Posts

Showing posts from January, 2018

(Telugu) వచ్చే డబ్బు, పోయే డబ్బు, దాచుకునే డబ్బు

[:te]ధనవంతుడివి కావాలన్న లక్ష్యంతో ఎండనక, వాననక కష్టపడి డబ్బు సంపాదిస్తున్నావు. ఆ డబ్బు మితంగా వాడుకుంటూ మిగిలిన సొమ్ముని ఆదా చేస్తున్నావు. నీ సంపద సృష్టిలో అత్యంత కీలకమైన విషయం – డబ్బులు ఎక్కడ ఎలా ఆదా చెయ్యాలి అన్న విషయం పైన నీ పరిజ్ఞానం తెలుసుకునే ప్రయత్నం మొదలుపెడుతున్నాను. ఇది ఎందుకు కీలకమన్నానంటే, దాచుకున్న డబ్బు సకాలంలో, అత్యధిక వడ్డీ సంపాదిస్తేనే సంపద సాధించే అవకాశం వుంటుంది. డబ్బులు దాచుకోడానికి వున్న వివిధ మార్గాలలో ఏ మార్గంలో వెళ్తే ఎంత లాభం వస్తుందో తెలుసుకోలేక చాలమంది తమ డబ్బులను వృధా చేసుకుంటారు. ఈ విషయం నీకు అర్థం అయ్యేలా ఓ కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను. సింగరాయకొండ బస్టాండులో బస్సు భోజనాలకి ఆగింది. వెంకటప్పయ్య, ఆయన భార్య తిరపతమ్మ కొడుకు గోవిందు ముగ్గురూ హోటల్లోకి వెళ్ళారు. వెంకటప్పయ్య మెనూ చూశాడు. అందులో ఫుల్ మీల్స్, ప్లేట్ మీల్స్, హాఫ్ మీల్స్, ఎగస్ట్రా మీల్స్ అని రాసి ధరలు వేసి వున్నాయి. ముగ్గురూ వాళ్ళ వాళ్ళ ఆకలిని బట్టి భోజనాలు ఆర్డర్ ఇచ్చారు. ఓ ఐదు నిముషాలలో ముగ్గురికీ భోజనాలు వడ్డించాడు సర్వర్ సుందరం. ముగ్గురూ భోజనం ప్రారంభించారు. అన్ని పదార్థాలు రుచిగా వున్నాయి. ...

(Telugu) రిస్క్ రివార్డ్ ఎక్కువగా వున్న పథకంలో దీర్ఘకాలిక పెట్టుబడి

[:te]ధనవంతుడివి కావాలన్న కోరికతో నీవు పడుతున్న శ్రమ అభినందించదగినది. డబ్బులు ఆదా చేసే వాళ్ళు తమంతట తామే నిర్ణయించుకోవాల్సినవి, అమలు పరచాల్సినవి కొన్ని వుంటాయి. అవి తెలుసుకోకుండా వుంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం వుంది. రాజగోపాలం ఇరవై ఏళ్ళుగా అమెరికాలో వుండి ఇక చాలనుకోని సొంత ఊరు కరువదికి తిరిగి వచ్చాడు. విదేశంలో అవకాశం ఉన్నంతవరకు మన సాంప్రదాయాల్ని పాటించేందుకు ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ అనీ కుదరక కొన్ని కొన్ని విషయాలలో సర్దుకుపోతుండేవాడు. ముఖ్యంగా తన తండ్రి ఆబ్దికం పెట్టాలంటే అక్కడ కుదిరేది కాదు. తిరిగి వచ్చిన రెండు నెలల తరువాత, మరో రెండు రోజుల్లో అతని తండ్రి చనిపోయిన రోజు వస్తుందనగా అతనికి తండ్రి కల్లో కనిపించాడు. “ఒరే రాజగోపాలం, ఇన్నేళ్ళుగా అమెరికాలో నీకు చేతకాకో, వీలుపడకో నాకు తద్దినం తూతూ మంత్రంగా జరిపించావు. ఇన్నాళ్ళకు మన ఊరికి తిరిగి వచ్చేశావు కాబట్టి ఈసారైనా ఆ కార్యక్రమం బాగా జరిపించు. ముఖ్యంగా నాకు ఎంతో ఇష్టమైన గారెలు చేయించి, బాగా తినగలిగిన బ్రాహ్మణ్ణి పిలిచి ఆయనకు పెట్టు” అని కోరాడు. తెల్లవారాక రాజగోపాలం కల గురించి చాలాసేపు ఆలోచించాడు. నిజంగా తండ్రి కనపడ్డాడా లేక అదంతా తన భ్ర...

(Telugu) ఫైనాన్షియల్ పోర్ట్ ఫోలియో

[:te]అనేక ఆర్థిక విషయాలు తెలిసినవారు కూడా తప్పులు చేసి తమ ఆర్థిక ప్రణాలికలను తారుమారు చేసుకోని, ఎదగలేకపోతుంటారు. వినయ్, విజయల వివాహం దిగ్విజయంగా జరిగింది. సాంప్రదాయం ప్రకారం ముచ్చట్లు అన్నీ కానిచ్చుకోని బెంగుళూరు చేరి కొత్త కాపురం పెట్టారు. అప్పటిదాకా వినయ్ ఒక్కడే ఉండేవాడు కాబట్టి ఇల్లంతా బ్రహ్మచారుల ఇల్లులాగే వుంది. ముఖ్యంగా వంటింట్లో సామాన్లు సగం వుంటే సగం లేవు. ఏవో నాలుగు గిన్నెలు, రెండు కంచాలు అన్నట్లు వుంది. ఇదంతా చూసిన విజయ వంట ఎలా చెయ్యాలా అని దిగులుపడిపోయింది. కొత్త సామాన్లు కొనుక్కుందాంలే అని ఇద్దరూ అనుకున్నారు. ఇంతలోనే వినయ్ తల్లిదండ్రులు, విజయ తల్లిదండ్రులు బెంగుళూరు వచ్చారు. “కొత్త సంసారం కదా... అన్ని వసతులు ఉన్నాయో లేదో అని మీ అమ్మ ఒకటే పోరుపెడితే ఇలా వచ్చేసాం” అన్నాడు వినయ్ తండ్రి. “వాళ్ళు వస్తారని మాకేం తెలుసు. మీ నాన్న కూడా ఇలాగే ఖంగారు పడుతుంటే బయల్దేరాము” అంది విజయ తల్లి. “ఇప్పుడేమైంది? ఎలాగూ వచ్చాం కాబట్టి బెంగుళూరు మొత్తం చూసి, ఎంచక్కా నా కోడలు వంట రుచి చూసి వెళ్తాం” అంది విజయ అత్తగారు. అన్నట్టుగేనే ఆ రోజు మధ్యాహ్నం భోజనం టైమ్ కి అంతా అవురావురంటూ కూర్చున్నారు. విజయ ...

(Telugu) ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాల్సిన ప్రాథమిక విషయాలు

[:te]ఇన్సూరెన్స్ తీసుకోవడంలో వున్న సాధకబాధకాలు నీకు నిజంగా తెలుసా? ఈ అనుమానం తీర్చుకోవడం కోసం నేను నీకు ఒక కథ చెప్తాను. ఆ ఊర్లో లచ్చమ్మ నోటికి భయపడనివాళ్ళు లేరు. ఎప్పుడు ఎక్కడ ఎవరు దొరికినా వాళ్ళను తిట్టిపోయడం ఆమె అలవాటు. అందుకని ప్రతి ఒక్కళ్ళూ ఆమె అంటే భయపడి దూరం పరిగెత్తేవాళ్ళు. అలా భయపడేవాళ్ళలో మొదటి పేరు శంకరయ్యది. తీరా చూస్తే శంకరయ్య ఆ లచ్చమ్మకి స్వయానా భర్తగారు. ఆమె అంటే భయంలేని వాళ్ళలో మొదటి వ్యక్తి ఆ ఊరి సర్పంచి పాపారాయుడుగారు. ఆమెకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని సరైన అవకాశం కోసం ఆయన చూస్తున్నాడు. ఒకరోజు రాజయ్య అనే రైతు పొలానికి వెళ్ళాలని హడావిడిగా సైకిల్ తొక్కుతూ పొరపాటున కిందపడ్డాడు. సైకిల్ చక్రానికి ఏదో అడ్డంపడటం వల్లే పడిపోయానని అతను అనుకున్నాడు. తీరా చూస్తే అతని సైకిల్ కింద పడి ఒక కోడి పుంజు చనిపోయింది. ఆ పుంజు ఎవరిదా అని అటూ ఇటూ చూశాడు. ఆ పక్కనే ఉన్న ఇంటిలోనుంచి శంకరయ్య ఆ పుంజు తనదేనంటూ వచ్చాడు. రాజయ్య ముందు భయపడ్డా, ఆ తరువాత సమయానికి లచ్చమ్మ అక్కడలేదని తెలుసుకోని మనసులోనే సంతోషించాడు. పైగా ఏదో మాయచేసి తప్పించుకోడానికి ఇదే మంచి అవకాశం అని అతనికి అర్థం అయ్యింది. “ఒరే శంకరయ్యా… ...

(Telugu) ఇన్సూరెన్స్ పథకాలలో అన్నింటికన్నా ఉత్తమమైనది, చౌకైనది టర్మ్ పాలసీ.

[:te]“మధ్యతరగతి మహారాజా, ఈ రోజుల్లో ఆర్థిక పథకాలు ఎక్కువైపోయాయి. అవి అందించే సంస్థలు కూడా ఎక్కువైపోయాయి. ఉదాహరణకు జీవిత బీమా సంస్థలనే చూస్తే ఒకప్పుడు ఒకటే సంస్థ వుండేది. ఇప్పుడు ఇరవైకి పైనే సంస్థలు, వారి వారి అనుబంధ బ్యాంకులు, ఏజంట్లు ఇలా ఎంతో మంది బీమా పథకాలను అమ్ముతున్నారు. ఇంతమంది అమ్మడం వల్ల కొనుగోలుదారుడుకి ఏ పథకం మంచిదో తెలుసుకోవడం చాలా కష్టంగా వుంది. చాలామంది ఈ తికమకలో ఒకదాని బదులు మరొకటి తీసుకోని తరువాత బాధపడుతున్నారు. అలా జరగకుండా ఏం చెయ్యాలో తెలుసుకునేలా నీకో కథ చెప్తాను. పూర్వం ఒకానొక అడవిలో అనేక రకాల జంతువులు వుండేవి. ఆ జంతువులను రోజుకొకటి చొప్పున ఒక సింహం తింటూ వుండేది. ఒక తెలివైన కుందేలు ఆ సింహాన్ని బావిలో పడేలా చేసి ఆ జంతువులన్నింటినీ కాపాడింది. అందుకు ఆ జంతువులు ఎంతో ఆనందించి, కుందేలుకి సన్మానం చేశాయి. వాటిని ఉద్దేశించి కుందేలు మాట్లాడింది. “ప్రియమైన జంతువులారా! ఈ రోజు సింహం చచ్చిపోయిందని మనం ఎంతో సంతోషంగా వున్నాము. కానీ, సింహం కన్నా తెలివైన, బలమైన, ప్రమాదకరమైన మరో జంతువు వుంది. దానిని మనిషి అంటారు. ఆ మనిషి ఒకప్పుడు అడవికి దూరంగా బతికేవాడు. ఇప్పుడు అడవులను ఆక్రమిస్తూ జం...

(Telugu) ఆర్థిక ప్రగతికి అత్యంత కీలకమైన విషయాలు

[:te]సంపాదించే ప్రతి మనిషి కోరుకునేది సంపద సాధించాలని. సంపాదనకు సంపదకు వున్న తేడా తెలుసుకోవడంతో ఇది మొదలౌతుంది. సంపాదన చేతిలోకి వచ్చే డబ్బు అయితే సంపద మనదగ్గర నిలిచేది. ఈ రెండింటి మధ్య వుండే ఖర్చు, పొదుపు, ముదుపు అనే విషయాలు సంపాదనను సంపదగా మార్చే విషయాన్ని ప్రభావితం చేస్తాయి. ఎంత సంపాదిస్తున్నామన్న దానికన్నా అందులో ఎంత డబ్బు సంపదగా మారుస్తున్నాము అన్నదాని బట్టే ఆర్థిక ప్రగతి ఆధారపడి వుంటుంది. ఇది తెలుసుకున్న తరువాత ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడం రెండో మెట్టు. డబ్బు తెలివిగా ఆదా చేస్తే తనంతట తానుగా పెరుగుతుంది అని తెలుసుకోవాలి. మొదటి లక్ష సంపాదించడం కష్టం కానీ, ఆ తరువాత అదే లక్ష తనంతట తానుగా మరో లక్షను సృష్టించగలదు. కాలం గడిచే కొద్ది ఆదా చేసిన డబ్బు పెరుగుతుంది, కానీ దానితో పాటే ఆ డబ్బు విలువ మాత్రం పడిపోతుంది. డబ్బు పెరగడానికి కారణం చక్రవడ్డీ, వ్యాపారం/షేర్లలో లాభాలు అయితే అదే డబ్బు విలువ తగ్గిపోడానికి కారణం ద్రవ్యోల్బణం. పెరిగే డబ్బు విలువ, ద్రవ్యోల్బణం కన్నా ఎక్కువ వుంటే అప్పుడే నిజమైన వృద్ధి సాధించినట్లు. ఇది మొదటి సూత్రం. ఆర్థిక అభివృద్ధి కోసం, సంపద సాధించడం కోసం కష్టపడే ప్రతి మ...

(Telugu) సంపద సాధించడంలో అత్యంత కీలకమైనది, అత్యంత లాభదాయకమైనది – పెట్టుబడి.

[:te]సంపద సాధించాలన్న నీ దృఢనిశ్చయం ఎంతో గొప్పది. నీ పట్టుదలతో పాటు, ఆర్థిక విషయాలను తెలుసుకోవాలన్న నీ తపన, తెలుసుకున్న సూత్రాలను అవలంబించడంలో నీ నిజాయితీ నన్నెంతగానో సంతోషపెడుతున్నాయి. అయితే సంపద సృష్టించడానికి అత్యంత కీలకమైన ఒక రహస్యం వుంది. అది తెలుసుకుంటేనే ఆర్థిక ప్రగతి సాధ్యమౌతుంది. ఆ ముఖ్యమైన రహస్యం నీకో తెలుసో లేదో సుభీక్షాపురంలో సోంబాబు అనే పెద్దమనిషి వున్నాడు. ఆయనకు మొదట్నుంచీ టైలర్ షాపు పెట్టాలని కోరిక. అందుకే వడ్డీవ్యాపారి వీరబాబు దగ్గర డబ్బులు అప్పు చేసి ఇంటిదగ్గరే ఒక మిషన్ కొనుక్కోని పని ప్రారంభించాడు. ఆ ఊరికి సోంబాబు ఒక్కడే టైలర్ కావటంతో ఊర్లో జనం అంతా అతని దగ్గరే బట్టలు కుట్టించుకోవడం మొదలుపెట్టారు. దాంతో సోంబాబు లాభాల బాటలోపడ్డాడు. త్వరలోనే వీరబాబు అప్పు వడ్డీతో సహా తీర్చేశాడు. కొంతకాలం గడిచింది. సోంబాబు బట్టలు చాలా బాగా కుడతాడని పేరుపడిపోయింది. ఆ ఊరే కాకుండా చుట్టుపక్కల వుండే గ్రామాలనుంచి కూడా జనం రావటం మొదలైంది. సోంబాబుకి ఇది మంచి అవకాశంలా కనపడింది. వెంటనే వీరబాబు దగ్గరకు వెళ్ళాడు. “వీరబాబుగారూ, గిరాకీ రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇంటి దగ్గర సరిపోవటంలేదు. సెంటర్లో ఒక ష...

(Telugu) మరొకరి వ్యాపారంలో భాగస్వామిగా మారడం.

[:te]పోయినసారి మనం కలిసినప్పుడు సంపద సాధించాలంటే పెట్టుబడి పెట్టడమే ఉత్తమమైన మార్గం అని అనుకున్నాము. పెట్టుబడి పెట్టడానికి మనంతట మనం ఏదైనా వ్యాపారం చేయడం ఒక మార్గం అయితే, ఇతరులు చేస్తున్న వ్యాపారంలో భాగస్వామిగా ఉండటం మరో మార్గం అని కూడా చెప్పుకున్నాము. అయితే చాలా మంది మధ్యతరగతి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఇలాంటి వారు స్వంతగా వ్యాపారం చేయడం చాలా కష్టసాధ్యమైన పని. ఇక మిగిలింది మరొకరి వ్యాపారంలో భాగస్వామిగా మారడం. ఇది కూడా అంత సులభమేమీ కాదు. వ్యాపారంలో లాభాలతో పాటు నష్టాలు కూడా వుంటాయి కాబట్టి, మనం పెట్టుబడిగా పెట్టే డబ్బు నష్టమైపోకుండా జాగ్రత్త వహించాలి. రామాంజనేయులు చాలాకాలంగా కూరగాయలు, ఊరగాయలు అమ్ముతుండేవాడు. అతని షాప్ చుట్టూ చాలా అపార్ట్మెంట్లు వుండటం వల్ల వ్యాపారం బాగా సాగేది. కొంత కాలం క్రితం అందరూ కూరగాయలు కొనుక్కునేవారు, ఊరగాయలు ఇంట్లో పెట్టుకునేవారు. అందువల్ల అతని వ్యాపారంలో కూరగాయలు ఎక్కువ లాభాలు ఇస్తుండేది. క్రమంగా కూరగాయల అమ్మకాలు తగ్గిపోయి ఊరగాయ అమ్మకాలు పెరగసాగాయి. విషయం ఏమిటా అని ఆరా తీశాడు రామాంజనేయులు. అతను తెలుసుకున్న విషయం ఏమిటంటే ఒకప్పుడు ఆ చుట్టుపక...

(Telugu) స్టాక్ మార్కెట్ లో తెలివిగా పెట్టుబడి చెస్తేనే ప్రగతి సాధ్యం అవుతుంది

[:te]సంపద సాధనలో అత్యంత కీలకమైన రహస్యం వ్యాపారంలో భాగస్వామిగా మారటమేనని మనం గతంలో చెప్పుకున్నాము. అలా మారేందుకు స్టాక్ మార్కెట్ మంచి మార్గమని కూడా అనుకున్నాము. అయితే స్టాక్ మార్కెట్ లో జొరబడిన ప్రతివాళ్ళు లాభాలతో బయటికి రాలేదు. కొందరు డబ్బు నష్టపోతే మరి కొంత మంది పరువుని కూడా పోగొట్టుకున్నారు. కొన్ని దారుణమైన సందర్భాలలో ప్రాణాలను సైతం పోగొట్టున్నారు. ఇలా జరగకుండా వుండాలంటే మనకి స్టాక్ మార్కెట్ పనితీరు గురించి స్పష్టమైన అవగాహన వుండాలి. అందుకే నీకు నేను ఒక కథ చెప్పదలిచాను. అచ్చుపేట రైతుబజార్ మొదట్లో అప్పలకొండ చిలక ప్రశ్న చెప్తుండేవాడు. అతను చాలా గొప్పగా జాతకం చెప్తాడని పేరు. జాతకం అంతా చిలక తెలివితేటల వల్లేనని కొంతమంది అనుకుంటే, మరికొంతమంది అది అప్పలకొండ తెలివితేటలని అంటుంటారు. అప్పలకొండ సొంత వూర్లో వుండే సింహాచలానికి ఈ రెండింటి మీద నమ్మకంలేదు. “ఆ ఊర్లో జనానికి బుద్ధి లేదు అందుకే ఏమీ చేతకాకపోయినా ఈడి యాపారం సాగుతోంది” అనేవాడు. చూస్తుండగానే అప్పలకొండ సొంతూరిలో ఆస్థులు కొనుక్కోవడం మొదలుపెట్టాడు. ఈ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని సింహాచలం అచ్చుపేటకి బయల్దేరి వచ్చాడు. సింహాచలం చెప్పిన విషయం విన్న...

(Telugu) ఆర్థికాభివృద్ధికి షేర్లలో పెట్టుబడి తప్పనిసరి.

[:te]ఎంతటివాళ్ళైనా, వాళ్ళు ఎంత కష్టపడినా మానవ సహజమైన కొన్ని లక్షణాలవల్ల నష్టపోతుంటారు. ఎంతో ప్రయత్నం చేస్తే కానీ ఈ లోపాలను అధిగమించలేము. ఆ విషయం అర్థం అయ్యేలా నీకు ఒక కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను. పూర్వం కోసలరాజ్యంలో కల్యాణి అని చాలా గొప్ప అందగత్తె వుండేది. అందంతో పాటే అందంగా వుంటానన్న గర్వం అదనంగా వుండేది. క్రమంగా అది పొగరుగా రూపాంతరం చెందింది. ఇది ఇలా వుంటే కల్యాణికి మంచి సంబంధం చూసి పెళ్ళి చెయ్యాలని ఆమె తండ్రి అనుకున్నాడు. అదే విషయం కల్యాణితో అన్నాడు. “ఏమిటి నాన్నా మీ చాదస్తం. నాకున్న అందానికి మన్మధుడు లాంటి ఏ అందాల రాజకుమారుడో కోరి వచ్చి నన్ను పెళ్ళి చేసుకుంటాడు” అంది. అనడమే కాదు, కల్యాణి ఆ విషయాన్ని మనసారా నమ్మేది కూడా. ఎప్పుడు ఏ రాజకుమారుడు వస్తాడా అని ఎదురుచూస్తూ వుండేది. ఆమె తండ్రి ప్రయత్నం ఫలించిందో, లేక నిజంగానే ఆమె అందాన్ని ఇష్టపడ్డారో కానీ ఎనిమిది మంది రాజకుమారులు తమని పెళ్ళి చేసుకోమని వర్తమానం పంపారు. ప్రతాప్ అనే ఒక రాజకుమారుడు మిగిలిన వారిలా తన వర్తమానం, చిత్రపటం పంపకుండా తానే స్వయంగా వచ్చి ఆమెను కలవాలని అనుకున్నాడు. అతను వచ్చేసరికి కల్యాణి ఎనిమిది మంది రాజకుమారుల చి...

(Telugu) సంపద సాధించాలంటే ఈక్వీటీలలో పెట్టుబడి తప్పనిసరి

[:te]నువ్వు ధనవంతుడివి కావాలన్న కోరికతో ఈ కష్టం అంతా పడుతున్నావు. అయితే మామూలు సంపాదనపరుడు ధనవంతుడిగా మారాలంటే అది అతను పొదుపు చేసే డబ్బువల్లే సాధ్యం అవుతుంది. అందులోనూ వేరే కంపనీలలో పెట్టుబడులు పెట్టకుండా డబ్బు కూడబెట్టడం అసాధ్యం. అలాగని నేరుగా స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి డబ్బులు పెడితే అవి పోగుట్టుకునే అవకాశం ఎక్కువ. ఇలా నేరుగా కాకుండా, నష్టపోయే అవకాశాన్ని తగ్గించుకునే మార్గం మరొకటి వుంది. అది అర్థం కావాలంటే నీకొక కథ చెప్పాలి. రామాపురం పొలిమేరలో రచ్చబండ పెట్టారు. పన్నెండు మంది రైతులు ఒకవైపు, ఏదో ఫారిన్ కంపెనీ ప్రతినిధులు మరో వైపు. రైతుల అందరి పొలాలు కలిపితే మొత్తం ముఫై ఎకరాలు. ఒకరు మిరప వేస్తారు, ఒకరు పొగాకు వేస్తారు, నీళ్ళు వున్న చోట వరి వేస్తారు, పొలం తక్కువుంటే కందులో శనగలో వేస్తారు. వ్యాపారం తెలిసిన కొంతమంది కూరగాయలు కూడా వేస్తుంటారు. అందరు రైతుల్లాగే వీళ్ళదీ లాటరీ జీవితం. దిగుబడి బాగుంటే ధర వుండదు, ధర పలికేటప్పుడు దిగుబడి వుండదు. ఒక సంవత్సరం ఆదాయం వస్తే నాలుగు సంవత్సరాలు నష్టాలు. నాలుగు వేళ్ళు లోపలికి పోతున్నాయన్న మాటే కానీ ఎవరూ సంపాదించుకున్నది ఏమీ లేదు. ఇదే సమయంలో ఏదో ఫారిన్ కం...