(Telugu) పిట్టపోరు కుందేలు పోరు
[:te]పూర్వం వింధ్యపర్వతం మీద ఓ చెట్టుతొర్రలో ఓ పక్షి నివసిస్తూ ఉండేది. అది ఆహారాన్ని వెతుక్కుంటూ పొద్దునే బయల్దేరి, సాయంత్రానికి గూటికి చేరుకునేది. ఎప్పటిలాగానే ఒకరోజు పొద్దునే బయల్దేరింది. సాయంత్రం అవుతోంది. గూటికి చేరే ప్రయత్నంలో వేగంగా ఎగురుతూ వస్తోంది. అంతలో వర్షం పట్టుకుంది. కుండపోతగా కురవసాగింది. వర్షానికి బాగా తడిసిపోయింది పక్షి. ఎగరడం కష్టం అనుకుంది. ఓ చెట్టుకొమ్మన కూర్చుంది.
అలాగే ఒక కుందేలు వర్షానికి తడుస్తూ పరుగు పరుగున వింధ్యపర్వతం మీది చెట్టు దగ్గరకు వచ్చి ఖాళీగా ఉన్న చెట్టు తొర్రను గమనించి తొర్రలోకి దూకి, వర్షం నుంచి తప్పించుకుని, వెచ్చగా హాయిగా పడుకుంది. చీకటి చీకటి వేళ గూటికి చేరుకుంది పక్షి. తొర్రలోకి ఆత్రంగా చేరుదామనుకుంటే అడ్డంగా కుందేలు కనిపించింది. చిర్రెత్తుకొచ్చింది పక్షికి. పొడిచి పొడిచి లేపింది దాన్ని.‘ఎవరూ’ అంటూ లేచింది కుందేలు.
‘నా ఇంట పడుకుని, నన్నెవరంటావేంటే! లే!వెళ్ళిక్కణ్ణుంచి. చూడెలా పడుకుందో మహరాజులా.’ కోపగించుకుంది పక్షి.‘నేను వెళ్ళను. ఏం చేస్తావు?’’‘చంపేస్తాను, నన్ను తక్కువగా అంచనా వెయ్యకు.’ అంది పక్షి.‘అది నీ వల్ల కాదుగాని, ముందో విషయం తెలుసుకో! బావులూ, చెరువులూ, చెట్టుతొర్రలూ ఎవరు ముందు ఆక్రమించుకుంటే వారికే చెందుతాయి. నేను నీ కంటే ముందొచ్చాను కాబటి ్ట ఇది నాది. కాదంటావా, దిక్కున్న చోటుకి వెళ్ళి చెప్పుకో, పో’ అంది కుందేలు.
ఎక్కడికీ పోలేక నోరు తగ్గించుకుని ఇలా అంది‘ఈ రాత్రివేళ తగవు ఎందుకు కాని, నేనూ నీతో పాటే ఇక్కడే ఉంటాను. తెల్లారనీ, తగవు తీర్చుకుందాం’ అంది పక్షి.‘అలా అన్నావు, బాగుంది.’ అంది కుందేలు.
నిద్రపోయింది. బాగా అలసిపోయి ఉందేమో! పక్షి కూడా పడుకుంది. తెల్లారిందో లేదో లేచింది పక్షి.‘లేలే! పద, తగవు తీర్చుకుందాం.’ అని తొందర చేసింది.‘తగవు ఎవరు తీరుస్తారు?’ అడిగింది కుందేలు.
‘ఎవరు తీరుస్తారంటే నర్మదానది ఒడ్డున ఓ ముసలిపిల్లి ఉంది. వ్యవహారజ్ఞానంలో దానికి ఉన్నంత పేరు మరెవరికీ లేదు. అలాగే అనుభం కూడా ఎక్కువ. దాని దగ్గరి పోదాం, అదే చెబుతుంది, తీర్పు’ అన్నది పక్షి.‘సరే’నంది కుందేలు.రెండూ పిల్లి దగ్గరకి వచ్చాయి. తగవు అంతా పూసగుచ్చినట్టుగా చెప్పాయి.‘పెద్దదానివి, సరైన తీర్పు నువ్వే చెప్పాలి.’ బ్రతిమలాడాయి. ముసలిపిల్లి చాటుగా నవ్వుకుంది. అదృష్టం అంటే తనదేననుకుంది. కాలు కదపకుండానే కావాల్సిన ఆహారం వెతుక్కుంటూ రావడం గతజన్మలో చేసిన పుణ్యం అనుకుంది. రెంటినీ చంపి తినాలని ఆలోచన చేసి ఇలా అంది.
‘మీరిందాకటి నుంచీ ఏదో చెబుతున్నారుగాని, నాకేదీ వినిపించడం లేదు. ముసలిదాన్నయిపోయాను కదా, చెవులు పని చేయడం లేదు. అందుకని, ఓ పని చేయండి మీరిద్దరూ నా దగ్గరగా వచ్చి, నా చెవుల్లో నోరు పెట్టి గట్టిగా అరిచి చెప్పండి. వింటాను. అప్పుడు మీ గొడవేమిటో ముందు అర్థమవుతుంది. మధ్యాహ్నం అయ్యింది, నాకుపూజా సమయం దగ్గర పడుతున్నది. పూజలు ముగించుకొని దానధర్మాలు చేసుకోవాల్సి ఉన్నది. అయినా తగవు తీర్చేవాళ్ళు ఎందరెందరో ఉన్నా కానీ, మీరు వాళ్ళను ఎవ్వరినీ కాదని, నేనేదో పక్షపాతం లేకుండా తీర్పు చెబుతానని, అంతదూరం నుండి వచ్చారు! అట్లాంటి మిమ్మల్ని ఊరికే వెనక్కి పంపించటం, మాలాంటి తపస్వులకు తగదు.
ఈ లోకంలోనే ఎల్లకాలం ఉట్టి కట్టుకుని ఎవ్వరమూ ఊగులాడం. చచ్చిపోయినప్పుడు ధర్మం ఒక్కటి తప్ప, మరేవీ మన వెంట రావు. కాబట్టి అట్లాంటి ధర్మాన్ని మాత్రం ఎన్ని కష్టాలు ఎదురైనా సరే, పోగొట్టుకోకూడదు. ఇదే సత్యం. మనం సత్యాన్ని ఎప్పుడూ తప్పకూడదు. అన్ని శుభాలకూ మూలం సత్యమే. సత్యానికి తోడుగా మనకు భూతదయ కూడా ఉండాలి. అన్ని ధర్మాలకూ అలంకారం భూతదయే. 'తన శరీరంలో ఎక్కడైనా ముల్లు దిగితే తనకు ఎంత నొప్పి పుడుతుంది! ఇతరుల శరీరాలూ అట్లాంటివే కదా'అని తెలుసుకొని, వివేకవంతులు ఎల్లప్పుడూ హింసకు దూరంగా ఉంటుంటారు. కానీ దుర్మార్గులకు ఇంత లోతుగా అర్థం ఎక్కడవుతుంది?! అందుకని వాళ్ళు దయా-ధర్మాలను విడచి, కేవలం బ్రతకటంకోసం ఇతర జీవుల హింసకు పాల్పడుతుంటారు.
"తనను ఆశ్రయించిన-వాళ్ళను కాపాడటాన్ని మించిన ధర్మం లేదు' అని మన గ్రంధాలన్నీ ఘోషిస్తున్నాయి కదా అంటూ చక్కగా ధర్మోపన్యాసం చేసింది.
అది విని పక్షి , కుందేలు రెండూ చాలా ముచ్చట పడ్డాయి.
అంతలోనే!‘ఏంటాలోచిస్తున్నారు? తొందరగా చెప్పండి. నాకవతల చాలా పనులున్నాయి.’ అంది పిల్లి. కుందేలూ, పక్షీ. పిల్లి రెండు చెవుల దగ్గరికీ రెండూ చేరాయి. చెవుల దగ్గర నోరు పెట్టి మాట్లాడబోయాయి. అంతే! చటుక్కున కాళ్ళతో నొక్కి పెట్టి, మెడలు కొరికీ రెంటినీ చంపేసింది పిల్లి. మూడు రోజుల పాటు వాటిని దాచుకుని, తృప్తిగా తింది.
నీతి: ఒకరిని నమ్మాలన్నా, సన్మానించాలన్నా దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని కాదనుకుని ముందుకి అడుగు వేస్తే ప్రమాదాల పాలవుతాం.[:]

Comments
Post a Comment