(Telugu) గరుడుని_గర్వ_భంగము (చిన్న కధ )

[:te]
ఒకప్పుడు గరుత్మంతునికి ,తాను మహా బలవంతుడనని గర్వము కలిగెను. తాను తక్కువవాడా ? గజ కచ్చపములను చెరియొక కాలితో పట్టుకొని కొన్ని యోజనముల దూరము ఎగురుట, అంతమంది రక్షకులను గెలిచి దేవలోకమున నున్న అమృతమును దెచ్చుట ,ఇంద్రుని వజ్రాయుధమునకు బెదర కుండుట సామాన్య విషయములా ? అవన్నియు ఎందుకు ? సకల బ్రహ్మాండ భాండములను తన కడుపులో బెట్టుకున్న ఆ శ్రీ మహా విష్ణువును అనాయాసముగా వహించుచు లోకములన్నియు దిరుగుచున్న తన కంటే బలవంతుడీ చతుర్దశ భువనములలో ఇంకెవడున్నాడని గర్వ పడ సాగెను. దానితో అందరిని కొంత చులకనగా జూచుచు ప్రవర్తింప జొచ్చెను. ఇది నారాయణుని దృష్టిలో బడినది .ఇతనికెట్లయినను గర్వ భంగము చేయవలెనని సంకల్పించెను.

 

ఒకనాడు నారదాది మునులు శ్రీ పతిని దర్శించుటకై వచ్చిరి .విష్ణుమూర్తి వారితో మాటలాడుచు అలవోకగా ప్రక్కనున్న గరుడునిపై చేయి వేసెను. మునులతో మాధవుని సంభాషణ సాగుచుండెను . గరుడునికి విష్ణుమూర్తి చేయి భరించ లేనంత బరువుగా నుండెను. ప్రాణములు కడ బట్టు చుండెను . సంభాషణ ఎంతసేపు సాగినదో కాని గరుడు డీలోపున ప్రాణ వశిష్టు డయ్యెను. ఎప్పటికో మునులు సెలవు దీసుకుని వెళ్ళిరి. శ్రీ హరి అప్పుడా చేయి గరుడుని మీద నుండి తీసెను. గరుడప్పటికే సొమ్మసిల్లి పడిపోయెను.

 

శ్రీ హరి అతనిని మృదువుగా సృశించెను . గరుడుడా స్పర్శతో తేరుకుని , విష్ణు మూర్తి పాదములపై బడి ," ఓ మహాపురుషుడా ! నీకన్న సృష్టిలో అధికు లెవ్వరును లేరు ఈ పరమార్ధమును గ్రహింపలేక గర్వాందుడనైన నాకు సరియైన పాటమును చెప్పితివి ,నా యాపరాధమును మన్నింపు " మని వేడుకొనెను . శ్రీ హరి ప్రసన్నుడయ్యెను .
[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము