ఇంటి నుంచే 9జాబ్స్
[:en]ఆఫీసుకు వెళ్ళి పని చేసేందుకు అవకాశం లేదు. ఇంట్లోనే ఉండాల్సిన పరిస్ధితి. ఏదైనా చేయాలన్న ఉత్సాహం మాత్రం ఉంది. అప్పుడు ఏం చేయాలి అనుకుంటే, ఇదిగో మీకూ ఈ అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు సంబంధిత నిపుణులు. అవేంటో చూద్దాం. తగు నైపుణ్యం ఉంటే చాలు, అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే ఇక తరువాయి..........
ఇంటి నుంచే 9జాబ్స్
1.వర్చ్యువల్ అసిస్టెంట్ షిప్:-అంత్రప్రెన్యూర్లు, వృత్తి నిపుణులు, చిన్నపాటి బృందాలకు అడ్మినిస్ట్రిటివ్ కార్యకలాపాల కోసం సిబ్బంది అవసరమవుతారు. సమావేశాల షెడ్యూలింగ్, క్లయింట్లు- ఇన్వెస్టర్లతో టచ్ లో ఉండటం, వివిధ ఆర్డర్ల ఫాలోఅప్, బిజినెస్ డాక్యుమెంట్లు సృష్టి అంటే పవర్ పాయింట్ ప్రజంటేషన్లు, ఎక్సెల్ సీట్లు, బ్లాగులు - వెబ్ సైట్స్ నిర్వహణ వంటివి ఈ పరిధిలోకి వస్తాయి. వర్చువల్ అసిస్టెంట్ల పని ఇక్కడ ముఖ్యంగా వివిధ వ్యవహారాలను సమన్వయపర్చుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. చాలా బిజీలో ఉండే వ్యక్తులకు సంబంధించిన ఆయా పనుల్లో సహకరించాలి. ఇందుకోసం కొద్దిపాటి శిక్షణ చాలా అవసరం. అలాగే మంచి కమ్యూనికేషన్ నైపుణ్యం ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ వంటి అప్లీకేషన్స్ తెలియాలి.Elance and Zirtual వంటి సైట్ల ద్వారా వర్చువల్ అసిస్టెంట్ పనులు పొందవచ్చు.
2. అనువాదం:-రెండు మూడు భాషాలపై పట్టు ఉన్న వ్యక్తులకు ఉపకరించే వృత్తి ఇది ఇంగ్లిష్ కు తోడు మరో ఒకటి రెండు జాతీయ భాషలపై ఒక స్తాయిలో అవగాహన, అనువదించే నైపుణ్యం ఉండాలి. ఆయా లాంగ్వేజ్ కోర్సులను చేసి కూడా నైపుణ్యం పొందవచ్చు. పెద్ద సంఖ్యలో స్కాలర్లు, అంతర్జాతీయ బిజినెస్ సంస్థలు ఇలాంటి వ్యక్తుల సేవలను పొందుతున్నాయి. అనువాద సామర్థ్యాలను నిరూపించుకోగలిగితేచాలు, చేసుకోగలిగిన వారి చేసుకున్నంత అన్న రీతిలో అవకాశాలు పొంచి ఉన్నాయి. Fiverr.com or Upwork.com వంటి సైట్లు ఈ విషయంలో సహకరిస్తాయి.
3.బ్లాగింగ్:-బ్లాగుల ఏర్పాటుకు దశాబ్దకాలంగా మంచి ఊపు లభిస్తోంది. గూగుల్ అడసీన్ లో సంతకంతో ఫేస్ పొంది సొంతంగా బ్లాగును సృష్టించుకోవచ్చు. ప్యూస్, క్లిక్స్ ఆధారంగా అదాయం పొందవచ్చు. బ్లాగ్ తో అనుబంధ మార్కెటింగ్ లేదంటే ఏవైనా ఉత్పత్తుల అమ్మకాల చేపట్టవచ్చు. మీ బ్లాగ్ ఎక్కువ మందిని ఆకట్టుకున్న పక్షంలో ప్రకటనలకు అవకాశం కలుగుతుంది. తద్వారా కూడా ఆదాయం పొందవచ్చు.
4.ఆన్ లైన్ లో ఉత్పత్తుల అమ్మకం:- కొవ్వొత్తుల నుంచి వివిధ చేతిపనుల ఉత్పత్తుల అమ్మకాలను ఆన్ లైన్ లో సాగించే సదుపాయం ఈ రోజుల్లో ఉంది. అందుబాటులో ఉన్న సరుకు తదితరాలతో ఇన్వెంటరీని రూపొందించి ఆయా ఉత్పత్తులకు గిరకీ కల్పించవచ్చు. అమెజాన్, ఇబే వంటి పోర్టల్స్ ఈ విషయంలో సహకరిస్తాయి. అమ్మకాలకు సహకరిచినందుకు కొద్దిపాటి మొత్తాన్ని మీ నుంచి ఈ పోర్టల్స్ వసూలు చేస్తాయి. అమ్మకాలు ఒక్కసారి మొదలైతే చాలు, రవాణా భాగస్వాములు వస్తువులను తీసుకెళ్ళడం మొదలుపెడతారు. వీక్లీ పేమెంట్స్ పొందవచ్చు.
5.యూట్యూబ్ విడియోస్:-వీడియో కెమెరాను ఉపయోగించడంలో ప్రావీణ్యం ఉంటే యూట్యూబ్ కు మించిన వేదిక మరొకటి లేదు. ప్రత్యేకించి మీరూ ఏ కేటగిరి కిందకు వస్తారో చూసుకుని అందులో నుంచి రాబడి పొందవచ్చు. మీరు ఎంచుకున్న టాపిక్ మాత్రం ఎక్కువ మందిని ఆకట్టుకునేలా చూసుకోవాలి. సరైన ఎక్విప్ మెంట్ ఉన్నా లేకున్నా పని నడుస్తుంది. అచ్చంగా బ్లాగ్ నిర్వహణ మాదిరిగానే ఇందులోనూ సముచిత అదాయం పొందవచ్చు.
6.వెబ్ డెవెలప్ మెట్:-వెబ్ డిజైన్ పై అవగహన చాలా ముఖ్యం. ఆ నైపుణ్యం ఉంటే, ఇంటి నుంచి వెబ్ డెవలపర్ గా పని చేయవచ్చు. వివిధ కంపెనీలు ఔట్ స్పోర్సింగ్ కింద ఈ పని ఇస్తుంటాయి. అయితే ఈ రంగంలో విపరీతమైన పోటీ ఉందన్న విషయాన్ని సదా గుర్తుంచుకోవాలి. వెబ్ డిజైనింగ్, ధర నిర్ణయంలో ఆచితూచి వ్యవహరించాలి. అక్కడా బెడిసికొట్టకుండా చూసుకున్నప్పుడే వచ్చిన అవకాశం నిలుస్తుంది.
7.కంటెంట్ రైటింగ్:-ఈ అంశం బాగా ఆదరణ పొందిన ఫ్రీలాన్స్ జాబ్ లోతుగా అద్యయనం చేసి, ఆకట్టుకునేలా రాసే వ్యక్తులకు ఈ రంగంలో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. వ్యాకరణం పై అవగహన ఉండి, వివిధ అంశాలపై విస్తృతంగా రాసే వ్యక్తులకు ఇంటి నుంచే అదాయం పొందవచ్చు. పేపాల్ అకౌంట్ ఏర్పాటు చేసుకుంటే తద్వారా పనులు పొందవచ్చు.
8.డేటా ఎంట్రీ:-ఆటోమేషన్ దెబ్బకొట్టినప్పటికీ, ఇప్పటికీ అవకాశం ఉన్న రంగమిది. ఈ జాబ్ తీసుకునేందుకు పెద్దగా నైపుణ్యాలు అవసరం లేదు. ఇంటర్నెట్ కనక్షన్, టైపింగ్ నైపుణ్యాలు ఉంటే చాలు. ఫాస్ట్ గా, తప్పుల్లేకుండా టైప్ చేయగలగాలి. ఫ్రీలాన్సింగ్ వెబ్ సైట్లతో అనుసంధానమైతే పని లభిస్తుంది. క్లయింట్ ఇచ్చే ప్రింటెడ్ లేదా స్కాండ్ షీట్టలను డిజిటల్ ఫార్మేట్ లోకి మారిస్తే సరిపోతుంది.
9.ఆన్ లైన్ ట్యూటరింగ్:-ఇప్పటికే ట్యూటరింగ్ లో ఉన్న లేదా ఏదైనా సబ్జెక్టులో పట్టు ఉన్న వారికి ఈ రంగం మంచి అవకాశాలను కల్పిస్తోంది. మై ప్రైవేట్ ట్యూటర్, భారత్ ట్యూటర్స్, ట్యూటర్ ఇండియా నెట్ వంటి ఆన్ లైన్ సంస్థలు ఉన్నాయి. ఇందులో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. అర్హతలు, అనుభవాన్ని బట్టి తీసుకుంటారు. ఆన్ లైన్ టెస్ట్ లేదంటే టెలిపోన్ ఇంటర్య్వుతో ఎంపిక జరుగుతుంది. అకడమిక్ ట్యూటరింగ్ మీ అంశమైతే సొంతంగా వర్చువల్ ట్యుటరింగ్ చేపట్టవచ్చు. తద్వారా మీకు ఇష్టమైన సబ్జెక్టు బొధించవచ్చు.[:]

Comments
Post a Comment