(Telugu) రిస్క్ రివార్డ్ ఎక్కువగా వున్న పథకంలో దీర్ఘకాలిక పెట్టుబడి
[:te]ధనవంతుడివి కావాలన్న కోరికతో నీవు పడుతున్న శ్రమ అభినందించదగినది. డబ్బులు ఆదా చేసే వాళ్ళు తమంతట తామే నిర్ణయించుకోవాల్సినవి, అమలు పరచాల్సినవి కొన్ని వుంటాయి. అవి తెలుసుకోకుండా వుంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం వుంది.
రాజగోపాలం ఇరవై ఏళ్ళుగా అమెరికాలో వుండి ఇక చాలనుకోని సొంత ఊరు కరువదికి తిరిగి వచ్చాడు. విదేశంలో అవకాశం ఉన్నంతవరకు మన సాంప్రదాయాల్ని పాటించేందుకు ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ అనీ కుదరక కొన్ని కొన్ని విషయాలలో సర్దుకుపోతుండేవాడు. ముఖ్యంగా తన తండ్రి ఆబ్దికం పెట్టాలంటే అక్కడ కుదిరేది కాదు. తిరిగి వచ్చిన రెండు నెలల తరువాత, మరో రెండు రోజుల్లో అతని తండ్రి చనిపోయిన రోజు వస్తుందనగా అతనికి తండ్రి కల్లో కనిపించాడు.
“ఒరే రాజగోపాలం, ఇన్నేళ్ళుగా అమెరికాలో నీకు చేతకాకో, వీలుపడకో నాకు తద్దినం తూతూ మంత్రంగా జరిపించావు. ఇన్నాళ్ళకు మన ఊరికి తిరిగి వచ్చేశావు కాబట్టి ఈసారైనా ఆ కార్యక్రమం బాగా జరిపించు. ముఖ్యంగా నాకు ఎంతో ఇష్టమైన గారెలు చేయించి, బాగా తినగలిగిన బ్రాహ్మణ్ణి పిలిచి ఆయనకు పెట్టు” అని కోరాడు.
తెల్లవారాక రాజగోపాలం కల గురించి చాలాసేపు ఆలోచించాడు. నిజంగా తండ్రి కనపడ్డాడా లేక అదంతా తన భ్రమా అని అనుమానపడ్డాడు. అతని తండ్రికి నిజంగానే గారెలు అంటే ఇష్టం కాబట్టి కల నిజమైనా కాకపోయినా పద్ధతిగా తద్దినం పెట్టి, బ్రాహ్మడికి గారెలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అలా అనుకోగానే అతనికి వీరభద్రయ్య గుర్తుకొచ్చాడు.
రాజగోపాలం చిన్న వయసులో ఉన్నప్పుడు అతని తండ్రి క్రమం తప్పకుండా పూర్వీకులకు తద్దినాలు పెట్టేవాడు. అప్పుడు భోజనం చేసేందుకు భోక్తగా వీరభద్రయ్యనే పిలుచుకొచ్చేవాడు. ఆయన కనీసం ఇరవై గారెలు అవలీలగా తినేసేవాడు. నలుగురైదుగ్గురు తినే భోజనాన్ని సునాయాసంగా ఖాళీచేసేవాడు. అలా ఆయన తృప్తిగా తిని త్రేంచితే భోజనం పెట్టిన వ్యక్తి కూడా తృప్తిగా వుండేది. అందువల్ల వీరభద్రయ్యగారే కావాలని అందరూ కోరుకునేవాళ్ళు. ఒకోసారి ఆయన దొరకటమే కష్టమయ్యేది.
ఇదంతా గుర్తు చేసుకున్న రాజగోపాలం తన తండ్రి తద్దినానికి వీరభద్రయ్యగారినే భోజనానికి పిలిపించాడు. అదృష్టం కొద్దీ ఆయన ఆ రోజు వేరే ఏ కార్యక్రమం లేకుండా ఖాళీగానే వున్నాడు. అనుకున్నట్టుగానే ఆయన వచ్చి భోజనం చేసి ఆశీర్వదించి వెళ్ళాడు. చాలా కాలం తరువాత సాంప్రదాయం ప్రకారం అన్నీ నడిచాయని రాజగోపాలం ఎంతో సంతోషించాడు. ఆ రోజు రాత్రికి ఆనందంగా పడుకొని నిద్రపోయాడు. నిద్రలో అతనికి మళ్ళీ తండ్రి కనిపించాడు.
“ఒరే, గోపాలం నేను చెప్పిందేంటి?నువ్వు చేసిందేంటి? నాకు ఏ మాత్రం తృప్తిగా అనిపించలేదు” అన్నాడు. రాజగోపాలం ఆశ్చర్యపోయాడు.
“అదేమిటి నాన్నా? నువ్వు చెప్పినట్లే మంచి బ్రాహ్మణుణ్ణి పిలుచుకొచ్చి భోజనం, గారెలు పెట్టాను కదా? ఇంకా మీకు తృప్తి కలగపోవడం ఏమిటి?” అని అడిగాడు.
“అయితే నువ్వు సరిగ్గా గమనించలేదనుకుంటాను. నువ్వు తీసుకొచ్చిన వీరభద్రయ్య రెండంటే రెండే గారెలు తిన్నాడు తెలుసా?” అన్నాడు కోపంగా.
వీరభద్రయ్యగారు ఇరవైకి తక్కువ కాకుండా గారెలు తింటారని కదా రాజగోపాలం అతన్ని తీసుకొచ్చాడు? మరి అలాంటప్పుడు అతను ఎందుకు రెండే గారెలు తిని సరిపెట్టుకున్నాడు? ఇందులో ఏదైనా మతలబు వుందా? దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆర్థికపాఠం ఏమిటి?.
ఇందులో ఆ బ్రాహ్మణుడి పొరపాటు ఏమీ లేదు. పొరపాటు చేసింది రాజగోపాలమే. కథ ప్రకారం రాజగోపాలం చిన్న వయసులో వున్నప్పుడు వీరభద్రయ్య ఇరవై గారెలు తినేవాడు. ఆ తరువాత రాజగోపాలం ఇరవై ఏళ్ళు వేరే దేశంలో వున్నాడు. అంటే దాదాపు ముఫై నలభై ఏళ్ళ తరువాత వీరభద్రయ్యని మళ్ళీ కలిశాడు. ఎంత లేదనుకున్నా ఆయనకి అరవై డెబ్భై ఏళ్ళు వుంటాయి. అరవై డెబ్భై ఏళ్ళ వయసులో కూడా వయసుకీ వున్నప్పుడు తిన్నట్లు తినడం సాధ్యమయ్యే పని కాదు. వయసుతోపాటు ఆహారాన్ని అరాయించుకునే శక్తి సన్నగిల్లుతుంది. ఆకలి మందగిస్తుంది. అదనంగా అనారోగ్యాలు వెంటపడుతుంటాయి. ఇవన్నీ గుర్తిస్తే రాజగోపాలం వేరే మనిషిని చూసుకునేవాడు. గుడ్డిగా అంతకు ముందు తిన్నట్లే ఇప్పుడు కూడా తింటాడని నమ్మి వీరభద్రయ్యను తీసుకురావడమే అతను చేసిన తప్పు. అందుకు ఫలితంగా తండ్రి అసంతృప్తికి లోనయ్యాడు. ఇదీ కథలో వున్న ప్రశ్నకు జవాబు. ఇక ఆర్థిక పాఠం సంగతి చెప్తాను విను -
ఇంతకు ముందు మనం రిస్క్ ఎపిటైట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆర్థిక ఒడిదుడుకుల్ని తట్టుకునే సామర్థ్యాన్ని రిస్క్ ఎపిటైట్ అంటామని చెప్పుకున్నాము.ఆలాంటి ఒడిదుడుకులు తట్టుకునే సామర్థ్యం వున్నవాళ్ళు డబ్బుల్ని కొంత రిస్క్ వున్న పథకాలలో ముదుపు చేయగలరు. ఆర్థికంగా నష్టపోతే తట్టుకోలేనివారు తమ డబ్బుని రిస్క్ తక్కువగా వున్న పథకాలలో పెట్టుకుంటారు. ఇదంతా ఎందుకు? అసలు రిస్క్ వున్న చోట డబ్బులు పెట్టాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్న కూడా రావచ్చు. ముందు దాని సంగతి చూద్దాం.
పాత జానపద సినిమాలలో సాహసం చేసిన ఢింబకుడికే రాజకుమారి లభించినట్లు ఆర్థిక ప్రపంచంలో కూడా రిస్క్ తీసుకున్నవారికే అనుకూలమైన ఆర్థిక ఫలితాలు (రివార్డ్స్) వస్తాయని ఆర్థిక నిపుణులు చెప్తారు. అంటే రిస్క్ కు రివార్డ్ కు దగ్గర సంబంధం వుందని వీరి వాదన. అయితే ఇక్కడ రివార్డ్ అంటే ఏమిటి? మనం ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుతున్నప్పుడు, ద్రవ్యోల్బణం కన్నా అధికంగా లాభాలు వచ్చే పథకాలలో డబ్బులు పెట్టడం ద్వారా సంపద సృష్టి త్వరగా జరుగుతుందని చెప్పుకున్నాం. ద్రవ్యోల్బణం కన్నా ఎక్కువగా లాభాలు ఇచ్చినప్పుడు వాటిని మంచి రిటర్న్ గా భావించవచ్చు. అంతకన్నా తక్కువ లాభాలు వస్తే అవి తక్కువ రివార్డ్ ఇచ్చినట్లు భావించవచ్చు. అలాగే రిస్క్ అంటే – లాభాల మాట అటుంచి, మనం పెట్టిన మూలధనంకూడా తిరిగి రాకుండా పోయే అవకాశం వున్నవి రిస్క్ పథకాలనీ, మూలధనం సురక్షితంగా వుంచుతూ స్వల్ప వృద్ధిని ఇచ్చే పథకాలు తక్కువ రిస్క్ వున్నవిగా అనుకోవచ్చు.
వీటిని మరింత స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మాటవరుసకి రిస్క్ ఎక్కువ వున్న పథకాలు, రిస్క్ తక్కువ వున్న పథకాలు వున్నాయనుకుందాం. అలాగే రివార్డ్ ఎక్కువ వచ్చే పథకాలు, తక్కువ వచ్చే పథకాలు వున్నాయనుకుందాం. అప్పుడు నాలుగు రకాల పథకాలు తయారౌతాయి.
రిస్క్ తక్కువ, రివార్డ్ తక్కువ వున్న పథకాలు: వీటిలో ధైర్యంగా డబ్బులు పెట్టవచ్చు. మూల ధనం సురక్షితంగా వుంటుంది. స్వల్పలాభాలను ఇస్తాయి. నష్టం వచ్చినా భారీ మొత్తంలో రాదు కాబట్టి తట్టుకోవచ్చు. పోస్టాఫీస్ పథకాలు, ఫిక్స్ డ్ డిపాజిట్స్ మొదలుకొని డెట్ ఫండ్స్, సంప్రదాయక ఇన్సూరెన్స్ దాకా చాలా పథకాలు ఇందులో వుంటాయి
రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ వున్న పథకాలు: ఏ మాత్రం ఒడిదుడుకులు లేకుండా అత్యధిక లాభాలు ఇచ్చేవి. ఇలాంటి పథకాలు వుండవు. ఒక వేళ వుంటే ప్రపంచం మొత్తం అందులోనే డబ్బులు పెడుతుంది. ఎవరైనా ఇలాంటి పథకం వుందని చెప్తే వాళ్ళు మోసం చేసే అవకాశం వుందని గుర్తించండి.
రిస్క్ ఎక్కువ, రివార్డ్ తక్కువ వున్న పథకాలు: లాభాలు రాకపోగా నష్టం వచ్చే అవకాశం ఎక్కువ. ఇలాంటి పథకాలు వున్నా అందులో డబ్బులు పెట్టడం అనవసరం.
రిస్క్ ఎక్కువ, రివార్డ్ ఎక్కువ వున్న పథకాలు: ఒడిదుడుకులు ఉంటాయి కానీ అత్యధిక లాభాలు ఇచ్చే పథకాలు ఇక్కడ వుంటాయి. బంగారం మొదలుకొని మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ వంటివి ఈ కోవ కిందకు వస్తాయి. సంపద రహస్యం అంతా ఇక్కడే వుంది. జాగ్రత్తగా ఈ పథకాలను వాడుకోవడం ద్వారా త్వరగా సంపన్నులు అయ్యే అవకాశం వుంది.
గతంలో మనం చెప్పుకునట్లు ప్రతి మనిషికీ రిస్క్ ఎపిటైట్ ఒకో రకంగా ఉంటుంది. వాటి ఆధారంగా ఎవరికి వారు ఈ విభాగాలలో సరిపోయే పథకాలను గుర్తించుకోవాలి. ఉదాహరణకు బంగారాన్ని నేను రిస్క్ ఎక్కువ, రివార్డ్ ఎక్కువ విభాగంలో పెట్టుకుంటే, ఇంకొకరు దానిని రిస్క్ తక్కువ, రివార్డ్ తక్కువ విభాగంలో పెట్టుకోవచ్చు. ఇదంత సులభమైన పని కాదు. ప్రతి పథకానికీ దానికి సంబంధించిన కాల వ్యవధి కూడా ఫలితాలను ప్రభావితం చేస్తుంది. ఇరవై సంవత్సరాల కాలపరిమితి తీసుకుంటే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటివి రిస్క్ తగ్గే అవకాశం వుంటుంది. అదే మ్యూచువల్ ఫండ్ లో డబ్బు ఆరు నెలలే ఉంచితే అది అత్యధిక రిస్క్ విభాగంలోకి వస్తుంది.
ఇప్పుడు మళ్ళీ కథలోకి వద్దాం. రిస్క్ ఎపిటైట్ కూడా మన వీరభధ్రయ్యగారి ఎపిటైట్ లాంటిదే. వయసు పెరిగే కొద్ది వీరభధ్రయ్యగారి ఆకలి తగ్గిపోయినట్లు ఇది కూడా తగ్గిపోతుంది. యుక్త వయసులో వున్నప్పుడు చేసిన పెట్టుబడులు ఏ కారణం వల్లైనా మునిగిపోయినా కోలుకోడానికి అవకాశం వుంటుంది. ముఖ్యంగా అలాంటి వ్యక్తికి ముందు ముందు కొన్ని సంవత్సరాల సమయం వుంటుంది. ఇందాక చెప్పినట్లు ఆ కాలాన్ని వాడుకోవడం ద్వారా మళ్ళీ పుంజుకోవచ్చు. కనీసం మళ్ళీ సంపాదించుకోగల శక్తి సామర్ధ్యాలు వుంటాయి. వయసు మీద పడ్డాక ఇలాంటివి జరిగితే కోలుకోవడం కష్టం. అందుకే వయసు పెరిగాక రిస్క్ ఎపిటైట్ తగ్గిపోతుంది.
ఇది తెలియక రిటైరైన తరువాత వచ్చిన డబ్బుని స్టాక్ మార్కెట్ లోనో, రియల్ ఎస్టేట్ లోనో పెట్టి అవి మునిగిపోయాక వీధినపడ్డ వాళ్ళు చాలామంది వున్నారు. అలాగే వయసులో వుండి కూడా డబ్బుని రిస్క్ ఎక్కువగా వున్న పథకాలలో పెట్టకుండా సంపద సాధించడంలో వెనుకపడినవాళ్ళు వున్నారు. ఈ రెండూ తప్పే.
యుక్తవయసులో వున్నప్పుడు ఎక్కువ డబ్బుని రిస్క్ ఎక్కువ వున్న పథకాలలో పెట్టి, తక్కువ డబ్బును రిస్క్ తక్కువ వున్న పథకాలలో పెట్టాలి. అలా పెట్టిన డబ్బుకు సరిపోయే సమయం (దీర్ఘకాలం అయ్యుండాలి) ఇచ్చి ఎదగనివ్వాలి. నష్టం వస్తే దానిని వెనక్కి తీసుకోవడం చెయ్యకుండా, అనుకున్న సమయం పూర్తయ్యేదాక ఎదురుచూడాలి. వయసు పెరిగుతున్న కొద్దీ క్రమంగా రిస్క్ ఎక్కువగా వున్న పథకాలలో డబ్బుని తక్కువ రిస్క్ వున్న పథకాలలోకి మారుస్తూ, రిటైర్మెంట్ నాటికి చాలా తక్కువ మొత్తం రిస్క్ పథకాలలో వుండేలా ఏర్పాటు చేసుకోవాలి. ఆ సమయంలో వచ్చే ఆకస్మిక ఖర్చులకి అందుబాటులో వుండే విధంగా (లిక్విడ్) ఉంచుకోవాలి. ఇదీ మనకి ఈ కథలో అర్థం అయ్యే ఆర్థికపాఠం.
రిస్క్, రివార్డ్ రెండూ ఒకదానికొకటి అనుబంధంగా నడుస్తాయి. రిస్క్ ఎక్కువైతే రివార్డ్ ఎక్కువగా వుంటుంది. రిస్క్ తక్కువ వుంటే రివార్డ్ కూడా తక్కువగానే వుంటుంది. ఆర్థిక ఒడిదొడుకులు తట్టుకునే సామర్థ్యం రిస్క్ ఎపిటైట్ అయితే, ఆఎపిటైట్ వయసుతో పాటు తగ్గుతూ వెళ్తుంది. అందువల్ల వయసులో వున్నప్పుడు ఎక్కువ రిస్క్ ఎక్కువ వున్న పథకాలలో, వయసు మీదపడ్డ తరువాత తక్కువ రిస్క్ వుండే పథకాలలో ముదుపు చెయ్యాలి
చిల్లర చిట్కాలు
మీ దగ్గర వంద రుపాయలు పెట్టుబడికి సిద్ధంగా వుంటే అందులో ఎంత డబ్బుని ఈక్విటీ వంటి రిస్కీ పథకాలలో పెట్టాలో తెలుసుకునేందుకు ఈ చిట్కా పని చేస్తుంది. వందలో నుంచి మీ వయసు తిసేసిస్తే వచ్చే సంఖ్య ఎంతో అంత శాతం ఈక్విటీ మార్కెట్‌లో పెట్టాలి. ఉదాహరణకు మీ వయసు 36 సంవత్సరాలు అయితే 100 – 36=64 అంటే అరవై నాలుగు రూపాయలు ఈక్విటీ వంటి రిస్కీ మార్కెట్ లో, ముఫై ఆరు రూపాయలు ఇతర పథకాలలో పెట్టాలి. [:]

Comments
Post a Comment