దుఃఖానికి పరిష్కారం
ఓం శ్రీ గురుభ్యో నమః
ఆధ్యాత్మికత ఎందుకు వచ్చిందంటే – మనిషి ఎప్పుడూ సుఖంగా శాంతిగా
వుండాలనుకోవటం వల్ల. తానూ తనవాళ్ళూ ఎప్పుడూ సుఖంగా శాంతిగా వుండటం కోసం
మనిషి నిరంతరం ఆరాటపడుతుంటాడు. ఎల్లప్పుడూ కేవలం అందుకోసమే
ప్రయత్నిస్తుంటాడు. ఏ ఆలోచన చేసినా, ఏ పనిచేసినా అది కాక మరో
కారణం ఉండనే వుండదు. సుఖ శాంతుల కోసం మనిషి తనకు చాతనైనంత వరకు ఎన్నో
ఏర్పాట్లు చేసుకొంటూవున్నాడు. ఆ ఏర్పాట్లు చేసుకోవటానికి ఎంతో శ్రమ, బాధ
పడుతూనే వున్నాడు. ఐనా జీవితంలో ఎన్నోసార్లు మళ్ళీ మళ్ళీ అశాంతీ, అలజడీ,
దుఃఖమూ, భయమూ, విసుగూ ఎదురౌతూనే వున్నాయి. ఈ పరిస్థితికి కారణం
ఏమిటని చూసినట్లయితే ఈ క్రింది నాలుగు విషయాలు
ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
మార్పు
మరణం
ప్రతికూలత
ఊహలు
ఈ నాలిగిటి వల్ల మనిషి అశాంతితో, అలజడితో, విసుగుతో, బాధతో, భయంతో
ఇంకా ఏదో చేయాలనే తాపత్రయంతో చివరికి మృత్యువు ఒడిలోకి జారి
పోతుంటాడు. సామాన్యమైన వ్యక్తులంతా ఈ వూబిలో పడిపోయి వుంటారు.
మార్పు :- ఏదో ఒక వస్తువును కొన్నప్పుడు చాలా సంతోషంగానే, ఆనందంగానే
వుంటుంది. ఐతే ఆ వస్తువుని జాగ్రత్త పరచడంలో అలసట, ఆందోళన,
భయము పొంచి వుంటున్నాయి. కొంత కాలం తర్వాత మార్పు వల్ల ఆ వస్తువు
పాతబడిపోతుంది. దాని స్థానంలో మరో కొత్తది కావాలనిపిస్తుంది. కొత్తది
కొంటే పాతదాన్నేమి చేయాలి? ఇదో సమస్య. ఐనకాడికి అమ్మేయాలా?
ఎవరికైనా ఇచ్చేయాలా? లేకపోతే ఎక్కడ పెట్టాలి? ఇదొక ఎడతెగని
అంతర్మధనం. ఈ రకమైన అంతర్మధనం, ఊగిసలాట కేవలం వస్తువుల
విషయంలోనే కాక, బంధువులు, స్నేహితుల విషయంలో కూడా వర్తిస్తున్నది.
సమస్యతో సహజీవనం చేయడం, సర్దుకు పోవడం తప్పనిసరిగా
మారుతున్నది.
మరణం :- తాను మరణిస్తానేమోననే ఆందోళన ఉండనే వుంది. అలాగే తనవాళ్ళు
మరణిస్తారనే భయము, అలజడి, దుఃఖము.
ప్రతికూలత :- తాను అనుకున్నది జరగనప్పుడు చికాకు, బాధ పడటమే కాకుండా,
చిన్న, పెద్ద విషయాలలో కూడా ఇలా జరుగుతుందనుకోలేదు అని మళ్ళీ మళ్ళీ
గతించిన చేదు విషయాలను జ్ఞప్తికి తెచ్చుకొని బాధ పడుతుంటాడు.
ఊహలు :- భవిష్యత్తుకు సంబంధించిన విషయాల ఊహలతో
సతమతమౌతుంటాడు.
ప్రతి మనిషీ ఎంతటి ప్రయత్నం చేసి ఎన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నప్పటికీ
మార్పుల వల్లా, మరణం వల్లా, ప్రతికూలతల వల్లా, ఊహలవల్లా బాధ,
దుఃఖము, అశాతి, అలజడి, విసుగు, ఆందోళన అడుగడుగునా ఎదురౌతూనే
వున్నాయిగదా! కానీ ఇది ఈనాడు కొత్తగా వచ్చిన సమస్యకాదు. అనాదిగా
మానవుడు ఎదుర్కొంటున్న సమస్యే. ఐతే మేధావంతులైన ప్రాచీన మహర్షులు
జటిలమైన ఈ సమస్యను కూలంకషంగా అధ్యయనం చేసి
మహత్తరమైన అనుభవాలతో ఈ క్రింది పరిష్కార మార్గాన్ని
ప్రతిపాదించారు.
మనిషి తన ఆధీనంలో లేనటువంటి బాహ్య విషయాల ప్రభావానికి లోనవటం
వలన తాను అంతర్గతంగా దుఃఖము, బాధ, విసుగు, అలజడి, ఆందోళన, భయము
మొదలైన వికారాలను పొందుతున్నాడు. బాహ్య విషయాలు తన ఆధీనంలో లేనివి
కనుక తాను తనకు అనుగుణంగా మార్చగలిగేవి కాదు. అందువల్ల వాటిని
మార్చాలనే ప్రయత్నం ఎంత గొప్పగా చేసినా, కాలానుగుణంగా అది
నిరుపయోగమే కాగలదు. ఐతే బాహ్య విషయాల ప్రభావానికి తాను లోనవటం
వల్లనే గదా తాను దుఃఖము మొదలైన వికారాలకు గురౌతున్నది. కావున తాను
ఏదోవిధంగా బాహ్య విషయాల ప్రభావానికి లోను కాకుండా ఉండగలిగితే దుఃఖ
పడవలసిన అగత్యం వుండదు. ఈ విధమైన దృక్పథంతో బాహ్య
విషయాలను ప్రక్కన పెట్టి అంతర్గతంగా తమలో ఏమి ఉన్నదో, దుఃఖము,
భయము మొదలైన వికారాలు అసలు ఎలా కలుగుతున్నాయో నిశితంగా పరిశీలించారు.
ఇదే అంతర్ముఖమవ్వటం, అంతశ్శోధన చేయటం అనబడుతుంది. ఇప్పటివరకు
తాను బహిర్ముఖుడై తనకు బాహ్య విషయాల వల్ల దుఖం కలుగుతున్నదని
గ్రహించడం చేత, అసలు బాహ్య విషయాలు ఏవిధంగా ప్రభావితం
చేస్తున్నాయో తెలుసుకోవలసిన ఆవశ్యకత ఏర్పడింది. అలా చూస్తున్నప్పుడు
తనకు గోచరమౌతున్న స్థూల విషయాలన్నీ పంచభూతములతో
నిర్మితమైనవిగనూ, తాను పంచభూతముల కంటే సూక్ష్మముగనూ, భిన్నముగనూ
వున్నట్లు తెలియుచున్నది. ఇప్పటివరకు స్థూల దేహమే తాననుకోవటం
వలన దేహ సంబంధ మైన విషయాలు తనపై నాపాదించుకోవటం జరిగింది. ఇప్పుడు
ఇతర విషయాల సరసన దేహం కూడా తనకు భిన్నంగా గోచరిస్తున్నది. అలాగే
స్థూలమైన దేహం కంటే సూక్ష్మమైన ఇంద్రియాలు, అంతకంటే సూక్ష్మమైన
మనస్సు, బుద్ధి, ప్రాణము తనకు గోచరమౌతున్నాయి కనుక ద్రష్టయైన
తాను గోచరమౌతున్న దృశ్యానికి భిన్నముగా సూక్ష్మతమమై యున్నట్లు
తెలియుచున్నది. ఈ విధంగా సాంఖ్యానమ్ చేసిన మహర్షులు ఆత్మ
యొక్క విస్త్రుతత్వాన్ని వివరించారు.
స్థూల పదార్థములకు భిన్నమైన ఆత్మ నిరాకారము. నిరాకారమైన ఆత్మ
అపరిమితమై సర్వ వ్యాపకమైయున్నది. సర్వ వ్యాపకమైన ఆత్మ
ఏ కదలికా లేనట్టిదీ, స్థాణువు. ఇంద్రియములకంటే సూక్ష్మమైయున్నందున
ఇంద్రియములకు గ్రహింప నలవికానిదౌటచే ఆత్మ అప్రమేయము.
మనస్సు కంటే సూక్ష్మమైన ఆత్మ అచింత్యము. సూక్ష్మాతి
సూక్ష్మతమమైన ఆత్మ దేనితోనూ అంట కుండుటచే నిర్మలము, నిరంజనము,
గుణాతీతము. ఏ మార్పూ చెందనట్టి దైన ఆత్మ అవినాశి. అవినాశియైన
ఆత్మ శాశ్వతము. శాశ్వతము, సర్వగతము ఐన ఆత్మ నిత్య
సత్యము. కాల పరిమితులకు అతీతమైన ఆత్మ సనాతనము. పూర్ణమై,
నిత్య తృప్తమై, ఇంద్రియ, మనో, బుద్ధులనూ, పంచ భూతములనూ, సర్వ
విషయాలనూ ప్రకాశ పరుస్తున్న ఆత్మ సత్ చిత్ ఆనందము.
ఈ విధంగా ఆత్మ యొక్క విస్తృతిని గ్రహించి నిరంతర ఆత్మ ధ్యానంతో
ఆత్మానుభవం పొంది ఆ పరమ శాంతిని ఆస్వాదిస్తున్న మహాత్ములకు దుఃఖ
మెక్కడిది? భయమెక్కడిది?
అంటే అశాంతి, అలజడి, దుఃఖము, అలసట, భయము పోవాలంటే బాహ్యమైన
విషయాలతో సతమతమవ్వటం మాని శాశ్వతమైన, ఆనందస్వరూపమైన
తనను తాను తెలుసుకొని ఆవిధమైన తాను తానుగా వుండటం ఒక్కటే సరియైన
పరిష్కారం అని మహర్షులు నిరూపించారు. వేల కొలది సంవత్సరాలుగా ఎందఱో
మహాత్ములు ప్రాచీన మహర్షులు తమ అనుభవాలతో నిర్దేశించిన
మార్గంలో ప్రయాణించి జీవన్ముక్తావస్థను పొంది దివ్యమైన శాంతి జీవనాన్ని
ఆస్వాదించారు. మహత్తరమైన అనుభవంతో ఉన్న అట్టి మహాత్ములందరూ
తమవలెనే సర్వ జీవులూ సుఖ శాంతులతో దివ్య జీవనం సాగించాలనే
ఏకైక ఆకాంక్షతో సాటి మానవులకు పరమ సత్యాన్ని చేతులు పైకెత్తి
చాటుతున్నారు. ప్రాచీన మహర్షులు తమ మహత్తరమైన అనుభవాలతో
రంగరించి భవిష్య మానవాళి అభ్యున్నతికై నిర్దేశించిన శాస్త్రాల
పరమార్థాన్ని విశదపరుస్తున్నారు. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న
దీనులకు జ్ఞాన మార్గాన్ని సూచిస్తూ, ఉత్తేజితులను ముందుకు నడపటానికి
అహర్నిశలూ పరితపిస్తున్నారు.
శాస్త్రాలలోకేల్లా తలమానికమైన శ్రీమద్భగవద్గీత దుఃఖాన్ని పోగొట్టుకునే
మార్గాన్ని స్పష్టపరచుచున్నది. అర్జున విషాద యోగం చూసినప్పుదు;
అర్జునునికి విషాదం ఎందుకు వచ్చింది? తాను యుద్ధంలో జయిస్తాడో జయించడో
అనే సందిగ్దత. ఎవరు జయించినా మరణించేది తాను గాకపోతే తనవాళ్ళే గదా
అనే భయము, ఆందోళన. విషాదం మనందరికీ అనుభవమే. విషాదాన్ని ఎలా
పోగొట్టుకోవాలి అని చూసినప్పుడు, సాంఖ్యానమ్ చేసుకోవాలని అంటే నీవు ఎవరో
నీవు కానిదేదో(నీకు గోచరమౌతున్నది) స్పష్టంగా విభజించి చూసుకొవాలని, దుఃఖ
పడుతున్నది దేహమే కాని నీవు దుఃఖ పడేవాడివి కాదని తెలుసుకొని నిన్ను నీవు
దుఃఖ పడుతున్నదాన్నుంచి విడగొట్టుకోవాలని సూచిస్తున్నది.
అచ్చేద్యో యమదాహ్యో యమ్ అక్లేద్యో శోష్య ఏవచ !
నిత్యః సర్వగతః స్థాణు: ఆచలో యం సనాతనః !
2వ అ/24
ఆత్మ నరకటానికి, తగలబెట్టటానికి, తడపటానికి, ఆరబెట్టటానికి
వీలు కానట్టిది. ఇది నిత్యము, సర్వవ్యాపి, చలింపనిది, స్థాణువు,
సనాతనము.
అవ్యక్తో యమచింత్యో యమ్ అవికార్యో యముచ్యతే !
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ! 2వ
అ/25
ఆత్మ ఇంద్రియ గోచరము కానిది, మనస్సుకు అందనిది, వికారములు లేనిది.
ఈ విధంగా నిన్నునీవు తెలుసుకొన్నప్పుడు నీకు శోకించే అర్హత లేదు.
మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః !
ఆగమాపాయినో నిత్యాః తాంస్తితిక్షస్వ భారత !
2వ అ/14
ఇంద్రియములు విషయములతో ప్రవర్తిస్తున్నప్పుడు శీతోష్ణములు, సుఖ
దుఃఖములు కలుగుచున్నవి. అవి వచ్చేవీ, పోయేవీ కాని శాశ్వతమైనవి కావు.
భారతా(స్వసుఖీ) వీటిని సహింపుము.
త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున !
నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ
ఆత్మవాన్ ! 2వ అ/45
మూడు వేదాలలో ప్రతిపాదించబడిన విషయాలన్నీ త్రిగుణాత్మిక మైనవే అని
గ్రహించి నీవు గుణాతీతమైన నీవుగా వుండాలంటే నిత్య సత్వమునాశ్రయించి
ద్వంద్వములను,యోగ క్షేమములను విడిచిపెట్టుము.
పంచభూతములతో నిర్మితమైన జగత్తు విషయాలు ఈ దేహంతో సహా నాకు
గోచరమౌతున్నాయి. అవి నేను కాదు. అలాగే మనస్సులో మెదిలే ఆలోచనలు నా
గమనికలో వున్నవి. అవి నేను కాదు. గమనిస్తున్న నేను వేరు,
గమనించబడుతున్న మనస్సుతో సహా సర్వ విషయాలు వేరుగా వున్నాయి
అని తెలుసుకోవటం వలన లాభం ఏమిటి?
దుఃఖానికి కారణమౌతున్నటువంటి విషయాలు, మార్పు, మరణము,
ప్రతికూలతలు, ఊహలు నీవు కానే కాదని తెలుసుకున్నప్పుడు, నీవు
ఆనందస్వరూపుడవు అని తెలుసుకున్నప్పుడు, నీవు దుఃఖించే వాడివి కాదు అని
తెలుసుకున్నప్పుడు నీకు దుఃఖం ఎక్కడ వున్నది? సుఖము, శాంతి నీ స్వరూపమే
అని తెలుసుకుని నీవు నీవుగా అనుభవంగా ఉంటున్నప్పుడు దుఃఖం లేనే లేదు.
ఐతే ఆ అనుభవం పొందటం ఎలా?
సర్వ కర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ !
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్ న కారయన్ ! 5వ
అ/13
సర్వ కర్మలను మనస్సులో వదలిపెట్టినవాడివై తొమ్మిది ద్వారములు
కల్గిన దేహమనే పురములో ఏదీ చేయని వాడిగనూ, ఏదీ చేయించని వాడిగనూ
సుఖముగా నుండుము.
ఇక్కడ సర్వ ప్రయత్నాలూ సుఖ శాంతుల కోసమే. కర్మలను సన్యసించటం
అంటే పనులు మానుకొని ఎక్కడికో పోవటం కాదు. సర్వ కర్మలను మనస్సులో
సన్యసించటం అంటే కర్మలు చేస్తున్నది ఈ దేహము, లేదా ఇంద్రియాలు,
లేదా మనస్సు అని భావిస్తూ నేను నవ ద్వారపురములో నున్న దేహిని. ఏపనీ
చేసే వాడినీ కాదు, చేయించే వాడినీ కాదు అని సుఖంగా శాంతిగా వుండటం.
నైవ కించిత్ కరొమీతి యుక్తో మన్యేత తత్వవిత్ !
పశ్యన్ శ్రుణ్వన్ స్పృశన్ జిఘ్రన్నశ్నన్ గచ్చన్ స్వపన్
శ్వసన్ ! 5వ అ/8
ప్రలపన్ విసృజన్ గృహ్ణన్నున్మిషణ్ నిమిషన్నపి !
ఇంద్రియాణీంద్రియార్ధేషు వర్తంత ఇతి ధారయన్ !
5వ అ/9
సత్యమునెరిగిన వాడు చూచుచున్నప్పుడు, వినుచున్నప్పుడు,
స్పర్శిస్తున్నప్పుసు, నాలుకతో రుచి చూస్తున్నప్పుడు, తినుచున్నప్పుడు,
వెళ్ళుచున్నప్పుడు, కలలు కంటున్నప్పుడు, శ్వాసిస్తున్నప్పుడు,
మాట్లాడుచున్నప్పుడు, విడిచిపెడుతున్నప్పుడు, శ్వీకరిస్తున్నప్పుడు, కనులు
తెరుస్తున్నప్పుడు, కనులు మూస్తున్నప్పుడు ఇంద్రియములు వాటి విషయాలలో
అవి ప్రవర్తిస్తున్నాయి కాని తాను కొంచెమైనా ఏమీ చేయటం లేదు అని
భావించుచుండును.
అంతేకాని దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ప్రాణము వాటి వాటి
విషయాలలో ప్రవర్తిస్తున్నప్పుడు తగుదునమ్మా అని వాటిలో దూరిపోయి
నేను కూర్చునివున్నాను, నేను చూస్తున్నాను, నేను సంతోషిస్తున్నాను, నాకిది శత్రువు,
నేను చనిపోతున్నాను అనుకొంటూ వాటి పాత్రలను పోషించరాదు. మరి ఎలా వుంటే
మనకు శ్రేయస్కరమో చూద్దాము.
కాయేన మనసా బుద్ధ్యా కేవలై రింద్రియైరపి !
యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే !
5వ అ/11
యోగులు దేహముతోనూ, మనస్సుతోనూ, బుద్ధితోనూ, ఇంద్రియములతోనూ
కర్మలను కేవలము ఆత్మ శుద్ధికొరకు నిర్వహిస్తారు.
యోగులు దేహము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అనే నాలుగు ఉపకరణాల
ద్వారా కర్మలు చేస్తున్నారు. మనము కూడా ఈ నాల్గిటి ద్వారానే కర్మలు
చేస్తున్నాము. ఐతే మనం కర్మలెందుకు చేస్తున్నాము? దేహం కోసం
చేస్తున్నాము లేదా మనసు సంతోషపడటం కోసం చేస్తున్నాము. ఆరోగ్యం కోసం,
సంపదల కోసం, బంధువుల కోసం, పరపతి కోసం, ఉల్లాసంగా ఉండటం కోసం ఇలా
ఎన్నో మారిపోయే వాటి కోసం, మరణించేవారికోసం చేస్తున్నాము.
ఆథ్యాత్మికత పేరుతో కూడా ఇందుకోసమే చేస్తున్నాము. యోగులు
ఆత్మశుద్ధి కోసం చేస్తున్నారట. అంటే దేహ భావన పోగొట్టుకోవటం కోసం
చేస్తున్నారు. ఏపని చేస్తున్నా కేవలం నేను ఆత్మగా ఉన్నానా లేదా అని
చూసుకోవటం కోసం వినియోగిస్తున్నారు. ప్రతి పని జరుగుచున్నప్పుడు నేను
దేహము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలతో మమేకం కాకుండా నేను నేనుగా
ఉన్నానా లేదా అని చూసుకోవటం కోసం మాత్రమే చేస్తున్నారు. ఇది ఎలా
సాద్యపడుతుంది, ఇందులో వున్న రహశ్యం ఏమిటి అని చూసినట్లయితే;
కర్మలు చేసే దానిని గమనిస్తూ వుండాలి. అలా చూస్తూ వున్నప్పుడు కర్మ
చేస్తున్నది (దేహము/మనసు/బుద్ధి/ఇంద్రియము) వేరు గమనిస్తున్న
నీవు వేరు అని తెలుస్తూ వుంటుంది. ఇలా సమస్త కర్మలను
గమనిస్తున్నప్పుడు మాత్రమే నీవు నీవుగా వుండగలుగుతావు. ప్రతి ఇంద్రియ
చలనానికీ, మనో చలనానికీ, ఇంద్రియ కలాపాలకూ నీవు సాక్షిగా వుంటున్నప్పుడు
క్రమేపీ అది అనుభవంగా మారుతుంది. ధ్యానం ఇందుకోసమే.
అసత్ జడ దుఃఖ స్వరూపమైన ఈ దేహం నీవుకాదు. నీవు సత్ చిత్ ఆనంద
స్వరూపుడవు అని అనుభవంతో తెలుసుకున్నప్పుడు అదే ముక్తావస్థ. దీనినే
జీవన్ముక్తావస్థ అంటారు. ఐతే ఇది ప్రతి రోజూ ఏదో కొంత సమయం
ధ్యానం చేస్తే వచ్చేదికాదు. ప్రతి కదలికలోనూ సాక్షిగా వుంటూ ఏదీ చేయని
నిన్ను నీవు గుర్తిస్తూ వుండాలి. సాధనతో మాత్రమే ఈ ఎరుక బలపడుతుంది.
బలపడి బలపడి నిరంతర ఎరుకగా స్థిరపడి అనుభవానికి దారితీస్తుంది.
అందుకు శ్రీమద్భగవద్గీత సూచిస్తున్న యోగసాధన అత్యంత సులభమైన
మార్గమని మహాత్ముల నిశ్చితాభిప్రాయము.
ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు :- ఇప్పటివరకు నిద్రించినది నేను కాదు.
ఇప్పుడు మేలుకొన్నదీ నేను కాదు. దేహము నిద్రించింది, మేలుకొన్నది. మనస్సు
కలలు కన్నది. నేను ఆ క్రియలకు సాక్షిని.
మల మూత్రాలను విసర్జిస్తున్నప్పుడు :- మలమూత్రాలతో నిండివున్న ఈ
తోలుతిత్తి నేనుకాదు. ఈ దేహం మలమూత్రాలను విసర్జిస్తున్నదిగా
గమనిస్తున్న నిర్మలమైన ఆత్మ స్వరూపాన్ని నేను.
శుబ్రపరచుకుంటున్నప్పుడు :- దేహం నీటితో తనను తాను శుబ్రపరచుకుంటున్నది.
నాసిక దుర్వాసనను గ్రహిస్తున్నది. కళ్ళు చూస్తున్నవి. మనస్సు
ఎవగించుకుంటున్నది. దేహం నీటితో ఫ్లష్ చేయడం ద్వారా మలమూత్రాలు కంటి
చూపుకీ, ముక్కు వాసనకీ అందనంత దూరం పోయేటట్లు చేస్తున్నది. నీను ఈ
చర్యలన్నిటికీ సాక్షిని. ఈ చర్యలను వర్ణిస్తున్న మనసుకు సైతం
సాక్షిని.
పళ్ళు తోముకుంటున్నప్పుడు :- ఈ దేహం దుర్వాసనా భరితమైన తన నోటిని
సుభ్ర పరచుకుంటున్నది. ఏ వాసనా లేని, ఏ కదలికలూ లేని, నిర్మలమైన నేను
గమనిస్తున్నాను.
ముఖం తుడుచుకుంటున్నప్పుడు :- నీటితో తడిసిన ముఖాన్ని తువ్వాలుతో
తుడుచుకుంటున్నది ఈ దేహం. తడపటానికి వీలుకానట్టి నేను గమనిస్తున్నాను.
బయటికి వెళ్ళటానికి బట్టలు మార్చుకుంటున్నప్పుడు :- బాహ్య
వాతావరణానికి అనువుగా ఉండేందుకూ, తన సిగ్గును కాపాడుకోవటానికీ ఈ దేహం
బట్టలు ధరిస్తున్నది. నిరాకారము, నిర్వికారము ఐన నేను
గమనిస్తున్నాను.
బూట్లు వేసుకుంటున్నప్పుడు :- ఈ దేహం వేగంగా కదిలేందుకు వీలుగా పాదరక్షలను
ధరిస్తున్నది. నేను గమనిస్తున్నాను.
వ్యాయామం చేస్తున్నప్పుడు :- ఈ దేహం ఒక చోటినుండి మరొక చోటికి
వేగంగా నడుస్తున్నది. చేతులు ఊగుతున్నాయి. నిశ్చలమైన నిరాకార
పరబ్రహ్మ స్వరూపాన్ని నేను. నాలో ఎ కదలికలూ లేవు. సర్వ
వ్యాపకమైన నేను అంతటా ఉన్నాను. కళ్ళు తమ పరిధిలోని దృశ్యాలను
చూస్తున్నాయి. నేను చూసే వాడినికాదు. ఈ చర్యలకు సాక్షిని. ముక్కు గాలిని
బలంగా పీలుస్తూ విడుస్తూంది. నేను నిర్వికారంగా గమనిస్తున్నాను.
ప్రతినిత్యమూ మారుతూ మరణిస్తూన్న కోటానుకోట్ల కణాలతో
నిర్మితమైన ఈ దేహం నేనుకాదు. నేను అక్షర పరబ్రహ్మ స్వరూపాన్ని.
ఈ దేహమూ, దాని కదలికలూ, ఇంద్రియాలూ వాటి చర్యలు, ఇంద్రియ
విషయాలైన ప్రకృతి, జీవరాసులు, సమస్తమైన వస్తుజాలములు, భూమీ,
జలమూ, అఘ్నీ, వాయువు, అనంతమైన ఆకాశమూ నా వలననే ఉనికిని
సంతరించుకొని ఇలా వున్నాయి. ఇవన్నీ అనుక్షణమూ మారుతూ పోతున్నాయి.
నేను శాశ్వతమైన పరబ్రహ్మ స్వరూపాన్ని. అనంతమైన ఆత్మ
స్వరూపాన్ని. ఈ సూర్య చంద్రాదులు నా చైతన్యము వల్లనే
ప్రకాశిస్తున్నాయి. అఘ్నికి వేడీ, జలానికి చల్లదనమూ, వాయువుకు
వ్యాపకత్వమూ, భూమికి ఘనత్వమూ, ఆకాశానికి అనన్తత్వమూ,
నక్షత్రాలకు సుదూరత్వమూ, ప్రకృతికి రమణీయతా, దేవతలకు
దివ్యత్వమూ, రాక్షసులకు కర్కశత్వమూ, జారిణులకు చపలత్వమూ,
మహర్షులకు శాంతీ నా వల్లనే కలుగుతున్నాయి. ఐనా నేనేమీ చేసేవాడినికాదు,
చేయించేవాడినీ కాదు. నేను కేవలం శాశ్వతమైన ఉనికిని. శుద్ధ చైతన్య
స్వరూపాన్ని. కేవలం నేనుండటం వల్లనే ఇవన్నీ ఇలా వున్నాయి.
త్రిగుణాత్మికమైన ఈ సృష్టికి కారణమైన నేను గుణ రహితుడను.
నిర్వికార పరబ్రహ్మ స్వరూపాన్ని నేను. కళ్ళు చూస్తున్నప్పుడు కళ్ళూ
నేనుకాదు, చూడబడే దృశ్యమూ నేనుకాదు. కళ్ళు చూడటానికీ కారణమౌతున్న
చైతన్యాన్ని నేను. శుద్ధ చైతన్యాన్ని నేను. చెవులు వింటున్నప్పుడు ఈ
చెవులూ నేనుకాదు, శబ్దమూ నేనుకాదు. చెవులు శబ్దాన్ని గ్రహించటానికి
కారణమౌతున్న చైతన్యాన్ని నేను. ముక్కు వాసన చూస్తున్నప్పుడు ముక్కూ
నేనుకాదు, వాసనా నేనుకాదు. ముక్కు వాసన గ్రహించటానికి కారణమౌతున్న
చైతన్యాన్ని నేను. కేవల చైతన్యాన్ని నేను. చర్మము
స్పర్శిస్తున్నప్పుడు చర్మమూ నేనుకాదు, స్పర్శిన్చబడేదేదీ నేనుకాదు.
చర్మము స్పర్శను గ్రహించటానికి కారణమౌతున్న జ్ఞానాన్ని నేను. శుద్ధ
జ్ఞాన స్వరూపాన్ని నేను.
ఈ దేహం వ్యాయామం చేస్తూ అలసట పొందుతున్నప్పుడు దేహము నేనుకాదు.
ఏ కదలికలూ లేని నిర్వికార ఆత్మ స్వరూపాన్ని నేను. దేహం అలసట
పొందుతున్నట్లు తెలుసుకుంటున్న చైతన్యాన్ని నేను. నేను కేవలం ఉన్నాను అంతే.
నేను ఉండటం వల్లనే ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఐనా నాకు వాటితోగాని, వాటి
చర్యలతోగాని ఏ సంబంధమూ లేదు. నేను కేవలము సాక్షిని
మాత్రమే. నిశ్చలంగా నిర్వికారంగా ఉన్నాను.
ఈ దేహం స్నానం చేస్తున్నప్పుడు :- ఈ దేహం చెమటతో, మాలిన్యంతో,
దుర్వాసనతో కూడి యుండటం వల్ల తనను తాను నీటితో కడుగుకుంటున్నది.
సబ్బుతో రుద్ది చేతులతో తోమి తోమి మకిలిని వదలించుకుంటున్నది.
నిర్మలము, నిరంజనము ఐన నేను గమనిస్తున్నాను. దేహపు చర్యలనే
కాక మనసులో మెదిలే వికారాలను సైతం గమనిస్తున్న నిర్వికార పరబ్రహ్మ
స్వరూపాన్ని నేను.
దేహం తువ్వాలుతో తుడుచుకుంటున్నప్పుడు :- తడిసిన దేహం తడిని
తుడుచుకుంటున్న విషయం తడవబడని నేను గమనిస్తున్నాను.
శుబ్రమైన దుస్తులు ధరిస్తున్నప్పుడు :- పరిమితమైన ఈ దేహం
దుస్తులతో కప్పుకుంటున్న చర్యను గమనిస్తున్నాను. అనంతమైన నన్ను
కప్పగల దుస్తులెక్కడుంటాయి అని మనసులో మెదిలే ఆలోచనకు కూడా సాక్షిని
నేను.
ఇలా ప్రతి చర్యలోనూ, చేష్టలోనూ కర్తను నిర్దుష్టంగా తనకు వేరుగా
ఉన్నట్లు గుర్తించాలి. ఇలా గుర్తించటం క్రమేణా పెరిగి పెరిగి ఎరుకను నేను
అనే విషయం బలపడాలి. అదే ఆత్మానుభవానికి దారితీస్తుంది. ఐతే శాస్త్రం
ఆదేశించిన విధంగా యజ్ఞ, దాన, తపస్సులను ఆచరిస్తూ క్రమంగా
దేహెంద్రియ మనో బుద్ధులతోగాని, ప్రాణంతో గాని మిళితం కాని ఆత్మ
భావాన్ని శుద్ధి పరచుకొన్నప్పుడు మాత్రమే నేను అనుకొన్న ప్రతిసారీ
అనంతమైన నిరాకారమూ, నిశ్చలమైన నిర్వికారమూ, నిరంజన నిరుపమానమూ
ఐన నేను అని మాత్రమే భావన చెయ్యటం కుదురుతుంది.
ఓం సర్వేషాం స్వస్థిర్భవతు ! అందరికీ శుభమే జరుగుగాక !
సర్వేషాం శాంతిర్భవతు ! అందరూ సుఖ శాంతులతో ఉండుగాక !
సర్వేషాం పూర్ణం భవతు ! అందరి జీవితము సమృద్ధిగా ఉండుగాక !
సర్వేషాం మంగళం భవతు ! అందరి జీవితము మంగళ కరంగా ఉండుగాక !
లోకాః సమస్తాః సుఖినో భవంతు !
నేను అదే! నా లోపలా అదే!నా బయటా అదే!
విద్య – విలువలు
ఈ పని చేస్తే ఈశ్వరుడు అంగీకరించడు. అందుకని ఈ పని చేయను. శక్తి లేక కాదు. ఏది చేస్తే ఆయన సంతోషిస్తాడో అదే చేస్తాను. ఏది చేస్తే మా నాన్నగారు బాధపడతారో అది చేయను. ఏది చేస్తే మా అమ్మగారు సంతోషిస్తారో అది చేస్తాను. వశవర్తి అంటే అదీ. అదే ఆధ్యాత్మికత. అది క్రమ క్రమంగా పరిణతి చెందాలి. మీరు రేపు ఓ గొప్ప ఉన్నతాధికారో, జిల్లా అధికారో అయినప్పుడు- పుష్కరాలొస్తున్నాయి ఏంచేయాలని ఎవరైనా మిమ్మల్ని అడిగితే నాబోటి వాళ్ల చుట్టూ తిరిగే పరిస్థితిలో మీరుండకూడదు. పుస్తక పఠనం అలవాటైతే మీకు ఆ అవసరం రాదు. మీకు ఎప్పుడు అవకాశం వచ్చినా, భగవంతుడి కోసం, పదిమందిని సంతోష పెట్టడం కోసం బతకడం రావాలి.
అదీ ఆధ్యాత్మిక పరిణతి అంటే..!
పరమేశ్వరుడు తప్ప మరొకటి లేదు. భూమి ఆయనే, గాలి ఆయనే, నీరు ఆయనే, నిప్పు ఆయనే. ఆయనే సూర్యుడు, చంద్రుడు, జీవుడు. ఆయన కానిదేముంది? నా ఎదురుగుండా ఉన్నదదే, నేను అదే, నాలో ఉన్నదదే. నాకు బయట ఉన్నదదే. ఉన్నది ఒక్కటే అన్న భావనతో జీవితం పూర్తయిపోతే… ఆ పరిణతికి ముగింపు.
ఇలా ఇప్పటివరకు మనం వ్యక్తిత్వ వికసనంలో చెప్పుకున్న ఐదింటిని నిరంతరం పరిశీలన చేసుకుంటూ ఉంటే… ఆగిపోవడమన్నది ఉండదు. వీటిలో మొదటిది ఆరోగ్యం. నాకు ఎన్నేళ్లు వచ్చాయన్నది ప్రశ్న కాదు. ఆరోగ్య పరిరక్షణ కోసం వయసుకు తగిన వ్యాయామం ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. రెండవది అధ్యవసాయం (మెంటల్లీ అలర్ట్)- నాకు 90 ఏళ్లు అనుకోండి. ఆ వయసులో సమాజానికి ఏం చేయవచ్చో నాకో స్పష్టత ఉండాలి. మూడవది సునిశిత ప్రజ్ఞ-నా అనుభవాన్ని, నా చదువును దృష్టిలో పెట్టుకుని సునిశిత ప్రజ్ఞతో ప్రకాశించాలి. నాలుగవది ఆవేశంలో సమతౌల్యత. దీనివల్ల నా వృద్ధిని, సమాజాభివృద్ధిని నేను సమన్వయం చేసుకోవాలి. చివరిది – ఆధ్యాత్మికత. దీనిలో నిరంతరం పురోభివృద్ధి పొందుతూ ఉండాలి.
ఈ ఐదూ ఉంటేనే వ్యక్తిత్వ వికసనం అంటారు. ఇసుక, ఇటుక, సిమెంట్, నీరు… ఇవన్నీ విడివిడిగా ఉన్నప్పుడు కాలితో, వేలితో కదిపినా చెరిగిపోతాయి. కానీ అవన్నీ కలిపి కట్టే గోడను నేనొక్కడినే కాదు, మనందరం కలిసి నెట్టినా పడిపోదు, గట్టిగా ఉంటుంది. ఈ విధమైన స్థిరమైన స్థితి పొందితే వికసనం పొంది ఉన్నాడని అర్థం. అటువంటి వ్యక్తి ఎక్కడున్నా సమాజ అభ్యున్నతికి, తన అభివృద్ధికి, తన కుటుంబ అభివృద్ధికీ కారణమౌతాడు. ”నువ్వెవరు? నీది ఏ కులం? నీ తల్లిదండ్రులెవరు? నీకు ఐశ్వర్యమెంత ఉన్నది? ఎంత చదువుకున్నావు? అన్న విషయాల కన్నా నీ నడవడిక ఎలా ఉంటుంది? నీవు పెద్దల దగ్గరికి వెళ్లినప్పుడు ఎలా ప్రవర్తిస్తావు? నీ కన్నా తక్కువవాడు కనబడితే ఎలా సమన్వయం చేసుకుంటావు? నీతో సమానులు కనబడితే ఎలా ఆదరభావాన్ని ప్రకటిస్తావు? వీటిలో నీ ఆచరణను బట్టి నీ శీలాన్ని నిర్ణయం చేస్తారు – అంటుంది రామాయణం.
శీలం అంటే స్వభావమని అర్థం. ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేక స్వభావంతో ఉంటాడు. ఒక తల్లికి ఒకే సమయానికి పుట్టిన కవల పిల్లలు కూడా ఒకే స్వభావంతో ఉండరు. ఒకరు ఒకటి ఇష్టపడితే ఇంకొకరు వేరొకదానిని ఇష్టపడతారు. లోపల స్వభావం ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగానే మనిషి నడవడిక కూడా ఉంటుంది. స్వభావం పుట్టుకతో వస్తుంది. కానీ పుట్టుకతో వచ్చిన స్వభావం సత్సంగం చేత, నీవు ఆచరించే మంచి పనుల చేత, మంచి గుణాల చేత, మంచి మాటలు వినడం చేత మారుతుంది.
”నా చెవులు ఎప్పుడూ భద్రమైన మాటలు వినుగాక” అంటుంది శాస్త్రం. అంటే ”ఏ మాటలు వినడం చేత నా స్వభావంలో మార్పు కలుగుతుందో, నా మనసును ప్రభావితం చేస్తాయో, ప్రభావితమైన మనసు ఆ సంకల్పం చేస్తుందో, ఆ సంకల్పానికి అనుగుణంగా ప్రవర్తిస్తేనే నాకు కీర్తి కానీ, అపకీర్తి కానీ కలగడమనేది జరుగుతుంది. కనుక నా ప్రవర్తన పదిమంది చేత గౌరవం పొందడానికి యోగ్యమైన రీతిలో మనసును ప్రచోదితం చేయగల మంచి మాటలు మాత్రమే నా చెవులయందు పడుగాక !” అని.
”ఒకవేళ నా చెవులు అన్నిటినీ విన్నప్పటికీ, నా మనసు మాత్రం సారవంతమైన మాటలను మాత్రమే పుచ్చుగొనుగాక! దానిచేత ప్రభావాన్ని పొందిన మనసు సత్సంకల్పాలను ఇచ్చి, బుద్ధి నిర్ణయం చేసి తదనుగుణమైన ప్రవర్తన చేత నేను శోభిల్లెదను గాక” అని దేవతలను మనం ప్రార్థన చేస్తాం. అందుచేత శీలం అనేది అత్యంత ప్రధానమైన విషయం. అది స్త్రీకి కానివ్వండి, పురుషుడికి కానివ్వండి, శీలమే గొప్ప సంపద. ఎవరు శీలవంతులో వారి శరీరం వెళ్లిపోయినప్పటికీ కూడా వారి నడవడికను ఆదర్శంగా యుగాల తరువాత కూడా చెప్పుకుంటారు.
రామచంద్రమూర్తి త్రేతాయుగంలో జీవించాడు. దాని తరువాత ద్వాపరయుగం వచ్చింది. తరువాత కలియుగం వచ్చింది. అయినా మనుష్యుడు-ప్రవర్తన-నడవడిక-శీలం- జీవితం-ఆదర్శం వంటి విషయాల ప్రస్తావన వచ్చినప్పుడు రాముడినే ఉదాహరణగా చెబుతారు. రాముడిలా బతకండి అని చెబుతారు.
ప్రేమ ప్రవాహమే భక్తి
మనసేమీ బాగలేదు. అలా సినిమాకెళ్దాం. మిత్రుల మధ్య గడుపుదాం అని పలుకుతూ ఉంటారు. అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు కూడా. నిజమే. బావుంది. ఫలితమేమిటి? అలా చెయ్యడం వల్ల బాగలేని మనస్సు బాగుపడుతుందా? కానేకాదు. బాగుపడలేని మనస్సు, బాధపడే మనస్సు తాత్కాలికంగా బాధను మరచిపోతుంది. అంతే.సినిమాలో ఉండేది రెండు మూడు గంటలే. బంధుమిత్రాదుల మధ్య ఎంతకాలం ఉండగలం? వాళ్లను, లేదా ఆ పరిస్థితుల్ని విడిచిపెట్టి రాగానే మళ్లీ జ్ఞాపకాలు ప్రారంభమవుతాయి. స్మృతులు కదుల్తాయి. మతులు కలవరపెడతాయి.
మరొక విషయాన్ని కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. వినోదాల మధ్య మనం ఉన్నంత మాత్రాన జ్ఞాపకాలు రావని చెప్పలేము. సరదాగా స్నేహితుల సరసన నవ్ఞ్వతూ కాలం వెళ్లబుచ్చుతున్నా, బాధల జ్ఞాపకాలు రావచ్చు. అలాంటి సమయాల్లోనే ప్రక్కవారు ”ఏమిటి? ఉన్నట్లుండి అదోలా మారిపోయారు అని మన ఆంతర్యంలోని మూగబాధను ముఖాలలో చూసి మాట్లాడుతూ ఉంటారు. అర్థమైందా? మన గతాలు స్వగతాలుగా మారి, అనుక్షణం బుద్ధిలో స్వాగత తోరణాలను అలంకరిస్తూ ఉన్నంతకాలం బాధల నుండి విడివడటం మనకు సాధ్యం కాదు. మనం మనకు జ్ఞాపకం వస్తున్నంత కాలం మనస్సు మదనపడుతూనే ఉంటుంది. మనుగడ మలినపడుతూనే ఉంటుంది.
అయితే, ఒక్క సత్యాన్ని ఇక్కడ విస్మరించకూడదు. మనస్సు దేనిని గురించి ఆలోచించినా, బుద్ధి మరొకచోట సంచరించినా ఫలితం మాత్రం శూన్యంగానే ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆలోచనలన్నీ ప్రపంచానికి సంబంధించే ఉంటాయి. మన స్మృతులు అందుకు భిన్నంగా లేవు. సంబంధాలతో ముడిపడియున్న ఈ ప్రపంచంలో ఒక అనుభవం మరొక అనుభవంతో కరచాలనం చెయ్యకపోదు. మనం క్రొత్తవిగా భావిస్తున్న ఆలోచనలు పాత జ్ఞాపకాలను రెచ్చగొట్టి, రచ్చకీడ్చి బాధపెడితే ఆశ్చర్యపడవలసినది ఉండదనే నా అభిప్రాయం.లోకంలో కలిగేవన్నీ లౌకికానుభవాలే. లౌకికానుభూతులే. ఇవే శోకాలు. చీకటిని చీకటితో పోగొట్టలేము. (నహి తమ స్తమసో నివర్తకమ్) మరి బాధల వలయం నుండి ఎలా విడిపడాలి? దానికి మార్గమేమిటి? మార్గం ఉంది. అదే భక్తి.
భక్తి ఏం చేస్తుంది? భక్తి వల్ల బ్రతుకులో ఏం జరుగుతుంది? భక్తి మనస్సును సంస్కరిస్తుంది. మనస్సులోని స్మృతులను శాశ్వతంగా మరుగున పడేస్తుంది. మహిమను ఆవిష్కరిస్తుంది. పరమేశ్వరునితో మనకుండే సంబంధాన్ని భక్తి గుర్తుచేస్తుంది. భగవంతుని స్మరణతో బుద్ధిని నింపేస్తుంది. జ్ఞాపకాలతో గొడవపడే మనస్సును గోవిందునితో ముడిపడి జీవించేలా చేస్తుంది. భక్తి ఎలా చెయ్యాలి? భక్తితో బుద్ధిని భవ్యంగా ఎలా మార్చుకోవాలి? బుద్ధిలో సదా భగవంతుడే శోభించే లాగా ఆచారాన్ని, విచారాన్ని కదిలిస్తూ ఉండటమే భక్తి.
నిరంతరం భగవన్నామాన్ని మానసికంగా జపిస్తూ ఉండాలి. విశ్వమంతా పరమేశ్వరుని విభూతిగా భావించి, వీక్షిస్తూ ఉండాలి. భగవల్లీలలను శ్రవణం చేస్తూ ఉండాలి. కీర్తిస్తూ జీవించాలి. సద్గ్రంథాలను శక్తి వంచన లేకుండా అధ్యయనం చేస్తూ ఉండాలి. విరామం దొరికితే పరమేశ్వరుని ధ్యానంలో చిత్తాన్ని లయింపచేస్తూ ఉండాలి. ఈ విధమైన భక్తి కార్యాలను శ్రద్ధతో ఆచరిస్తూ దివ్యప్రేమను పెంపొందించుకోవాలి.మనస్సులోని జ్ఞాపకాలే, ఆలోచనలే బాధల రూపంలో వ్యక్తమౌతాయని గ్రహించాము కదా! ఇప్పుడు అవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. జ్ఞాపకాలు ఉన్నాయి. కాని బాధలు లేవు. ఆలోచనలు ఉన్నాయి. కాని ఆవేదనలు లేవు. ఎందుకని? ఇప్పుడున్న జ్ఞాపకాలలో గోవిందుడు ఉన్నాడు. ఆలోచనలలో అచ్యుతుడు పచార్లు చేస్తున్నాడు. ఇదే భక్తి వైభవము. బాధలను సమూలంగా పాతిపెట్టి, బ్రతుకును భవ్యంగా, దివ్యంగా మార్చే భగవద్భక్తి వైభవము.
మద్భక్తోభవ! అర్జునా! నాకు భక్తుడివి కా! అని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ మాట అర్జునుడి కొరకే అనలేదు. మనందరి కొరకు అన్నాడు. అర్జునుడు భక్తుడై తరించాడు. మనము కూడా అర్జునుని అడుగుజాడలలో పయనించి, కృష్ణభక్తిని పెంచుకుందాం.
భక్తి అనేది ప్రేమప్రవాహం. ఉన్నచోటనే ఉండదు. సదా కదుల్తూ ఉంటుంది. కదిలిస్తూ ఉంటుంది. ఒక దశలో జ్ఞానకడలిలో కలిసిపోయేలా, కరిగిపోయేలా చేస్తుంది.
సర్వం కర్మాఖిలం పార్థజానే పరిసమాప్యతే
‘అర్జునా! (భక్తి) కార్యములన్నియు ఆత్మజ్ఞానము నందే విలీనమౌతున్నాయి’ అని ప్రసన్న గంభీరంగా పలికాడు మన నొసటిరాతను తుడిచే ప్రయత్నంలో శ్రీకృష్ణుడు.

Comments
Post a Comment