(Telugu) ఇన్సూరెన్స్ పథకాలలో అన్నింటికన్నా ఉత్తమమైనది, చౌకైనది టర్మ్ పాలసీ.
[:te]“మధ్యతరగతి మహారాజా, ఈ రోజుల్లో ఆర్థిక పథకాలు ఎక్కువైపోయాయి. అవి అందించే సంస్థలు కూడా ఎక్కువైపోయాయి. ఉదాహరణకు జీవిత బీమా సంస్థలనే చూస్తే ఒకప్పుడు ఒకటే సంస్థ వుండేది. ఇప్పుడు ఇరవైకి పైనే సంస్థలు, వారి వారి అనుబంధ బ్యాంకులు, ఏజంట్లు ఇలా ఎంతో మంది బీమా పథకాలను అమ్ముతున్నారు. ఇంతమంది అమ్మడం వల్ల కొనుగోలుదారుడుకి ఏ పథకం మంచిదో తెలుసుకోవడం చాలా కష్టంగా వుంది. చాలామంది ఈ తికమకలో ఒకదాని బదులు మరొకటి తీసుకోని తరువాత బాధపడుతున్నారు. అలా జరగకుండా ఏం చెయ్యాలో తెలుసుకునేలా నీకో కథ చెప్తాను.
పూర్వం ఒకానొక అడవిలో అనేక రకాల జంతువులు వుండేవి. ఆ జంతువులను రోజుకొకటి చొప్పున ఒక సింహం తింటూ వుండేది. ఒక తెలివైన కుందేలు ఆ సింహాన్ని బావిలో పడేలా చేసి ఆ జంతువులన్నింటినీ కాపాడింది. అందుకు ఆ జంతువులు ఎంతో ఆనందించి, కుందేలుకి సన్మానం చేశాయి. వాటిని ఉద్దేశించి కుందేలు మాట్లాడింది.
“ప్రియమైన జంతువులారా! ఈ రోజు సింహం చచ్చిపోయిందని మనం ఎంతో సంతోషంగా వున్నాము. కానీ, సింహం కన్నా తెలివైన, బలమైన, ప్రమాదకరమైన మరో జంతువు వుంది. దానిని మనిషి అంటారు. ఆ మనిషి ఒకప్పుడు అడవికి దూరంగా బతికేవాడు. ఇప్పుడు అడవులను ఆక్రమిస్తూ జంతువులను చంపేస్తున్నాడు. అందువల్ల మనం ఈ ప్రమాదం గురించి కూడా ఆలోచించాలి” అని చెప్పింది.
అక్కడకి చేరిన అన్ని జంతువులు అందుకు అంగీకరించి, తెలివైన కుందేలే ఏదో పరిష్కారం కనుక్కోవాలని కోరాయి. కుందేలు బాగా ఆలోచించి తన పథకం గురించి చెప్పడం మొదలుపెట్టింది.
“మనిషిని ఎదిరించడం, తెలివితో మోసం చేసి సింహాన్ని చంపినట్లు చంపడం జరిగేపని కాదు. పైగా సింహంలాగా రోజుకు ఒక జంతువు అన్న నియమాలేవీ మనిషికి లేవు. అందుకని మనిషికి కనిపించకుండా తిరగటం తప్ప వేరే మార్గం లేదు. అతనికి దొరికిన రోజు మన కాలం అయిపోయింది అనుకోవడం తప్ప మనం ఏమీ చెయ్యలేము. కాకపోతే ఇందులో మరో చిక్కు వుండి. ఇలా మరణించే జంతువులలో ఎక్కువ శాతం ఆయా కుటుంబాల పెద్ద దిక్కు ఎక్కువగా వుండటం గమనించాను. వీరు కుటుంబం కోసం ఆహారం తీసుకురావటానికి తమ తమ ఇళ్ళ నుంచి బయటకు వచ్చి అడవిలో సంచరించి, ఇలాంటి మనుషులకు బలి అవుతున్నారు. ఇలా ప్రతి కుటుంబంలో ఆహారం తెచ్చే ఇంటి పెద్ద చనిపోవడం వల్ల ఆ కుటుంబాలు అడవి పాలైపోతున్నాయి." అంది కుందేలు.
"అవును నిజమే.. మరి వారిని ఆదుకోవడం ఎలా?" అడిగింది ఏనుగు.
"అందుకు నేనొక పథకం తయారు చేశాను. ఇక నించి ప్రతి జంతువు తాము సంపాదించిన ఆహారంలో కొంత భాగం అడవి మధ్యలో వున్న ఉలూకగుహలో వుంచాలి. అలా సేకరించిన ఆహారాన్ని ఇలా అడవిపాలయ్యే కుటుంబానికి ఇద్దాము. ప్రతి జంతువు కుటుంబంలో వున్న జంతువుల సంఖ్య, వారు తినే ఆహారం పరిమాణం బట్టి సేకరించిన ఆహారంలో ఎంత ఇవ్వాలో లెక్క వేస్తాము. అంత ఆహారాన్ని వాళ్ళు ఉలూకగుహలో వుంచాలి. అలా సేకరించిన ఆహారంలో నుంచి చనిపోయిన కుటుంబాలకి ఆహారం ఇవ్వడం జరుగుతుంది” అంటూ వివరించింది. ఆ రకంగా "అరణ్య ఆహార పథకం" ప్రారంభమైంది.
మొదలైన మొదట మూడు నెలలు బాగానే జరిగింది. క్రమ క్రమంగా జంటువులు ఉలూక గుహలో ఆహారం పెట్టడం తగ్గిపోయింది. ఆరునెలలకు దాదాపు అన్ని జంతువులూ అందులో ఆహారం పెట్టడం మానేశాయి. కుందేలు తల పట్టుకోని కూర్చుంది.
కుందేలు పెట్టిన పథకం ఎందుకు విఫలమయ్యింది? కుందేలు ఆలోచనలో తప్పుందా? లేక మిగిలిన జంతువులు తప్పుగా ఆలోచించాయా?
“ముందుగా కుందేలు ప్రవేశపెట్టిన పథకాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది సరిగ్గా మన ఇన్సూరెన్స్ పథకం లాంటింది. ఇన్సూరెన్స్ అంటే అది కొనుక్కునే పాలసీదారుడికీ, ఇన్సూరెన్స్ కంపెనీకీ మధ్య ఒక ఒప్పందం. ఫలానా సంఘటన జరిగితే ఇంత మొత్తం ఇస్తాం అని కంపెనీ, అలా ఒప్పుకున్నందుకు నెల నెలా, లేదా సాలీనా ఇంత డబ్బు కంపెనీకి ఇస్తానని కస్టమరు చేసుకునే ఒప్పందమే ఇన్సూరెన్స్. ఆ సంఘటన ఏక్సిడెంట్ అయితే అది ఏక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అంటారు, దొంగతనమైతే తెఫ్ట్ ఇన్సూరెన్స్ అంటారు, అగ్ని ప్రమాదమైతే ఫైర్ ఇన్సూరెన్స్ అంటారు. అదే ఒక మనిషి చనిపోవటం గురించి ఇన్సూరెన్స్ చేస్తే అది లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు. ఇక్కడ కుందేలు చేసింది కూడా లైఫ్ ఇన్సూరెన్సే. ఏదైనా కుటుంబంలో ఆహారాన్ని సేకరించే జంతువు చనిపోతే, ఆ కుటుంబానికి ఆహారాన్ని అందించడం సరిగ్గా జీవిత బీమా లాగానే వుంది. ఏ జంతువు కుటుంబానికి ఎంత ఆహారం అవసరమో సరిగ్గా మనం గతంలో చెప్పుకున్న HLV విధానంలోనే లెక్కేసుకున్నారు.
ఈ కథలో పథకం ఎందుకు విఫలమైందో తెలుసుకునే ముందు జీవిత బీమాలో రకాల గురించి మరింత వివరంగా తెలుసుకోవాలి. ఇందాక నేను చెప్పిన కాంట్రాక్ట్ ప్రకారం ఫలానా సమయం దాకా (policy term), పాలసీదారుడు కట్టే డబ్బుకి (premium) అనుకున్న కాలంలో ఎప్పుడు చనిపోతే అప్పుడు ఇన్సూరెన్స్ డబ్బు (sum assured) కంపెనీ ఇస్తుంది. అంటే ఉదాహరణకు ప్రతి సంవత్సరం ఒక వ్యక్తి పది వేలు కడుతూ ముఫై ఏళ్ళకి, యాభై లక్షల ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఆ ముఫై ఏళ్ళలో ఆ వ్యక్తి ఎప్పుడు చనిపోయినా కంపెనీ యాభై లక్షలు ఇస్తుంది. ఇప్పుడు వెంటనే వచ్చే ప్రశ్న- ఒక వేళ అతను చనిపోకపోతే ఏమౌతుంది అని. అతనికి ఏ డబ్బు తిరిగిరాదు. అయితే కట్టిన ప్రీమియం మొత్తం కంపెనీకి లాభంగా మిగిలనట్లే అనుకోడానికి కూడా లేదు.
ఒక ఇన్సూరెన్స్ పథకాన్ని తయారు చేసేటప్పుడు, ఒక వెయ్యి మంది కొంటే అందులో ఎంతమంది పాలసీకాలంలో చనిపోయే అవకాశం వుంటుంది అని లెక్క వేస్తారు. వెయ్యిలో ఇద్దరు చనిపోయే అవకాశం వుంది అనుకుంటే, వారికి కోటి రూపాయలు చెల్లించాలి అని అనుకుంటే ఆ వెయ్యి మంది చేత తలా పది వేల రూపాయాలు తీసుకుంటారు. అలా అందరి దగ్గర తీసుకున్న డబ్బుని ఎక్కడో చనిపోయిన ఒక వ్యక్తికి ఇస్తారు. అతను చనిపోయేదాకా కంపెనీ ఆ డబ్బుని వేరే చోట పెట్టుబడిగా పెట్టడం ద్వారా, చార్జీల పేరుతో వసూలు చేసే డబ్బు ద్వారా లాభపడే మాట వాస్తవమే కానీ, కట్టిన ప్రీమియం మొత్తం కంపెనీకి లాభం కాదు.
కంపెనీ లాభపడినా పడకపోయినా కట్టినవాళ్ళు పాలసీ కాలంలో చనిపోకపోతే నష్టమే కదా?అని కూడా ప్రశ్నించవచ్చు. కానీ పాలసీ అనుకున్న కాలంలో ఎక్కడోక్కడ ఎవరో ఒకరు చనిపోతూనే వుంటారు. వారికి బీమా సొమ్ము అందుతూనే వుంటుంది. అయినా కానీ పాలసీ కాలంలో నేను ఎట్టి పరిస్థితుల్లో చనిపోను అని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు కాబట్టే ఇన్సూరెన్స్ అవసరం వచ్చింది.
అరణ్య ఆహార పథకంలో కూడా అదే జరిగింది. జంతువులన్నీ కొంత కాలం పాటు ఆహారాన్ని సేకరించి అందులో కొంత భాగాన్ని (ప్రీమియంలా) ఇచ్చాయి. కానీ మూడు నెలల్లో ఏ జంతువూ చనిపోలేదు కాబట్టి తమ ఆహారాన్ని అనవసరంగా వృధా చేసుకుంటున్నామేమో అన్న అనుమానంతో ఇవ్వటం మానుకున్నాయి. ఇది ఖచ్చితంగా జంతువుల తప్పే తప్ప పథకంలో లోపం కాదు. ఇన్సూరెన్స్ గురించి అవగాహన లేకపోవటం వల్లే ఇలా జరిగింది.
అందుకే అన్ని బీమా కంపెనీలు రకరకాల పథకాలను పెట్టి పాలసీదారుడు డబ్బులు క్రమం తప్పకుండా కట్టేలా చూసుకుంటారు. కేవలం ప్రీమియం తీసుకోని బీమా సౌకర్యాన్ని ఇచ్చే పాలసీని టర్మ్ పాలసీ అంటారు. ఇందులో పాలసీ కాలంలో పాలసీదారుడికి ఏం జరగకపోతే ఏ డబ్బు వెనక్కి రాదు. అందువల్ల దీనికి ప్రీమియం కూడా తక్కువగా వుంటుంది. గతంలో మనం చర్చించుకున్నట్లు ఒక మనిషి విలువకు తగ్గట్టు ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఇదే సరైన ఇన్సూరెన్స్. మిగిలినవి పథకాలుగా ఎంత ఆకర్షణీయంగా వున్నా వాటిలో డబ్బులు వృధా అయ్యే అవకాశమే ఎక్కువ.
ఇప్పుడు మిగిలిన బీమా పథకాల గురించి కూడా చెప్తాను విను. పాలసీ కాలపరిమితి మొత్తం ప్రీమియం తీసుకోని చివర్లో కట్టిన సొమ్ము తిరిగి ఇచ్చే పథకాలు వున్నాయి. వీటిని టర్మ్ పాలసీ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం (Term policy with return of premium) అంటారు. తీసుకున్న డబ్బు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తే మరి ఇందాక చెప్పినట్లు ఎక్కడోక్కడ ఎవరోకరు చనిపోతే వాళ్ళకి డబ్బులు ఎలా ఇస్తారు? అని అనుమానం వస్తుంది. ఈ పథకంలో ముందు చెప్పిన టర్మ్ పాలసీకన్నా చాలా ఎక్కువ మొత్తంలో ప్రీమియం తీసుకుంటారు. ఆ సొమ్ముని పెట్టుబడిగా పెట్టి టర్మ్ పాలసీ ప్రీమియం అంత సొమ్ముని సంపాదించి దానితో ఇన్సూరెన్స్ కవర్ ఇచ్చి చివర్లో ఆ డబ్బుని తిరిగి ఇచ్చేస్తారు. అంటే ఒక చెరకు గడ తీసుకోని కొన్ని సంవత్సరాలు దాన్ని పిండి చివర్లో ఆ చెరకు పిప్పి తిరిగిచ్చినట్లు. పాలసీదారుడు ఈ పాలసీ కొనే బదులు అదే డబ్బుతో ఒక టర్మ్ పాలసీ తీసుకోని, మిగిలిన డబ్బుని ఫిక్సడ్ డిపాజిట్ తీసుకున్నా అంత కన్నా ఎక్కువ లాభాలు పొందవచ్చు.
ఇలాగే ఇంకా ఎక్కువ డబ్బు తీసుకోని ఆ డబ్బుని వడ్డితో సహా చివర్లో ఇస్తామని చెప్పే పథకాలు ఎండోమెంట్ (endowment) పథకాలు. ఈ పథకాలలో వడ్డీ శాతం సుమారుగా నాలుగు నుంచి ఎనిమిది లోపు వుంటుంది. ఇది బ్యాంక్ వడ్డీ కన్నా చాలా తక్కువ అని సులభంగానే తెలుసుకొవచ్చు. కాబట్టి ఈ పథకం కన్నా టర్మ్ పాలసీ తీసుకోని మిగిలిన డబ్బుని బ్యాంక్ లో వేసుకోవడం మంచిది. ఇలాగే చివర్లో ఇచ్చే సొమ్ముని అరవై ఏళ్ళ తరువాత నెల నెల ఇస్తే పెన్షన్ పథకం, పిల్లల చదువులకు అవసరమైనప్పుడు ఇస్తే అది ఎడ్యుకేషన్ ప్లాన్ అవుతాయి. ఇవన్నీ కూడా చాలా స్వల్పమైన వడ్డీలు మాత్రమే ఇస్తాయి.
ఇక మార్కెట్ ఆధారిత పథకాలు వున్నాయి. వాటిని ULIPs (యూలిప్స్) అంటారు. ఇందులో బీమా ఇవ్వడానికి అవసరమైన సొమ్ము, చార్జీలు పోను మిగిలిన డబ్బుని స్టాక్ మార్కెట్లో ఉంచుతారు. మార్కెట్ పెరిగితే ఈ డబ్బు పెరుగుతుంది. మార్కెట్ నష్టాలలోకి వెళితే ఈ డబ్బు తగ్గిపోతుంది. ఈ పథకాలు కొంత వరకు మంచివే అయినా కేవలం ఇన్సూరెన్స్ తీసుకోడానికి ఈ పథకం పనికిరాదు. దీని బదులు ఒక టర్మ్ పాలసీ తీసుకోని, ఒక మ్యూచువల్ ఫండ్ పథకంలో డబ్బు పెట్టడం ద్వారా ఇంకా ఎక్కువ సంపాదించే అవకాశం వుంది. ULIPsలో చార్జీల రూపంలో కంపెనీ వసూలు చేసే సొమ్ము ఎక్కువ. ఏజంట్ల కమీషన్లు వగైరాలు మన డబ్బులో నుంచే ఇవ్వబడతాయి కాబట్టి మనం కట్టిన డబ్బులో పెట్టుబడిగా మరే సొమ్ము తక్కువ.
ఒక సిద్ధాంతంగా చెప్పుకోడానికి ఇవన్నీ బాగానే వుంటాయి కానీ వ్యవహారికంలో ఒక ఇబ్బంది వుంది. ఇంతకు ముందు చెప్పినట్లు ఒక టర్మ్ పాలసీ తీసుకోని మిగిలిన డబ్బుని ఫిక్సడ్ డిపాజిట్ లోనో, మ్యూచువల్ ఫండ్స్ లోనే పెడితే లాభాలు బాగానే వుంటాయి. కానీ, టర్మ్ పాలసీ తీసుకోని మిగిలిన డబ్బుని ఎక్కడా పొదుపు చెయ్యకుండా వాడుకుంటే దానికి ఏ ఫలితం వుండదు. అలా ఆర్థిక వ్యవహారాలపైన అదుపు లేనివాళ్ళు ULIP, లేదా ఎండోమెంట్ తీసుకున్నా తప్పులేదు. కనీసం కొంత డబ్బు దాచినట్లు అవుతుంది, కొంత టాక్స్ ప్రయోజనం కూడా కలుగుతుంది. అయితే తన విలువకు తగ్గ ఇన్సూరెన్స్ వచ్చేలా తీసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. అలాగే చేతిలో మిగిలే సొమ్ము మొత్తం ఇన్సూరెన్సలో పెట్టడం కూడా మంచిది కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోతే అరణ్య ఆహార పథకాన్ని అర్థం చేసుకోని జంతువుల్లా మనం కూడా నష్టపోతాము.
మనిషి జీవితకాలపు ఆర్థిక విలువకు సరిపడేలా టర్మ్ పాలసీ తీసుకోని మిగిలిన డబ్బుని వేరే ఏవైనా పథకాలలో ఉంచి ఎక్కువ లాభాలు సంపాదించవచ్చు. ఆర్థిక వ్యవహారాలపైన అదుపు లేనివాళ్ళు ఇతర ఇన్సూరెన్స్ పథకాలను తీసుకోవచ్చు, కానీ అవసరానికి తగ్గ టర్మ్ పాలసీ తీసుకున్న తరువాతే అవి తీసుకోవడం మంచిది.
చాలామంది ఏజెంట్లు వాళ్ళకు అత్యధికంగా కమిషన్లు వచ్చే పథకాలనే అమ్మాలని ప్రయత్నిస్తారు. టర్మ్ పాలసీలో ఆదాయం తక్కువ కాబట్టి దాని గురించి ఎక్కువగా చెప్పరు. టర్మ్ పాలసీ కావాలంటే గట్టిగా అడగక తప్పదు. ఇంటర్నెట్ సౌకర్యం వున్న వాళ్ళు, కంపెనీ వెబ్ సైట్ల నుంచి కూడా టర్మ్ పాలసీలను కొనుగోలు చెయ్యవచ్చు. నెట్ ద్వారా ఈ పాలసీ ఇంకా చౌకగా లభించే అవకాశం వుంది. [:]

Comments
Post a Comment