Posts

Showing posts from August, 2019

(Telugu) నేరమూ-శిక్ష - అక్బ‌ర్ బీర్బల్ కథ

[:te]ఒకసారి మాంసం వ్యాపారికి , చ‌మురు వ్యాపారికి మ‌ధ్య చాల పెద్ద గొడవ జ‌రిగింది. త‌మ తగువు తీర్చమని ఇద్ద‌రూ అక్బ‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళారు. వెంట‌నే అక్బ‌ర్ బీర్బల్ కు ఈ స‌మ‌స్య‌ను అప్ప‌గించి ప‌రిష్క‌రించ‌మ‌ని చెప్పాడు. బీర్బ‌ల్ అస‌లేం జ‌రిగింది అని అడ‌గ‌గా మాంసం వ్యాపారి "నేను మాంసం అమ్ముకుంటుంటే ఈ చమురు వ్యాపారి నా దుకాణానికి వచ్చి చమురు పోస్తానన్నాడు. పాత్ర తీసుకు రావడానికి నేను లోపలకి వెళ్ళి నప్పుడు ఇతను నా నాణాల సంచి తీసుకుని అది తనదే అని గొడవ చేస్తున్నాడు. చమురు వ్యాపారి “లేదు! అతను చెప్పేవన్నీ అబద్ధాలు. ఆ సంచి నాదే. నేను నాణాలు సంచి లోంచి తీసి లెక్క‌ పెడుతున్నాను. అది చూసి ఇతను దురాశతో నా సంచి కాచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నిసార్లు అడిగినా ఇద్ద‌రి నుండి ఇదే స‌మాధానం. దీంతో బీర్బ‌ల్ నీటితో నిండిన పాత్రను తెప్పించాడు. సంచిలో ఉన్న నాణాలన్నీ అ నీటి లో ప‌డేశాడు…అప్పుడు ఆ పాత్రలో నీళ్ళపైన పలచగా నూనె తేలింది. దీంతో ఆ నాణాలు చ‌మురు వ్యాపారివే అని నిర్ధారించాడు.. మాంసం వ్యాపారిని క‌ఠినంగా శిక్షించాడు.[:]

(Telugu) పిట్టపోరు కుందేలు పోరు

[:te]పూర్వం వింధ్యపర్వతం మీద ఓ చెట్టుతొర్రలో ఓ పక్షి నివసిస్తూ ఉండేది. అది ఆహారాన్ని వెతుక్కుంటూ పొద్దునే బయల్దేరి, సాయంత్రానికి గూటికి చేరుకునేది. ఎప్పటిలాగానే ఒకరోజు పొద్దునే బయల్దేరింది. సాయంత్రం అవుతోంది. గూటికి చేరే ప్రయత్నంలో వేగంగా ఎగురుతూ వస్తోంది. అంతలో వర్షం పట్టుకుంది. కుండపోతగా కురవసాగింది. వర్షానికి బాగా తడిసిపోయింది పక్షి. ఎగరడం కష్టం అనుకుంది. ఓ చెట్టుకొమ్మన కూర్చుంది. అలాగే ఒక కుందేలు వర్షానికి తడుస్తూ పరుగు పరుగున వింధ్యపర్వతం మీది చెట్టు దగ్గరకు వచ్చి ఖాళీగా ఉన్న చెట్టు తొర్రను గమనించి తొర్రలోకి దూకి, వర్షం నుంచి తప్పించుకుని, వెచ్చగా హాయిగా పడుకుంది. చీకటి చీకటి వేళ గూటికి చేరుకుంది పక్షి. తొర్రలోకి ఆత్రంగా చేరుదామనుకుంటే అడ్డంగా కుందేలు కనిపించింది. చిర్రెత్తుకొచ్చింది పక్షికి. పొడిచి పొడిచి లేపింది దాన్ని.‘ఎవరూ’ అంటూ లేచింది కుందేలు. ‘నా ఇంట పడుకుని, నన్నెవరంటావేంటే! లే!వెళ్ళిక్కణ్ణుంచి. చూడెలా పడుకుందో మహరాజులా.’ కోపగించుకుంది పక్షి.‘నేను వెళ్ళను. ఏం చేస్తావు?’’‘చంపేస్తాను, నన్ను తక్కువగా అంచనా వెయ్యకు.’ అంది పక్షి.‘అది నీ వల్ల కాదుగాని, ముందో విషయం తెలుసుకో! బావు...

(Telugu) చతుర్ధశలోకములు

[:te] ఇతిహాస, పురాణములననుసరించి, బ్రహ్మదేవుని సృష్టిలోన చతుర్ధశ (14) భువనములు లేక లోకములు కలవు. మనమున్న భూలోకమునకు పైన భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము మరియు సత్యలోకములు, భూలోకముతో చేర్చి సప్త (7) లోకములు కలవు. అలాగే భూలోకమునకు క్రింద అతలలోకము, వితలలోకము, సుతలలోకము, రసాతలలోకము, తలాతలలోకము, మహాతలలోకము, పాతాళములని సప్త (7) అధోలోకములు కలవు. భూలోకవాసులైన మానవులను తప్పించి ఇతర లోకములలోనున్నవారు అధిక పుణ్యాత్ములు, అచ్చటనున్న జీవుల శరీరములు అతిసూక్ష్మములైనవి. భూలోకము యొక్క దక్షిణదిగ్భాగములో మృత్యు (యమ) లోకము, ప్రేతలోకము, నరకలోకము, పిత్రులోకములనే 4 భాగములు కలవు. (1) భూలోకము - ఇచ్చట స్వేదము (చెమట నుండి ఉద్భవించు పేళ్ళు (పేనులు), నల్లులు మొ.), ఉద్భిజములు (గ్రుడ్డు నుండి ఉద్భవించు పక్షులు), జరాయుజములు (స్త్రీ, పశువుల గర్భము నుంది ఉద్భవించు మానవులు మరియు పశువులు) అని నాలుగు విధములైన జీవరాసులు. (2) భువర్లోకము (భూలోకము పైన) - ఇచ్చట సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు, అశ్విన్యాది నక్షత్ర సద్రుష్యములైన గ్రహరాసులు, సూక్ష్మ శరీరులైన కిన్నెరా, కింపురుష, విద్యాధరులు కలరు. (3) సువఃలోకము ...

(Telugu) మధుర లాలస - మణికంధరుడి తపోభంగం

[:te] (జరిగిన కథ - ద్వారకలో కృష్ణుణ్ణి చూడటానికి, శిష్యుడు మణికంధరుడితో వెళ్తున్న నారదుడు రంభా నలకూబరుల్ని కలుస్తాడు. రంభకి గర్వభంగం చెయ్యాలనుకుంటాడు. కలభాషిణి రంభానలకూబరులు విమానంలో మాట్లాడుకున్న కొన్ని విషయాల గురించి నారదుణ్ణడుగుతుంది. నారదుడు ద్వారకలో సంగీతం నేర్చుకుని తిరిగి వెళ్తూ ఏ స్త్రీ రూపం కావాలనుకుంటే ఆ రూపం వచ్చే వరం కలభాషిణికి ఇస్తాడు. ఒకరోజు కలభాషిణి తోటలో ఉండగా ఓ సిద్ధుడు సింహం మీద ఆకాశంలోంచి దిగుతాడు. ఆమె గతచరిత్రని వల్లిస్తూ కుశలమడుగుతాడు. ఇక చదవండి.) “అయ్యా! మీకేవో గొప్ప శక్తులున్నట్టున్నాయి. నువ్వు కపిలముని లాటి సిద్ధుడివో లేకపోతే స్వయంగా దేవుడివేనో! మీ పేరేమిటో విశేషాలేమిటో వినాలనుంది నాకు” “నా పేరు మణిస్తంభుడు. నువ్వు చెప్పిన వాళ్ళలో ఎవణ్ణీ కాను. కేవలం మామూలు సిద్ధుణ్ణి” “మీ మాటలు ఒక్కొక్కటి వింటుంటే నాకు మతిపోతోంది. ఇవి మామూలు సిద్ధులకి ఎలా తెలుస్తాయి? మరో విషయం మీరిందాక మణికంధరుడు ఇప్పుడు తపస్సు చేస్తున్నాడన్నారు. అదెలా జరిగిందో తెలుసుకోవాలని కుతూహలంగా వుంది” “అమ్మాయీ! నాకు దూరదృష్టి, దూరశ్రవణ శక్తులున్నాయి. అందువల్ల నేను ఉన్నచోటునుంచి కదలకుండా అన్ని విషయాలు తెలు...

(Telugu) గరుడుని_గర్వ_భంగము (చిన్న కధ )

[:te] ఒకప్పుడు గరుత్మంతునికి ,తాను మహా బలవంతుడనని గర్వము కలిగెను. తాను తక్కువవాడా ? గజ కచ్చపములను చెరియొక కాలితో పట్టుకొని కొన్ని యోజనముల దూరము ఎగురుట, అంతమంది రక్షకులను గెలిచి దేవలోకమున నున్న అమృతమును దెచ్చుట ,ఇంద్రుని వజ్రాయుధమునకు బెదర కుండుట సామాన్య విషయములా ? అవన్నియు ఎందుకు ? సకల బ్రహ్మాండ భాండములను తన కడుపులో బెట్టుకున్న ఆ శ్రీ మహా విష్ణువును అనాయాసముగా వహించుచు లోకములన్నియు దిరుగుచున్న తన కంటే బలవంతుడీ చతుర్దశ భువనములలో ఇంకెవడున్నాడని గర్వ పడ సాగెను. దానితో అందరిని కొంత చులకనగా జూచుచు ప్రవర్తింప జొచ్చెను. ఇది నారాయణుని దృష్టిలో బడినది .ఇతనికెట్లయినను గర్వ భంగము చేయవలెనని సంకల్పించెను.   ఒకనాడు నారదాది మునులు శ్రీ పతిని దర్శించుటకై వచ్చిరి .విష్ణుమూర్తి వారితో మాటలాడుచు అలవోకగా ప్రక్కనున్న గరుడునిపై చేయి వేసెను. మునులతో మాధవుని సంభాషణ సాగుచుండెను . గరుడునికి విష్ణుమూర్తి చేయి భరించ లేనంత బరువుగా నుండెను. ప్రాణములు కడ బట్టు చుండెను . సంభాషణ ఎంతసేపు సాగినదో కాని గరుడు డీలోపున ప్రాణ వశిష్టు డయ్యెను. ఎప్పటికో మునులు సెలవు దీసుకుని వెళ్ళిరి. శ్రీ హరి అప్పుడా చేయి గరుడుని మీద నుండి తీ...

(Telugu) *పులస్త్యుడు*

[:te]పులస్త్యుడు బ్రహ్మ మానస పుత్రులైన ఏడుగురు ప్రజాపతులులో ఒకరు.ప్రస్తుతం జరుగుతున్న మన్వంతరములోని (ఏడవ మన్వంతరము) సప్తర్షులలో ఒకడు. కొన్ని పురాణాలు పులస్త్యుని ద్వారానే మానవాళికి చేరాయి. ఈయన బ్రహ్మ నుండి విష్ణు పురాణాన్ని పొంది, పరాశరునికి బోధించాడు. పరాశరుడు విష్ణు పురాణాన్ని సమస్త లోకానికి తెలియజేశాడు. పులస్యుడు కర్ధముని తొమ్మిది మంది కుమార్తెలలో ఒకతయిన హవిర్భును వివాహమాడినాడు. హవిర్భు ద్వారా పులస్యునికి అగస్త్యుడు జన్మించాడు. పులస్యునికి ఇద్దరు భార్యలు. పులస్త్యుని రెండవ భార్య, రాజర్షి పుత్రిక అయిన తృణబిందు నకు కుమారుడు విశ్రవసుడు కలిగాడు. సుమాలి కూతురైన కైకసి వలన విశ్రవసునికి రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు మరియు శూర్పణఖ జన్మించారు. మరో భార్య ఇద్విద ద్వార కుబేరుడు జన్మించాడు. ఈ విధంగా పులస్త్యుడు కుబేరుడు, రావణుడు వంటి వారితో సహా సమస్త రాక్షసులకు మూలపురుషుడు. పులస్యుడు దక్షుని కూతురైన ప్రిథిని వివాహమాడినాడు. ఈమెనే భాగవతములో హవిస్భూగా చెప్పబడినది. ఇద్విద, తృణబిందుడు మరియు అలంబూష అనే అప్సరసల కూతురు. తృణబిందుడు వైవస్వత మనువు వంశములోని మరుత్తుని సంతతికి చెందినవాడు. తృణబిందుడు యాగము చ...

(Telugu) స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు... పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం

[:te]స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు... పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది..కానీ ఎందుచేతో ఈ పద్యం జన బాహుళ్యం లో లేదు కార్యేషు యోగీ, కరణేషు దక్షః రూపేచ కృష్ణః క్షమయా తు రామః భోజ్యేషు తృప్తః  సుఖదుఃఖ మిత్రం షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం) --> కార్యేషు యోగీ : పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి. --> కరణేషు దక్షః కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో  నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి. --> రూపేచ కృష్ణః రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే (ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకోమని కాదు) ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి. --> క్షమయా తు రామః ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి. --> భోజ్యేషు తృప్తః భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి. --> సుఖదుఃఖ మిత్రం సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి. ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే  పురుషుడు ఉత్తమ  పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు. [:]

రోజూ కనీసం అర గంట... ధ్యానం, యోగ చెయ్యండి... ఆరోగ్యంగా జీవించండి...

బ్రహ్మవిదుడూ, ఉత్తముడు (శ్రోత్రియుడు), కరుణామయుడూ ఐన గురువును చేరి ఆయనను సేవించి, జిజ్ఞాసువైన సాధకుడు ఆత్మవిచారణా విధానాన్ని, ధ్యానం చేసే పద్ధతిని తెలుసుకొని ఆయన చూపిన మార్గం వెంట పయనించాలి.  అర్హత కలిగిన సాధకుడే సాధనలో విజయం సాధించగలడని అర్హత లేనివానికి సిద్ధిలేదని ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నాం. ఈ శ్లోకంలో గురువు యొక్క అర్హతలూ చెప్పబడ్డాయి, శిష్యుని కర్తవ్యమూ చెప్పబడింది.  (i) బ్రహ్మవిదుం :- బ్రహ్మవిదుడు అంటే బ్రహ్మమును గురించి తెలిసినవాడు అని. ఈ లోకంలో సత్ప్రవర్తనతో ఎలా నడుచుకోవాలో చెప్పేవారే ఎక్కువమంది. అదీ కావాలి. ఎవరికి? సామాన్యులకు. మానవజీవిత లక్ష్యమైన మోక్షాన్ని పొందాలని తపనపడే జిజ్ఞాసువులకు సదాచారాన్ని గురించి చెబితే ప్రయోజనం లేదు. వారికి మోక్షాన్నందుకొనే ఉపాయాన్ని చెప్పాలి. దానికై చేయవలసిన సాధనలను చెప్పాలి. ఆత్మను గురించి చెప్పాలి. సదాచారం గురించి కాదు. సర్వాత్మభావం కావాలి అని డా.సర్వేపల్లి రాధాకృష్ణన్  గారన్నారు. ఆత్మా బ్రహ్మమూ ఒక్కటేనని తెలియజేయాలి. ఆ బ్రహ్మము నీవేనని తెలియజేసి బ్రహ్మనిష్ఠలో నిలిచేట్లు చేయాలి. ఇలా చేయాలంటే గురువు బ్రహ్మము గురించి తెలిసిన బ్...

తొలి ఏకాదశి

Image
ఆషాఢ శుద్ద ఏకాదశికి శయన ఏకాదశి, దేవశయన ఏకాదశి, తొలి ఏకాదశి అని పేర్లు. విష్ణువు ఆరాధనకు అత్యంత విశిష్టవంతమైన రోజు. సమస్త సృష్టికి స్థితికర్త అయిన శ్రీ మహావిష్ణువు ఈ రోజు నుంచే వైకుంఠంలో పాలసముద్రంలో ఆదిశేషుని పడుకుని  మీద యోగనిద్రలోకి వెళతాడు. నాలుగు నెలల పాటు నిద్రించి కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఆషాఢ శుద్ద ఏకాదశి నుంచే విష్ణువు శయనిస్తాడు కనుక దీనికి శయన ఏకాదశి అని పేరు. అసలు విష్ణువుకు నిద్ర అనేది ఉంటుందా? స్వామి నిద్రపోతే, బ్రహ్మాండం ఏమైపోతుంది? ఆర్తుజనులను రక్షించేందుకు ఎవరు ఉంటారు? విష్ణుమూర్తి నిద్రపోవడమేంటని చాలా మంది అనుమానం రావచ్చు. అందరిని కాపాడే ఆ పరమాత్ముడికి నిద్ర ఏంటని అనిపిస్తుంది. విష్ణువు అంటే వ్యాపకత్వం కలిగినవాడని అర్దం. విష్ణువు స్థితి కర్త. అందరిని, అన్నిటిని నడిపించేవాడు, విష్ణువే సమస్త జీవరాశిలో ఉన్న ప్రాణశక్తి. మనలో ఆ శ్రీ మహావిష్ణువు ప్రాణశక్తి రూపంలో స్థితమై ఉండి నడిపిస్తున్నాడు. దక్షిణాయనంలో, ముఖ్యంగా భారతదేశంలో వానాకాలం, చలికాలం ఉంటాయి. ఈ సమయంలో సూర్య కిరణాలు భూమి పూర్తిగా చేరకుండా మేఘాలు, మంచు మొదలైనవి అడ్డుపడతాయి...

ఆషాఢ పూర్ణిమ, గురుపూర్ణిమ

Image
ఆషాఢ పూర్ణిమను గురుపూర్ణిమగా జరుపుకుంటాం. ఈ రోజున శ్రీ వేదవ్యాస మహర్షిని తప్పకుండా పూజించాలి. భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేకస్థానం ఉంది. యోగ సంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి. గురుసంప్రదాయంలో శివుడే ఆదిగురువు. పరమశివుడి తాండవంలోఆయన చేతి ఢమరుకం నుంచి నాదం(శబ్దం) పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. ఈ వేదాన్ని శ్రీ మహా విష్ణువు బ్రహ్మదేవునకు ఉపాదేశించాడు(శివకేశవులకు బేధం లేదు, ఇద్దరూ ఒకే పరమాత్మ యొక్క భిన్న కోణాలు). బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మ దేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి, ఆయన తన కూమరుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు. ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయింది, అనేక మంది ఈ మహాజ్ఞానం ఉపదేశించబడదింది. కానీ అప్పటివరకు వేదం ఎప్పుడు గ్రంధస్థం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు(అందుకే వేదానికి 'శ్రుతి' అని పేరు). మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది. కానీ కలియుగంలో మనుష్యుల యొక్క ఆయుషును(జీవిత కాలాన్ని), బుద్ధిని, జ్ఞాపకశక్తిని దృష్టిలో ఉంచ...

గురు పూర్ణిమ విశిష్టత

ఆషాడ పూర్ణిమ, గురుపూర్ణిమ. భారతీయ సంస్కృతిలో గురువులది ప్రత్యేకస్థానం. యోగ సంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి. సిద్ధసంప్రదాయంలో శివుడే ఆదిగురువు. గురుపరంపరకు ఆద్యుడు నారయణుడు. ఈ సృష్టిలో శివుడు, శక్తి, విష్ణువు పరబ్రహ్మ యొక్క ముఖ్యమైన ప్రతిబింబాలు. నిరాకారము, శూన్యము, ఆద్యంతరహితమైన తత్వం, అవ్యక్తమే శివుడు. నిరాకారం సాకారమైనప్పుడు, అవ్యక్తం వ్యక్తమై సృష్టిగా ఏర్పడడమే శక్తి, పార్వతీ దేవీ. సృష్టి మొత్తం జడమనుకుంటే, ఆ జడత్వంలో ఉన్న చైతన్యం, ప్రాణశక్తి శ్రీ మన్నారాయణుడు. బ్రహ్మ దేవుడు, మహర్షులు మొదలైన అనేకమందికి జననమరణాలు, జన్మలు ఉన్నా, వీటన్నిటికి అతీతులు శివ, శక్తి, విష్ణువులు. వీరిని ముగ్గురిగా చెప్పుకున్నా, నిజానికి వీరు ఒక్కరే, తత్వం ఒకటే. సనాతనధర్మం ప్రకారం ఈ సృష్టి క్రమానికి ఆది, అంతము అంటూ ఉండవు. సముద్రపు అలలపై ఏర్పడే నురుగులో ప్రతి క్షణం కొన్ని వేల బుడగలు పుడుతుంటాయి. కొన్ని వేలు నీటిలో కలిసిపోతుంటాయి. అట్లాగే పరమాత్ముడి సృష్టిలో అనేక జగత్తులు నిత్యం ఉద్భవిస్తుంటే, అనేకం లయమవుతుంటాయి. సృష్టి ఏర్పడే క్రమాన్ని సనాతన ధర్మం శాశ్త్రీయంగా కూడా వివరించింది. వాటిలో అణువుల కదిలకలకు ప్రతీక నట...

గురు పూర్ణిమ సందేశం

Image
అంధకారంలో మగ్గుతున్న జీవులను ఉద్ధరించడం కోసం ఈశ్వరుడు ఈ సృష్టి చేశాడు. జీవుల కర్మక్షయం కోసం జన్మల పరంపరను ఏర్పరిచాడు. అన్నీ తానే చేసినా, తాను అన్నిటికి సాక్షిగా ఉండాలని, జీవుల మీద ప్రేమతో వారికి దగ్గరగా ఉండాలని అంతర్యామియై అంతటా, అన్నిటి యందు ఉన్నాడు. ఇది అర్దం చేసుకున్న జీవుడు, ఈ జీవితం భౌతికమైన సుఖాల కోసం కాదని, అంతర్యామియైన భగవానుని తెలుసుకోనుటకేనని నిశ్చయించుకుని ఆయనను వెతకడం ప్రారంభిస్తాడు. భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. మరి ఈశ్వరుని గురించి తెలిపే వారెవరు? నా గురించి ఏదైనా చెప్పుకుంటే నేనే చెప్పుకోవాలి. మీ గురించి చెప్పుకుంటే మీరే చెప్పుకోవాలి. ఇతరులు మన గురించి చెప్తే, అది అసంపూర్ణంగానే ఉంటుంది. అట్లాగే ఈశ్వరుని గురించి కూడా. అందుకే ఈశ్వరుడే రహస్యంగా గురు రూపంలో భూమిపై తిరుగుతూ, తన గురించి తెలుసుకోవాలనే తపన కలిగిన వారికి తన తత్వం చెప్తాడు. అందుకే శాస్త్రం 'ఈశ్వరః గురు రూపేణ గూఢఛ్ఛరతి భూతలే' అంటుంది. వారి వారి స్థాయిని అనుసరించి, వారి సంస్కారాన్ని అనుసరించి వారికి తగిన విధంగా అర్దమయ్యేలా తత్వం బోధ చేస్తాడు. అందుకే లోకంలో అనేకమంది గురువులు ఉన్నారు. ఈశ్వరుడు ఒక్కో య...

గురు పూర్ణిమ విశిష్టత (కధ)

Image
అనాది కాలంనించీ "ఆషాడ శుద్ధపౌర్ణమిని" "గురుపౌర్ణమి" అంటారు. దీనినే "వ్యాసపౌర్ణమి" గా పరిగణలోనికి తీసుకొని ఆ రోజు దేశం నలుమూలలా గురుపూజా మహాత్సవాలు నిర్వహిస్తుంటారు. ఆ రోజు ముని శ్రేష్ఠుడైన వ్యాసమహాముని జన్మతిధి కనుక ఆ భగవానుని యొక్క జన్మదినం మానవ చరిత్రలొనే అది ఒక అపూర్వమైన ఆధ్యాత్మికమైన మహాపర్వదినంగా విరాజిల్లుతోంది. అసలు ఈ ఆషాడ శుద్ధపౌర్ణమి యొక్క విశిష్ఠత గురించి ఒక చక్కని ప్రాచీన కధ ఉంది. పూర్వం వారణాశిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. ఆత్రేయసగోత్రము గల ఆ బ్రహ్మణుని యొక్క పేరు 'వేదనిధి'. ఆయన భార్య వేదవతీ. వీరిద్దరు ఎల్లప్పుడు చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవిస్తుండేవారు. వారు సంతానము కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా; వారికి సంతానము మాత్రం కలుగలేదు. ఇలా ఉండగా; ఒకనాడు 'వేదనిధికీ ప్రతిరోజు మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తుంటారని వార్త తెలుసుకుని ఎలా అయినాసరే! వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజూ వేయికళ్ళతో వెతక నారంభిస్తాడు, ఒక రోజు నదీతీరాన ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్...

గురుపూర్ణిమ – ఆది గురువు ఉదయించిన రోజు!

నిండు పున్నమి రోజు ఉండే స్పందన, ప్రకంపనాలు, ఆ రోజు ఉండే అనుభూతి, మిగతా రోజులలో కన్నా చాలా వేరుగా ఉంటుంది. ఆధ్యాత్మిక పధంలో ఉండేవారికి ఈ రోజు ప్రకృతి నుండి లభించిన ఒక వరంలాంటిది. సుమారు అరవై, డెబ్భై ఏళ్ళ క్రితం వరకూ కూడా, మన దేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో గురుపూర్ణిమ ఒకటి. ఎదో తెలియని కారణం వలన మనం జ్ఞానం బదులు అజ్ఞానాన్ని వేడుక చేసుకుంటున్నాం, అందుకని  ఇది ప్రభుత్వ సెలవువదినం కావాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నాం. మెల్లగా దేశ వ్యాప్తంగా గురుపూర్ణిమ వేడుకలు క్రమక్రమంగా తగ్గిపోయాయి. ఇప్పటికీ అక్కడక్కడా కొన్ని ఆశ్రమాలలో, అది సజీవంగా ఉంది, కానీ ‘గురుపూర్ణిమ’ అంటే ఏమిటో ఈ రోజుల్లో చాలా మందికి తెలియదు. మనం యోగ సాంప్రదాయంలో శివుడిని దేవుడిగా చూడం. ఆయనను ఆదియోగి లేదా మొదటి యోగిగా చూస్తాం. మొట్ట మొదటి గురువు జన్మించిన రోజుని గురుపూర్ణిమ అంటాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం, శివుడు సిద్ధి పొంది, హిమాలయాల్లో పారవశ్య నృత్యం చేసారు. మనం యోగ సాంప్రదాయంలో శివుడిని దేవుడిగా చూడం. ఆయనను ఆదియోగి లేదా మొదటి యోగిగా చూస్తాం. ఆయన పారవశ్యత కదలికలను అధిగమించినప్పుడు, ఆయన నిశ్చలులయ్యారు. పారవశ్యత ఆయనలో...

వరలక్ష్మీదేవి వ్రత కథ

సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులని చూసి యిలా అన్నాడు. ‘ఓ మునీశ్వరులారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి’. ఒక రోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా, పార్వతీదేవి ఆయనని సమీపించి, ‘దేవా! లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యములను, పుత్రపౌత్రాదులను కలిగి సుఖసంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి’ అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడు. ‘ఓ దేవీ! స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతమును శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము రోజు చేయవలెను’. పార్వతీదేవి ‘ నాథా! ఆ వరలక్ష్మీ వ్రతము ఎలా చేయాలి , ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీనినెవరైనా యింతకు ముందు చేసారా? ఆ వివరములన్నీ చెప్పండి’ అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను విను. పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది...

వరలక్ష్మీవ్రత కధ ద్వారా మన గ్రహించవలసింది ఏమిటి?

Image
ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అఖిల జగత్తులకు తండ్రి అయిన శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటారు కనుక, ఈ నాలుగు నెలలు మన అమ్మ లక్ష్మీదేవి లోకపరిపాలన చేస్తుంది. పిల్లలు నాన్నను ఏదైనా ఒక వస్తువు అడగాలంటే భయపడతారు. కానీ అమ్మ దగ్గరకు వచ్చేసరికి భయం ఉండదు. స్వేచ్చగా అడుగుతారు. నాన్న వస్తువు కొన్నివ్వడంలో కాస్త ఆలస్యం చేసినా, అమ్మ అడగగానే కొనిస్తుంది. అదే విధంగా ఒక అధికారి ఇంట్లో లేనప్పుడు, ఆయన భార్య, తన భర్తకు చెడ్డపేరు రాకుండా ఉండేలా జాగ్రత్తగా ఆలోచిస్తూ, పనులన్నీ చక్కబెడుతుంది. తిరిగి భర్త రాగానే, తానూ చేసినవన్నీ చెప్తుంది. అలాగే లక్ష్మీదేవి కూడా తను పరిపాలకురాలిగా అన్నీ పనులు చక్కబెడుతుంది. పిల్లలు అడిగినవన్నీ వెంటవెంటనే ఇచ్చేస్తుంది, వరాలు కురిపిస్తుంది. అందుకే ఇప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారికి వరలక్ష్మీ అని పేరు. వరలక్ష్మీ వ్రతం కేవలం స్త్రీలకు సంబంధించిన వ్రతం మాత్రమే కాదు. స్త్రీ ఉంటేనే కుటుంబ వ్యవస్థ అంటారు. స్త్రీ లేకుంటే అసలది కుటుంబమే కాదు. కుటుంబ వ్యవస్థకు స్త్రీ మూలస్థంభం. అటువంటి స్త్రీ ఒక పూజకు ఉపక్రమించింది, వ్రతం చేపట్టిందంటే మొత్తం కుటుంబం అందులో పాల...

ధనుర్మాసం విశిష్టత

ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. దీనిని బాలభోగం అని పిలుస్తారు. భోగితో ముగుస్తుంది: సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసే భోగి వరకూ (సంక్రాంతి ముందురోజు) ధనుర్మాసం కొనసాగుతుంది. ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది. వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి (అండాళ్‌) మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి, స్వామిని కీర్తించింది. ధనుస్సంక్రమణ రోజు స్నానాలు, పూజలు, జపాలు చేయడం మంచిది. సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం. ఎంతో పునీత మాసం: ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ధను అనగా దేనికొరకు ప్రార్థించడమో అనే అర్థం దృష్ట్యాధనుర్మాసం అత్యంత పునీతమైనది. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలగలసిన అంశాలలో ధన...