రోజూ కనీసం అర గంట... ధ్యానం, యోగ చెయ్యండి... ఆరోగ్యంగా జీవించండి...
బ్రహ్మవిదుడూ, ఉత్తముడు (శ్రోత్రియుడు), కరుణామయుడూ ఐన గురువును చేరి ఆయనను సేవించి, జిజ్ఞాసువైన సాధకుడు ఆత్మవిచారణా విధానాన్ని, ధ్యానం చేసే పద్ధతిని తెలుసుకొని ఆయన చూపిన మార్గం వెంట పయనించాలి.
అర్హత కలిగిన సాధకుడే సాధనలో విజయం సాధించగలడని అర్హత లేనివానికి సిద్ధిలేదని ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నాం. ఈ శ్లోకంలో గురువు యొక్క అర్హతలూ చెప్పబడ్డాయి, శిష్యుని కర్తవ్యమూ చెప్పబడింది.
(i) బ్రహ్మవిదుం :- బ్రహ్మవిదుడు అంటే బ్రహ్మమును గురించి తెలిసినవాడు అని. ఈ లోకంలో సత్ప్రవర్తనతో ఎలా నడుచుకోవాలో చెప్పేవారే ఎక్కువమంది. అదీ కావాలి. ఎవరికి? సామాన్యులకు. మానవజీవిత లక్ష్యమైన మోక్షాన్ని పొందాలని తపనపడే జిజ్ఞాసువులకు సదాచారాన్ని గురించి చెబితే ప్రయోజనం లేదు. వారికి మోక్షాన్నందుకొనే ఉపాయాన్ని చెప్పాలి. దానికై చేయవలసిన సాధనలను చెప్పాలి. ఆత్మను గురించి చెప్పాలి. సదాచారం గురించి కాదు. సర్వాత్మభావం కావాలి అని డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారన్నారు. ఆత్మా బ్రహ్మమూ ఒక్కటేనని తెలియజేయాలి. ఆ బ్రహ్మము నీవేనని తెలియజేసి బ్రహ్మనిష్ఠలో నిలిచేట్లు చేయాలి. ఇలా చేయాలంటే గురువు బ్రహ్మము గురించి తెలిసిన బ్రహ్మవిదుడు కావాలి. విత్ = తెలియుట. ఎవరో చెప్పిన మాటలు గాక శాస్త్రాల నుండి జ్ఞానాన్ని సంపాదించాలి. అప్పుడే సత్యం తెలుస్తుంది.
(ii) ఉత్తమం:- ఉత్తముడు అంటే శాస్త్రం బాగా తెలిసినవాడు అయి ఉండాలి. శాస్త్రం తెలియకపోతే బోధించటం కుదరదు. శాస్త్ర విషయాలు ఆధారంగా చూపకపోతే శిష్యునికి నమ్మకం కుదరదు. కనుక వేదవిజ్ఞానం - ఉపనిషత్తుల జ్ఞానం గురువుకు ఉండాలి. అట్టి గురువే ఉత్తముడు.
(iii) దయాసింధుం గురుం :- గురువు కేవలం శ్రోత్రియుడు, బ్రహ్మవిదుడే గాక అనంత కరుణాసముద్రుడయి ఉండాలి. ఎందుకంటే శిష్యులలో ఉత్తమాధికారులేగాక మందాధికారులు, మధ్యమాధికారులు కూడా ఉంటారు. ఎంత మందబుద్ధి కలిగినవాడికైనా అర్ధమయ్యేటట్లుగా - తగిన ఉపమానాలతో బోధించకపోతే శాస్త్రజ్ఞానం అతడికి వృధా అయిపోతుంది. కనుక ఓర్పుతో శిష్యుల యొక్క స్థాయికి దిగివచ్చి తన బోధను సాగించాలి. సాధనలకు తగిన విధంగా సూచనలిస్తూ వారికి తోడ్పడాలి. శాస్త్రాన్ని అర్థం చేసుకోవటంలో సాధకులకు అనేక ఇబ్బందులుంటాయి. ఆటంకాలుంటాయి. వాటన్నింటిని సానుభూతితో అర్థం చేసుకొని శిష్యులకు తగినవిధంగా తోడ్పాటు నందించాలి. ఇదంతా చేయాలంటే శిష్యులపై ప్రేమ - కరుణ - అనుగ్రహ దృష్టి ఉండాలి.
పూర్వజన్మ సుకృతం వల్ల మానవజన్మ కలిగి, మోక్షాపేక్షులై సద్గురువును ఆశ్రయించిన వారు తమను తామే ఉద్ధరించుకోవాలని, తమ ఉన్నతికి తామే పాటుబడాలని ఇంతకుముందు శ్లోకంలో చెప్పారు. ఎలా పాటుబడాలి? ఎలా తమను తాము ఉద్ధరించుకోవాలో ఇక్కడ చెబుతున్నారు. అట్టివారు ముందు పండితులు – ధీరులు కావాలి.
(1) పండితై:- సద్గురువును చేరి కొంతకాలం ఆయనను సేవించి, పూజించి, ఆయన ఆదేశాలను పాటిస్తూ ఉంటే ఆయన తగిన సమయంలో శాస్త్రాన్ని బోధించటం ప్రారంభిస్తాడు. ఆయన బోధలను సావధానంతో; నేర్చుకోవాలనే ఆతృతతో, తపనతో; ప్రశాంతమైన మనస్సుతో శ్రవణం చేసి మననం చేసుకోవాలి. విషయాలను స్థిరపరచుకోవాలి. దానితో ఈ ప్రపంచంగాని, ఇక్కడి సంబంధాలు గాని, ఇక్కడి భోగాలు గాని, అన్నీ అనిత్యమైనవని, మిథ్యయని, శరీరం ఉన్నంత వరకే గాని ఆ తర్వాత వాటితో సంబంధం ఉండదని గ్రహించటం జరుగుతుంది. ఈ అనిత్య వస్తువుల ద్వారా విషయాల ద్వారా నిత్యమైన ఆనందం రాదని - నిత్యమైన ఆనందమే తమకు కావాలసిన ఆనందమని తెలుస్తుంది - ఇది తెలిస్తే వారు పండితులే.
(2) ధీరై:- ఇలా ప్రపంచ అనిత్యాత్వాన్ని తెలుసుకున్న తర్వాత, తనకు కావలిసిన నిత్యమైన ఆనందం నిత్య వస్తువైన ఆత్మవల్లనే లభిస్తుందని తెలిసిన తర్వాత అనిత్యమైన వాటిని వదలగలగాలి. అనిత్య ప్రపంచాన్ని నిరశించాలి. అలా నిరశించాలంటే గొప్ప ధైర్యం కావాలి. అందుకే ధీరై అన్నారు. అలా పండితులు, ధీరులు అయినవారు ఏంచేయాలి?
*(3) సర్వకర్మాణి సన్యస్య:- లోపల నుండి కలుగుతున్న కోరికల ప్రేరణతో చేయబడే సర్వకర్మలనూ వదలి వెయ్యాలి. ఎప్పుడైతే బుద్ధిలో కోరికలు కలిగాయో వెంటనే వాటిని ఎలా తీర్చుకోవాలా? అనే ఆలోచనలు ప్రారంభమౌతాయి. దానితో మనస్సులో సంచలనం - అశాంతి. ఈ సంచలనం - అశాంతి కర్మలు చేసినప్పుడే ఆగిపోతుంది. కాకపోతే ఆ కర్మల ఫలాలు మళ్ళీ నీలో సంచలనం కలిగిస్తాయి. అవీ అణిగితే మరల కొత్త కోరికలు - కొత్త సంచలనాలు
మన శరీరం లోకి వెళ్లిన ఆహారం 24 గంటల్లో... మలినంగా బయటికి వెళ్లిపోవాలి, లేకపోతే జబ్బులు.
మన శరీరం లోకి వెల్లిన నీరు 4 గంటల్లో… బయటికి వెళ్లిపోవాలి, లేకపోతే జబ్బులు.
మన శరీరంలోకి వెళ్లిన గాలి ఒక నిముషంలోగా… బయటికి వెళ్లిపోవాలి లేకపోతే మనం రోగ గ్రస్థులం అవుతాం.
మరి మనలోకి చేరిన కోపం, అసూయ, ద్వేషం, మోసం... ఇలాంటివన్నీ సంవత్సరాలుగా మనలోనే ఉంటే... ఏమౌతుందో తెలుసా... మనం నిత్య రోగగ్రస్తులుగా అవుతాం.
అందుకే ఋషులు అంటారు... "మనం రోజూ జీవిస్తున్నాం అని అనుకుంటున్న మూర్ఖులం... నిజానికి మనం రోజూ కొద్దీ కొద్దీగా మరణిస్తున్నాం. మనకు వయసు పెరిగితే... ఆయుష్షు తగ్గినట్టా? పెరిగినట్టా?... మనం ప్రతి రోజూ... నెగెటివ్ ఎనర్జీ లతో కొద్ది కొద్దిగా మరణిస్తున్నామన్న చేదు నిజాన్ని త్వరగా గ్రహించాలి.
మనలో చేరి బయటికి వెళ్లిపోకుండా తిష్ట వేసుకొని... మన జీవితాల్ని మృతప్రాయం చేస్తున్న కోపాన్ని, ఒత్తిడిని, ద్వేషాన్ని, బద్ధకాన్ని, అనారోగ్యాన్ని… ప్రతి రోజూ ధ్యానం, యోగ చెయ్యడం ద్వారా ప్రాణ శక్తిని ఎక్కువగా పొంది నెగెటివ్ ఎనర్జీ దూరం చెయ్యాలి. మన శరీరంలోకి అధిక మొత్తంలో ప్రాణ శక్తిని చేర్చే ఏకైక మార్గం ధ్యానం, యోగాయే...
అందుకే భారతీయ ఋషులు ధ్యానం, యోగ మార్గాన్నే అనుసరించారు.

Comments
Post a Comment