(Telugu) ఫైనాన్షియల్ పోర్ట్ ఫోలియో
[:te]అనేక ఆర్థిక విషయాలు తెలిసినవారు కూడా తప్పులు చేసి తమ ఆర్థిక ప్రణాలికలను తారుమారు చేసుకోని, ఎదగలేకపోతుంటారు.
వినయ్, విజయల వివాహం దిగ్విజయంగా జరిగింది. సాంప్రదాయం ప్రకారం ముచ్చట్లు అన్నీ కానిచ్చుకోని బెంగుళూరు చేరి కొత్త కాపురం పెట్టారు. అప్పటిదాకా వినయ్ ఒక్కడే ఉండేవాడు కాబట్టి ఇల్లంతా బ్రహ్మచారుల ఇల్లులాగే వుంది. ముఖ్యంగా వంటింట్లో సామాన్లు సగం వుంటే సగం లేవు. ఏవో నాలుగు గిన్నెలు, రెండు కంచాలు అన్నట్లు వుంది. ఇదంతా చూసిన విజయ వంట ఎలా చెయ్యాలా అని దిగులుపడిపోయింది. కొత్త సామాన్లు కొనుక్కుందాంలే అని ఇద్దరూ అనుకున్నారు. ఇంతలోనే వినయ్ తల్లిదండ్రులు, విజయ తల్లిదండ్రులు బెంగుళూరు వచ్చారు.
“కొత్త సంసారం కదా... అన్ని వసతులు ఉన్నాయో లేదో అని మీ అమ్మ ఒకటే పోరుపెడితే ఇలా వచ్చేసాం” అన్నాడు వినయ్ తండ్రి.
“వాళ్ళు వస్తారని మాకేం తెలుసు. మీ నాన్న కూడా ఇలాగే ఖంగారు పడుతుంటే బయల్దేరాము” అంది విజయ తల్లి.
“ఇప్పుడేమైంది? ఎలాగూ వచ్చాం కాబట్టి బెంగుళూరు మొత్తం చూసి, ఎంచక్కా నా కోడలు వంట రుచి చూసి వెళ్తాం” అంది విజయ అత్తగారు. అన్నట్టుగేనే ఆ రోజు మధ్యాహ్నం భోజనం టైమ్ కి అంతా అవురావురంటూ కూర్చున్నారు. విజయ మామిడికాయపప్పు, మజ్జిగచారు చేసింది. అంతా వడ్డింఛుకున్నారు.
తిన్నవాళ్ళంతా ఏదో మొహమాటానికి అన్నట్లు “బాగుంది” అన్నారు కానీ వాళ్ళ ముఖంలో ఆనందం లేదని విజయకు అర్థం అయ్యింది. వంట కుదర్లేదేమో అని అనుమానం వచ్చింది. అదే విషయాన్ని వాళ్ళమ్మ దగ్గర అడిగింది.
“నువ్వు మామిడికాయ పప్పు నాకన్నా చాలా బాగా చేస్తావు కదా... ఈ రోజేంటే అస్సలు కుదర్లేదు? అదేంటో ఒకటే చేదు. అయినా మజ్జిగచారులో మిరియాలు వెయ్యమని ఎవరు చెప్పారే? అందుకే అది కూడా చెడింది” అంటూ అసలు విషయం చెప్పిందావిడ. ఆ తరువాత రోజు కూడా వంటలు అలాగే వుండటంతో అనుమానం వచ్చి వంటింట్లోకి వెళ్ళి చూసిందామె. అప్పటికి కానీ అసలు విషయం అర్థం కాలేదు. వెంటనే బజారుకు వెళ్ళి ఒక వస్తువు కొని బహుమతిగా ఇచ్చింది. ఇక అప్పటి నుంచి విజయ వంటలు అద్భుతం అని ఇంటిల్లిపాదీ పొగడసాగారు.
“విజయ స్వతహాగా మంచి వంటలు చెయ్యగలదని వాళ్ళమ్మే చెప్పింది. కానీ పెళ్ళి తరువాత ఆమె వంటలు ఇలా తయరవ్వడానికి కారణం ఏమిటి? వంటలు బాగుపడతానికి ఆమె తెచ్చిచ్చిన బహుమతి ఏమిటి? అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన ఆర్థికపాఠం ఏమిటి?
“ప్రతిసారిలాగే ఈసారి కూడా నీ ప్రశ్నలకు సమాధానం నీ కథలోనే వుంది. అప్పటిదాకా బ్యాచిలర్ ఇల్లులా వున్న ఇంటిలోనే విజయ కొత్త కాపురం మొదలైంది. ఆ ఇంట్లో ముఖ్యంగా వంటింట్లో సామాను తక్కువగా ఉన్నాయని నువ్వే చెప్పావు. ఇదే కీలకమైన సమాచారం. ఇక వంటల్లోకి వస్తే పప్పు చేదుగానూ, మజ్జిగచారులో మిరియాలు ఉన్నాయని కూడా చెప్పావు. అంటే పప్పులో మెంతులు, మజ్జిగచారులో మిరియాలు పడ్డాయన్నమాట. వంట చేయడం బాగా తెలిసిన విజయ వంటలో ఇలా అనవసరమైన పదార్థాలు వున్నాయి అంటే అది పొరపాటునే జరిగివుండాలి. అలాంటి పొరపాటు జరిగే అవకాశం ఎప్పుడు వుంటుంది అని ఆలోచిస్తే అసలు సంగతి బయటపడింది. వాళ్ళ వంటింట్లో పోపులపెట్టెలేదన్నమాట. పోపులపెట్టె వుంటే ఏ గింజలకు ఆ గింజలు విడివిడిగా వుంటాయి. అప్పుడు ఒకదాని బదులు మరోటి పడే అవకాశం వుండదు. ఇది తెలుసుకున్న విజయ తల్లి ఆమెకు పోపులపెట్టె బహుమతిగా ఇచ్చి వుంటుంది. దాంతో ఆమె వంటలు ఎప్పటిలా అద్భుతంగా వుండి వుంటాయి.
కథలో సమస్య పరిష్కారం అయ్యింది కాబట్టి ఇప్పుడు దానిలో వున్న ఆర్థిక పాఠాలను గమనిద్దాం. పోపులపెట్టెకి ఆర్థిక ప్రణాలికకూ చక్కని సంబంధం వుంది. పోపులపెట్టెలో రకరకాల వస్తువులు ఎలా వుంటాయో సరిగ్గా అలాగే మన ఆర్థిక ప్రణాలికలో రకరకాల ఆర్థిక పథకాలు వుండాలి. అలా వున్నప్పుడే విజయ వంటలాగా ఆర్థిక ప్రగతి కూడా సుస్థిరంగా వుంటుంది.
గతంలో మనం చర్చించుకున్న విషయాలలో రిస్క్ ఎపిటైట్ గురించి మాట్లాడుకున్నాము. వయసుని బట్టి, ఆర్థిక స్థితిగతులను బట్టీ రిస్క్ ఎక్కువగా వున్న పథకాలలో కొంత, రిస్క్ తక్కువగా వున్న పథకాలలో కొంత పొదుపు చెయ్యాలని కూడా అనుకున్నాము. అలాంటి ప్రణాలికతో ఆర్థిక పథకాలలో డబ్బులు పెట్టినప్పుడు కనీసం ఆరేడు రకాల పథకాలు మన ఆర్థిక ప్రణాలికలో భాగం అవుతాయి. సరిగ్గా పోపులపెట్టెలో చేదుగా వుండే మెంతులు, ఘాటుగా వుంటే ఆవాలు, కారంగా వుండే ఎండుమిరపకాయలు లాగే, ఆర్థిక ప్రణాలికలో వుండే రకరకాల పథకాలు కూడా తమ తమ లక్షణాలను బట్టి పని చేసుకుపోతాయి. ఎక్కువ రిస్క్ వున్న స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ వంటివి దీర్ఘకాలానికి అధికమొత్తంలో లాభాలను అందిస్తే, పోస్టాఫీస్ పథకాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు వంటివి తక్కువ వడ్డీ ఇస్తూ స్థిరమైన ఆదాయాన్ని స్వల్పకాలంలో ఇస్తాయి.
ఇలా రకరకాల పథకాలను తీసుకునేటప్పుడు రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని, వయసుని పరిగణలోకి తీసుకున్నట్లే ఆ డబ్బుతో ఎప్పుడు అవసరం పడుతుందో కూడా అంచనా వేసుకోని ఆ ప్రకారం ముదుపు చెయ్యాలి. రాబోయే కాలంలో రాబోయే ఖర్చులను ముందే అంచనా వేసుకోని దీర్ఘకాలిక అవసరాలకు దీర్ఘకాలిక పెట్టుబడులను, అలగే స్వల్పకాలిక అవసరాలకు స్వల్పకాలికమైన పథకాలను ఎంచుకోవాలి. వయసుతోపాటే ఈ పథకాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ అవసరమైన మార్పులు చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చెయ్యకపోతే మజ్జిగచారులో పంటి కింద మిరియాలు పడ్డట్లు అవసరమైనప్పుడు డబ్బులు చేతికి అందక ఇబ్బందులు ఎదురౌతాయి.
ఈ విషయాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకునేందుకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి తన కొడుకు పైచదువులకోసం, పిల్లాడు పుట్టినప్పటి నుంచి డబ్బులు ఆదా చెయ్యడం మొదలుపెట్టాడనుకుందాం. ఇది దీర్ఘకాలికమైన అవసరం. ఓ ఇరవై ఏళ్ళ తరువాత పీజీ లాంటి కోర్సులు చెయ్యడానికి అధికమొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. అందుకోసం అతను ఇరవై ఏళ్ళపాటు నెలనెల బ్యాంకులో ఆర్.డీ. కట్టాడానుకుందాం. అలా కట్టిన ఆర్.డీ. చాలా తక్కువ వడ్డీ ఇస్తుంది. అంత తక్కువ వడ్డీ వల్ల డబ్బు ఎంత పెరిగినా ఇరవై ఏళ్ళ తరువాత అప్పటి ఫీజులకి సరిపోకపోవచ్చు. అలా కాకుండా రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెడితే అప్పటికి బాగా పెరిగే అవకాశం వుంది. కానీ రియల్ ఎస్టేట్ తో వున్న సమస్య ఏమిటంటే, మనకి అవసరం అనుకున్న సమయంలో మనకి మంచి రేటు రావచ్చు రాకపోవచ్చు. పిల్లాడి డిగ్రీ పూర్తైన మరుక్షణం దురదృష్టం వల్ల రేట్లు పడిపోతే అప్పటిదాకా పడిన శ్రమ వృధా అయిపోతుంది. ఒక వేళ రేట్లు వున్నా అప్పటికప్పుడు అమ్మాలని ప్రయత్నిస్తే కొనడానికి సరైన వ్యక్తి దొరకపోవచ్చు. ప్రయత్నించి ఓ సంవత్సరం తరువాత మంచి రేటుకి అమ్మినా అప్పటికి పిల్లాడి చదువు ఓ సంవత్సరం వెనకపడుతుంది!
అన్నిరకాలుగా సమస్యగా కనపడుతున్నా, దీనికి పరిష్కారం వుంది. కొంత డబ్బుని ఆర్.డి., ఫిక్స్డ్ డిపాజిట్ లాంటి చోట వుంచి ఎక్కువ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ లాంటి పథకాలలో పెట్టవచ్చు. కాలం గడుస్తున్నకొద్దీ మ్యూచువల్ ఫండ్స్ లోకి పంపే సొమ్ముని తగ్గిస్తూ, ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి పెంచుకుంటూ వెళ్ళచ్చు. కొడుకు డిగ్రీకి వచ్చినప్పటి నుంచీ స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల్ని పరిశీలిస్తూ మంచి రేటు వచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్ డబ్బుని బయటకు తీసి మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ లాంటి తక్కువ రిస్క్ వున్న చోటకు బదలాయించవచ్చు. ఇలా చేస్తే సరిగ్గా పిల్లాడు పీ.జీ. చేయడానికి సిద్ధంగా వుండే సమయానికి అవసరమైనంత సొమ్ము, సులభంగా విత్ డ్రా చేసుకునేలా అందుబాటులోకి వస్తుంది. పిల్లల పెళ్ళిళ్లు, రిటైర్మెంట్, ఇల్లు కొనుక్కోవడం లాంటి దీర్ఘకాలిక అవసరాలకు ఇలాగే ప్రణాలికలు వేసుకోవాలి. కారు కొనుక్కోవడం, విదేశీ విహారయాత్రలు వంటి మధ్యకాలికమైన ఆర్థిక అవసరాలకు అందుకు అనుగుణంగా, ఇంట్లో హోమ్ థియేటర్ కొనుక్కోవటం, నగలు కొనుక్కోవటం లాంటి స్వల్పకాలికమైన ఆర్థిక అవసరాలకు రిస్క్ తక్కువగా వుండే పథకాలలో డబ్బు ముదుపు చేసుకునేలా ప్రణాలిక వేసుకోవాలి. వీటన్నింటినీ కలిపి “ఫైనాన్షియల్ పోర్ట్ ఫోలియో” (Financial Portfolio) అంటారు. మన కథలో పోపులపెట్టె అలాంటి పోర్ట్ ఫోలియోకి ఒక ప్రతీక.
ఇలా చెయ్యాలనుకున్నప్పుడు ముందుగా ప్రస్తుతం వున్న పోర్ట్ ఫోలియోని సమీక్షించుకోవాలి. పోర్ట్ ఫోలియో గురించి అవగాహన లేనివారు ఇలాంటి సమీక్ష చేసుకుంటే ప్రముఖంగా మూడు విషయాలు బయటపడతాయి. అందులో మొదటిది ఎక్కువ రిస్క్ తో పాటు ఎక్కువ లాభాలను కూడా ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్, షేర్స్ చాలా తక్కువగా వుంటాయి. దీని వల్ల ఆదాయం కోల్పోవటమే కాకుండా, దీర్ఘకాలికమైన అవసరాలకు సరిపోయే డబ్బు సమకూరదు. రెండో సమస్య అన్ని పథకాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఏ మార్పులు లేకుండా వుండటం. అంటే గతంలో మనం చెప్పుకున్నట్లు వయసుతోపాటు మారుతున్న రిస్క్ ఎపిటైట్ తో సంబంధం లేకుండా ఆర్థిక పథకాలు వుంటాయి. తాము కొన్న షేర్లు ఎంత పెరిగినా, తగ్గినా వాటిని పట్టించుకోకపోవడం, ఫిక్స్డ్ డిపాజిట్ కాలపరిమితి అయిపోయినా అలాగే వుంచేయడం ఇలాంటివి తరచుగా కనిపిస్తాయి. ఇందాక మనం చెప్పుకున్నట్లు పోర్ట్ ఫోలియో వున్నా దానిని తరచుగా సమీక్షించుకోకపోవటం వల్ల వచ్చే నష్టం ఇది.
ఇక మూడొవది, పోర్ట్ ఫోలియోలో అత్యధికంగా ఇన్సూరెన్స్ పథకాలు కలిగి వుండటం. దీనికి అనేక కారణాలు వున్నాయి. మనలో చాలామంది ఆదాయపు పన్ను రాయితీ అనగానే ఇన్సూరెన్స్ పథకాలు తీసుకుంటుంటాము. ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసం (జనవరి, ఫిబ్రవరి, మార్చి)లో ఇన్సూరెన్స్ పథకాలు అత్యధికంగా అమ్ముడవడానికి ఇదే కారణం. అదీకాక, మన చుట్టపక్కాలలో చుట్టుపక్కల మిత్రులలో చాలామంది ఇన్సూరెన్స్ ఏజంట్లు వుండటం మరో కారణం. మ్యూచువల్ ఫండ్స్ వంటి పథకాలకు ఏజెంట్ కావాలంటే కొంచెం ఎక్కువ పరిజ్ఞానం అవసరమౌతుంది. పోస్టాఫీస్ పథకాలకు ఏంజెంట్ అయితే ఆదాయం తక్కువగా వస్తుంది. అదే ఇన్సూరెన్స్ ఏజెంట్ అవటం సులభమే కాక, ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది. అందువల్ల మనకి చాలామంది ఇన్సూరెన్స్ ఏజెంట్లు తారసపడతారు. కారణాలు ఏమైనా మనలో చాలామంది అవసరానికి మించి ఇన్సూరెన్స్ పథకాలు కలిగి వుంటాము. ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ కలిగి వుండటం తప్పనిసరి అయినా అవసరానికి మించి బీమా పథకాలు కొనడం ఆర్థిక ప్రగతికి ఏమంత సహాయపడదని గుర్తించాలి.
ఇవన్నీ తెలుసుకోని ఆర్థిక అవసరాలను అంచనా వేసుకోని సరైన ప్రణాలికలు వేసుకోని అందుకు తగ్గట్టుగా పోర్ట్ ఫోలియో రూపొందించుకుంటే పోపులపెట్టె వున్న విజయ ఇంటి వంటలా మన ఆర్థిక ప్రగతి కూడా సమర్థవంతంగా వుంటుంది.
డబ్బుని పొదుపు/ముదుపు చేసేటప్పుడు అన్ని రకాల ఆర్థిక పథకాలు అవసరమైనంత మేరకు వుండేలా చూసుకోవాలి. రాబోయే అర్థిక అవసరాలకు కాల వ్యవధి, రిస్కు తీసుకునే సామర్థ్యం, వయస్సు, ఆయా పథకాల లిక్విడిటీ వంటివి పరిగణన చేసుకుంటూ ఒక పోర్ట్ ఫోలియో నిర్మించుకోవాలి. ఎప్పటికప్పుడు ఈ పోర్ట్ ఫోలియోని సమీక్షించుకుంటే అవసరమైన మార్పులు చేసుకోవాలి.
రిస్క్-రివార్డ్ ఆధారంగా నాలుగు రకాలుగా పథకాలను విభజించాము. ఇప్పుడు అదే పట్టికకు లిక్విడిటీని కూడా జత చేసి ఏ పథకం ఏ విభాగం కిందకు వస్తుందో గమనించండి. ఇప్పుడు మీకు ముందు ముందు కలగబోయే ఆర్థిక అవసరాలను ఒక పట్టిక వేసుకోని వాటిని దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక అవసరాలుగా విభజించి వాటికి ఈ పథకాలను జతపరచండి. మీ ఆర్థిక ప్రణాలిక ఇప్పుడు సిద్ధంగా వుంది. దీనిని మీకు తరచూ కనిపించేలా పెట్టుకోని, దానినే అనుసరిస్తూ పొదుపు/ముదుపు చెయ్యండి. [:]

Comments
Post a Comment