకప్పటిలా ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా పెన్షన్ వుండటం లేదు. ప్రయివేట్ ఉద్యోగాల సంగతి సరే సరి. అలాంటప్పుడు రిటైర్మెంట్ రోజులు ఎలా గడుస్తాయో ఊహించుకోవడమే కష్టంగా వుంది. అప్పుడు సంపాదించే ఓపిక వుండదు. పిల్లలు చూస్తారన్న నమ్మకమూ వుండదు. మారుతున్న కాలంలో మనిషి జీవిత పరిమాణం పెరుగుతూ వస్తోంది. అంటే ఒకప్పడు మనిషి సగటు ఆయుర్దాయం నలభై యాభై మధ్య వుంటే ఇప్పుడు అది సుమారు ఎనభై దాకా చేరింది. అంటే రిటైర్మెంట్ తరువాత సంపాదన లేని రోజులు పెరుగుతున్నాయన్నమాటే కదా!
మరో విషయం ఆలోచాలి. ఉద్యోగం చేసే రోజుల్లో ఎక్కువ డబ్బు ఎప్పుడు ఖర్చౌతుందో గమనించండి. ఒక సగటు ఉద్యోగికి వారం మొత్తం ఉద్యోగంలో తలమునకలై వుండటం వల్ల ఖర్చు పెట్టే అవకాశం కూడా రాదు. అదే వారాంతంలో బయటికి వెళ్ళి తినడం, సినిమాకో షికారుగానో వెళ్ళడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. అంటే పని చేసే రోజుల కన్నా సెలవు రోజుల్లో ఎక్కువ ఖర్చుపెడతాము. మరి రిటైర్మెంట్ అన్నింటికన్నా పెద్ద సెలవ అని ఎందుకనో ఎవరికీ గుర్తుండదు. ఆ సమయంలో అత్యధికంగా అయ్యే ఖర్చు వైద్యానికి, మందులకీ వుంటుంది. ద్రవ్యోల్బణాన్ని (ఇంఫ్లతిఒన్) గమనిస్తే ఆరోగ్యానికి పెట్టే ఖర్చు, మందుల ధరలు అత్యధికంగా పెరుగుతున్నాయి. వీటన్నింటికి ఒకరి మీద ఆధారపడకుండా, స్వంత డబ్బుతో గడపాలనుకుంటే, అది కేవలం రిటైర్మెంట్ ప్లానింగ్ తోనే సాధ్యం అవుతుంది.
రిటైర్మెంట్ చెయ్యాలనుకున్న తరువాత ముందుగా ఆలోచించుకోవాల్సింది తమ జీవన శైలి (ళిఫె శ్త్య్లె) గురించి. ఉద్యోగంలో ఉన్నప్పటికి జీవన విధానం, ఉద్యోగం లేనప్పుడు కూడా కావాలంటే అది చాలా ఇబ్బంది కలిగిస్తింది. ఉదాహరణకి ఇప్పుడు కారు నడుపుతూ గడిపి, రిటైర్మెంట్ తరువాత ఆ కారు నడపడానికి అయ్యే పెట్రోల్ ఖర్చు భరించలేక స్కూటర్ నడపాల్సి వస్తే అంత కన్నా దారుణం ఇంకొకటి వుండదు. అందువల్ల ఇప్పుడు వున్న జీవన శైలి కొనసాగాలంటే ఎంత డబ్బు అవసమవుతుందో ముందే లెక్క వేసుకోవాలి. ఆ తరువాత ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకోని ఆ ఖర్చు రిటైర్మెంట్ నాటికి ఎంత అవుతుందో లెక్క వేసుకోవాలి. అంత డబ్బు అప్పటికి సమకూరేలా ఇప్పటి నుంచే పొదుపు మొదలుపెట్టాలి. ఇదంతా లెక్క కడితే ఇప్పుడు వస్తున్న సంపాదనలో సుమారు 20% దాచిపెడితే తప్ప రిటైర్మెంట్ నాటికి డబ్బు సరిపోవు.
రిటైర్మెంట్ నాటికి డబ్బు దాచిపెట్టడమే ఇంత కష్టమైతే ఆ పొదుపు కూడా చెయ్యకుండా ఆలస్యం చేస్తే ఎంత నష్టం కలుగుతుందో హరి లావణ్య కథ ద్వారా మనకి అర్థం అవుతోంది. మన ఆర్థిక పాఠం కోసం వీళ్ళిద్దరూ రిటైర్మెంట్ కోసం డబ్బు దాచుకుంటున్నారు అనుకుందాం. ఇద్దరి వయసు 21 సంవత్సరాలు అనుకుంటే లావణ్య ఎనిమిది సంవత్సరాల పాటు దాచి, ఆ తరువాత ఆపేస్తేనే ఆ డబ్బు అరవై ఏళ్ళ నాటికి రెండు లక్షల అరవై ఐదు వేలు అవుతోంది. ఎనిమిది సంవత్సరాల తరువాత మొదలుపెట్టిన హరి అరవైయో ఏడు వచ్చేవరకూ, అంటే ముఫై తొమ్మిది సంవత్సరాలు ప్రతి సంవత్సరం వెయ్యి రూపాయలు దాచిపెట్టినా రెండు లక్షల ఇరవై వేలే అవుతోంది. ఎనిమిది సంవత్సరాల వ్యత్యాసం తీసుకొచ్చే తేడా ఇంత వుంటుంది.
అదే లావణ్య ఎనిమిది సంవత్సరాలకు నెల నెల కట్టడం ఆపకుండా అలాగే కొనసాగిస్తే అరవై ఏళ్ళు వచ్చేసరికి సుమారు ఐదు లక్షలు సమీకరింఛుకునేది. అందుకే చిన్న వయసులో దాచిన డబ్బు విలువ వయసు మళ్ళిన తరువాత కోట్లలోకి చేరుతుంది. అదే సంపద సాధించడంలో అసలు రహస్యం.
(కథలో చక్రవడ్డీ మహత్యాన్ని, చిన్న వయసులో దాచిపెట్టడం వల్ల ఉపయోగాన్ని వివరించడానికి పది శాతం వడ్డీ ఇచ్చే పథకం అని చెప్పడం జరిగింది. ప్రస్తుతం బ్యాంక్ ఫిక్సుడ్ డిపాజిట్లకు 8.5% నుండి 9.5% వరకు వుంది. 10% స్థిరంగా ఇచ్చే పథకాలు దాదాపుగా లేవు. కొన్ని కార్పొరేట్ బాండ్లు వంటివి తప్ప ఇంకే పథకంలో 10% కన్నా ఎక్కువ వచ్చినా అవి మార్కెట్ లింక్డ్ అయి వుండే అవకాశం వుంది. అందులో రిస్క్ కూడా వుంటుందని గుర్తించాలి)
చిన్న వయసులో పొదుపు చేసి, ఎక్కువ కాలం పాటు వుంచితే ఆ డబ్బు అత్యధికంగా పెరుగుతుంది. అందువల్ల చిన్న వయసులోనే రిటైర్మెంట్ కోసం ప్రణాలిక వేసుకోవడం మంచిది. ఎంత త్వరగా పొదుపు మొదలుపెడితే అంత త్వరగా సంపద సాధించవచ్చు. [:]

Comments
Post a Comment