(Telugu) ఆర్థిక ప్రగతికి అత్యంత కీలకమైన విషయాలు
[:te]సంపాదించే ప్రతి మనిషి కోరుకునేది సంపద సాధించాలని. సంపాదనకు సంపదకు వున్న తేడా తెలుసుకోవడంతో ఇది మొదలౌతుంది. సంపాదన చేతిలోకి వచ్చే డబ్బు అయితే సంపద మనదగ్గర నిలిచేది. ఈ రెండింటి మధ్య వుండే ఖర్చు, పొదుపు, ముదుపు అనే విషయాలు సంపాదనను సంపదగా మార్చే విషయాన్ని ప్రభావితం చేస్తాయి. ఎంత సంపాదిస్తున్నామన్న దానికన్నా అందులో ఎంత డబ్బు సంపదగా మారుస్తున్నాము అన్నదాని బట్టే ఆర్థిక ప్రగతి ఆధారపడి వుంటుంది.
ఇది తెలుసుకున్న తరువాత ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడం రెండో మెట్టు. డబ్బు తెలివిగా ఆదా చేస్తే తనంతట తానుగా పెరుగుతుంది అని తెలుసుకోవాలి. మొదటి లక్ష సంపాదించడం కష్టం కానీ, ఆ తరువాత అదే లక్ష తనంతట తానుగా మరో లక్షను సృష్టించగలదు. కాలం గడిచే కొద్ది ఆదా చేసిన డబ్బు పెరుగుతుంది, కానీ దానితో పాటే ఆ డబ్బు విలువ మాత్రం పడిపోతుంది. డబ్బు పెరగడానికి కారణం చక్రవడ్డీ, వ్యాపారం/షేర్లలో లాభాలు అయితే అదే డబ్బు విలువ తగ్గిపోడానికి కారణం ద్రవ్యోల్బణం. పెరిగే డబ్బు విలువ, ద్రవ్యోల్బణం కన్నా ఎక్కువ వుంటే అప్పుడే నిజమైన వృద్ధి సాధించినట్లు. ఇది మొదటి సూత్రం.
ఆర్థిక అభివృద్ధి కోసం, సంపద సాధించడం కోసం కష్టపడే ప్రతి మనిషి చేయాల్సిన మొదటి పని ఇన్సూరెన్స్ తీసుకోవడం. మనిషి విలువకి సరిపోయేంత జీవిత బీమా, కుటుంబానికి సరిపోయేలా ఆరోగ్యబీమా, ప్రమాద బీమా తీసుకోవాలి. ఇవి లేకపోతే కుంటుబంలో ఎవరికైనా, ముఖ్యంగా సంపాదిస్తున్న వ్యక్తికి ప్రమాదం జరిగినా, అనారోగ్యం సంభవించినా, విధివశాత్తు చనిపోయినా సంపద సాధించాలన్న ఆశయం విఫలమైపోవటమే కాకుండా, ఆ కుటుంబం ఆర్థికంగా మరింత దిగజారే పరిస్థితి వస్తుంది. అందువల్ల బీమా లేకుండా ఆర్థిక అభివృద్ధికి పథకాలు వేసుకోవడం అవివేకమే అవుతుంది
“ఎలాగూ ఇన్సూరెన్స్ సంగతి వచ్చింది కాబట్టి ఈ ఇన్సూరెన్స్ గురించి చెప్పుకుందాం. ప్రతి మనిషికి ఒక విలువ వుంటుంది. అది అతను/ఆమె జీవితకాలంలో సంపాదించే డబ్బు, సంపాదించే ఆస్థి మొదలైనవి అన్నీ కలిపితే వచ్చేది. దాన్ని ద్రవ్యోల్బణానికి సరిచేసి, దానికి చేసిన అప్పులను కలిపితే వచ్చేదే హ్యూమన్ లైఫ్ వాల్యూ. అంత మొత్తానికి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఆ తీసుకునే ఇన్సూరెన్స్ కూడా ఏజంట్లు చెప్పినది కాకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. తక్కువ ఖర్చుతో ఎక్కువ బీమా పొందడానికి టర్మ్ ఇన్సూరెన్స్ మించినది లేదు. ఒక మనిషి తన విలువకి సరిపడా టర్మ్ ఇన్సూరెన్స్ చేసిన తరువాతే ఇతర ఇన్సూరెన్స్ పథకాలు, వేరే ఆర్థిక పథకాలు కొనుగోలు చెయ్యాలి.
ఇది ఇలా వుంచితే, మనం డబ్బుని మూడు రకాలుగా విభజించుకున్నాము. మొదటిది వచ్చే డబ్బు, రెండోది పోయే డబ్బు మూడోది దాచుకునే డబ్బు. వచ్చే డబ్బును పెంచుకోవాలి, దాచుకునే డబ్బుని పెంచాలి, పోయే డబ్బుని అదుపు చెయ్యాలి. అందుకోసం వచ్చే డబ్బులో దాచుకునే డబ్బు పోగా మిగిలిన డబ్బునే ఖర్చుపెట్టాలి. ఇది మనం చెప్పుకున్న రెండొవ సూత్రం.
ఆ తరువాత మనం ఖర్చైపోయే డబ్బు గురించి మాట్లాడుకున్నాము. మన చేతిలో నుంచి పోయే డబ్బులలో మూడు రకాలుగా వుంటాయి. అనివార్యమైన ఖర్చులు కొన్ని, ఖర్చుపెట్టకుండా తప్పించుకోగలిగిన ఖర్చులు కొన్ని, ఖర్చుపెట్టినా తిరిగి మనకే లాభాన్ని ఇచ్చే ఖర్చులు కొన్ని. ఈ విభజనని జాగ్రత్తగా అర్థం చేసుకోని, వాటిని అనుకూలంగా మలుచుకోవడమే ఆర్థికప్రగతికి మార్గం.
అనివార్యంగా ఖర్చుపెట్టాల్సిన డబ్బులో రోజువారీ కుటుంబ అవసరాలు, ఇంటి అద్దెలు, ఈ.ఎం.ఐ.లు వగైరాలతో పాటు ప్రభుత్వం విధించే టాక్సులు ముఖ్యమైనవి. ఈ టాక్సులు తప్పించుకోడానికి అవకాశం చాలా తక్కువ. సేల్స్ టాక్స్, ఎక్సైజ్ టాక్స్ మొదలైన పన్నులు పడకుండా చూసుకోవడం దాదాపు అసాధ్యం. పన్ను రాయితీ పొందే అవకాశం కేవలం ఆదాయపు పన్ను విషయంలోనే సాధ్యమౌతుంది. అందుకోసం ప్రభుత్వం ప్రత్యేకించి కొన్ని పథకాలను, కొన్ని ఖర్చులను ఆదాయపు పన్ను పరిధిలో నుంచి తొలగించింది. ఇలాంటి ఖర్చులు పెట్టుకుంటూ, పన్నురాయితీ వున్న పథకాలలో డబ్బుని తెలివిగా ముదుపు చేసుకుంటే ఆదాయపు పన్ను పడకుండా తప్పించుకోవచ్చు. పన్ను రాయితీకోసం కేవలం ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకోవడం, ఎక్కువ లాభాలు రాని ఫిక్సడ్ డిపాజిట్ లాంటి చోట అధికంగా డబ్బు పెట్టడం వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ అని తెలుసుకున్నాము
అంటే పన్ను ఆదా చెయ్యడం కోసం దాచుకునే డబ్బు, ఖర్చుల్లో తిరిగి మనకే లాభాలు ఇచ్చే ఖర్చుకు సంబంధించిన డబ్బు మంచి పథకాలలో తెలివిగా ముదుపు చెయ్యడమే మూడో సూత్రం
“దాచిపెట్టాల్సిన సొమ్ము ఎంతో తెలుసుకున్న తరువాత ఆ డబ్బుని ఎక్కడ దాచుకోవాలి అన్న ప్రశ్న వస్తుంది. డబ్బు దాచుకోడానికి రిస్క్ అస్సలు లేని పోస్టాఫీస్, ఫిక్సడ్ డిపాజిట్ దగ్గర్నుంచి బాగా రిస్క్ వున్న స్టాక్ మార్కెట్ షేర్లదాకా ఎన్నో అవకాశాలు వున్నాయి. సాధారణంగా రిస్క్ ఎక్కువ వున్న చోట పెట్టుబడి పైన లాభం కూడా ఎక్కువ వచ్చే అవకాశం వుంటుంది. ముఖ్యంగా ఎక్కువ కాలం పాటు ఇలాంటి రిస్క్ ఎక్కువ వున్న పథకాలలో పెట్టిన డబ్బు ఎక్కువగా లాభాలు ఇచ్చే అవకాశం వుంది.
డబ్బుని దాచిపెట్టాలని నిర్ణయించుకున్న తరువాత ఎంత రిస్క్ తీసుకోగలను అని ప్రశ్నించుకోవాలి. ఆ తరువాత ఎంత కాలానికి ఈ డబ్బు అవసరమౌతుంది అని ప్రశ్నించుకోవాలి. చివరగా ఈ దాచిపెట్టే సొమ్ము పైన ఆదాయపు పన్ను రాయితీలు అవసరమా అని కూడా చూసుకోవాలి. ఈ మూడు ప్రశ్నలకు సమాధానాల ఆధారంగా ఎంత డబ్బు ఎక్కడ పెట్టాలి అని పథకం వేసుకోవాలి. సాధారణంగా తక్కువ వయసు వున్నవాళ్ళు ఎక్కువ రిస్క్ పథకాలలో డబ్బులు ముదుపు చెయ్యడం వల్ల మంచి ఫలితం వుంటుంది. అదే వ్యక్తి వయసు పెరుగుతున్న కొద్దీ డబ్బుని ఎక్కువ రిస్క్ వున్న పథకాల నుంచి తక్కువ రిస్క్ వున్న పథకాలలోకి మార్చుకుంటూ రావాలి. రిటైర్మెంట్ నాటికి ఎక్కువ డబ్బు రిస్క్ తక్కువ వున్న పథకాలలో, ఫిక్సడ్ డిపాజిట్లలో, బ్యాంకు ఖాతాలోకి చేరేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇది నాలుగో సూత్రం.
ఇదే విధంగా జీవితంలో జరగబోయే ముఖమైన సందర్భాలను ముందుగానే ఊహించి అందుకు అనుగుణంగా డబ్బులు ఆదా చెయ్యాలి. ఏ ఖర్చు కోసం దాచిన డబ్బుని ఆ ఖర్చుకే అన్న నియమం పెట్టుకోని అలాగే వాడుకోవాలి. అదే విధంగా దాచిపెట్టాలనుకున్న సొమ్ము మొత్తాన్ని ఒకచోటే కాకుండా వివిధ రకాల పథకాలలో పెట్టడం వల్ల ఆర్థిక ప్రగతి సునాయాసంగానూ, సురక్షితంగానూ సాగుతుంది”
“ఇదే కాకుండా చేతిలో నుంచి పోయే డబ్బులో ఖర్చులు కూడా వున్నాయి. ఏ డబ్బు అనివార్యమైన ఖర్చుగా వెళ్ళిపోతోందో ఏ డబ్బు అదుపు చేసుకోగలిగిన ఖర్చుగా వెళ్ళిపోతోందో, ఏ డబ్బు పెట్టుబడిగా వెళ్ళిపోతోందో సమీక్షించుకోవడం అవసరం. మన చేతిలో నుంచి పోయే డబ్బులో కేవలం ఖర్చులే కాక పొదుపు, ముదుపు/పెట్టుబడి కూడా వుండేలా చూసుకోవాలి. వాడుకోడానికి కొనుక్కుంటే అది ఖర్చనీ, ఏదైనా అవసరానికి ప్రణాలిక ప్రకారం వస్తు/డబ్బు రూపంలో దాచుకోవడం పొదుపు అనీ, లాభాలు ఆశించి లావాదేవీలు జరిపితే అది పెట్టుబడి అనీ గుర్తించి అందుకు అనుగుణంగా ఆదా చెయ్యాలి.
నగలుగా కొన్న బంగారం ఒక ఖర్చులాంటిదనీ, భవిష్యత్తులో కూతురి పెళ్ళి కోసం ఒక్కో బంగారు నాణెం కొనుక్కోవడం ఆదా/పొదుపు అవుతుందనీ, అదే ఈటీయఫ్ ద్వారానో, బిస్కెట్ల రూపంలోనో కొని, బంగారం ధర పెరుగినప్పుడు అమ్మేందుకు కొన్న బంగారం పెట్టుబడి అవుతుందని చెప్పారు. ఎన్ని చెప్పినా బంగారం గురించిన విషయాలు ఆడవాళ్ళు అంత తొందరగా మర్చిపోరు కదా?
“ఇక ఆ తరువాత నుంచి మనం వచ్చే డబ్బు గురించి మాట్లాడుకున్నాము. అంటే సంపాదన. ప్రతి వ్యక్తికి అతను/ఆమె చేసే పనిని బట్టి జీతం రూపం లోనో, కూలి రూపంలోనో, వడ్డీ రూపంలోనో సంపాదన వస్తుంది. అయితే అది సంపాదించడానికి ఏమేమి వదులుకోవాల్సి వస్తోందో, ఆ వదులుకున్న వాటి విలువ ఏమిటో తెలుసుకోవాలి. ఆ వదులుకోవాల్సినవి ఆనందం, సమయం, కుటుంబంతో సమయం గడిపే అవకాశం వంటివి కూడా వుండచ్చు. సంపాదనకు, వదులుకున్న వాటికి మధ్య బేరీజు వేసుకోని నిజమైన ఆదాయం ఏమిటో తెలుసుకోవాలి. సంపాదన వేరు ఆదాయం వేరు అని గుర్తించాలి.
మనం డబ్బుకోసం పని చెయ్యడం కన్నా మనకోసం డబ్బుతో పని చేయించుకోవడం తెలివైన వారి పద్ధతి. అంటే సమయం, శ్రమ వంటివి అవసరం లేకుండా డబ్బు తనంతట తానుగా మరి కొంత డబ్బు సంపాదిస్తే అది వడ్డీ రూపంలోనో, లాభాల రూపంలోనో మన చేతికి అందుతుంది. ఈ డబ్బు అత్యంత లాభకరమైనది. ఇదే నిజమైన ఆదాయం అని కూడా గుర్తించాము.
మరో ముఖ్యమైన పని ప్రస్తుతం నెల నెల సంపాదిస్తున్న సంపాదనని సుస్థిరం చేసుకోవడం. ఇప్పుడు వస్తున్న సంపాదన ఉన్నట్టుండి లేకుండా పోతే అప్పుడు ఆదుకునేందుకు కొంత డబ్బుని సులభంగా తీసుకునేలా అందుబాటులో వుంచుకోవాలి. అలాగే ప్రత్యామ్నాయ ఆదాయ అవకాశాలను కూడా సిద్ధంగా వుంచుకోవాలి. దీనినే కెరీర్ ఇన్సూరెన్స్ అనుకున్నాము. ఇదంతా జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఒడిదొడుకులు రాకుండా కాపాడుకోవడం కోసం చెయ్యాల్సింది. ఒకప్పుడు వ్యాపకంగా వున్న విషయాలే ఇప్పుడు ఆదాయ మార్గాలుగా మరుతున్నాయి కాబట్టి ఇదేమంత కష్టం కాకపోవచ్చు.
“నేను చెప్పిన ప్రతి విషయాన్నీ చాలా జాగ్రత్తగా నేర్చుకుంటున్నారని నేర్చుకున్న విషయాలను అమలు పరుస్తున్నారని అర్థం అయ్యింది. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు మర్చిపోయారు. సంపాదన ధ్యాసలో, సంపద సాధించాలన్న ఆతృతలో ఆరోగ్యం, కుటుంబం వంటి అతి ముఖ్యమైనవాటిని నిర్లక్ష్యం చెయ్యకూడదు. [:]

Comments
Post a Comment