గురు పూర్ణిమ విశిష్టత
ఆషాడ పూర్ణిమ, గురుపూర్ణిమ.
భారతీయ సంస్కృతిలో గురువులది ప్రత్యేకస్థానం. యోగ సంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి. సిద్ధసంప్రదాయంలో శివుడే ఆదిగురువు. గురుపరంపరకు ఆద్యుడు నారయణుడు. ఈ సృష్టిలో శివుడు, శక్తి, విష్ణువు పరబ్రహ్మ యొక్క ముఖ్యమైన ప్రతిబింబాలు. నిరాకారము, శూన్యము, ఆద్యంతరహితమైన తత్వం, అవ్యక్తమే శివుడు. నిరాకారం సాకారమైనప్పుడు, అవ్యక్తం వ్యక్తమై సృష్టిగా ఏర్పడడమే శక్తి, పార్వతీ దేవీ. సృష్టి మొత్తం జడమనుకుంటే, ఆ జడత్వంలో ఉన్న చైతన్యం, ప్రాణశక్తి శ్రీ మన్నారాయణుడు. బ్రహ్మ దేవుడు, మహర్షులు మొదలైన అనేకమందికి జననమరణాలు, జన్మలు ఉన్నా, వీటన్నిటికి అతీతులు శివ, శక్తి, విష్ణువులు. వీరిని ముగ్గురిగా చెప్పుకున్నా, నిజానికి వీరు ఒక్కరే, తత్వం ఒకటే.
సనాతనధర్మం ప్రకారం ఈ సృష్టి క్రమానికి ఆది, అంతము అంటూ ఉండవు. సముద్రపు అలలపై ఏర్పడే నురుగులో ప్రతి క్షణం కొన్ని వేల బుడగలు పుడుతుంటాయి. కొన్ని వేలు నీటిలో కలిసిపోతుంటాయి. అట్లాగే పరమాత్ముడి సృష్టిలో అనేక జగత్తులు నిత్యం ఉద్భవిస్తుంటే, అనేకం లయమవుతుంటాయి. సృష్టి ఏర్పడే క్రమాన్ని సనాతన ధర్మం శాశ్త్రీయంగా కూడా వివరించింది. వాటిలో అణువుల కదిలకలకు ప్రతీక నటరాజ స్వాన్య్. శివుడు ఎప్పుడు తాండం చేస్తూనే ఉంటాడు నటరాజు రూపంలో. ఆయన తాండవం ఆగదు. పరమశివుడి తాండవ స్మయంలో ఆయన చేతి ఢమరుకం నుంచి నాదం(శబ్దం) పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. సృష్టికి మొదట నాదం రూపంలో పరబ్రహ్మ వ్యక్తమయ్యాడు కనుక నాదబ్రహ్మం అని అంటాం. నాదం నుంచి ప్రణవం (ఓంకారం), వేదం వచ్చాయి. ఈ వేదాన్ని సర్వవ్యాపకుడైన శ్రీ మహా విష్ణువు బ్రహ్మదేవునకు ఉపాదేశించాడు(శివకేశవులకు బేధం లేదు, ఇద్దరూ ఒకే పరమాత్మ యొక్క భిన్న కోణాలు). కనుక శ్రీ మహావిష్ణువును గురుపరంపరలో మొదటివాడిగా చెప్పుకుంటున్నాం. అందుకే అద్వైత గురు పరంపర స్తోత్రం 'నారయణ సమారంభాం' అంటూ ప్రారభమవుతుంది. బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. అందుకే వేదోఖిలం జగన్మూలం అన్నారు అంటే వేదమే జగత్తునకు మూలమై ఉన్నది అని అర్దం. దేవతలను, మానవులను, దానవులను సృష్టించాడు. వేదం ఆధారంగా ధర్మాన్ని ఏర్పరిచాడు.

బ్రహ్మ శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలో నుంచి పుట్టాడు, కనుక బ్రహ్మదేవుడిని పద్మభువుడు అన్నారు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కుమారుడు. విష్ణువుమూర్తి తనకు ప్రసాదించిన జ్ఞానాన్ని, బ్రహ్మ విద్యను, వేదాన్ని బ్రహ్మ తన కుమారుడైన వశిష్టమహర్షికి, వశిష్టుడు తన పుర్తుడైన శక్తి మహర్షికి, శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు. ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయింది, కోట్ల సంవత్సరాలు కాలంలో వెళ్ళిపోయాయి, ఎందరో మహానుభావులు పుట్టారు, ఎందరో ముక్తిని పొందారు. అనేక మందికి ఈ మహాజ్ఞానం ఉపదేశించబడదింది. వశిష్టమహర్షి 24 వ త్రేతాయుగంలో శ్రీ రామచంద్రునికి, లక్ష్మణునికి గురువుగా యోగవిద్యను బోధించారు. ఆ మహాయుగం గడిచిపోయింది, ఇంకా 3 మహాయుగాలు గడిచి 28 వ మహాయుగం ప్రారంభమైంది. సత్యం యుగం దాటింది, త్రేతాయుగం వెళ్ళిపోయింది, ద్వాపరయుగం ఆఖరికి చేరుకుంది. ఇంతలో మహాభారత యుద్ధం జరిగింది. ఇంతకాలం గడిచినా వేదం ఎప్పుడు గ్రంధస్థం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు. అందుకే వేదానికి 'శ్రుతి' అని పేరు వచ్చింది.
ఈ వేదాన్ని సమాధి స్థితిలో ఉన్న ఋషీశ్వరులు విన్నారు. పరమాత్మ వారికిచ్చిన వేదం ఒకటిగానే ఉండేది. అంతా కలిసిపోయి ఉండేది. దానికి తోడు, మధ్యకాలంలో అనేకమంది తమ అనుభూతులు ద్వారా, సమాధి స్థితి ద్వారా అనేకానేక విషయాలను వేదం నుంచి వెలికితీశారు. ఇదంతా పెద్ద జ్ఞానరాశి. ఒక వ్యక్తి వీటిని సక్రమంగా అర్దం చేసుకోవడం దుర్లభంగా ఉండేది. ఈ విషయాన్ని వ్యాసమహర్షి గుర్తించారు.
రాబోయేది కలియుగం. కలియుగ జనంలో భక్తి తక్కువగా ఉంటుంది, ఆయుషు (జీవితకాలం) తక్కువ (100-120 ఏళ్ళు), అధికశాతం ప్రజలు మందబుద్ధులుగా ఉంటారు. జ్ఞాపకశక్తి గొప్పగా ఉండదు. మహాభారత యుద్ధం కారణంగా వేదపండితులనేకమంది మరణించారు. వైదిక సంస్కృతి దెబ్బతింది. ఇలా సాగితే, కలియుగజనం ఎట్లా తరిస్తారు? ఆ సందేహం వ్యాసమహర్షికి కలిగింది. ఋషి భవిష్యత్తును దర్శనం చేయగలడు. కనుక అన్ని విషయాలను గమనించి కలియుగ ప్రారంభానికి ముందు వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదాలుగా విభజించారు. ప్రపంచ నలుమూలల ఉండే 88,000 మహర్షులను భారతదేశానికి ఆహ్వానించి, వేదసభ ఒకటి నిర్వహించి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంధస్థం చేశారు.

తను విభజించిన వేదాలను తన నలుగురు శిష్యులకు అప్పగించి ప్రచారం చేయించారు. ఎంతో జటిలమైన వేదవిభజన చేయడంతో బ్రహ్మ ఆనందం పొంది మహర్షిని వేదవ్యాస అన్నారు. అందుకే వేదాన్ వ్యస్యతి ఇతి వేదవ్యాసః అంటారు. వేదవ్యాసా! నాకు పుత్రుడివై, వేదాలను విభజించి, నన్ను ఆనందపెట్టవు. ఇలాగే అన్ని మన్వంతరాలలో, ద్వాపరంలో జన్మిస్తూ, వేద విభజన చెయ్యి' అని అపాంతరముడికి విన్నవించాడు బ్రహ్మ. అప్పటి నుంచి ప్రతి మన్వంతరంలో వేదవ్యాసుడు జన్మిస్తున్నాడు. అయితే వేదవ్యాసుడనేది పదవి నామమే అని, వ్యక్తి నామం కాదని చెప్తారు పెద్దలు. మొదట స్వాయంభువ మనవు వేదవ్యాసుడు కాగా, రెండో మన్వంతరంలో ప్రజాపతి, మూడవ మన్వంతరంలో శుక్రుడు వ్యాసులయ్యారు.
వేదవ్యాసునికి బాదరాయణుడు, అపాంతరముడని వ్యవహార నామాలు. ఇప్పటి వ్యాసమహర్షికి కృష్ణద్వైపాయనుడని పేరు. నల్లని వరణం కలిగినవాడు కనుక కృష్ణ అన్నారు, యమునా నదీ ద్వీపంలో ప్రకటితమయ్యాడు కనుక ద్వైపాయనుడన్నారు.
వ్యాసమహర్షి వేద విభజన చేసి ఆపలేదు. లోకులకు వేదసారం త్వరగా అర్దమవ్వాలని పంచమవేదమైన మహాభారత ఇతిహాసాన్ని లిఖించారు. అప్పటికి అర్దం కానివారుంటారని వేదం సులువుగా అర్దమవ్వడం కోసం అనేక మన్వంతరాలలో జరిగిన ఘట్టాలను ఏర్చి, కూర్చి, 18 పురాణాలను, 32 ఉపపురణాలను రచించారు. ఇంకా లోకులకు ఉపకారం చేయాలన్న తపనతో భక్తిని ప్రసాదించే భగవద్ లీలల సమాహారమైన భాగవతాన్ని అందించారు. ఇంత మేలు చేసిన వ్యాసమహర్షికి కృతజ్ఞతగా గురుపూర్ణిమ పేరుతో ప్రజలు తమ తమ గురువులలో వ్యాసమహర్షిని చూసుకుని, ఆరాధిస్తారు. వ్యాసుడి అంశలేని వారు వేదవేదాంతల బోధ చేయలేరు. ప్రతి గురువులో వ్యాసుడు ఉంటాడు. గురుపూర్ణిమ వ్యాసుని కోసం వచ్చింది. అది వ్యాసపూర్ణిమ. ఆ రోజు తమ తమ గురువులలో వేదావ్యాస మహర్షి చూసుకుని పూజించాలి.
వ్యాసుడు చిరంజీవి. ఇప్పటికి తపస్సు చేసుకుంటూ దేహంతో ఉన్నారు. బద్రీనాధ్ దగ్గరలో కొందరికి దర్శనమిస్తారు. వేద విభజన చేసాక వ్యాసులవారు హిమాలయ పర్వత గుహలోకి వెళ్ళారు. తరువాత ఆయన సంకల్పం చేత ఒక పెద్ద మంచుచర్య విరిగిపడి, ఆ గుహ ద్వారం మూసుకుపోయింది. వ్యాస మహర్షి దర్శనం ఆదిశంకరాచార్యులవారికి కాశీలో కలిగింది. అటుతర్వాత భారతీయ గణిత శాస్త్రజ్ఞుడైన భాస్కరాచార్యులవారికి కలిగింది.

Comments
Post a Comment