శమంతకోపాఖ్యానం
వినాయకచవితి వ్రతకధలో ముఖ్యమైంది శమంతకోపాఖ్యానం.
ఇప్పుడు వినాయకచవితి సందర్భంగా పుస్తకాలలో ప్రచురిస్తున్న కధలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దాని ఫలితంగా ఆ కధ విన్నా, అసలు ఫలితం రాదు. ఇప్పుడు మనం విష్ణు, స్కాందపురాణాలలో చెప్పబడిన అసలు కధ చెప్పుకుందాం.

వినాయకచవితి నాడు చంద్రదర్శనం చేసినవారు నీలాపనిందల పాలవుతారని గణపతి శాపం అలానే ఉంది. అది ద్వాపర యుగం. సత్రాజిత్తు, ప్రసేనుడు అన్నదమ్ములు, ద్వారకలో ఉంటారు. సత్రాజిత్తు గొప్ప సూర్యభక్తుడు. విష్ణుపురాణం ప్రకారం సత్రాజిత్తుకు సూర్యభగవానుడు మిత్రుడు. సత్రాజిత్తు సముద్రం వద్దకు వెళ్ళి సూర్యుడితో కాసేపు మాట్లాడుదామని పిలిస్తే సూర్యుడు వచ్చాడు. సూర్యుడంటే మాములువాడు కాదు. పెద్ద వెలుగు, దాంతో పాటు మెడలో శమంతకమణి. అందువల్ల సత్రాజిత్తుకు సూర్యుడి రూపం కనిపించలేదు. నాకు నీ రూపం కనిపించడంలేదు అని సత్రాజిత్తు అనడంతో సూర్యుడు ఆ శమంతకమణిని తీసి సముద్రపు ఒడ్డున పెట్టి, తన తేజస్సును తగ్గించికొని, ఆయనతో కాసేపు కబుర్లు చెప్పాడు. దేవతలను పిలిస్తే వరం ఇవ్వకుండా వెళ్ళరు. వెళ్ళకూడదు. అది వారికి ఉన్న నియమం. వినాయకచవితినాడు పూజించే వరసిద్ధివినాయకుడు కూడా వరాలు ఇచ్చే వెళతాడు.
అందువల్ల సూర్యుడు నీకు ఏమి వరం కావాలో అడుగు, ఇస్తానన్నాడు. శమంతకమణి సూర్యబింబంలా మెరసిపోతోంది. ఆ మణి కావాలన్నాడు సత్రాజిత్తు. సరే ఇస్తున్నా అన్నాడు సూర్యుడు. అది మెడలో వేసుకుంటే దాని కాంతివలన అందరు నిన్ను సూర్యుడిగా భావిస్తారు. కానీ ఆ మణిని పవిత్రంగా మాత్రమే ధరించాలి అన్నాడు (మణి, మంత్రము, ఔషధము స్వార్ధానికి వాడుకోకూడదు. మణి ఎవరికైన పనికొస్తుందంటే ఇవ్వాలి. మంత్రము ఎదుటివారు బాగుపడడం కోసం ఉపదేశించవచ్చు. ఔషధం డబ్బు ఇవ్వలేదని అని అనారోగ్యంతో ఉన్నవారికి ఇవ్వకుండా ఉండకూడదన్నది శాస్త్రం).
ఈ మణి రోజుకు 8 బారువుల బంగారం పెడుతుంది. ఇది ఎక్కడ ఉంటే అక్కడ వ్యాధులు రావు, కరువు ఉండదు, ప్రమాదాలకు తావు ఉండదు అంటూ సూర్యుడు మణి గురించి వివరించాడు. ఈ మణిని ధరించాలి అంటే శారీరిక శౌచము (శుభ్రత), మానసిక శౌచము (కుళ్ళు, అహంకారము అసూయ, ద్వేషము, పరనింద వంటివి లేకుండా ఉండడం అవసరం. అలాగే నిజాయతి ఉండాలి) ఖచ్చితంగా ఉండి తీరాలి. ఉదహరణకు ఒకవేళ శరీర అవసరాల దృష్ట్యా మూత్రవిసర్జన చేయాల్సి వస్తే, ముందు ఈ మణిని మెడలోనుండి తీసి పక్కన పెట్టి, విసర్జన తరువాత కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కొని ఆచమనం చేసి, ఆ తరువాతే ధరించాలి. "ఒకవేళ మానసికంగా కానీ,శారీరికంగా కానీ శౌచనికి భంగం ఏర్పడితే, ఆ సమయంలో ఇది ధరించి ఉంటే వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి. అప్పుడు ఈ మణి ప్రాణాలను తీస్తుంది". అందువల్ల జాగ్రత్త మిత్రమా! అంటూ ఆ మణిని సత్రాజిత్తుకు వరంగా ఇచ్చాడు సూర్యుడు.
సత్రాజిత్తు ఆ మణి మీద వ్యమోహంతో తీసుకొని మెడలో వేసుకున్నాడు. అది ధరించగానే ఆయన మనసులో కృష్ణుడు ఈ మణిని అడుగుతాడేమో, దొంగిలిస్తాడేమో అనే చెడు భావన కలిగింది. ఆయన ద్వారకకు చేరగా, ఆ మణిని ధరించి వస్తున్న సత్రాజిత్తును చుసిన ప్రజలు సూర్యుడే వస్తున్నాడని తలచి, అలాంటివారు కృష్ణదర్శనం కొసమే వస్తారని, ఈ విషయాన్ని కృష్ణునకు చెప్పారు.

విషయం తెలుసుకున్న కృష్ణుడు సత్రాజిత్తు వద్దకు వెళ్ళాడు. ఆ మణి ఎక్కడ ఉంటే వ్యాధులు, కరువుకాటకాలు, రోగాలు రావు. మీ ఇంట్లో ఇద్దరే ఉంటారు. మీ వద్ద ఉంటే మీకు మాత్రమే ప్రయోజనం. అది నాకు ఇస్తే నేను ఉగ్రసేన మహా రాజుగారికి ఇస్తాను. రాజు దగ్గర ఉంటే రాజ్యం అంతా బాగుంటుంది అన్నాడు. ప్రజల మేలు కోసమని అడిగాడు. సత్రాజిత్తు తిరస్కరించగా, కృష్ణుడు వెళ్ళిపొయాడు.
కృష్ణుడు ఇంతకముందు చాలా మంది రాక్షసులను చంపాడు, ఇప్పుడీ మణి కోసం తనను కూడా చంపుతాడని అనుమానించాడు సత్రాజిత్తు. నిజానికి కృష్ణుడు కంస సంహారం చేశాక ద్వారక నగరాన్ని కంసుని తండ్రి ఉగ్రసేన మహారాజుకు ఇచ్చాడు కాని తాను పరిపాలించలేదు. ద్వారకను సముద్రం మధ్యలో నిర్మించుకున్నా తనకంటే పెద్దవాడు బలరాముడని, బలరాముడికి పట్టం కట్టాడు. ఇక కృష్ణుడి దగ్గర కౌస్తుభ మణి ఉంది. అది శమంతకమణికంటే కోటి రెట్లు విలువైనది. కౌస్తుభం ఉండగా శమంతకమణి అవసరమేంటి. ఇవి ఆలోచించకుండా కృష్ణపరమాత్మ గురించి ఇలాంటి నీచపు అలోచనలు చేశాడు సత్రాజిత్తు.
ఈ విధమైన ఆలోచనల వల్ల మనసు అపవిత్రమైంది. ఆ సమయంలో మెడలో శమంతకమణి ఉంది. తన దగ్గర ఉంటే కృష్ణుడు చంపుతాడని భయపడి, తమ్ముడు ప్రసేనుడిని పిలిచి ఆ మణిని ఇచ్చాడు. అది తీసుకునే సమయానికి ప్రసేనుడు బాహ్యాంతర (శారీరిక,మానసిక) శౌచం ఉంది. దాన్ని ప్రసేనుడు తీసుకుని మెడలో వేసుకున్నాడు.
ఇది ఇలా ఉండగా ఒకనాడు కృష్ణుడు, ప్రసేనుడు కలిసి వేటకు వెళ్ళారు. ప్రసేనుడి గుర్రం దారి తప్పింది. ప్రసేనుడికి ఆ సమయంలోనే మూత్రవిసర్జన చేయవలసిన అవసరం ఏర్పడింది. మెడలో ఉన్న మణి తీసి ప్రక్కన పెడితే, ఎవరైనా తీసుకుపొతారని దాన్ని మెడలోనే వేసుకొని మూత్రవిసర్జన చేశాడు. అదే దోషం. అందునా అక్కడ నీరు ఉండదు కనుక కాళ్ళు, చేతులు కడుక్కొని, ఆచమనం చేయడానికి కుదరలేదు. మెడలో మణి అపవిత్రం అయ్యింది. ఇది ఇంకా పెద్ద దోషం. అపవిత్రమయితే ప్రాణాలు తీస్తుంది. గుర్రం ఎక్కి వెళుతున్నాడు. దాని ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. మృత్యువు సింహం రూపంలో వచ్చింది. గుర్రాన్ని, ప్రసేనున్ని చంపి, మాంసం తినింది. అక్కడ ఎముకలతో పాటు ఈ శమంతక మణి దేదీప్యమానంగా వెలిగిపొతోంది. అది తినే వస్తువు కాకపొయిన చూడడానికి బాగుంది కదా అని నోటికి కరుచుకొని వెళ్ళింది.

సింహం హత్యచేసింది. అది గుర్రాన్ని, ప్రసేనుడిని చంపింది, మాంసం తిన్నది, కనుక అపవిత్రం అయ్యింది, శౌచం పోయింది. అది ఏ ప్రాణి అయినాసరే నియమం మారదు. మణి మళ్ళీ తన ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. సింహానికి మృత్యువు ఎలుగుబంటి రూపంలో వచ్చింది. వచ్చి ఆ సింహాన్ని చంపి మణిని తీసుకుపోయింది ఎలుగుబంటి.
అక్కడ కృష్ణుడు ప్రసేనుడి కొరకు అన్వేషిస్తున్నాడు. అది భాద్రపద మాసం. వర్ష ఋతువు కారణంగా త్వరగా చీకటి పడుతుంది. ప్రసేనుడికి ఏదైనా ప్రమాదం జరిగితే తానే మణి కోసం చంపాను అనుకుంటారని కృష్ణుడు ఆందోళన పడ్డాడు. ప్రసేనుడి కోసం వెతికినా జాడ తెలియలేదు. "ప్రసేనా! ఎక్కడ ఉన్నావు" అని తల పైకి ఎత్తి గట్టిగా అరిచాడు. ఆ రోజు వినాయక చవితి. చంద్రబింబం శుద్ధ చవితినాడు 30డీగ్రీలు కిందకి వచ్చి ఉంటుంది. తల కొంచం పైకి ఎత్తగానే చంద్ర దర్శనం అయ్యింది. చంద్రున్ని చూసిన కృష్ణుడు, రాత్రి అయిపొయిందని తలచాడు (కాని అది చవితి చంద్రుడన్న విషయం గుర్తుకురాలేదు), ఇప్పుడు వెతకడం కష్టమని తలచి, సైన్యాన్ని తీసుకొని తిరిగు బాట పట్టాడు.
చవితి చంద్రుని దర్శనం నీలాపనిందలు తెచ్చిపెడుతుంది కదా. రాత్రికి రాత్రి ద్వారకలో కృష్ణుడే ప్రసేనుడిని చంపాడని పుకారు వచ్చింది. మొదటి నీలాపనింద. ద్వారకలో ఉంటున్న ప్రజలంతా ఇదే నమ్మారు. అప్పటివరకు కృష్ణుని చేత రక్షింపబడినవారు, ఆయన్ను పొగిడిన వాళ్ళంతా ఇప్పుడు "నిజమే, చిన్నతనంలో కృష్ణుడు ఎన్ని దొంగతనాలు చేయలేదు, ఎంత మందిని చంపలేదు. ఇప్పుడు శమంతకమణి కోసమని ప్రసేనుడిని కూడా కృష్ణుడే చంపి, ఏమి ఎరగనట్టు అసత్యాలు పలుకుతున్నాడు" అని అనడం మొదలుపెట్టారు. మళ్ళీ నీలాపనిందలు. తన మీద వచ్చిన అపనిందలను తొలగించుకోదలచిన కృష్ణపరమాత్మ ప్రజలతో 'నాతో పాటు మీరు కూడా అడవికి వస్తే వెళ్ళి వెతుకుదాము' అన్నాడు. 'ఇంతకముందు నువ్వు చాలా మందిని చంపావు. ఇప్పుడు మమ్మల్ని చంపుతావు. నీ మీద మాకు నమ్మకంలేదు, నీవెంట వచ్చెది లేదు' అన్నారు ప్రజలు.

కొందరు మాత్రం వస్తామనడంతో, వారిని తీసుకొని అడవిలో వెతకడానికి వెళ్ళాడు శ్రీ కృష్ణుడు. వారు వస్తున్నారు కాని వారికి శ్రీ కృష్ణుడి మీద నమ్మకం లేదు. గుర్రపు అడుగుజాడలను అనుసరించి వెళ్ళగా అక్కడ ప్రసేనుడి బట్టలు, ఎముకలు, రక్తపు మరకలు ఉన్నాయి. "చుశారా! నేను చంపానన్నారు. ఇక్కడ సింహపు అడుగుజాడలు ఉన్నాయి. వారిని సింహమే చంపింది. అందువల్ల ఎముకలే ఉన్నాయి కాని శరీరాలు లేవు. అది చంపి వారిని తినేసింది" అని కృష్ణుడాన్నాడు. అయితే వచ్చిన వారిలో కొందరు 'ఈయనే చంపి మణి తీసుకున్నాక, సింహం ఈ దారిన వచ్చినప్పుడు శవాలను తిని ఉంటుంది. మళ్ళీ ఒక కట్టుకధ అల్లుతున్నాడు. మహా మోసగాడు చుశారా' అన్నారు. ఇంకొక నీలాపనింద.
కాస్త ముందుకు వెళ్ళి చుస్తే అక్కడ ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. సింహం శవం ఉంది. ఎలుగుబంటి సింహాన్ని చంపి మణి ఎత్తుకుపొయింది. ఈ పాదముద్రలు పట్టుకొని వెళదాం అన్నాడు కృష్ణుడు. సింహం ఎలుగుబంటిని చంపుతుంది కాని ఎక్కడైన ఎలుగుబంటి సింహాన్ని చంపుతుందా? ఇది ఇంకొక కట్టుకధ అన్నారు ఆయనతో వచ్చిన వారు. మళ్ళీ అబద్దాలు ఆడుతున్నాడని నీలాపనిందలు వేశారు.
ఆ ఎలుగుబంటి జాంబవంతుడు. ఆయన 24 వ త్రేతాయుగంనాటి వాడు. కృష్ణుడు 28 వ ద్వాపరయుగం నాటి వాడు. త్రేతాయుగంలో రామసేతు నిర్మాణసమయానికే జాంబవంతుడు కడువృద్ధుడు. అంటే ఆయన వయసు చాలా ఎక్కువ. త్రేతాయుగంలో రామున్ని చూసిన జంబవంతుడు ఆయన సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. 'పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం' అని రాముడిని వర్ణిస్తాం. మగవారే మొహించేంతటి సుందరుడు శ్రీ రామ చంద్రుడు. అటువంటి రాముడిని గట్టిగా కౌగిలించుకొవాలి అని కోరిక పుట్టింది జాంబవంతుడికి. రామున్ని అడుగగా, ఈ అవతారంలో కుదరదు, రాబోయే కృష్ణావతారంలో అవకాశం ఇస్తానన్నాడు. ఆ జాంబవంతుడికే ఒక పిల్లవాడు పుట్టాడు. పేరు సుకుమారుడు. వాడి ఆహారం కోసమని అడవిలో తిరుగుతున్న జాంబవంతునకు శమంతకమణి నోట కరుచుకున్న సింహం కనిపించింది. ఆ మణి చూడడానికి బాగుందని సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని వెళ్ళి తన కూమారుడి ఉయ్యాలకు కట్టాడు. కళ్ళు మిరమిట్లుకొరిపే ఆ మణి ఒక పసిపిల్లవాడికి ఆట వస్తువంటే వారు ఎంత బలవంతులో అర్దం చేసుకోండి.
అంతా కలిసి ఆ ఎలుగుబంటి అడుగుజాడలను పట్టుకొని వెళ్ళగా, ఒక గుహలోకి వెళ్ళినట్టు ఆ అడుగుజాడల గుర్తులు ఉన్నాయి. కృష్ణుడు లోపలికి వెళ్ళి వెతుకుదాం అన్నప్పటికి వారు రాలేదు. రాకపోగా వచ్చినవారు కృష్ణుడు లోపలికి తీసుకువెళ్ళి చంపుతాడని, అందుకోసమే ఈ అడవిలో ఈ గుహ వద్దకు తీసుకువచ్చాడని అన్నారు. కృష్ణుడు 'ఒంటరి లోపలికి వెళతాను, బయట వేచి ఉండండి' అన్నా, తాము వేచి ఉండేది లేదని, ద్వారకకు తిరిగి వెళ్ళిపొయారు.
పడ్డ అపనింద తొలగించుకోవాలని కృష్ణపరమాత్మ చీకటిగా ఉన్న ఆ గుహలోనికి వెళ్ళాడు. కొంచం దూరం వెళ్ళాక అక్కడ యవ్వనంలో ఉన్న ఒక స్త్రీ ఒక పిల్లవాడిన ఉయ్యాలలో వేసి ఊపుతోంది. ఆ స్త్రీ జాంబవతి. జాంబవంతుని కూమార్తే. ఊయలలో ఉన్నది జాంబవంతుని కూమారుడు సుకుమారుడు. తమ్ముడిని ఊయలలో పడుకోబెట్టి ఊయల ఊపుతోంది. ఆ ఊయలకు శమంతక మణి కట్టి ఉండడం కృష్ణుడు చూశాడు. కృష్ణుడిని చూడగానే జాంబవతి మొహించింది. ఆయనే తనకు భర్త అని భావించింది. కృష్ణుడు ఆ మణి వంకే చూడడం గమనించి ఆ మణి కృష్ణుడిదే అని, తన తండ్రి తీసుకువచ్చి ఉంటాడని, కృష్ణుడు మణి కోసమే వచ్చాడని గ్రహించింది. ఎవరైన క్రొత్తవారు వచ్చారని తెలిస్తే జాంబవంతుడికి కోపం వస్తుందని, కృష్ణుడిని చంపుతాడని భయపడుతుండగా, ఆ మణి కోసం కృష్ణుడు దగ్గరగా వస్తున్నాడు. ఆవిడ కృష్ణుడికి ఆ మణి ఇక్కడకు ఎలా వచ్చిందో అర్దమయ్యేలా, పిల్లవాడికి జోల పాడుతున్నట్టుగా, జాంబవంతునకు కృష్ణుడు వచ్చాడన్న సంగతి తెలియకుండా ఉండేందుకని ఒక పాట రూపంలో ఊయల ఊపుతూ జరిగినదంతా చెప్పింది.
సింహప్రసేనమవధి సింహోజాంబవతాహతః
సుకుమారకమారోధి తవహేష్యాశ్శమంతకః
సింహం ప్రసేనుడిని చంపింది. సింహాన్ని జాంబవంతుడు చంపాడు. ఓ సుకుమార! నువ్వు ఏడవకు. ఈ మణి నీదే అని అర్దం.
ఇంతా చెప్పిన కృష్ణుడు దగ్గరకు వచ్చేస్తున్నాడు. ఏంటయ్యా, ఎంత చెప్పిన వినకుండా దగ్గరకు వచ్చేస్తున్నావు. మా నాన్న చూస్తే నిన్ను చంపేస్తాడు. అది నేను తట్టుకోలేను. వెనక్కి వెళ్ళు అని జాంబవతి పలికింది. రక్షించాలనుకుంది, ఇంతలో జాంబవంతుడు వచ్చాడు.

జాంబవంతుడు వచ్చి కృష్ణపరమాత్మతో మల్లయుద్దం చేశాడు. యుద్దంలో కిందపడవేయడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా పడట్లేదు. ఎన్ని సార్లు ముట్టుకున్న జాంబవంతుడికి కృష్ణపరమాత్మను ముట్టుకోవాలనిపిస్తోంది. ఎన్నిసార్లు కౌగిలించుకున్నా ఇంకా ఇంకా హత్తుకోవాలి అనిపిస్తొంది. 21 రోజుల పాటూ నిర్విరామంగా యుద్దం చేసినా కృష్ణుడు అలసిపోలేదు. వచ్చింది రాముడే అన్న విషయం తెలుసుకున్నాడు జాంబవంతుడు. ఆయనకు నమస్కరించి, శమంతకమణి ఇచ్చి, తన కూతురు జాంబవతికి కృష్ణునితో వివాహం చేశాడు. కృష్ణపరమాత్మ జాంబవతిని వెంటపెట్టుకొని మణితో ద్వారకకు వెళ్ళాడు. జరిగిన విషయాన్ని సత్రాజిత్తుకు వివరించాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు, కృష్ణుడు ఎంతో మంచివాడని, కృష్ణుడి మీద వేసిన నీలాపనిందలకు క్షమాపణగా ఆయన కూతురు సత్యభామను ఇచ్చి వివాహం చేశాడు. శమంతకమణిని ఇచ్చాడు కానీ కృష్ణుడు తీసుకోలేదు. ఉన్నది ఒక్క కూతురే కనుక ఎలాగో తరువాత తమకే దక్కుతుందని, ఎంతో ఇష్టపడి సూర్యుడి దగ్గరనుండి తెచ్చుకున్నారు కనుక తన దగ్గరే ఉంచుకోమని సత్రాజిత్తుకు చెప్పాడు.
ఇక్కడితో కధ ముగియలేదు. పెద్ద మలుపు తిరిగింది. ఎప్పటినుంచో సత్యభామను వివాహం చేసుకుంటామని అక్రూరుడు, శతధన్వుడు, కృతవర్మ అనే ముగ్గురు సత్రాజిత్తును అడుగుతున్నారు. ఇంతకాలంగా వివాహ విషయాన్ని దాటవేతూ వచ్చిన సత్రాజిత్తు ఇప్పుడు మణి తెచ్చి ఇచ్చాడని కృష్ణపరమాత్మకు ఇచ్చి వివాహం చేయడం సహించలేకపోయారు. ఆ ముగ్గురిలో అక్రూరుడు, కృతవర్మకు కృష్ణుని యందు అపారమైన భక్తి. శతధన్వుడికి భక్తి కాస్త తక్కువ. సత్రాజిత్తు మీద ఉన్న కసిని తీర్చుకోవడానికి సమయం కోసమని ఎదురుచూస్తున్నారు.

ఆ సమయానికి పాండవులను లక్క ఇంట్లో పెట్టి, ఇంటిని తగలబెట్టి చంపేశారని కృష్ణుడికి వార్త అందింది. తమ్ముడి కొడుకులు చనిపొయారని బాధపడుతున్నట్టు నటిస్తున్న దృతరాష్ట్రుడిని ఓదార్చడానికి కృష్ణుడు వెళ్ళాడు. ఈ ముగ్గురికి సమయం దొరికింది. సమావేశం జరిపి సత్రాజిత్తును చంపాలి అని పధకం వేశారు. అక్రూరుడు,కృతవర్మకు భక్తితత్పరులు కనుక శతధన్వుడికి ఈ పని అప్పగించారు. శతధన్వుడు నిద్రపోతున్న సత్రాజిత్తును చంపాడు. చంపి ఆ మణిని మెడలో వేసుకొని వచ్చాడు. మణి అపవిత్రమయ్యింది. వాడు అక్రూరుడి వద్దకు వచ్చి ఈ మణి తన దగ్గర ఉంటే జాగ్రత్తగా ఉండదని, అందువల్ల అక్రూరుడి వద్ద దాచమని చెప్పి, బలవంతంగా ఇచ్చి తన ఇంటికి వెళ్ళి దాక్కున్నాడు.
సత్యభామ రధమెక్కి కృష్ణుడి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పింది. కృష్ణుడు శతధన్వుడిని చంపుతానని రధం ఎక్కి ద్వారకకు వెళ్ళి, బలరాముడికి విషయం చెప్పి, రా! అన్నయ్యా ఇద్దరం కలిసి వెళదాం అన్నాడు. ఇద్దరు కలిసి రధం మీద బయలుదేరారు. బలరామకృష్ణులు వస్తున్నారన్న సంగతి తెలుసుకున్న శతధన్వుడు, జాంబవంతుడినే ఓడించిన కృష్ణుడు తనను చంపుతాడని ఆందోళన చెంది గుర్రమెక్కి పారిపోయాడు.
శతధన్వుడు వంద ఆమడల దూరం పరిగెత్తగల గుర్రం ఎక్కాడు. బలరామకృష్ణులు నాలుగు గుర్రాలతో నడిచే రధం మీద వెంబడిస్తున్నారు. కొంచం దూరం వెళ్ళాక శతధన్వుడి గుర్రం కిందపడి మరణించింది (శమంతమణి ప్రభావం). వాడు పరిగెత్తడం చూసి రధంలో వెంబడిస్తున్న కృష్ణుడు అన్నయ్యా, వాడి గుర్రం చనిపొయింది. అలా నేల మీద పరిగెడుతున్న వాడిని రధంలో వెంబడించడం తగదు. ఒంటరిగా పరిగెడుతున్న వాడిని ఇద్దరు వెంబడించడం ధర్మం కాదు. అందువల్ల నువ్వు రధంలోనే ఉండు నేను వాడిని చంపి మణి తీసుకువస్తానన్నాడు.
కృష్ణుడు వాడిని వెంబడించగా, వాడు పొదల్లొ దాక్కొవడం, యుద్దం చేయడం, వాడిని చంపడం జరిగింది. వాడు చనిపోయాక వాడి బట్టలంతా వెతికినా శమంతకమణి దొరకలేదు (ఇంతకముందే వాడు అక్రూరుడికిచ్చాడు). జరిగినదంతా చెప్పి శమంతకమణి దొరకలేదన్న విషయాన్ని చెప్పగా, బలరాముడు 'చిన్నప్పటినుంచి నిన్ను చూస్తునేవున్నా. నువ్వు ఎన్ని దొంగతనాలు చేయలేదు, ఎంత వెన్న తినలేదు, నేను వయసులో పెద్దవాడిని, మణి నాకు ఇవ్వవలసి వస్తుందని, మణి దొరకలేదని అబద్దాలు చెప్తున్నావు. మణిని శతధన్వుడు రధంలో దొంగిలించడం చూసి సత్యభామ నీకు చెప్పింది. మరి మణి వాడి దగ్గర లేకపొతే ఎక్కడ ఉంటుంది? నువ్వూ వద్దు, ద్వారక వద్దు. నేను విదేహరాజ్యానికి వెళ్తున్నాను' అని చెప్పి వెళ్ళిపోయాడు.
తిరిగి ద్వారకకు వెళ్ళిన కృష్ణుడిని చూసి 'చుశారా! అన్నయ్యని కూడా మోసం చేశాడి కృష్ణుడు' అంటూ ప్రజలు అన్నారు.
జాంబవతి 'ఈయన మా నాన్న మీద గెలిచి నన్నూ, మణిని తీసుకున్నాడు. ఈ మణి మా నాన్న ఇచ్చాడన్న గౌరవం కూడా లేకుండా, మా నాన్నకు పేరు వస్తుందని సత్రాజిత్తుకిచ్చాడు. సత్రాజిత్తుకిచ్చి ఆయన దగ్గర నుండి తిరిగి మణిని తీసుకొని సత్రాజిత్తుకు పేరు తేవాలని చూస్తున్నాడు' అని జాంబవతి అనుమానం వ్యక్తం చేసింది.
ముందు మా నాన్న మణి అడిగితే ఇవ్వలేదు. తరువాత ఇచ్చినా అహంకారం అడ్డువచ్చి తీసుకోలేదు. శతధన్వుడు చంపుతాడని తెలిసి, ఆయన మా నాన్ను చంపడం కోసమే కృష్ణుడు ఊరు విడిచి వెళ్ళాడు. ఆ శతధన్వుడిని చంపి ఆ మణి తన దగ్గరే దాచిపెట్టుకొని, లేదని చెప్తూ నటిస్తున్నాడని సత్యభామ అన్నది. తనలో సగమైన భార్యలు కూడా అనుమానించడం మొదలు పెట్టారు. ఇంతకంటే పెద్ద నీలాపనిందలు ఇంకేమంటాయి?
ఇన్ని నీలాపనిందలు ఎదురుకున్న కృష్ణుడు అంతఃపురంలో కూర్చుని ఎంత బయట పడదామన్నా, ఇంకా ఇంకా అపనిందలు వస్తూనే ఉన్నాయి, ఏమి చేయాలని ఆలోచిస్తున్నాడు.
అక్రూరుడికి కృష్ణునియందు అపారమైన భక్తి ఉన్నా, ఆ మణిని కృష్ణునకు ఇవ్వడానికి సిగ్గుపడి, ఆ మణిని తీసుకొని కాశీకి వెళ్ళాడు. కాశీకి వెళ్ళగానే ఆయన మనసు మారింది. నేను మణి ఇవ్వకపోవడం వల్లనే కృష్ణుడి మీద ఇన్ని అపనిందలు పడ్డాయి అని భాదపడ్డాడు. దానిని పవిత్ర కార్యాలకు వాడడం మొదలు పెట్టాడు. దాని నుండి వచ్చిన బంగారంతో కాశీలో రోజు అన్నదానం చేశాడు. ఆ మణిని పవిత్రంగా ఉంచడంవల్ల దాని ప్రభావంతో కాశీలో కరువుకాటకాలు రాలేదు. వ్యాధులు అసలే లేవు.
దీనంగా ఆలోచిస్తున్న కృష్ణుని వద్దకు నారదమహర్షి వచ్చారు. కృష్ణా! నీకు ఇన్ని అపనిందలు రావడానికి కారణం భాద్రపద శుక్లచవితినాడు (అంటే వినాయక చవితి) నువ్వు ప్రసేనుడితో కలిసి వీటకు వెళ్ళినప్పుడు చూసిన చవితి చంద్రుడు. ఆ రోజు చంద్రున్ని చూసిన వారికి నీలాపనందలు వస్తాయని వినాయకుడి శాపం. అందువల్ల ఈసారి నువ్వు వినాయకచవితి రోజున వరసిద్ధివినాయకచవితి వ్రతం ఆచరించు. 21రకాల పత్రిని, అలాగే పచ్చని దొసపండు (కీరదోసకాయ) ను సమర్పించు. వినాయకుడు తప్పక అనుగ్రహిస్తాడు అని పలికాడు నారదమహర్షి.
నారదమహర్షి చెప్పినట్టుగానే కృష్ణుడు వ్రతం ఆచరించాడు. వ్రతం ముగియగానే గణపతి ప్రత్యక్షమయ్యి, మామయ్య!(పార్వతిదేవి విష్ణుమూర్తికి చెల్లెలు. గణపతికి విష్ణుమూర్తి మామయ్య) నా వ్రతం ఆచరించావు కనుక ఈ రోజుతో నీ మీద పడ్డ నీలాపనిందలు తొలగిపోతాయి అన్నాడు. వరం ఇవ్వగానే కాశీకి 'అక్రూర, జరిగింది ఏదో జరిగిపొయింది. ఇక్కడ కరువు వచ్చింది. వర్షాలు లేవు. అందువల్ల నువ్వు తక్షణమే ఆ మణిని తీసుకోని ద్వారకకు రావాలి' అని కబురు పంపాడు.
సాక్షాత్ కృష్ణుడే రమ్మన్నాడు కదా అని అక్రూరుడు ద్వారకు వచ్చి కృష్ణుడికిస్తే, దానికి బదులుగా కృష్ణుడు 'నాకేందుకీ మణి. నేను ప్రజల బాగు కోసమే అడిగాను. నీ దగ్గరే పెట్టుకోని, దీని నుండి వచ్చిన బంగారంతో అన్నదానం చేస్తూ, ఆ మణిని పవిత్రకార్యాలకు వాడు' అని పలికాడు.
అప్పటినుండి ద్వారకలో కరువులేదు. ప్రజలు సుఖశాంతులతో హాయిగా ఉన్నారు. ఆ సమయంలో వినాయకుడు కృష్ణుడితో 'ఇప్పుడు ఆనందంగా ఉందా. నీ మీద పడ్డ పనిందలన్ని తొలగిపోయయి కదా' అని అంటే కృష్ణుడు 'భగవంతుండినైన నేనే చంద్రుని చూసినందుకు నీ శాపం కారణంగా ఇన్ని అపనిందలు పడ్డాను. ఇక సామాన్య మానవులు మరెన్ని కష్టాలు పడతారో. దీనికి ఏదైనా పరిష్కారం చూపవా' అన్నాడు. అందుకు బదులుగా వినాయకుడు, వినాయక చవితి రోజున నువ్వు పడ్డ కష్టాలతో కూడిన ఈ కధను చదివి లేదా విని అక్షింతలు వేసుకుంటారో వారి 'పొరపాటున' చంద్రున్ని చూసినా వారికి ఏ నీలాపనిందలు రాకుండా వరం ఇస్తున్నా. అలాగే పూజ చేయకూడని వారు (జాతాశౌచం, బందువుల మరణం లాంటి కారణాల వల్ల) ఈ కధ చదివిన లేదా విన్న వారు, కధా చదివే సమయంలో చేతిలో పట్టుకున్న అక్షతలను తలమీద వెసుకున్నా ఫలితం లభిస్తుంది' అని పలికాడు.
గణపతి ఎంత శక్తివంతుడో,ఆయన శాపానికి ఎంత శక్తి ఉంటుందో ఈ కధ ద్వారా మనకు అర్దం అవ్తుంది. అలాగే మన కోసమని కృష్ణపరమాత్మ ఇన్ని కష్టాలు పడి, వినాయకుడి ద్వారానే ఒక పరిష్కారం చూపి మనల్ని ఉద్ధరించాడు.
ఈ కధనే వినాయకచవితి నాడు చదవాలి. అలా వీలుకాని పక్షంలో కనీసం శ్లోకమైన చదివి అక్షతలు వేసుకోవాలి.

Comments
Post a Comment