(Telugu) సంపద సాధించాలంటే ఈక్వీటీలలో పెట్టుబడి తప్పనిసరి
[:te]నువ్వు ధనవంతుడివి కావాలన్న కోరికతో ఈ కష్టం అంతా పడుతున్నావు. అయితే మామూలు సంపాదనపరుడు ధనవంతుడిగా మారాలంటే అది అతను పొదుపు చేసే డబ్బువల్లే సాధ్యం అవుతుంది. అందులోనూ వేరే కంపనీలలో పెట్టుబడులు పెట్టకుండా డబ్బు కూడబెట్టడం అసాధ్యం. అలాగని నేరుగా స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి డబ్బులు పెడితే అవి పోగుట్టుకునే అవకాశం ఎక్కువ. ఇలా నేరుగా కాకుండా, నష్టపోయే అవకాశాన్ని తగ్గించుకునే మార్గం మరొకటి వుంది. అది అర్థం కావాలంటే నీకొక కథ చెప్పాలి.
రామాపురం పొలిమేరలో రచ్చబండ పెట్టారు. పన్నెండు మంది రైతులు ఒకవైపు, ఏదో ఫారిన్ కంపెనీ ప్రతినిధులు మరో వైపు. రైతుల అందరి పొలాలు కలిపితే మొత్తం ముఫై ఎకరాలు. ఒకరు మిరప వేస్తారు, ఒకరు పొగాకు వేస్తారు, నీళ్ళు వున్న చోట వరి వేస్తారు, పొలం తక్కువుంటే కందులో శనగలో వేస్తారు. వ్యాపారం తెలిసిన కొంతమంది కూరగాయలు కూడా వేస్తుంటారు. అందరు రైతుల్లాగే వీళ్ళదీ లాటరీ జీవితం. దిగుబడి బాగుంటే ధర వుండదు, ధర పలికేటప్పుడు దిగుబడి వుండదు. ఒక సంవత్సరం ఆదాయం వస్తే నాలుగు సంవత్సరాలు నష్టాలు. నాలుగు వేళ్ళు లోపలికి పోతున్నాయన్న మాటే కానీ ఎవరూ సంపాదించుకున్నది ఏమీ లేదు. ఇదే సమయంలో ఏదో ఫారిన్ కంపెనీ అక్కడ ఫ్యాక్టరీ పెట్టాలని వచ్చింది. ఆ ఫ్యాక్టరీ మనుషులు లెక్కలు, కొలతలు వేసి ఈ ముఫై ఎకరాలైతే బాగుంటుందని తెలుసుకున్నారు. బేరం పెట్టారు. కంపెనీ ఇవ్వమనీ, రైతులు ఇవ్వమనీ. అదీ పంచాయితీ.
“మీకు పొలం మీద లాభం వస్తుందో రాదో తెలియదు. అదే మేము ఇచ్చే డబ్బు బ్యాంకులో వేసుకుంటే జీవితాతం దర్జాగా బతకచ్చు” అన్నారు ఫ్యాక్టరీ వాళ్ళు.
“పొలం మా ఆస్థి. అన్నం పెట్టే అమ్మ. అమ్మనమ్మం, అమ్మనే అమ్మం” అంటూ ఎదురుతిరిగారు రైతులు. మాట మాట పెరిగింది. చివరికి ఒక ఒప్పందానికి వచ్చారు. అదేమిటంటే – రైతులు యధావిధిగా తమ పొలంలో పనులు చేసుకుంటారు. ఏ సంవత్సరమైనా నష్టం వస్తే ఆ సంవత్సరం పొలాన్ని ఫ్యాక్టరీకి అమ్మేయాలి అని. తప్పని బలవంతాల వల్ల ఒప్పుకున్నారు కానీ ఇది చాలా కష్టమని వాళ్ళకి వెంటనే అర్థం అయిపోయింది. ఏం చెయ్యాలా అని తల పట్టుకున్నారు.
సరిగ్గా అప్పుడే పట్నం నుంచి బాలిగాడు వచ్చాడు. వచ్చి రాగానే పరిస్థితి అర్థం చేసుకున్నాడు. అప్పుడు ఒక ప్రతిపాదన పెట్టాడు. “కలసి వుంటే కలదు పొలం” అన్నాడు. ఒక పథకం వివరించాడు. అందరూ ఒప్పుకున్నారు. ఇక అప్పట్నుంచి మొదలైంది. ప్రతిసారి కోతల సమయానికి ఫ్యాక్టరీ వాళ్ళు రావటం, అందరు రైతులు లాభాల వుండటం చూసి వెనక్కి వెళ్ళడం. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచింది. చివరికి ఫ్యాక్టరీ వాళ్ళే తప్పుకోని వేరే చోట భూమిని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు.
రైతులకీ ఫ్యాక్టరీ యాజమాన్యానికి మధ్య పందెం చూస్తే రైతులు ఏ మాత్రం గెలిచేలా లేదు. అయినా వాళ్ళు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని వెనక్కి పంపించారు. ఇదెలా సాధ్యం అయ్యింది? పట్నం నుంచి వచ్చి బాలిగాడు చెప్పిన పథకం ఏమై వుంటుంది? దీనికీ మన ఆర్థిక పాఠాలకూ వున్న సంబంధం ఏమిటి?
బాలిగాడు చెప్పిన “కలసి వుంటే కలదు పొలం” అన్న వాక్యంలోనే కథంతా వుంది. నాకు తెలిసి అతను ప్రతిపాదించింది పరస్పర సహకార సామూహిక వ్యవసాయం. అంటే ఒకరి పొలం అని కాకుండా, అందరి పొలంలో అందరూ పని చెయ్యడం. ముందు అందరూ తమ తమ పొలాలను కలుపుతారు. ఒకళ్ళది పది ఎకరాలు కావచ్చు, ఇంకొకరిది అర ఎకరం కావచ్చు. మొత్తం కలిపి ఉమ్మడిగా ముఫై ఎకరాలు. ఇలా కలిపిన పొలంలో రకరకాల పంటలు వేస్తారు. ఆ సంవత్సరం మిర్చి ధర పలుకుతుంది అనుకుంటే పది ఎకరాలు మిర్చి వేస్తారు. మిగిలిన ఇరవై ఎకరాలలో ఏడు ఎకరాలు పొగాకు వేస్తారు, మూడు ఎకరాలు వరి, మిగిలిన పది ఎకరాలలో పప్పు దినుసులు, కూరగాయలు మొదలైనవి వేస్తారు. జరిగేదేమిటంటే మిర్చి మంచి ధర పలకకపోయినా పొగాకు బాగా వచ్చి మంచి ధర పలకచ్చు. కూరగాయల వ్యాపారం బాగా సాగచ్చు. రకరకాల పంటలు వున్నాయి కాబట్టి ఒకటి కాకపోతే మరొకటి పండుతుంది. తరువాత పంటకి మళ్ళీ అంచనాలను బట్టీ ఏ పంటలు వెయ్యాలో నిర్ణయించుకుంటారు. మొత్తం మీద ముఫై ఎకరాలనూ కలిపి చూస్తే లాభమే వుంటుంది. మొత్తం లాభాలని వాళ్ళ పొలం సైజు ఆధారంగా పంచుకుంటారు. అంటే పది ఎకరాలు ఇచ్చిన రైతుకి మూడోవంతు, మూడు ఎకరాలు ఇచ్చన రైతుకి పదో వంతు, అర ఎకరం ఇచ్చిన రైతుకి దాదాపు మూడున్నర శాతం లాభాలు పంచుతారు. అందువల్ల ఎప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చినా రైతులు లాభాలలోనే వున్నారు” అని చెప్పాడు.
ఈ కథలో దాగి వున్న ఆర్థిక పాఠం:
స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టడం చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. అలాగని మనం దాచుకునే డబ్బులో ఈక్విటీకి భాగం లేకపోతే ఆర్థికంగా ఎదిగే అవకాశం తక్కువ. అందుకోసం కాస్త తక్కువ రిస్క్ తో, ఈక్విటీ వల్ల కూడా లాభాన్ని పొందేందుకు మ్యూచువల్ ఫండ్స్ ఉపయోగపడతాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోడానికి ఈ కథ బాగా ఉపయోగపడుతుంది. మ్యుచువల్ ఫండ్ కంపెనీ చేసే పని ఏమిటంటే చిన్న చిన్న ముదుపర్ల దగ్గర్నుంచి డబ్బులు సేకరించి, వాటిని రకరకాల షేర్లలో పెట్టుబడిగా పెడుతుంది. ఆ పెట్టుబడులమీద లాభం వస్తే ఆ లాభాలతో సహా తిరిగి ఇస్తుంది. (నష్టం వచ్చినా అది ముదుపరిదే అని గుర్తుంచుకోవాలి). ఇందుకుగాను కంపెనీ కొంత డబ్బుని ఫీజు కింద తీసుకుంటుంది.
నష్టం వచ్చే అవకాశం వున్నా ఎందుకు అలాంటి చోట డబ్బులు పెట్టాలి అని అనుమానం రావచ్చు. ఈక్విటీ మార్కెట్ అంటేనే ఎత్తుపల్లాలు, హెచ్చుతగ్గులు తప్పనిసరి. అందువల్ల నష్టం వచ్చే అవకాశం వుంది అని గుర్తుంచుకుంటే చాలు. ఇందులో నష్టం వచ్చే అవకాశాలను తగ్గించే లక్షణాలు మూడు వున్నాయి. మొదటిది రకరకాల షేర్లలో పెట్టుబడి పెట్టడం. సరిగ్గా మన కథలో రకరకాల పంటలు పండించిన రైతులు ఎలా లాభపడ్డారో అలాగే మ్యూచువల ఫండ్స్ లో కూడా ముదుపరి లాభపడే అవకాశం ఎక్కువ. దీనినే డైవర్సిఫికేషన్ అంటారు. ఇన్ని రకాల షేర్లలో పెట్టుబడి పెడితే లాభాలు వచ్చే మాట నిజమే అయినా, ఆ షేర్లన్నీ విడిగా కొనాలంటే చాలా డబ్బు కావాలి. అదే మ్యూచువల్ ఫండ్స్ లో అయితే అయిదు వందలతో కూడా ఇన్ని షేర్లలో పిసరంత భాగం కొనుక్కోవచ్చు.
ఇక రెండొవది – ఫండ్ మేనేజర్ గురించి. ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీ (దీనినే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనీ, ఫండ్ హౌస్ అనీ వాడకంలో అంటారు) తమ ఫండ్స్ ని నిర్వహించడం కోసం కొంతమంది ఫండ్ మేనేజర్లని నియమిస్తుంది. వీళ్ళు స్టాక్ మార్కెట్ గురించి, అర్థ, ఆర్థిక విషయాల గురించి చదువుకోని వుంటారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఈ ఫండ్లను నిర్వహిస్తారు. అంటే మన డబ్బు వృద్ధి కావాలని ఈ ఫండ్ మేనేజర్లు పని చేస్తుంటారు. నమ్మతగిన తెలివితేటలు, చదువు వున్న వ్యక్తులు మన ఆర్థికాభివృద్ధి పని చేసే అవకాశం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా సాధ్యమౌతుంది.
మూడోవది ఏంటంటే – ఇలాంటి ఫండ్ హౌసెస్ మధ్య వుండే పోటీ. ఎప్పటికప్పుడు అత్యధిక లాభాలను ఇచ్చిన కంపెనీగా నిలవాలని ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీ ప్రయత్నిస్తూనే వుంటుంది. ఫండ్ మేనేజ్మెంట్ చెయ్యడానికి అత్యంత ప్రతిభావంతులను లక్షల జీతాలు ఇచ్చి పెట్టుకుంటుంది. సెన్ సెక్స్, నిఫ్టీ వంటి సూచీలతో బేరీజు వేసుకుంటూ ఎప్పటికప్పుడు ఎక్కువ లాభాలను ఇవ్వాలని ప్రయత్నిస్తాయి. అందుకే గత సంవత్సరం 8% నుంచి 54% వరకు లాభాలు ఇచ్చిన ఫండ్స్ వున్నాయి.
ఇదిలా వుంటే మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయో స్థూలంగా తెలుసుకోవడం అవసరం. మ్యూచువల్ ఫండ్స్ పని చేసే విధానానికి, మన కథలో రైతులు చేసినదానికి చాలా సామ్యం వుంది. కొంతమంది జనం దగ్గర డబ్బులు/పెట్టుబడి/పొలం పోగు చేసి, వాటి ద్వారా సంపాదించిన లాభాన్ని వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తిలో పంచడమే మ్యూచువల్ ఫండ్స్ అయినా, సామూహిక సహకార వ్యవసాయం అయినా. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఫండ్ హౌస్ తాము నిర్వహించబోయే ఒకానిక ఫండ్ కోసం డబ్బులు పెట్టుబడిగా పెట్టమని కోరింది అనుకుందాం. ఎవరి స్థోమతని బట్టి వాళ్ళు ఆ ఫండ్ లో పెట్టుబడి పెడతారు. అలా సేకరించిన మొత్తం డబ్బు మూడు లక్షలు అనుకుందాం (అనుకోడానికే, ఆ మొత్తాలు కోట్లలో వుంటాయి). అప్పుడు ఆ మూడు లక్షలని భాగాలుగా విడకొడతారు. ఒక్కో భాగం విలువ పది రూపాయలు. అంటే ముఫై వేల భాగాలు వస్తాయి. ఈ భాగాలను యూనిట్లు అంటారు. (అర్థం కావడానికి ఇలా చెప్పాను కానీ, ముందే విడగొట్టి యూనిట్లలోనే అమ్ముతారు)
ఇప్పుడు పెటుబడి పెట్టిన ముదుపరి వైపు నుంచి చూద్దాం. ఒక వ్యక్తి ఐదు వందలు ఇస్తే అతనికి యాభై యూనిట్లు వస్తాయి. మూడు వేలు పెడితే మూడొందల యూనిట్లు వస్తాయి. ఇప్పుడు ఆ ఫండ్ మేనేజర్ మూడు లక్షలనీ రకరకాల కంపెనీ షేర్లలోనూ, బాండ్స్ లోనూ, డెట్ ఫండ్స్ లోనూ ఇంకా అనేక రకాలుగా ఇన్వెస్ట్ చేస్తాడు. అలా పెట్టిన డబ్బు షేరు ధరలు పెరగటం వల్లో, కంపెనీలు బోనస్ ప్రకటించడం వల్లో పెరగడం మొదలౌతుంది. సంవత్సరం తిరిగే సరికి మూడు లక్షల పెట్టుబడి నాలుగున్నర లక్షలు అయ్యిందనుకుందాం. అప్పుడు ఒక్కో యూనిట్ ధర పది రూపాయల నుంచి పదిహేను రూపాయలౌతుంది. అంటే అయిదొందలు ఇచ్చి యాభై యూనిట్లు కొనుక్కున్న వ్యక్తికి (50 X 15) ఏడు వందల యాభై రూపాయలు వస్తాయి. గమనిస్తే మన కథలో రైతులు కూడా ఇదే విధంగా ముఫై ఎకరాలు కలిపేసుకోని, అందులో ఎవరి పొలం ఎంత వుందో అంత నిష్పత్తిలోనే లాభాలను పంచుకున్నారు.
ఇది ఇలా వుంటే, మ్యూచువల్ ఫండ్స్ లో చాలా రకాలు వున్నాయి. పెద్ద షేర్లు మాత్రమే కొనే ఫండ్స్, మీడియం కంపెనీల షేర్లు , చిన్న కంపెనీ షేర్లు ఇలా రకరకాల పెట్టుబడి పెట్టేవి వుంటాయి. అలా కాకుండా కేవలం ఒకే రకం కంపెనీలలో పెట్టే ఫండ్స్ వుంటాయి. ఉదాహరణకి సాఫ్ట్ వేర్ కంపెనీలలో మాత్రమే పెట్టుబడి పెట్టే ఫండ్స్ కొన్ని వుంటాయి. వీటిని సెక్టోరియల్ ఫండ్స్ అంటారు. ఇలా చెప్పుకుంటూపోతే చాలా వున్నాయి.
మరి ఇన్ని రకాల ఫండ్స్ వున్నప్పుడు ఏది ఎన్నుకోవడం మంచిది అన్న ప్రశ్న కలుగుతుంది. అర్థ ఆర్థిక విషయాలు తెలుసుకోని, ఆయా ఫండ్స్ గురించి, ఫండ్ మేనేజర్ల గురించి తెలుసుకోని పెట్టుబడి పెట్టడం ఒక పద్ధతి. ఇవేమీ తెలియకపోతే విభిన్నంగా వుండే షేర్లు కలిగిన ఫండ్ ని ఎన్నుకోవడం ఉత్తమం. మన కథలో రైతులు ఒకే రకమైన పంటలు పండిస్తే నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా వుండేది. ఇప్పుడు సహకార పద్ధతిలో రకరకాల పంటలు పండించడం వల్ల అందరూ లాభపడుతున్నారు. సరిగ్గా అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో రకరకాల కంపెనీలలో పెట్టుబడి పెట్టే ఫండ్స్ తక్కువ రిస్క్ తో మంచి లాభాలు ఇచ్చే అవకాశం వుంటుంది. ఉదాహరణకు ఏ కారణం వల్ల అయినా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందంటే కేవలం రియల్ ఎస్టేట్ రంగంలోనే పెట్టుబడి పెట్టిన సెక్టోరియల్ ఫండ్ దెబ్బతింటుంది. సామాన్యంగా అర్థ వ్యవస్థలో ఒక రంగం దెబ్బతింటే మరో రంగం పుంజుకునే అవకాశం వుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్న టైములోనే బంగారం విలువ పెరగచ్చు. బంగారం ఆధారంగా పనిచేసే కంపెనీ షేర్లు లాభాలను ఇచ్చే అవకాశం వుంటుంది. ఇలా డైవర్సిఫైడ్ ఫండ్ లో డబ్బులు పెట్టడం వల్ల రామాపురం రైతుల్లా ఎప్పుడూ లాభాలలోనే వుండచ్చు. మరో విశేషమేమిటంటే డైవర్సిఫైడ్ ఫండ్స్ లో కొన్ని టాక్స్ ఆదా చేసే పథకాలు కూడా వున్నాయి. అలాంటి ఫండ్ లో పెట్టుబడి పెడితే, ఫండ్ ఇచ్చే లాభంతో పాటు, టాక్స్ ఆదా కూడా కలిసి లాభాన్ని మరింత పెంచుతుంది.”
సంపద సాధించాలంటే ఈక్వీటీలలో పెట్టుబడి తప్పనిసరి. అందుకు స్టాక్ మార్కెట్ కాకుండా, మ్యూచువల్ ఫండ్ మార్గంలో వెళ్ళడం ద్వారా రిస్క్ తక్కువ తీసుకుంటూనే మంచి లాభాలను పొందవచ్చు. అలాంటి ఫండ్స్ లో కూడా డైవర్సిఫైడ్ ఫండ్స్ లో, టాక్స్ ఆదా చేసే ఫండ్స్ లో ముదుపు చేయడం లాభదాయకం.
చిల్లర చిట్కాలు:
ఇది చాలా ముఖ్యమైన విషయం. మ్యూచువల్ ఫండ్స్ లో (మరేదైనా స్టాక్ మార్కెట్ తో సంబంధం వున్న పథకంలో) ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. సరిగ్గా అలా పెట్టిన రోజే స్టాక్ మార్కెట్ కూలిపోతే కోలుకోవడం కష్టం. కాబట్టి నెల నెల ఒకే మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం మంచిది. దీనినే సిస్టమాటిక్ ఇన్వస్ట్మెంట్ ప్లాన్ అంటారు. [:]

Comments
Post a Comment