(Telugu) సుఖానికి సనాతన ధర్మం
[:te]సనాతన ధర్మం
“సుఖానికి సనాతన ధర్మం సహకారినా? వ్యతిరేకినా?” –
జీవుల సుఖప్రాప్తికి, దుఃఖ నివృత్తికి సనాతన ధర్మం అత్యంత సహకారియే అయి ఉన్నది. కానీ, ఈకాలంలో కొద్దిమంది భ్రాంతులై, ఈ ధర్మం సుఖానికి కారణం కాదని, దుఃఖానికే కారణమైనదని తాము భ్రమించడమే కాక ఇతరుల బుద్ధినీ ప్రభావితం చేస్తున్నారు.సరియైన జ్ఞానాన్ని పొందినవాళ్ళు ఉన్నప్పటికీ ఈ విరుద్ధ భావాల్ని తుడిచే ప్రయత్నాన్ని చేయడంలేదు. దీనికి కారణాలు సరిగ్గా తెలియరావడం లేదు. కాబట్టి, మాకు తెలిన మేరకుపరోపకార బుద్ధితో సనాతన ధర్మం మహాసుఖప్రాప్తికి, సమస్త దుఃఖ నివృత్తికీ దోహద కారియని తెలియజెప్పే క్రమమే మా ఈ చిన్న ప్రయత్నం. ప్రతి ఒక్కరూ ఇలానే చెయ్యాలని కట్టడి చేయడానికి ఈ గ్రంధాన్ని వ్రాయలేదు.
పూర్వం మహాభారత యుద్ధ సందర్భంలో అర్జునుడు “యుద్ధం పాపానికీ, దుఃఖానికీ కారణమైన”దనిశంకించినపుడు, శ్రీకృష్ణ పరమాత్మ ధర్మయుద్ధం క్షత్రియులకు పూర్వపుణ్యం వల్లనే దొరుకుతుందని, అది రాబోయే మహాపుణ్యానికి సాధనా మార్గమని, అందువల్లనే మహాసుఖానికీ కారణమని తెలిపాడు.
అర్జునుడిని యుద్ధంచేయమని ఎప్పుడూ భగవంతుడు బలవంతం చేయలేదు, అన్న తరువాత ఎవరు ఎవరినీ బలవంతం చేసేందుకు వీలులేదు. కాబట్టి మేము సనాతన ధర్మం మహాసుఖాని కి కారణమైనదని చెప్పడానికి మాత్రమే పూనుకున్నాం. మా మాటల్లో ఏవైనా దోషాలు కనబడితే, విశేషజ్ఞానులు తెలుపగలరు. దీనివల్ల మాకూ దిద్దుబాట్లు చేసుకునేందుకు అనుకూలమౌతుంది.
1. సుఖము యొక్క ప్రశంస మరియు దాని ప్రభేదాలు:
లోకంలో ప్రజలు కోరే ధనం, ధాన్యం, ఇల్లు-వాకిలి, విద్య, అధికారం, కీర్తి, మర్యాద, పుణ్యం, బంధువర్గం మొదలైన నానా విషయాలన్నీ తమతమ సుఖానికేనని లేక దుఃఖ నివృత్తికేనని భావిస్తారు.
సుఖం స్వతహాగా సుందర మైనది. దానిని పురుషులు (జీవులు) కోరడం చేత అదే ముఖ్యమైన పురుషార్థమని చెప్పబడుతుంది.లోకప్రసిద్ధాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలు పురుషులచే (జీవులచే)
కోరబడి, సుఖానికి కారణమై నప్పుడే వీటికి పురుషార్థాలని పేరు దక్కింది.
ఇంత ముఖ్యమైన పురుషార్థ శబ్ద వాచ్యమైన “సుఖ” లో
(1) తాత్కాలిక సుఖం (2)దీర్ఘకాలిక సుఖం
(3) పరలోక సుఖం మరియు (4) శాశ్వత సుఖం – అని నాలుగు విభాగలున్నాయి.
అవివేకులైన పిల్లలు మొదలైన వారు తాత్కాలిక సుఖాన్ని కోరుతారు. వివేకులుదీర్ఘకాలిక సుఖానికై ప్రయత్నిస్తారు. ఆస్తికులు దీర్ఘకాలిక సుఖాన్ని లెక్కించక పరలోక సుఖానికై ప్రయత్నిస్తారు. పరమ ఆస్తికులు కేవలం శాశ్వత సుఖానికే మహాప్రయత్న శీలురౌతారు.
“విచారించి చూస్తే, సుఖం అన్నది శరీరంలోని పదార్థమే కానీ శరీరానికి ఆవలనున్నది కాదు. సుఖం జీవి (soul) అంతఃకరణం యొక్క ధర్మమే అయివున్నది.” కావున, సుఖాన్ని పొందగోరినవారు తమ అంతరంగం వైపుకు దృష్టి పెట్టక బాహ్య పదార్థాల ను సంగ్రహించడం వైపే దృష్టి సారిస్తే,ఉత్తరదిక్కువెళ్ళవలసిన వారు దక్షిణదిక్కుకు ప్రయాణించడంలాంటి ఆభాసమే (fault)అవుతుంది.
సుఖమంటే తమకు అనుకూల మైనదనే భావించినప్పుడు, దాని ప్రతికూలమైనవన్నీ దుఃఖాలే. ఈ సుఖదుఃఖాలు మన వశంలో లేనివి. ఒకవేళ అవి మన అధీనంలోనే ఉన్నవైతే ఎవ్వరూ దుఃఖ పడకూడదు. ఎల్లప్పుడూ సుఖభోగులయ్యే ఉండాలి. కానీ, అలా ఎవ్వరూ శాశ్వత సుఖభోగులు కానందువల్ల, శాస్త్రాలలో చెప్పిన విధంగా మనమనుభవించేసుఖదుఃఖాలు మన అదుపులోలేనివని తెలుసుకోవాలి.
మన మనోభావాల వల్లనే సుఖదుఃఖాలు ఉత్పన్నమౌతా యని కొందరి వాదన. మనం స్వతంత్ర్యులైనప్పుడు ఎలాంటి దుఃఖ భావమూ మనల్ని తాకకుండా జాగ్రత్త పడవచ్చు కదా? మన నాలుకను మనమే కొరుక్కుని, తద్వారా కలిగే నొప్పిని (దుఃఖానుభవాన్ని) నివారించుకోలేక పోవడం ద్వారా మనం స్వతంత్ర్యులం కామని, సుఖదుఃఖాలు మన అధీనంలో లేవని తెలుసుకోవచ్చు.
ఇలానే భోజనం మొదలైన సుఖసామగ్రులు అందుబాటు లో లేనప్పుడు కూడా మనిషి మనసు ఒకొక్కప్పుడు ఉల్లాసంగా ఉండడం అనుభవైకవేద్యమే. అలానే అన్ని సుఖ కారక వస్తువులు (మంచి భోజనం మొదలైనవి) ఉన్నాకూడా మనసు విచారం లో మునిగి ఉండడం కూడా చూస్తాము. వీటన్నింటినీ చూసినప్పుడు సుఖదుఃఖాలు దైవాధీనాలని స్పష్టమౌతుంది. అంటే పదార్థాల ద్వారా లభించేదే సుఖమని నమ్మరాదు.
కాబట్టి దుఃఖ పరిహారాన్నీ, ఈ లోకపు అల్పసుఖాన్నీ, శాశ్వత మోక్షసుఖాన్నీ కోరేవారు, దైవానుగ్రహ సంపాదన చేయాలని, తద్వారానే జీవుల దుఃఖ నివృత్తి అవుతుందని వేదాది శాస్త్రాలు చెబుతున్నాయి.
ప్రమాణముల విమర్శ:
పరలోకాలు, వాటికి కారణ మయ్యే పుణ్యపాపాలు, వీటిల్ని అనుభవించేదేహాతిరిక్త ఆత్మ(జీవి), మోక్షం; సమస్త ప్రపంచానికీ నియామకుడైన దేవుడు – ఇవన్నీ కంటికి కనిపించనివి కాబట్టి వీటిల్ని నమ్మాల్సిన అవసరం లేదని కొందరు చెబుతారు. కానీ ఇది సరికాదు. ఏ వస్తువే గానీ “ఉంది” అథవా “లేదు” అని చెప్పడానికి ఆధారాలు అవసరం.
ఉదాహరణకు, ఏ ఇంద్రియాని కి ఏ వస్తువు విషయం అవుతుందో, ఆ ఇంద్రియం ఆ వస్తువు “ఉన్నది”, “లేదు” అనడానికి ఆధారమౌతుంది. కుండ మొదలైన వస్తువులు కంటికి “విషయ”మైనందువల్ల, ఈ చోట “కుండ ఉంది” అనడానికి గానీ “కుండ లేదు” అని అనడానికి కన్నే (Eye) ఆధారం. వస్తువు ఎలా ఉన్నదో అలాగే గ్రహించడాన్ని “ప్రమాణం” అంటారు. కన్ను లాగే శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం మొదలైనవాటిని తెలిపే ప్రమాణాలే శ్రోతృ, త్వక్, చక్షుసు, రసన, ఘ్రాణేంద్రియా లు. వీటినే “పంచేంద్రియాలు” అంటారు. ఇది లోకప్రసిద్ధం.
ఈ పంచేంద్రియాలను శాస్త్రం లో ప్రత్యక్షప్రమాణాల ప్రభేదాలని పిలిచారు. ఇంద్రియాలకు గోచరంకాని విషయాలను తెలియజెప్పేదే “మనసు”. ఇది శరీరం లోపల ఉండడంవల్ల “అంతఃకరణం” అన్న పేరును పొందింది. (కన్ను మొదలైన వాటికి బాహ్యకరణా లని పేర్లు).
ఇంద్రియాలకు “విషయ”మైన పదార్థాలను నమ్మనివాళ్ళు లోకంలో బ్రతకడమే కష్టమౌతుంది. ఈ విషయం అందరికీ తెలిసినదే. “ఈ వస్తువు ఇక్కడ, ఈఆకారంలో, ఇలా ఉంది” అని అందరూ అన్నప్పుడు అలా లేదు అని అన్నవారు బుద్ధిహీనులని ప్రపంచం పిలుస్తుంది కదా! కాబట్టి మన జీవనం సుఖకరం గా సాగాలంటే ఇంద్రియాలకు గోచరమయ్యే పదార్థాలన్నిటినీ నమ్మి తీరాలి. కేవలం కంటికి కనిపించేవాటినే నమ్మేవారు ఇతర ఇంద్రియాల ద్వారా అనుభవమయ్యేవాటిని నమ్మకపోతే ఆయా ఇంద్రియాల ద్వారా లభించే సుఖాన్ని కాదనుకొన్నవారే అవుతారు. కన్ను చూపించే వస్తువుల్ని అసలు నమ్మని వారు మహా దుఃఖానికి గురి కావల్సి వస్తుంది.
“నేను ఉన్నాను;నేను సుఖాన్ని లేక దుఃఖానీపొందుతున్నాను; నా మనస్సు సరిగాలేదు; అది ఎక్కడెక్కడికో పోతోంది” వగైరా విషయాలు మనందరికీ అనుభవమైనవే. ఈ అనుభవాలు కన్ను మొదలైన ఇంద్రియాలను పోగొట్టుకున్న వారు సహితం అనుభవిస్తారు. కానీ పై అనుభవాలు కన్ను మొదలైన ఇంద్రియాల ద్వారా కలిగేవి కావు. ఇలా కన్ను, చెవి మొదలైన బాహ్యకరణాల ద్వారా దొరకని అనుభవాన్ని గ్రహించే ఇంద్రియానికి “సాక్షి” అని పేరు. ఇది కూడా ప్రత్యక్ష ప్రమాణాల్లోని ఒక ప్రభేదమే.
కన్ను మొదలైన గోళకాలను (అవయవాలను) చూడగలం గానీ “చక్షుసు” మొదలైన ఇంద్రియాలు కానరావు. మనకు చూచే శక్తి ఉంది అంటే అది “చక్షుసు” వల్లనే. కానీ ఆ శక్తి వ్యక్తమయ్యేది కంటి ద్వారా. అలాగే మనం వినగలుగుతున్నామూ అంటే దానికి “శ్రోతృ” అన్న ఇంద్రియం వల్ల సాధ్యం. అంటే “శ్రోతృ” అనే ఇంద్రియపు శక్తి చెవి అనే బాహ్యేంద్రియం ద్వారా తెలిసివస్తుంది. గమనించ వల్సిన విషయమేమిటంటే కన్ను, చెవి మొదలైనవి పని చేస్తున్నాయని “చక్షుసు”, ‘శ్రోతృ”వుల ద్వారా ఊహించి తెలుసుకుంటాము.
దూరంలో పొగను చూసి “అక్కడ నిప్పు ఉంది” అని ఊహిస్తాము. నిజానికి నిప్పు కంటికి కనబడకపోయినా కూడా చూడగలిగినవాడు ఊహించి తెలుసుకుంటాడు. ఈ ఊహ అబద్ధం కాదు. ఉన్న పదార్థాలను తెలియజెప్పే ఈ ఊహకే “అనుమానం” అని శాస్త్రనామం. “ప్రత్యక్షం” మొదటి ప్రమాణమైతే, ఈ “అనుమానం” రెండవది.
దేశాంతర, కాలాంతర పదార్థాలను మరొకరు చెప్పడంవల్లనో, వారి అభిప్రాయాలను వినడం వల్లనో, వారి వ్రాతల వల్లనో తెలుసుకుంటాము. దీనికి “ఆగమం” అని పేరు. ఇది మూడో ప్రమాణం.
లోకంలో “ధర్మం”, “అధర్మం”, “దేవుడు” మొదలైన పదాలున్నాయి. ఈ పేర్లతో పిలువబడే వస్తువులు మనకు తెలియనప్పటికీ అవి ఉండి తీరాలి. ఎలాగంటే మనకు తెలియని ఒక పదార్థముంటే దానికొక పేరున్నట్టే! భాషలోని ఏ పదమూ వ్యర్థం కాదు. దీన్నే కాళిదాసు –
వాగర్థావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే|
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ||
అని చెప్పాడు. ప్రపంచంలో ఏదైనా ఎక్కడైనా ఉన్నా అది “వస్తువు” అన్న పేరును పొందుతుంది. క్రియలు గానీ, గుణాలు గానీ వస్తువులోనే అంతర్భావాన్నిపొందుతాయని తెలుసుకోవాలి.
ఒక పదం మనకు దొరికినప్పుడు ఆ పేరుతో పిలవబడే పదార్థం మనకు తెలియకపోయినా ఆ పదం ద్వారా సూచితమయ్యే వస్తువు త్రికాలాల్లో ఎప్పుడైనా ఉండి ఉంటుందనే భావించాలి.
ధర్మం, అధర్మం మొదలైన అతీంద్రియ పదార్థాలను తెలియజెప్పేదే “ఆగమం”. ఎవరి మాటలతోనూ ధర్మాదు లను నిశ్చయించడానికిసాధ్యం కానందువల్ల, వాటిల్ని తెలియ జెప్పేందుకు వేదాలువచ్చాయి. ఈ వేదాలు ఏ ఒక్క వ్యక్తో లేక వ్యక్తుల సమూహాలతోనో రచించబడినవి కావు. కాబట్టి వ్యక్తిగత దోషాలు లేనివి. ఒకరి నుండి మరొకరికి ఉపదేశ రూపంలో పరంపరానుగతంగా రావడంతో “శ్రుతి” అన్న పేరుతో ప్రసిద్ధి పొందాయి.[:]

Comments
Post a Comment