(Telugu) విషయం వుందిలే ఈ మాటలలొ

[:te]149. బాధపడటానికి వంద కారణాలు చూపించిన జీవితానికి నవ్వడానికి వెయ్యి కారణాలు వున్నాయని నువ్వు చూపించు నీకు జీవితం ఎంతో అందంగా కనిపిస్తుంది
150. నిన్నంతా గతము నేడంతా సుఖము ఇక రేపటికెందుకు భయము నీదే జయము !!!సాగించుమా పయనము సాగించు అలుపెలేని .... పయనం సాగించు
153. వెలుగుతున్న దీపమే ఇతర దీపాలను వెలిగించగలదు. నిత్యం నేర్చుకునే వాడే ఇతరులకు నేర్పగలడు.
154. తల్లికి మీరేమిచ్చినా తక్కువే. ఎందుకంటే ఆమె మీకు జీవితాన్ని ఇచ్చింది మరి.
155. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే.
156. ఏకాగ్రత ఉంటే ఏదైనా సాధించగలం. అందుకే మనం చేసే పని మీదే పూర్తి ఏకాగ్రత ఉంచాలి.
157. ఆలోచనలలో విశ్వాసం, కార్యాలలో ధైర్యం, మాటలలో వివేకం, జీవితంలో సేవా భావం ఎప్పుడూ కలిగి ఉండాలి.
158. మహాత్ములు మనోబలాన్ని కలిగి ఉంటారు. దుర్భల మనుషులు కోరికలను మాత్రమే కలిగి ఉంటారు.
159. ఆత్మవిశ్వాసం అనేది అదృష్టం కన్నా గొప్పది. పట్టుదల గల మనిషి అదృష్టం కోసం ఎదురుచూడడు.
160. నీ మీద నీకు నమ్మకం లేకపోతే నీవు సాధించగలిగిందేమీ ఉండదు. విజయపథంలో సాగాలంటే ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి- స్వామి వివేకానంద
161. నీవు కావాలన్నది సాధించాలనుకుంటే నీలో ఉన్న శక్తిని విశ్వసించాలి- రాబర్ట్ ఆంథోని
162. భయం తలుపు తట్టినప్పుడు ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలపాలి. అప్పుడు భయం పారిపోతుంది- మార్టిన్ లూథర్ కింగ్
163. విజయం మన అకుంఠిత విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది.
164. బలహీనులే అదృష్టాన్ని నమ్ముతారు. ధీరులెప్పుడూ కార్యకారణ సంబంధాన్నే విశ్వసిస్తారు.
165. ఆత్మవిశ్వాసం మితిమీరితే అహంకారమైనా అవుతుంది లేక అజ్ఞానమైనా అవుతుంది.
166. ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే మనిషి ఎక్కలేని ఎత్తులు లేవు. అందుకోలేని శిఖరాలూ లేవు.
167.ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోలేం. ప్రేమతో మాత్రమే జయించగలం- గౌతమ బుద్ధుడు
168. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత- అరిస్టాటిల్
169. కోపంగా ఉండటం అంటే రగిలే నిప్పును చేతితో పట్టుకోవడంలాంటిది. దానిని ఇతరులపై విసిరే లోపలే నిన్ను దహించి వేస్తుంది- గౌతమ బుద్ధుడు
170. కోప రంగప్రవేశం చేయగానే వివేకం తెర వెనక్కు వెళ్ళిపోతుంది.
171. మంచి మనుషుల హృదయాల్లో క్రోధం ఎక్కువ సేపు ఉండలేదు.
172.బలోద్రేకాల కంటే ఉన్నతమైనవి సహనమూ...కాలమూ- లాఫాంటిన్
173. మనం గతాన్ని మార్చలేము. కానీ భవిష్యత్తుకు సంబంధించిన దిగులు బంగారం లాంటి మన వర్తమానాన్ని పాడు చేస్తుంది- పార్కర్
174. కాలమే జీవితం. కాలం వృథా చేయటం అంటే జీవితాన్ని వృథా చేయటమే.
175. ఏ పనైనా మూడు గంటలు ముందైనా పూర్తి చేయొచ్చుగాని, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు.
176. మనకెప్పుడూ తగినంత కాలం ఉండనే ఉంటుంది. కానీ అది జాగ్రత్తగా వినియోగించికోవాలంతే.
177. చెయ్యవలసిన పని ఆలస్యంగా చేయడం అమాయకత్వం కాని చెయ్యకూడని పని ముందుగానే చేయడం మూర్ఖత్వం.
178. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే సాఫల్యానికి రాచబాట.
179. కొన్ని సమయాల్లో నష్టపోవడమే గొప్ప లాభం- హెర్బర్ట్
180. మామూలు మనుషులు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచిస్తుంటారు. ప్రతిభ గల వారు సమయాన్ని స్సద్వినియోగం కోసం ప్రయత్నిస్తారు.
181. రోజులు నేర్పజాలని పాఠాలు సంవత్సరాలు నేర్పగలవు- ఎమర్సన్
182. తేలికయిన హృదయం చాలా కాలం జీవిస్తుంది- స్వామి వివేకానంద
183.లక్ష్యం చేరడం కష్టమైనా అసాధ్యం కాదు. ధైర్యంతో ముందుకు సాగాలి.
184. ఉత్సాహంతో ఏ పని చేసినా లక్ష్యసాధనలో మనం విఫలమయ్యే ప్రసక్తే ఉండదు- వాల్మీకి
185. చిన్న చిన్న లక్ష్యాలతో ప్రయత్నాలు మొదలు పెడితేనే భారీ లక్ష్యాలు సాధ్యమవుతాయి- విలియమ్ షేక్ స్పియర్
186. లక్ష్యం మీద చూపించే శ్రద్ధ, దాన్ని సాధించే విధానాల మీద కూడా చూపించినప్పుడే లక్ష్యసిద్ధి జరుగుతుంది.
187. జీవితానికి ఒక లక్ష్యమంటూ ఒకటి ఉండాలి. లేకపోతే గమ్యం లేని నదివలె ఎటు ప్రవహించాలో తెలీదు.
188. మనం చేపట్టిన లక్ష్యం మంచిదైతే చాలదు. నడిచే మార్గం కూడా సరైనది కావాలి- నెహ్రూ
189. గొప్ప లక్ష్యాన్ని సాధించాలని ప్రయత్నించి విఫలం కావడం నేరం కాదు, గొప్ప లక్ష్యం లేకపోవడం నేరం.
190. మనం సాధించాలి అనుకున్న విషయాన్ని మర్చిపోవడమే మనం చేసే అతి పెద్ద నేరం- పాల్
191. వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది- జపాన్ సామెత
192.అపజయాన్ని కఠినమైన శ్రమ ద్వారా తునాతునకలు చేయవచ్చు- లేమన్
193. సాధిందిన దానితో సంతృప్తి పొందడం ప్రారంభిస్తే అక్కడితో అభివృద్ధి ఆగిపోయినట్టే- స్టెఫ్ కెట్టరింగ్
194. అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి- ఠాగూర్
195. అసాధ్యం అనే పదం ఎంతో జాగ్రత్తగా వాడే వారే విజయవంతమయ్యే వారు.
196. ప్రణాళికాబద్ధంగా పనిచేసేవాడు జీవితంలో అనేక విజయాలు సాధిస్తాడు.
197. విజయానికి రహదారి ఎప్పుడూ నిర్మాణంలోనే ఉంటుంది- ఆర్నాల్డ్ పాల్కర్
198. సుఖ దుఃఖాలపైన ఆధిపత్యం సంపాదించిన వ్యక్తి జీవితంలో విజయానికి చేరువవుతాడు- మోక్షగుండం విశ్వేశ్వరయ్య
199. మనిషి ఆశావాదంతో జీవించాలి. కృషి ఉంటే ఎవరికైనా, ఎప్పటికైనా విజయం వరిస్తుంది. చీకటిని నిందిస్తూ కూర్చునే కంటే ఓ కొవ్వొత్తిని వెలిగించే చొరవ తీసుకోవాలి. అప్పుడే జీవితంలో ఏదైనా సాధించే నేర్పు అలవడుతుంది- మోక్షగుండం విశ్వేశ్వరయ్య
200.స్వయంకృషితో పైకి వచ్చిన వ్యక్తి దగ్గర అదృష్టం గురించి మాట్లాడలేము.
201. నువ్వెంత కష్టపడి పని చేస్తావో చెప్పొద్దు. ఎంత పని పూర్తయిందో చెప్పు- బెర్నార్డ్ షా
202. పనిలో కష్టం కూడా సుఖాన్నిస్తుంది- మోక్షగుండం విశ్వేశ్వరయ్య
203. కష్టపడి పని చేసినవాడే విశ్రాంతిని పూర్తిగా అనుభవించగలడు.
204. గొప్ప పనులు బలంతో కాదు, పట్టుదలతో సాధ్యమవుతాయి.
205. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నీ వినియోగించుకోవడమే వివేకం.
206. మీకు ఇష్టమైన దాన్ని అందుకోవడానికి కృషి చేయకపోతే అందుబాటులో ఉన్నదాన్నే ఇష్టపడాల్సి వస్తుంది.
207. ఒక శాతం ప్రేరణను, తొంభైతొమ్మిది శాతం శ్రమను ప్రతిభ అంటారు- రోస్ పాల్
208. కష్టపడి పనిచేయడం+ ఆత్మవిశ్వాసం+ నిరంతర సాధన+లక్ష్యం వైపే పయనం= విజయం.
209. పని సాధించడానికి సాధనలపై గురి ఏర్పరుచుకోవాలన్నదే నేను జీవితంలో నేర్చుకున్న అతి గొప్ప పాఠం- స్వామి వివేకానంద
210. బద్ధకంలో దారిద్ర్యం ఉంది. కృషిలో ఐశ్వర్యం ఉంది.
211. సోమరితనం ఒక రాచపుండు వంటిది. ఒకసారి సోకిందంటే ఆ వ్యక్తి ఇక బాగుపడలేడు
212. ఓర్పు చేదుగానే ఉంటుంది. కానీ దాని ఫలితం మాత్రం ఎంతో మధురంగా ఉంటుంది- రూసో
213. ఇతరుల తప్పులను క్షమించడానికి మొదటి మెట్టు, వాటిని భరించగలగడం.
214.నీ ప్రయత్నం నువ్వు చేయి. ఫలితం గురించి ఎక్కువగా ఆలోంచించకు. ఎందుకంటే అది మంచైనా సరే, చెడైనా సరే తప్పకుండా వస్తుంది. ఓడితే మళ్ళీ ప్రయత్నం చేయాలి. లేకపోతే పతనం తప్పదు.
215. ఓటమి అంటే ఆ పనిని అంతటితో ఆపివేయమని కాదు దాని అర్థం. ఆ పనిని మరింత పట్టుదలతో, నేర్పుతో విజయవంతం చేయమని దాని అర్థం.
216. ఓడిపోగానే ఒక వ్యక్తి చరిత్ర ముగిసిపోదు. పారిపోయినప్పుడు మాత్రమే అలా జరుగుతుంది- రిచర్డ్ నిక్సన్
217. జీవితంలో వైఫల్యాలు భాగమని గ్రహించేవారు వాటి నుండి గుణపాఠాలు నేర్చుకోవచ్చు- ఠాగూర్
218. ఓటమి కుంగిపోవలసింది కాదు, మరింత మెరుగైన స్థితికి చేరుకోవడానికి పనికివచ్చే నిచ్చెన అది.
219. అపజయం వల్ల నిరాశకు గురికావచ్చు. కానీ మళ్ళీ ప్రయత్నం చేయకపోతే పతనం తప్పదు- బెవర్లీ సిల్స్
220. జీవితంలో విఫలమైన వారు ఓడిపోరు, మధ్యలో వదిలేస్తారంతే- పాల్.జె.మేయర్
221. గెలవాలంటే ఓటమికి కారణాలు తెలియాలి- నెహ్రూ
222. కష్టపడకుండా విజయాన్ని ఆశించడం ఎడారిలో మంచినీళ్ళ కోసం వెదకడం లాంటిది.
223. ఒక పెద్ద పనీని అసంపూర్ణంగా చేయడం కన్నా ఒక చిన్న పనిని పరిపూర్ణంగా చేయడం ఉత్తమం.
224.వివేకం ఉత్తములను నడిపిస్తుంది. అనుభవం మధ్యములను నడిపిస్తుంది. అవసరం అధములను నడిపిస్తుంది.
225. అజ్ఞానం కన్న నిర్లక్ష్యం ఎక్కువగా కీడు చేస్తుంది.
226. మనిషికి నిజమైన పెట్టుబడి డబ్బు కాదు. సరైన ఆలోచన.
227. వివేకవంతుడు ముందు ఆలోచించి తరువాత మాట్లాడుతాడు. అవివేకి ముందు మాట్లాడి తరువాత ఆలోచిస్తాడు- డెవిలే
228. జరిగిపోయిన దాని గురించి బాధపడకూడదు. జరిగిన దాని ద్వారా జరగబోయే దాని గురించి ఆలోంచించాలి.
229. ఏదైనా ఆలోచించాకే నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకున్నాక ఆ
230.అంతా మన మంచికే అనుకోవడంవల్ల లాభం ఏమిటంటే మనకు కష్టం కలిగిందన్న బాధ ఉండదు. అంతే కాదూ భవిష్యత్ లో మంచి జరుగుతుందనే భావంతో ఉంటాం కాబట్టి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇది మన జీవితంలో సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడానికి దోహదపడుతుంది
231.మన ప్రవర్తనే మనకు మిత్రులనుగానీ, శత్రువులనుగానీ సమకూరుస్తుంది.
232.కదలకుండా కూర్చుంటే కల కరిగిపోతుంది. ఆచరణకు పూనుకుంటే స్వప్నం సాకరమవుతుంది
233.కోపం మరో వ్యక్తికి హానికలిగించేందుకు ముందే నీకు హాని కలుగజేస్తుంది
234.లోకంలో ఎప్పుడూ ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోలేం. ప్రేమతో మాత్రమే ద్వేషాన్ని ఎదుర్కోగలం--- గౌతమబుద్దుడు.
235.ప్రతి పక్షికి కావల్సిన ఆహారాన్ని భగవంతుడు ఇస్తాడు. అంతేగాని దాని నోటికి ఆహారాన్ని అందివ్వడు
236.మనం కావాలని ఇతరుల్ని దూరంగా ఉంచినప్పుడు ఒక శక్తి సమకూడినట్లుండి,సంతోషంగా ఉంటుంది.కానీ ఇతరులు మనల్ని దూరంగా ఉంచుతున్నారని అనిపించినప్పుడు ఒంటరితనం బాధిస్తుంది.బలహీనత ఏర్పడి,దుఃఖం వస్తుంది. ఆలోచనలతో మనంసృష్టించుకొనే గోడల్నిపైకి లేవకుండా ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు.---జిడ్డు క్రిష్ణమూర్తి
237.కోరికల్ని సృష్టించుకుంటూ, వాటికి లొంగిపోతూండటం,వాటిని నెరవేర్చుకోవాలని తాపత్రయపడటం ఒకవిధంగా మానసిక పరాధీనతే. కొందరు వ్యక్తులుగాని, కొన్ని వస్తువులుగాని దగ్గర లేకపోతే బ్రతకలేమనుకోవడం కూడా పరాధీనతే. వ్యక్తులమీదా,వస్తువులమీదా,మానసికంగా ఆధారపడటమే సమస్యల్ని సృష్టిస్తుంది,మనశ్శాంతి లేకుండా చేస్తుంది.---జిడ్డుక్రిష్ణమూర్తి
238.కష్టాలను తప్పించుకునేవారికంటే వాటిని అధికమించేవాళ్ళే విజయం సాధించగలరు.-- మహాత్మాగాంధీ
239.వెచ్చదనం మైనాన్ని కరిగించినట్లే సభ్యతాసంస్కారాలు ఎదుటివారి మనసులను కరిగిస్తాయి
240.పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడితే , మనుషులు నాలుకలు కారణంగా చిక్కుల్లో పడతారు.
241.పగ తీర్చుకుంటే ఆరోజు మాత్రమే ఆనందం కలుగుతుంది. ఒకరోజు ఆనందం కోసం చిరకాలం కలిగే ఆనందాన్ని బలిపెట్టకూడదు.--తిరుక్కురళ్.
242.మీకు కాలం అనుకూలంగా లేనప్పుడు, మీరే కాలానికి అనుకూలంగా మెలగండి
243.ఏమీ తెలియనప్పుడు మౌనంగా ఉండాలి. అలాగే అన్నీ తెలిసినప్పుడు కూడా
244.పిల్లలకు తల్లిదండ్రులిచ్చే అతిపెద్ద బహుమానామేమిటంటే వారిద్దరూ అన్యోన్యంగా ఉండడమే.
245.ఆకలి తీర్చే అన్నదాత కంటే అజ్ఞానం పోగొట్టే జ్ఞానదాత మిన్న
246.ఒక ఇంట్లో కుటుంబసభ్యులు పరస్పరం ప్రేమను కలిగి ఉండకపోతే ఎన్ని విద్యుద్దీపాలు ఉన్నా వెలుతురు లేనట్లే. ఈ భావం ప్రపంచం అంతా విస్తరించాలని దేశ దేశాల మధ్య అంతరాలు తొలిగి ఐకమత్యం ఏర్పడాలని ఆ దేవుడ్ని ప్రార్ధిద్దాం
247.జీవితం అంటే 'భౌతిక సుఖాలు మాత్రమే ' అన్నభావం నుంచి బయటపడి ఈర్ష్య, ద్వేషం వంటి వాటిని నిగ్రహించుకోగల్గితే ఎదుగుతాము.
248.ఎవడు సమస్త ప్రాణుల యొక్క సుఖదుఃఖాలను తనవిగా చూచుకుంటాడో, అలాంటివాడు అందరిలో నాకు ఎక్కువ ప్రియతముడు.------- శ్రీకృష్ణుడు
249.కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్న వాడు ... హింసకు దూరంగా ఉంటాడు ! పునర్జన్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్న వాడు ... పరిస్థితులకు ఆవల ఉంటాడు !
250.విజయం ఒక గమ్యం కాదు గమనం మాత్రమె ఎన్నిసార్లు ఓడినా మళ్లీ గెలవడానికి అవకాసం ఉంటుంది..- జార్జ్ ఇలియట్
251.సంపదతో సంబంధం లేకుండా సాటి మనిషి పట్ల ప్రేమను చూపించాలి... - గౌతమ బుద్ధుడు
252.శాంతంగా, నిబ్బరంగా ఉండటమే నిజమైన శక్తికి నిదర్సనం..- స్వామి వివేకానంద
253.ఏది తప్పో ఏది ఒప్పు మీ అంతరాత్మ చెబుతూనే ఉంటుంది తెలియదనడం వట్టి వంచన - చలం
254.ఆవేశాలు చెలరేగినప్పుడు మేధావికి మౌనమే శరణ్యం..- నేతాజీ సుభాష్ చెంద్రబోస్
255.ఈ విశ్వ సౌభాగ్యానికి విద్యార్ధులే పట్టుగొమ్మలు..- రవీంద్రనాద్ ఠాగూర్
256.తాను సర్వజ్ఞాడినని విర్రవీగేవాడే అందరికన్నా మూర్ఖుడు.. - చాచాజీ జవహర్లాల్ నెహ్రు
257.ఉదయం కానేకాదనుకోవడం నిరాశ ఉదయించిన ఉదయం అలానే ఉండాలనుకోవడం దురాశ..- కాళోజి
258.ఏ విషయంలోనూ, ఎట్టి పరిస్థితిల్లోను ఇతరులతో పోల్చి చూసుకోకండి. ఎందుకంటే 'పోలిక' అనేది విషతుల్యమైనది. అలా 'పోల్చుకోవటం' ద్వారా మీదైన ప్రత్యేకమైన 'అత్యద్భుతమైన సృజనశక్తి' ని మీరు కించపరుస్తున్నారు. అందువల్ల 'పోలిక' ను త్యజించి, మీవైన విలక్షణమైన ప్రతిభా సామర్ధ్యాలను మీ శక్తి మేరకు వినియోగించండి ... వికసించనియ్యండి ! ----- సేత్
259.ప్రపంచంలో అత్యంత లోతైనది సాగరం కాదు జీవితం.. సాగరాన్ని కష్టమైనా ఈదవచ్చేమో కాని సంసార సాగరాన్ని ఈదడం చాలా కష్టం .
260.మనది అనుకునేది.. మనది కాదు అనుకునేది ఏది మనది కాదు.. అది అర్ధం చేసుకుంటే ఏ బాధా లేదు
261.జననం మరణం అనే ఎత్తుగా ఉండే రెండు పర్వతాల మధ్య మనం గమనాన్ని సాగించే వారధి జీవితం
262.మంచి చెప్పేది మనకన్నా చిన్నవాడైనా చెవికి ఎక్కించుకోవాలి.. చెడు చెప్పేది మనకన్నా పెద్దవారైనా పెడచెవిన పెట్టాలి
263.ఏది తప్పు.. ఏది ఒప్పు.. ఏది ముప్పు.. అనేది మన మనసుకి ముందే తెలుసు ఏదైనా పని చేసే ముందు మనల్ని మనం ప్రశ్నించుకుంటే తప్పులే చేయకుండా జీవించవచ్చు ఇది కష్టమే కాని అసాధ్యం కాదు
264.అసత్యం పలకడం తప్పు కాని ముప్పు నుంచి తప్పించుకునే పరిస్థితులలో ఆ తప్పు చేయడం తప్పేమీ కాదు
265.సముద్రంలో నీళ్ళెన్నివున్నా లోనికివస్తే తప్ప ఓడను ముంచలేవు.అన్ని రకాలైన వత్తిడులు మనల్ని బాధించలేవు, వాటిని లోనికి రానిస్తే తప్ప
266.కొంత మంది నిరంతరం ఎదుటివారినడిగి తమకు కావలసినవన్నీ సమకూర్చుకుంటుంటారు. అంతే కానీ తమకు తాముగా సంపాదించటం, ఖర్చు పెట్టడం అనేవి చేయరు.
267.నా నమ్మకం ఒక్కటే ! మనిషిగా పుట్టడం ఒక అదృష్టం. మనం మనకోసమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసమూ బ్రతకాలి. అప్పుడే మన జీవితానికి విలువ.
268.మాట్లాడడానికి ముందు శ్రద్ధగా విను. వ్రాయడానికి ముందు సావకాశంగా ఆలోచించు. వెచ్చించడానికి ముందు సంపాదించు. పెట్టుబడి పెట్టేముందు విచారించు. ఆక్షేపించేముందు బాగా ఆలోచించు. విలియం ఆర్థర్ వార్డ్
269.మన సమస్యలకు పరిష్కారాలు మనదగ్గరే ఉంటాయి . కానీ మనం, ఎవరో వచ్చి వాటిని పరిష్కరిస్తారని అనుకొంటామంతే. షేక్స్ పియర్.
270.మనలో ఉన్న పెద్ద లోపమేమిటంటే ముగ్గురం కలిసి పొందికగా ఐదునిమిషాలు పని చేయలేం. ప్రతివ్యక్తీ పెత్తనం కోసం పాకులాడుతుంటాడు. అందువల్లే మొత్తం పని, వ్యవస్ధ చెడిపోతున్నాయి.
అప్పటి రోజుల్లో కూడా ఒకే లక్ష్యం వైపు పయనిస్తూ ఆదిపత్యం కోసం గ్రూపులు, ముఠాలు అంటూ కొట్టుకున్నారని వింటుంటే “మార్పు” ఎప్పటికీ రాదు అనిపిస్తుంది.
271.పిరికితనానికి మించిన మహాపాపం ఇంకోటి లేదు. ఒక దెబ్బతింటే రెట్టింపు ఆవేశంతో పది దెబ్బలు కొట్టాలి. అప్పుడే మనిషివని అనిపించుకొంటావు. పోరాడుతూ చనిపోయినా పర్లేదు. కానీ పోరాటం అవసరం.
272.ప్రేమ.. డబ్బు.. జ్ఞానం.. చదువు.. దేనికోసమైనా తపనపడుతూ పిచ్చివాడై పోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచాల్సిందల్లా ఉడుంపట్టులాంటి పట్టుదల, సంకల్పబలం, శ్రమించేతత్వం
273.మనలో నిజాయితీ వుంది అని అనుకున్నప్పుడు ఎవరికీ భయపడ వలసిన పని లేదు. మన కోసం కానీ, సమాజం కోసం కానీ, జీవితం అంటే నిరంతర పోరాటమే.
274.గెలుపు ఓటమి వేరు వేరు కాదు.ఒకే ప్రయాణంలోని మజిలీలు.అందుకే దామస్ ఆల్వా ఎడిసన్ 'ఎవరన్నారు నేను ఏడు వందల సార్లు విఫలమయ్యానని?నిజానికి ఒక్కసారి కూడా విఫలం కాలేదు.ఆ ఏడు వందల ప్రయత్నాలలో బల్బు వెలగకపోవటానికి ఏడు వందల కారణాల్ని గుర్తించగలిగాననీ చెప్పాడు[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము