(Telugu) మనుషులెందుకు నాస్తికులవుతారు ?

[:te]ఆధునిక ప్రపంచం ఎదుర్కుంటున్న సమస్యల్లో ఉగ్రవాదం కంటే నాస్తికత్వం అతిపెద్దసమస్య. ఇది కేవలం భారతదేశానికీ, హిందూ మతానికి పరిమితమైనది కాదు. అన్ని దేశాలూ, అన్ని మతాలూ నాస్తికుల నుంచి ముప్పు నెదుర్కుంటున్నాయి. అయితే నాస్తికత్వంలో కూడా చాలా రకాలున్నాయి. అందుచేత నిజమైన నాస్తికుల్ని గుర్తుపట్టడంలో మనం అప్పుడప్పుడు విఫలమవుతాం. అసలు మనుషులెందుకు నాస్తికులౌతారో చర్చిస్తే ఆ బెడదని ఎలా నివారించాలో, ఎక్కణ్ణుంచి ఆస్తికతా ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టాలో మనక్కాస్త స్పష్టత ఏర్పడే అవకాశం ఉంటుంది.

సాధారణంగా నాస్తికుల జాతకాల్లో శుభగ్రహాలూ, శుభస్థానాలూ భారీయెత్తున పాడై ఉండడం కనిపిస్తుంది. ముఖ్యంగా గురుడూ, చంద్రుడూ బాలేక పోవడం మామూలు. గురుచండాల యోగం (గురుడూ, రాహువూ ఒకే రాశిలో ఉండడం) వల్ల కూడా నాస్తికులవుతారని పెద్దలు చెప్పారు కానీ అది ఇతరేతర జాతకబలాల మీద కూడా ఆధారపడి ఉంటుందని కొందరి అభిప్రాయం. ఎందుకంటే ఈ గ్రహయుతి ఉన్న జాతకాలవాళ్ళందఱూ పూర్తిస్థాయి నాస్తికులైనట్లుగా అనుభవంలో గోచరించడం లేదు. కాకపోతే కొంత ఆచారహీనత, శుచీశుభ్రాల దగ్గఱ రాజీపడ్డం, పెద్దల్ని ఎదిఱించడం లాంటివి కనిపిస్తున్నాయి. గురుచండాల యోగం స్త్రీలలోను, పురుషుల్లోను ఒకే విధంగా కాక కొద్దిపాటి తేడాతో పనిచేయడం కూడా ఉన్నది. ఇది కాకతాత్కాలిక నాస్తికత్వం అనే స్థితి ఒకటుంది. అంటే, మనకి కర్మఫలం అనుభవించే రాత బలంగా రాసున్నప్పుడు దానికి పరిహారాలేమీ చేసుకోకుండా అడ్డుపడడం కోసం గ్రహాలు తమ దశాభుక్తుల్లో మనిషిలో అవిశ్వాసాన్నిపెంపొందిస్తాయి. ఆ దశాభుక్తులు గడిచిపోగానే మనిషి మళ్లీ ఆస్తికమార్గం లోనికి వస్తాడు. మనమిప్పుడు మాట్లాడుకుంటున్నది దీని గుఱించి కాదు.

నాస్తికులు ఈ రోజే హఠాత్తుగా నాస్తికులుగా మారలేదని గమనించడం అవసరం. వారిలో అత్యధికశాతం మంది గతజన్మల్లో కూడా నాస్తికులే అయ్యుంటారు. అయినా వారికి మళ్లీ మానవజన్మెత్తే అవకాశం రావడం వారి బ్యాంకు ఖాతాలో డబ్బు (పుణ్యం) ఇంకామిగిలుండడం వల్లనేతప్ప వారి నాస్తికత్వాన్ని భగవంతుడు క్షమించాడని గానీ, వారి ధోరణి సరైనదని గానీ తాత్పర్యం కాదు. నాస్తికులు కూడాఅనుకోకుండా కొన్ని పుణ్యాలు (పరోపకారాలూ, ప్రజాసేవ లాంటివి) చేస్తారు. కనుక వారిక్కూడా వాటి ఫలం లభించకపోదు. కొన్నిసార్లు భగవంతుడే నాస్తికుల భవిష్యద్‌గతి పట్ల ఆందోళన చెంది వారి మెడలు వంచి బలవంతంగా పుణ్యకార్యాలు చేయిస్తాడు. ఒక చిన్న ఉదాహరణ : మన రాష్ట్రంలోని నాస్తికులంతా ఆరాధించే తెలుగు రచయిత కీ.శే. కొడవటిగంటి కుటుంబరావు. ఆయన జీవితమంతా దేవుణ్ణి,మతాన్ని దుమ్మెత్తిపోయడంలోనే గడిచిపోయింది. ఆయన ఆర్థిక బాధల్లో ఉన్నప్పుడు చందమామ పిల్లల మాసపత్రిక వారు ఆయన్ని సంప్రదించి రామాయణం మీద పిల్లల కోసం ఒక ధారావాహిక (serial) వ్రాయమని కోరారు. తన సిద్ధాంతాలకి వ్యతిరేక మైనప్పటికీ పరిస్థితులు బాలేక కుటుంబరావు ఒడంబడక తప్పింది కాదు. “వీరహనుమాన్” పేరుతో కొన్ని సంవత్సరాల పాటు ఆయన రామాయణం ఎపిసోడ్స్ వ్రాశాడు. అదెంత పుణ్యకార్యమో వేఱే మనవి చెయ్యనక్కఱలేదు. అందఱికీ లభించే అవకాశం కూడా కాదు. కుటుంబరావు దైవదూషణ పట్ల, అందువల్ల అతనికి ప్రాప్తించబోయే దుర్గతి పట్ల భగవంతుడెంత వ్యథ చెంది ఉంటాడో, అతని పూర్వీకుల పుణ్యాల్ని దృష్టిలో ఉంచుకొని చందమామ రూపంలో అతనికొక అవకాశాన్ని ఇవ్వాలని ఎలా నిర్ణయించుకొని ఉంటాడో మనం ఊహించవచ్చు.

కొంతమంది తమ జీవితంలోని తొలి దశాబ్దాల్లో ఆస్తికులై ఉండి మలి దశాబ్దాల్లో నాస్తికులుగాపరిణమించడాన్ని గమనిస్తాం. ఇలాంటివారు నాస్తికత్వ ప్రచారం కోసం తఱచుగా చెప్పే చార్వాక పురాణం ఇలా మొదలౌతుంది. “నేనూ మీలాగే దేవుణ్ణి, దెయ్యాన్నీ ఆచారాల్నీ, శాస్త్రాల్నీ గుడ్డిగా నమ్మినవాణ్ణే. గుళ్ళచుట్టూ గోపురాల చుట్టూ తిరిగిన వాణ్ణే. ఆలోచించాక/ ఫలానా పుస్తకం చదివాక నాలో అంతర్మథనం మొదలయింది.” అంటూ ఒక అలుపెఱుగని సత్యాన్వేషకుడి పోజు, అపర బుద్ధభగవానుడి పోజు ఇస్తారు. ఇక్కడ గమనించాల్సింది పూర్వజన్మ వాసనలు అలాంటివారి ప్రజ్ఞని ఆక్రమించుకోవడానికి చిన్నప్పట్నుంచి వారి అధోచైతన్యంలో ఎలా కాచుక్కూర్చున్నాయి? అనేది. ప్రతి వాసనా క్రియాశీలం కావడానికి జీవితంలో కొంత సమయం తీసుకుంటుంది. బలీయమైన కామవాంఛా వాసనలతో జన్మించిన వ్యక్తిలో బాల్యంలోనే ఆ లక్షణాలు గోచరించవు. అప్పుడు అతను అందఱు పిల్లల్లాగానే ఉంటాడు. యౌవనం వచ్చాకనే ఆ లక్షణాలు గోచరిస్తాయి. నాస్తిక వాసనలైనా అంతే. తమ సమయం వచ్చాక అవి మనిషిని సంపూర్ణంగా ఆక్రమించుకుంటాయి. అంతకుముందు అతడు ఆధ్యాత్మికతలో పాల్గొంటున్నప్పటికీ అది ఒక అంటీముట్టని వ్యవహారమే తప్ప అతనేదో భక్తతుకారామ్ స్థాయి నుంచి నేరుగా గోరా, లవణం స్థాయికొచ్చేశాడనీ, ప్రతి ఆస్తికుడూ అలా అవుతాడనీ భావించరాదు. కానీ అందఱూ అలాఅవ్వాలని నాస్తికులు కోరుకుంటారు. అందుకే వారు ఆ చార్వాక పురాణాల్ని వినిపించడం.

నాస్తిక వాసనలు ఎలా మొదలవుతాయో గ్రహిస్తే వాటికి మన జీవితంలో స్థానం లేకుండా చేసుకోవడం ఎలాగో అర్థం అవుతుంది. నాస్తికత్వ మూలాలు మన పచ్చిస్వార్థం లోను, మన అహంకారం లోను, అవగాహనారాహిత్యం లోను ఉన్నాయి. ఉదాహరణకి- ఒకడు తన భార్యని అమితంగా ఆఱో ప్రాణంలా ప్రేమిస్తూ ఉండవచ్చు. ఆమెకి ప్రాణాపాయకరమైన అనారోగ్యం చేస్తే అతను హోరాహోరీ పూజలూ, మ్రొక్కులూ, పుణ్యక్షేత్ర సందర్శనాలూ చేసి తన భార్యని బతికించమని దేవుడి కాళ్ళవేళ్ళా పడి వేడుకొని ఉండవచ్చు. కానీ ఆమె జాతకరీత్యా, అంతకంటే ముఖ్యంగా, ఆమె కర్మఫలం రీత్యా ఆమె చనిపోక తప్పని పరిస్థితి ఉండొచ్చు. ఆమెని స్వస్థురాల్ని చెయ్యడం ఆమెకే మంచిది కాదు గనుక అందుకు భగవంతుడు అంగీకరించక పోవచ్చు. తత్‌ఫలితంగా ఆమె చనిపోయి ఉండొచ్చు. ఎంత వేడుకున్నా తన ప్రార్థనలూ, పూజలూ ఫలించలేదు కనుక ఆ వ్యక్తి దేవుడి మీద కక్ష పూన్తాడు. కానీ దేవుడితో పోలిస్తే మానవుడు పరమ అల్పుడు. ఆయన మీద కక్ష తీర్చుకునే మార్గమే లేదతనికి. అందుకని ఈ రూట్‌లో వస్తాడు, “దేవుడూ లేడు, దెయ్యమూ లేదు, ఈ శాస్త్రాలన్నీ బొంకులు, పురాణాలన్నీ బూతులు, పూజారులు దొంగలు, మతస్థాపకులు మోసగాళ్ళు, మతమంతా బతుకుతెఱువు కోసం కనిపెట్టిన మహా ఇండస్ట్రీ” అంటూ బజారు కెక్కుతాడు. దేవుడివిగ్రహాల్నీ, పటాల్నీ ఇంట్లోంచి చెత్తకుప్ప మీదికి విసిరేస్తాడు. తరువాత కొంతకాలానికి అతను కూడా చనిపోయి వేఱేచోట జన్మిస్తాడు. అప్పుడు మొదలవుతుంది అసలు కథ. అంతకుముందు లేని నాస్తిక వాసనలు మనిషిలో అంకురించడానికి దోహదించే జీవిత ఘటనల్లో ఇది ఒకానొకటి మాత్రమే. ఇక్కడ వరసలు మారతాయేమో గానీ కథ ఫార్మాట్ ఇలాగే ఉంటుంది. కాకపోతే భార్య స్థానంలో కొడుకు పోవచ్చు, కూతురు పోవచ్చు, భర్త పోవచ్చు, స్నేహితుడు పోవచ్చు.

ఆ భార్య తనకెవరు, తానామెని పెళ్ళి చేసుకోక ముందు? అప్పుడామె ఒకఱి కూతురు మాత్రమే. ఆమె వారికి కూతురుగా పుట్టక ముందు అమె వారికి ఏమవుతుంది? ఏమీ కాదు. ఆమెకా జన్మ ఎవడైతే ఇచ్చాడో ఆమె శాశ్వతంగా ఆయన ఆస్తే. ఆమే కాదు, మీరూ, నేను అందఱమూ ఆయన ఆస్తులమే. “నా కష్టార్జితం, నా డబ్బు, నేను కట్టించిన యిల్లు” అని గంతులేస్తారే అల్పమానవులు. ఎవఱికైనా ఏదైనా అఱువిస్తే అణాపైసలతో సహా వసూలు చేసుకునేదాకా నిద్రపోరే ! తిరిగివ్వకపోతే రక్తం కళ్ళజూస్తారే! మఱి తానిచ్చిన ప్రాణాన్ని వెనక్కి తీసుకునే హక్కాయనకి లేదా? తన హక్కుని తానుపయోగించు కున్నందుకు మనం ఆయన మీద కక్ష గట్టేదేంటి? ప్రపంచం లో అందఱమూ పోవాల్సిన వాళ్ళమే, కొంచెం ముందో వెనకో! వెనక పోయేవాళ్ళంతా ముందుపోయేవాళ్ళ గుఱించి దేవుడి మీద కక్ష గడుతూనే ఉండాలా ?

మనుషులు కాస్త ఆగి ఇలా నిదానంగా ఆలోచిస్తే నాస్తికత్వం అనే ఈజన్మజన్మల ఊబి తమని లాక్కుని కబళించకుండా తమని తాము కాపాడుకోవచ్చు.

భగవంతుడికి మనకంటే ఓర్పు కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ అనేది నిజమే గానీ అంతమాత్రాన మనం ఆయన్ని అవమానిస్తే ఆయన సహిస్తాడనుకోవడం అమాయకత్వం మాత్రమే. స్వతః పాపాలు అనే పాపశ్రేణి ఒకటుంది. అంటే అవి చేస్తే ఎవరూ శపించకుండానే వాటి ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. అలాగే దైవదూషణ/ దైవాభిభవం స్వతః పాపం కావడం చేత ఆయన మన పట్ల అపకారాన్ని సంకల్పించక పోయినా మనం తగువిధంగా అనుభవించాల్సి వస్తుంది. సృష్టి యావత్తు మన మీద తిరగబడుతుంది. స్వర్గతుల్యమైన సృష్టి ఒక్కపెట్టున మన పాలిట నరకంగా మారిపోతుంది.ఇలాంటి
దూషణ జఱిగిన సందర్భాల్లో ఆయన తన వంతుగా చేసేదేమంటే – కొంతసేపు ఆ దూషకుల నుంచి ముఖం తిప్పుకోవడం. ఇక్కడ ’కొంతసేపు’ అనే మాటకర్థం కొన్నివేల
సంవత్సరాలని! ఆ తరువాతి జన్మల్లో వారు ఎన్ని కష్టాలు పడినా ఆయన వారిని
ఆదుకోవడానికి రాడు, తన తరఫున ఎవఱినీ పంపడు కూడా ! “చాలామంది దేవుళ్ళకి మొక్కుకున్నాం,
ఏమీ జఱగలేదు” అని చెబుతారు కొంతమంది. ఎంత అడిగినా దేవుడు
వినిపించుకోక పోవడానికి కారణం ఇలాంటి పూర్వజన్మ దోషాలే.

పక్షాంతరంలో – కొంతమంది ప్రతిచిన్న నలతకీ OTC
మందులుమింగినట్లు ప్రతీ చిన్న ఇబ్బందికీ దేవుడికి ఎడాపెడా మొక్కులు మొక్కేస్తూంటారు.అవసరం
తీఱాక ఆ మొక్కుల్ని చెల్లించడం గుఱించి మర్చిపోతారు. అందువల్ల మఱుజన్మలో వారు ఎన్ని మొక్కులు మొక్కినా భగవంతుడు ఆలకించడు,
పట్టించుకోడు. పైపెచ్చు
అలాంటివాళ్ళు చాలా తఱచుగా ధననష్టాలకి లోనవడం, “ఆ లాభం ఈ గూబలోకి సరి” అన్నట్లు ఎప్పడు సంపాదించినది అప్పుడేఖర్చయిపోతూండడం,ఏమీ మిగలకపోవడం, వెఱసి అతిసామాన్యమైన జీవితం సంప్రాప్తమవుతాయి. ఇలాంటివారు ఈ జన్మలో
దేవుణ్ణి ఎంత నమ్మినా వారికి ఏ మంచీ జఱక్కపోవడం వల్ల ఇఱుగుపొఱుగులూ, బంధుమిత్త్రులూ వారి మీద ఎకసక్కెంగా వ్యాఖ్యానించడం కూడా ఉంది. “ఏంటో!ఎప్పుడూ దేవుడూ, దెయ్యం, గుళ్ళూ, గోపురాలూ అని తిరుగుతూంటారు.అయినా
వీసమెత్తు వెనకేసింది లేదు” అని ! ఆ వ్యాఖ్యలకి లోనైన వారికి క్రమంగా దేవుడి మీద అపనమ్మకం మొదలౌతుంది. అలా నాస్తికులయ్యేవాళ్ళు మఱికొంతమంది.సాధారణంగా మనలోని దోషాలే దేవుడి దోషాలుగా,గురువు దోషాలుగా కనిపిస్తాయి. అవి సాక్షాత్తు మన దోషాలేనని, దానికి వారు బాధ్యులు కారనీ, మనం మారితే మన పట్ల వారి వైఖరి మారుతుందనీ గమనించడమే ఆధ్యాత్మికతకి తొలిమెట్టు.

దేవుడిది దివ్యాహంకారం. ఆయన ఎంతదయామయుడో ఆధ్యాత్మిక క్రమశిక్షణ దగ్గఱ అంత రాజీలేనివాడుకూడాను. “నియన్తా(dictator) నియమో యమః, దండో దమయితా దమః ” అని వర్ణిస్తున్నాయి విష్ణుసహస్రనామాలు ఆయన్ని ! కనుక ఆయనతో లేదా ఆయన గుఱించి యథేచ్ఛగా మాట్లాడ్డం క్షేమదాయకం కాదు. అది ఆత్మకి పతనహేతువు.
ఒకసారి ఒకఱి వల్ల తాను విమర్శకి లోనైన తరువాత ఆయన వారిని వారి కర్మకి
వదిలివేయడమేజఱుగుతుంది “దైవదూషణ నరకానికి త్రోవ” అని మతగ్రంథాల్లో చెప్పబడింది. అయితే ఇక్కడ నరకమంటే ఖచ్చితంగా రౌరవ, కుంభీపాక, అసిపత్రాదినరకాలని కాదు. భూలోకం లోని మానవేతర (non-human) జన్మలన్నీ నరకం కిందనే జమ. చలేస్తే మానవులు కంబళ్ళు కప్పుకుంటారు. తిర్యక్కులు ఏం చేస్తాయి? వాటికి ఏ రక్షణా లేదు. జీవితాలకి ఏ భరోసా లేదు.ఏది కావాలన్నా,
ఎంత బాధగా ఉన్నా నోరు తెఱిచి చెప్పలేవు. అలా ఉంటాయి నరకాలంటే ! అవి దేవుడి చేత వదిలిపెట్టబడిన జన్మలు. పురాకృత దోషాలు తీవ్రతరమై సంప్రాప్తించే జన్మలు. “మానవుడంటే ఉన్నతి పొందిన జంతువు” అంటుంది పాశ్చాత్య విజ్ఞానం. “అలా కాదు, జంతువంటే పతనం చెందిన మానవుడు” అంటుంది హిందూధర్మం. నాస్తికత్వం ఇలాంటి పతనాల్లో అగ్రగణ్యమైనది.

మనుషులు నాస్తికులు కావడానికి ఇంకొన్ని కారణాలు కూడా ఉంటాయి. “మనిషి
తెలిసీ ఎందుకు పాపం చేస్తాడు స్వామీ?” అని కర్మయోగంలో అర్జునుడు భగవంతుణ్ణి అడిగినప్పుడు ఆయన చెప్పినది: కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ:”
అన్నారు. ఎన్ని తెలిసినా కామక్రోధాలకి లోనయితే మనిషి పాపం చేస్తాడని ఆయన చెప్పారు. ఇక్కడ రజోగుణం (dominating nature) అనే మాట వాడారు,
జాగ్రత్తగా గమనించండి. రజోగుణం అధికార బలారాధన, బలప్రదర్శన,
సంపదల పట్ల ఆసక్తి, తాను గొప్పవాణ్ణనే అభిమానం,
తనకన్నీ తెలుసుననే అహంకారం, తన గుఱించి అందఱూ గొప్పగా అనుకోవాలనే,చెప్పుకోవాలనే
డాంభిక ప్రవృత్తి మొదలైన వాటికి కారణం. ఈ లక్షణా లున్నవారు సహజంగా ఉగ్ర, పరుష స్వభావులై
ఉంటారు. శాస్త్రాల్లో చెప్పబడని ఇంకో ప్రభేదానికి చెందిన రాజసిక (రజోగుణ)
మనుషులు వీరిలోనేఉంటారు.
వారు ప్రచ్ఛన్న ఉగ్రులు (hidden aggressive).
వాళ్ళెందుకు ప్రచ్ఛన్నులు?అంటే – వాళ్ళు పైకి నవ్వుతూ కనిపిస్తారు. హుషారుగా చలాకీగా దర్శనమిస్తారు. ఎప్పుడూ సరదాగా జోక్స్ వేస్తూంటారు. చమత్కారంగా మాట్లాడతారు. ఆగండి, ఒక్క నిమిషం. ఇదంతా ఇతరుల పట్ల హీనభావంతోనే సుమా! వారు వేసే జోక్స్ అన్నీఇతరుల హృదయాల్ని నొప్పించడానికీ,
అవమానించడానికీ ఉద్దేశించి నవే. తాము చాలా తెలివైన
వాళ్ళమనీ,సృజనాత్మకులమనీ ఇంప్రెషన్ కలిగించడం కోసం చేసే పని అది. ఈ మధ్య పాశ్చాత్య మనశ్శాస్త్ర పరిశోధకులు కూడా ఈ జోకర్ల మనస్తత్త్వాన్ని శోధించి ఇది dominating nature లో ఒక భాగమని తేల్చడం గమనార్హం. చెప్పొచ్చేదేంటంటేఇలా ప్రతిదాన్నీ ఎగతాళి చేసేవారిలో భావి నాస్తికులు
దాగి ఉన్నారని గ్రహించాలి. ప్రతి నాస్తికుడిలోను, లేదా ప్రతి అల్పవిశ్వాసిలోను ఈ తత్త్వాన్ని స్పష్టంగా గమనించ వచ్చు. అతను కేవలం దేవుడు, మతం లాంటి మత/ ధార్మిక/పారలౌకికవిషయాలనే
కాక ప్రపంచంలో ప్రతి మనిషి నీ, ప్రతి విషయాన్నీ ఎగతాళి చేసే దుర్లక్షణం గలవాడనీ,
అతను వాడే పదజాలం ఎంత ఆడంబరంగా ఉన్నప్పటికీ అతనికి విషయాల పట్ల గంభీర వైఖరి (serious attitude) లేదనిఅర్థమౌతుంది
కనుక ఆధ్యాత్మిక మార్గం కావాలనుకున్నవారు ఈ హాస్యగాడి మనస్తత్త్వాన్ని సుదూరంగా విసర్జించాలి. ఈ మనస్తత్త్వం ఉన్నవాళ్ళని కూడా విసర్జించాలి. ఇప్పటికే ఆధ్యాత్మికతలో చాలా
ముందుకెళ్ళినవారికి మాత్రం ఈ నియమం వర్తించదు.

నాస్తికత్వానికి గల మఱో పార్శ్వం – దైవోపదేశం/ గురూపదేశం గానీ, దైవాదేశం/గుర్వాదేశం గానీ లేకుండానే విపరీతంగా పుస్తకాలు చదవడం. ముఖ్యంగా మత విషయంలో ఎవరు పడితే వారు వ్రాసిన పుస్తకాలు చదవడం పనికిరాదు. శాస్త్రాలు ఎవరికి వారు చదివితే అర్థమయ్యేవి కావు. ఈ రోజుల్లో ముద్రణయంత్రాల పుణ్యమా అనిపుస్తకాలు ఎక్కడ పడితే అక్కడ దొఱుకుతున్నాయి. డబ్బులు పారేస్తే కొనుక్కోవచ్చు.అయితే భగవద్దర్శనం పొందనివాళ్ళు లేదా భగవదాదేశంలేనివాళ్ళు,
గురుసేవ చెయ్యని వాళ్ళు,
ఆత్మజ్ఞానం లేనివాళ్ళు,
కించిత్‌ తపోబలం కూడా లేనివాళ్ళు – ఇలాంటివాళ్ళు దేవుడి మీదా, మతం మీదా
రాసే పుస్తకాలూ, వ్యాసాలూ చదవడం, మీదుమిక్కిలి వాటిని నమ్మడం మంచిది కాదు.మతగ్రంథాలు తపశ్శాలు రైన ప్రాచీన మహనీయుల చేత రచింపబడ్డాయి. వారు
దైవభక్తులు, గురుసేవా పరాయణులు, భగవత్‌ సాక్షాత్కారమూ భగవదాదేశమూ కలిగినవారు,బ్రహ్మచర్య వ్రతదీక్షాపరులు, ఆత్మనిగ్రహవంతులు, లోక
కల్యాణకాములు. అలాంటి వారు వ్రాసిన వాటిని మనలాంటి వారు స్వతంత్రించి చదివితే మన మతధర్మ పరిజ్ఞానం అల్పాత్యల్పం కాబట్టి అంతరార్థాల సంగతలా ఉంచి, అన్నీ అపార్థాలే స్ఫురించి ఛప్పన్న గుంటల్లో,
గోతుల్లో లేవలేకుండా పడిపోతాం. వట్టి భాష తెలిసినంత మాత్రాన ఏమీ లాభం లేదు. అంబేడ్కరు సంస్కృతం నేర్చుకొని హిందూ మతగ్రంథాల్ని స్వయంగా చదివి ఆ తరువాత వాటిని ఏకిపారేస్తూ లావుపాటి సాహిత్యం సృష్టించాడు.

“విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమమ్” (ఒక పండితుడి శ్రమని ఇంకో
పండితుడే గ్రహించగలడు) అనే ఆర్యోక్తి చొప్పున ఆ ప్రాచీన మహనీయుల
యథార్థభావం అవగతం కావాలంటే మళ్ళీ అంతటి సమకాలిక మహనీయుణ్ణే వెతికి పట్టుకొని పాద నమస్కారం చేసుకొని దయతో ఆ గ్రంథాన్ని వివరించ వలసిందిగా ప్రార్థించాలి. ఈ రోజుల్లో అలా చెయ్యకపోవడం వల్ల అశిక్షితులైనవారు హిందూ మతగ్రంథాల్లో రామాయణం నుంచి మనుధర్మశాస్త్రం దాకా దేన్నీ వదలకుండా తమ స్వీయ అవగాహనా కోణం నుంచి బుఱద జల్లడమూ,
లోతెఱుగని పామరజనం దాన్ని సుగంధద్రవ్యంగా భావించడమూ జరుగుతున్నది.

నాస్తికత్వానికి ఇంకో ముఖ్యమైన కారణం కూడా ఉన్నది.

పూజలూ, వ్రతాలూ చేసేవారు ఆ పూజాసమయంలో భగవంతుడి మీద మనసుని కేంద్రీకరించక పోవడం వల్ల ఆ సమయంలో వారు దేన్ని స్మరిస్తారో వారికి అదే ప్రాప్తిస్తుంది.వారు ఆ సమయం
లో దేన్ని స్మరిస్తున్నారో ఆ సర్వాంతర్యామికి తెలుసు. అయితే పూజ ఎలా చేసినా చేసినందుకు తగు ఫలిత మివ్వక తప్పదు. “యే యథా మాం ప్రపద్యన్తే తాం స్తథైవ భజామ్యహమ్” అందువల్ల ఆ పూజకులు మఱుజన్మలో ఆ పుణ్యఫలాన్ని అనేక రూపాల్లో అనుభవిస్తారు. కానీ దైవభక్తి మాత్రం ఉండదు.
“మాకు దైవభక్తి లేదు, మేం పూజలు చెయ్యం, కానీ మాకిప్పుడొచ్చిన నష్టమేంటి?”
అని వాదిస్తారు కూడా. ఈ వాదన ముదిఱినాస్తికత్వంలోకి
దిగే సంభావ్యత హెచ్చు. కనుక ఫోన్ చేసేటప్పుడు ఎలాగైతే కరెక్ట్ నంబర్ డయల్ చేస్తామో, అలాగే పూజ చేసేటప్పుడు కరెక్టుగా దేవుడి నెంబర్ డయల్ చేసేటట్లు
చూసుకోవాలి.

నాస్తికత్వానికి గల మఱో పార్శ్వం – దైవోపదేశం/ గురూపదేశం గానీ, దైవాదేశం/గుర్వాదేశం గానీ లేకుండానే విపరీతంగా పుస్తకాలు చదవడం. ముఖ్యంగా మతవిషయంలో ఎవరు పడితే వారు వ్రాసిన పుస్తకాలు చదవడం పనికిరాదు. శాస్త్రాలు ఎవరికి వారు చదివితే అర్థమయ్యేవి కావు. ఈ రోజుల్లో ముద్రణయంత్రాల పుణ్యమా అనిపుస్తకాలు ఎక్కడ పడితే అక్కడ దొఱుకు తున్నాయి. డబ్బులు పారేస్తే
కొనుక్కోవచ్చు. అయితే భగవద్దర్శనం పొందనివాళ్ళు లేదా భగవదాదేశంలేనివాళ్ళు, గురుసేవ చెయ్యని వాళ్ళు, ఆత్మజ్ఞానం లేనివాళ్ళు,
కించిత్ తపోబలం కూడా లేనివాళ్ళు – ఇలాంటివాళ్ళు దేవుడి మీదా, మతం మీదా రాసే పుస్తకాలూ, వ్యాసాలూ చదవడం, మీదుమిక్కిలి వాటిని నమ్మడం మంచిది కాదు. మతగ్రంథాలు తపశ్శాలురైన ప్రాచీన మహనీ యుల చేత రచింపబడ్డాయి. వారు దైవభక్తులు, గురుసేవా పరాయణులు,భగవత్సాక్షాత్కారమూ భగవదాదేశమూ
కలిగినవారు, బ్రహ్మచర్య వ్రతదీక్షాపరులు,ఆత్మనిగ్రహవంతులు, లోక కల్యాణకాములు. అలాంటివారు వ్రాసిన వాటిని మనలాంటివారు స్వతంత్రించి చదివితే మన మత ధర్మ పరిజ్ఞానం అల్పా త్యల్పం కాబట్టి అంతరార్థాల సంగతలా ఉంచి, అన్నీ
అపార్థాలే స్ఫురించి ఛప్పన్న గుంటల్లో, గోతుల్లో లేవ లేకుండా పడిపోతాం. వట్టి భాష తెలిసినంత మాత్రాన ఏమీ లాభం లేదు. అంబేడ్కరు సంస్కృతం నేర్చుకొని హిందూ మతగ్రంథాల్ని స్వయంగా చదివి ఆ తరువాత వాటిని ఏకిపారేస్తూ లావుపాటి సాహిత్యం సృష్టించాడు.

“విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమమ్” (ఒక పండితుడి శ్రమని ఇంకో పండితుడే గ్రహించగలడు) అనే ఆర్యోక్తి చొప్పున ఆ ప్రాచీన మహనీయుల
యథార్థభావం అవగతం కావాలంటే మళ్ళీ అంతటి సమకాలిక మహనీయుణ్ణే వెతికి పట్టుకొని పాద నమస్కారం చేసుకొని దయతో ఆ గ్రంథాన్ని వివరించవలసిం దిగా ప్రార్థించాలి. ఈ రోజుల్లో అలా చెయ్యక పోవడం వల్ల అశిక్షితులైనవారు హిందూ మతగ్రంథాల్లో రామాయణం నుంచి మనుధర్మశాస్త్రం దాకా దేన్నీ వదలకుండా తమ స్వీయ అవగాహనా కోణం నుంచి బుఱద జల్లడమూ, లోతెఱుగని పామరజనం దాన్ని సుగంధద్రవ్యంగా భావించడమూజరుగుతున్నది.[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము