బోధి ధర్మ : తేనీరు
బోధి ధర్మ షావోలిన్ పర్వతం పైన ఒక గుహలో తొమ్మిది సంవత్సరాలు ధ్యానం లో ఉన్నాడు. ఆ సమయంలో ఆయన ఒక గోడను తదేకంగా చూస్తూ ధ్యానాభ్యాసం చేసేవాడు. ఆ సమయంలో ఆయనకు నిద్ర మత్తు వచ్చి కనురెప్పలుమూసుకు పోయేవి. దీనిని నివారించ దానికి ఆయన కను రెప్పలను కోసి పారవేశాడు. అవి నేలపైన పడిన చోట తేయాకు మొక్క పుట్టింది. అందువల్లనే తేనీరు త్రాగితే నిద్ర రాదు. ఇది చైనాలో ప్రచారంలో ఉన్నటువంటి ఒక గాథ. ఇందులోని నిజా నిజాలను ప్రక్కన ఉంచితే, ఈనాటికీ జెన్ ఆశ్రమాలలో సన్యాసులు ధ్యానంలో కలిగే నిద్రను ఆపుకోనడానికి తేనీరు సేవించటం ఒక ఆచారంగా వస్తున్నది. ఆశియా దేశాలలో దొరికే దామో బొమ్మకు అందుకే కనురప్పలుఉండవు. బోధి ధర్మనే సంక్షిప్త రూపంలో దారుమ అని దామో అని జపాన్ లో పిలుస్తారు. ఆయనకు కల ఇంకొక పేరు ధర్మ తిష్య. దీనినే జపాన్ లో దారుమ తైషి అని అంటారు. నిద్రను జయించి తదేక దృష్టి తోతొమ్మిది ఏళ్ళు ధ్యానం లో ఉన్న కారణం చేత బోధి ధర్మ చిత్రాలకు మిడి గుడ్లు ఉంటాయి. కనురెప్పలు ఉండవు. ఇంకొక గాధ ప్రకారం, అన్ని ఏళ్ళు కదల కుండా కూర్చొనుట వల్ల ఆయన కాళ్ళకు పక్షవాతం వచ్చింది. కనుక ఆయన బొమ్మలకు కాళ్ళు కూడా ఉండవు. ఇది నిజం కాక పోవచ్చు. ఎందుకంటే ఆయన మరణం తర్వాత మూడేళ్ళకు ఆయనమంచులో నడుస్తూ భారత దేశానికి పోవటం సరిహద్దు సేనాని చూస్తాడు.
కనుక ఈ గాధలను ప్రతీకాత్మకం గానే తీసుకోవాలి. తదేక ధ్యాన నిష్ఠకు సూచకంగా కనురెప్పలు లేకపోవటం, తొమ్మిదేళ్ళుకదలకుండా కూచోవటం సూచనకు కాళ్ళు లేకపోవటం అనేవి ప్రతీకలుగా (symbols) తీసుకోవాలి. ఆయన కూర్చొని ఉన్న గుహలోని గోడ మీద ఆయన నీడ ఏళ్ళ తరబడి పడి అది చాయా చిత్రంగా మారింది. ఇది ఈనాటికీషావోలిన్ ఆలయంలో గల బోధి ధర్మ గుహలో గోడమీద చూడవచ్చు.తదేకధ్యాన నిష్ఠకు ప్రతీకగా బోధి ధర్మ చరిత్ర పుటలలో నిలిచి పోయాడు.
Comments
Post a Comment