(Telugu) మనసును మార్చే కొన్ని మాటలు

[:te]అనందం గా ఉండడానికి 5 చిట్కాలు :
1. ద్వేషాన్ని దూరం చేయండి.
2. చెడు ఆలోచనలకు దూరం గా ఉండండి.
3. వీలైనంత సాధు స్వభావం కలిగి ఉండండి .
4. ఎక్కువ ఇవ్వండి.
5. తక్కువ ఆశించండి.

741)వెక్కి వెక్కి ఏడిస్తే వెతలు తీరునా..కలతసెంది కూకుంటే కతలు మారునా..
అంతటి సూరీడుకైనా తప్పదుగా గ్రహణం
అంతటితో కృంగిపోతే ఉంటుందా ఉదయం??"
742)సజ్జనులతో సాంగత్యము వలన,వారితో సంభాషించడము వలన మనలోని దుర్గుణములు తొలగిపోతాయి.మంచి వారితో కలిసి మెలసి తిరగడము వంటికి గంధము పూసుకోవడము వంటిది. శరీరములోని దుర్గంధాన్ని మంచి గంధము పూత యెలా దూరము చేస్తుందో , అలాగే సజ్జన సాంగత్యము మనలోని వలక్షణాలని దూరము చేస్తుంది
743)మంచి పుస్తకాలు నిశ్శబ్ద మిత్రులు. అవి మనకి ఎప్పుడూ అందుబాటు లో ఉండే మర్గదర్శకులు. తిరుగు లేని ఉపాధ్యాయులు.
744)ఎప్పుడైతే ఒక వ్యక్తి నిన్ను కోపకూపంలోకి దించాడో, ఆ క్షణమే అతను నిన్ను జయించినట్టు..
745)మనిషి ఆనందం కన్నా కస్టాలను సులభంగా లెక్కపెడుతున్నాడు. అదే ఆనంద క్షణాలను లెక్కించి ఉండి ఉంటే కస్టాలలో కూడా ఆనందమే కనపడి ఉండేది.
746)నాకు నచ్చిన కొన్ని మంచి వాక్యాలు మీకు కూడా నచ్చితే
1.ఒక కరెక్టు వ్యక్తిని కలుసుకోబోయే ముందు, పది మంది అనామకుల్ని విధి పరిచయం చేస్తుంది. మొదటి వ్యక్తి దగ్గరే ఆగిపోయేవాడు అనామకుడు గానే మిగిలిపోతాడు.
2.'అంతా తనదే' అన్నది మమకారము.'అంతాతనే' అన్నది అహంకారము.
3.నేడు రేపటికి 'నిన్న' అవుతుంది.నిన్నటి గురించి రేపు బాధ పడకుండా వుండాలంటే,నేడు కూడా బావుండాలి.
4.మలుపు తిరగటానికి కరెక్ట్ ప్లేస్..Dead End....'అంతే అయిపోయింది ఇంకేమీ లేదు' అనుకున్నచోట ఆగిపోకు. ప్రక్కకి తిరుగు. మరోదారి కనపడుతుంది.
5.నిన్నెవడయినా తప్పు పట్టాడంటే,నువ్వు తప్పు చేస్తునావని కాదు.నువ్వు చేస్తున్నపని వాడికి నచ్చలేదన్నమాట.
6.ఓడిపోయేవాడు ఒక్కసారే ఓడిపోతాడు.గేలిచేవాడు తొంబైతొమ్మిదిసార్లు ఓడిపోతాడు.వందసార్లు ప్రయత్నిస్తాడు కాబట్టి.
7.నిన్నటినుంచి పాఠం గ్రహించి,రేపటి గురించి కలలుకంటూ ఈ రోజుని ఆనందించు.కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్దం చేసుకోకు.ఇవ్వటంలో నీకు అనందం వుంటే ఇస్తూ అనందించు.అలా కాని పక్షంలో నీ అనందానికి అడ్డువచ్చే వారినందరిని నీ దినచర్య నుండి తోలగించు.రాజీపడి మాత్రం బ్రతక్కు.
1001)మన వద్ద సిరిసంపదలు ఉన్న లేకున్నా,అధికారం కలిగిన లేకున్నా -మంచి గుణాలు కలిగి ఉంటె ..ఎప్పటికి ఒంటరి వాళ్ళం
1002)విద్య వల్ల వినయం,వినయం వల్ల గౌరవం,గౌరవం వల్ల ధనం,ధనం వల్ల సుఖం సమకూరుతాయి.
1003)సంపాదనకైనా ,సంపాదించాలన్న ఆశకైనా ఓ పరిమితి ముఖ్యం.ఆ సంతృప్తి లేకపోతే మనస్సంతి కరువు అవుతుంది.మనం ఎంత సంపాదించినా ..అందులో ఐదుశాతమో పదిశాతమో సమజానికి కేటాయించాలన్న నిర్ణయం తీసుకుంటే,ఆ నిర్ణయాన్ని జీవిత ప్రణాళిక లో భాగం చేసుకుంటే ,మనకి ఆస్తులతో పాటు ఆత్మ సంతృప్తీ పెరుగుతుంది.
1004)వైఫల్యం నిరాశకి కారణం కాకూడదు.కోత్హ ప్రేరణకి పునాది కావాలి
1005)మనిషి ఉన్నతంగా ఎదగడానికి తనకి ప్రపంచం కావాలి.తాను ఉన్నతంగా ఎదగడానికి ఈ ప్రపంచానికి తాను కావలి.అందుకే ఈ ప్రపంచం గర్వించే విదంగా మనిషి ఎదగాలి
1006)నీకు జీవితంలో ఆనందం కావాలా...?
అయితే ఎప్పుడూ ప్రేమను అర్ధించే వానిగా ఉండకు...
ప్రేమను అందించే వానిగానే ఉండు...
అప్పుడే నీ జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది...! విశ్వ..!
1007)విజయం అంటే ఏమిటి...? ఒకే ఒక్క ముక్కలో చెప్పాలంటే...
ఏ రోజైతే నీ "సంతకం", "ఆటోగ్రాఫ్"గా రూపాంతరం చెందుతుందో...
ఆ రోజు నువ్వు నిజమైన విజయాన్ని సాధించావనే చెప్పాలి...! విశ్వ..!
1008) జననం మన జీవితానికి ప్రారంభం...
అందం మన జీవనానికి పరమార్ధం...
ప్రేమనేది మన జీవితాన ఒక భాగం...
మరణం మన జాతకానికి అంతం...
కాని స్నేహమనేది జీవన్మరణాలకు అనంతం...! విశ్వ..!
1009) కష్టాలకు భయపడితే అవి దగ్గరగా చేరి నిన్ను మారిత భయపెడతాయి...
అదే కష్టాను భయపెట్టేలా తిరగబడితే తిరిగి చూడకుండా పరుగు పెడతాయి...! విశ్వ..!
1010) నీ జీవితంలో కష్టాలనేవి నిన్ను నాశనం చేసేవి కావు...
నీలో దాగున్న ఆత్మవిశ్వాసాన్ని వెలికి తేసే సాధనాలు మాత్రమే...
కష్టానికి తెలియజేయి నిన్ను ఓడించడం కష్టానికి కష్టమేనని...! విశ్వ..!
1011)ఆలోచించు.కానీ సమయం మించిపోకముందే ఆలోచనలని పక్కనబెట్టి ఆచరణకు దిగు.
1012)నువ్వు లేకపోయినా ఉన్నట్టే...
ఎందుకంటే ఎవరైనా మన ముందు లేకపోతే...
మనం వారిని కోల్పోయామని బాధపడితే...
వారు మన హృదయంలో ఉన్నారనే అర్ధం, ఎవరికైనా అంతకన్నా ఏమి కావాలి...! విశ్వ..!
1013)విజయం మన నేస్తం కాదు. ఎప్పుడైతే కష్టపడి సాదించుకుంటామో అప్పుడే అది మన సొంతం అవుతుంది
1014)ఙ్ఞానం అనేది మనం సంపాదిస్తే వచ్చేది కాదు. మనలోని అఙ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది
1015)భోగి భోగ భాగ్యాలు.. కనుమ కనక వర్షాలు.. సంక్రాంతి పాడి పంటలు...
మీ ఇంట సంతోషాల పంట పండాలని.. సరదాల వంట వండాలని.. ఆనందాల అందాలు నిందాని...
మనస్పూర్తిగా కోరుకుంటూ "మకర సంక్రాంతి" శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను...! విశ్వ..!
1016)అపజయమే ఆలోచనలకు అంతిమ తీర్పేమి కాదు ..అలుపన్నది గెలుపుని వెతికే నీలో ప్రతిభకు రాదు..పోరాడు...పోట్లాడు...జీవితమను ఆటాడు...గెలుపును వేటాడు..
1017)విజయం సంతోషానికి కారణం కాదు.సంతోషమే విజయానికి కారణం.
1018)ఓటమిని చూసి భయపడకూడదు. ఓటమి గురువులాంటిది.ఏమి చెయ్యకూడదో ,ఎలా చెయ్యకూడదో అది నేర్పుతుంది.జీవించు నీ జీవితం.సాధించు నీ ఆశయం.తల వంచావా అపజయమే,ఎదిరించావా విజయం నీదే
1019)గెలుపు అనేది భయట దొరికే వస్తువు కాదు.అది కస్టపడి పని చేసే వారి దెగ్గర దాగి వుంటుంది.కష్టపడనిదే ఏదీరాదు.కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ నిలబడదు.అందుకనే విజయఫలం కోసం అనుక్షణం శ్రమించు,ఆ మధుర ఫలాన్ని అందుకొని ఆనదం గ ఆరగించు..సోమరితనం వీడి కష్టపడి పనిచేసినవాడి వెన్నంటువుంటుంది విజయం
1020)ఆహ్లాదకరమైన ఆలోచనలు, స్పూర్తినిచ్చే ప్రేరణలు , మంచి సంగీతం
చక్కని పుస్తకాలు, మంచి స్నేహితులు, మంచి కృషి
అవన్నీ మిమ్మల్ని సంతోషంగా ఉంటాయని గమనించండి
ఉన్నవాటిని కాపాడుకుంటూ కొత్తవాటిని సమీకరించుకోండి
1021)ఆచరణ లేని ఆలోచన,ఆలోచన లేని ఆచరణ ,రెండూ ఓటమికి కారణాలే
1022)శత్రువుని జయించాలంటే చేయెత్తి కొట్టాల్సినవసరం లేదు,వాడికి అందనంత సతికి ఎదిగితే చాలు.
1023)ఒక్క టన్ను బరువైన నిరాశ తొలగించుకునేందుకు ఒక్క చుక్క ధైర్యం చాలు .
1024)విజయం వేళ కన్నా విపత్తులోనే మనిషి గొప్పతనం భయటపడుతుంది
1025)ఒక ఆడదానికి చదువుకున్న భర్త రావడం సహజం,కానీ తనని చదివిన వాడు రావడం అదృష్టం
1026)చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనుషుల్ని మర్చిపోవచ్చు కానీ ,చేయూత నిచ్చి మనల్ని అభివృద్ధిలో పెట్టిన మనుషుల్ని మరువకూడదు
1027)గతం నుంచి పాటలు నేర్చుకుని బంగారు భవిష్యత్కోసం వర్తమానాన్ని తనకు అనుకూలంగా మలచుకున్నవాడికి విజయం తద్యం
1028)తనలోని బలహీనతలను గుర్తెరిగి బలమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రణాళికాబద్దంగా లక్ష్యాలను ఏర్పరుచుకుని ముందకు సాగినవాడే విజయం సాదిస్తాడు.
1029)జీవించిన ఈ కొద్ది పాటి ఈ జీవితంలో మనం ఏమి సాదించమన్నది మాత్రమే ముఖ్యం...
ఎన్ని ఆస్తులు సంపాదించాం, ఎన్ని అంతస్తులు నిర్మించాం, ఎన్ని లక్షలు కూడపెట్టామన్నది ముఖ్యం కాదు...
జీవించినంత కాలం ఉన్న దానితో తృప్తిగా జీవించు, ఉన్నంతలో మనస్శాంతిగా జీవించు...
ఈ భూమి మీద ఎవ్వరు శాస్వతంగా ఉండేది లేదు, ప్రేమ ఒక్కటే శాస్వతంగా ఉండేది కనుక మానవత్వంతో అందరితో ప్రేమగా ప్రేమిస్తూ జీవించు...
1030)ఎంత డబ్బున్నా ఆ డబ్బుతో కూడా కొన్ని కొనలేనివేన్నోవున్నాయి అని గమనించాలి మనం.మూడు వేళ్ళతో దానం చేస్తే ఐదు వేళ్ళతో తినగలం.పది వేళ్ళతో ఎదుటివాడికి సహాయం చేయగలిగితే పదుల వేలు సంపాదించుకోగలం.ఎంత సేపు వాడు 'నాకేం చేసాడని నేను చెయ్యాలి?' అనడం మానుకోవాలి.మనం చెయ్యడమే ప్రధానం.భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితం పదిమందికి తోడ్పడాలి.పది మంది మన మాట వల్ల ,మన చర్య వల్ల ఆనందపడాలి...ఆ ఆనందమే మన ఆరోగ్యాన్ని పెంచుతుంది.
1031)సమస్యలు లేని జీవితం ,గాలి లేని ప్రదేశం ఉండవు.
1032)మనశ్శాంతి లేని ధనికుడు కన్నా ప్రశాంతత ఉన్న నిరు పేద మిన్న ..
1033)మనం బాధపడినపుడు సంతోషం ఉండదు ..సంతోశాపడినపుడు బాధ ఉండదు...ఇవి రెండు ఒక దగ్గర ఉండవు...ఇది అర్ధం చేసుకున్నవాడు జీవితం లో పైకి వస్తాడు....
1034)ఎదుటి మనిషి దూరం అవుతాడు అని తెలిసికూడా తనతో స్నేహం చేస్తాము.....అందుకే నేమో ఈ ప్రంపంచం లో స్నేహానికి చాల విలువ ఉంది.....
1035)కొందరికి దేవుడు అన్ని ఇస్తాడు ప్రేమను తప్ప. కొందరికి ప్రేమను ఇస్తాడు అన్ని ఇవ్వడం మర్చిపోతాడు. జీవితంలో మీ జీవితానికి ఏదీ కావాలో తేల్చుకోండి....కింగ్.....
1036)పక్కవారిని ఎక్కువగా నమ్మితే నమ్మక ద్రోహం చేస్తారు ...అందుకే ఫ్రెండ్స్ ఎవరిని ఎక్కువగా నమ్మకు ...
1037)బండెడు పాండిత్యం కన్నా గుప్పెడు ధార్మిక జీవితం గొప్పది
1038)ఒకరి గుణగుణాలు పరిక్షించి చూడాలంటె అతనికి ఒకసారి అధికారం ఇచ్చి చూస్తే సరిపోతుంది
1039)చనిపోతమని తెలిసి, బ్రతుకు బండిని ఆశా చక్రాలతో నడిపే జీవితం మంది.......ఈ చిన్ని ఆశ జీవితం లో పక్కవాడితో గొడవలు అవసరమా....
1040)ఏ ప్రయత్నం చేసినా తన మీద తనకు నమ్మకం ఉంటేనే విజయం వరిస్తుంది .ప్రయత్నం చేసి ఓడిపో కాని ప్రయత్నం మానకు. అది తెలుసుకున్నప్పుడు నువ్వు సాదించలేనిది లేదు
1041)దేవుడిని నువ్వు బాగుండాలి అనుకోరుకుంటే అది స్వార్ధం ...అందరం బాగుండాలి అని కోరుకుంటే అది మంచితనం..దేవుడు ఎప్పుడు మంచితనాన్నే దీవిస్తాడు.
1042)గాలిలో దీపం పెట్టి వెలుగు దేవుడా అంటే దేవుడు కూడా కరుణించాడు.నీ ప్రయత్నం లేకుండా విజయాన్ని ఆశించడం ,పగటి పూట చుక్కలకోసం వెతకడం లాంటిది
1043)దానమంటే మన ధనం అవతలి వ్యక్తికి ఇచ్చివేయడమని అర్ధం.దానమెప్పుడు దాన్ని తీసుకునే అర్హత కలవారికే ఇవ్వాలి.ఇచ్చేశాక ఆ డబ్బు మీద మనకు మమకారం ,ఇది నాది అనే భావం ఎంత మాత్రం ఉండకూడదు ప్రతిఫలం ఆశించి చేసే సహాయం ,సహాయమే కాదు ,దానిని దేవుడు కూడా క్షమించాడు
1044)సమాజంలో ప్రతి వాడు ఆకలి తీరిన తరువాత....ఆకలి తీరింది కదా అని సంతోషపడకుండా ...మల్లి ఆకలి వేస్తే అనే ఆలోచన తో బ్రతుకుతున్నాడు.
1045) గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలను గుర్తు తెచ్చుకో ,నీవు ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాల తీయదనం రెట్టింపవుతుంది
1046)కాగితం ఏం వ్రాసినా దాన్ని తనలో దాచుకుంటుంది. కానీ కొన్ని వ్రాతలు మాత్రమే కాగితాలు దాచుకునేలా చేస్తాయి.
1047)కష్టాలతో ఎంత పోరాడగలిగితే అంత బలం మనిషికి లభిస్తుంది. కష్టాలే మనిషి విజయానికి సోపానాలు.మనిషిలోని యుక్తి ,శక్తీ కష్టాలు వచినప్పుడే అవి భయట పడతాయి .
1048)మనస్సును అదుపులో ఉంచుకోవటం అలవరచుకుంటే ,కోరికలను అదుపు లో ఉంచుకున్నట్లే.అప్పుడు మనిషి ఈ ప్రపంచాన్ని జయించినట్లే.
1049)ఏదీ లభించినా ,ఎంతో కొంత లభించినా ,ఆ లభించిన దానితో సంతృప్తి చెందుతూ ,బ్రతికినంత కాలం 'నాది' అనే భావన కలగకుంటే మన జీవితం ఆనందదాయకమవుతుంది.
1050)తోటివారి కష్టాలను తన కష్టాలుగా చూసినవాడు,తోటి వారి సంతోషమే తనదిగా ఎంచినవాడే గొప్పవాడు
1051)ప్రపంచంలో భారి విజయాలు సాధించిన వారంతా జీరో నుండి ప్రారంబించినవారే . అవకాశాల కోసం ఎదురుచూడవద్దు ,సృష్టించు కొండి .
1052)ఆన్ లైన్లో సంభంధాలనేవి అరిటాకుల్లాంటివి....
తిన్నంతసేపూ తృప్తిగా తినాలేకాని.. బాగుందని కంచంలా కడిగి కలకాలం దాచుకోవాలనుకోవడం....
మూర్ఖత్వమే అవుతుంది.
1053)విజయాన్ని నిరంతరం నిలబెట్టుకోవడమే విజేతకు ఎదురయ్యే అసలైన సవాల్.
1054)సంకల్పం మంచిది అయితే సాధించే శక్తి దానంతట అదే వస్తుంది
1055)గొప్ప మనస్సుగలవాడు పరిస్థితులు తారుమారు అయినప్పుడు
ఇబ్బందులకు లోనై కిందపడినా ,బంతిలా మళ్ళీ పైకి ఎగురుతాడేగాని నేలకు
అతుక్కొని ఉండిపోడు.అందుకే మనం బంతిలా ఉండడానికి ప్రయత్నించాలే గాని మట్టిముద్దలా కాదు
1056)విజయం ఒక గమ్యం కాదు .గమనం మాత్రమే .ఎన్ని సార్లు ఓడిపోయిన వ్యక్తికైనా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది.
1057)జీవితంలో జయాలు,అపజయాలు ఉంటాయి.విజయం కోసం ఓటమిని ఎదుర్కొనక తప్పదు.ఓటమి గెలుపునకు స్ఫూర్తి కావలి కానీ నిరాస కాకూడదు
1058)ప్రతి మనిషికి జీవితంలో సమస్యలు వస్తువుంటై,పోతువుంటై.ఆ సమస్యలకే మనం భయపడి,భాదపడి ,మన చుట్టూ ఉన్నవాళ్ళని భాదపెట్టకుండా
1059)మనస్సే ఒక అందాల బృందావనం ..అనుకుంటూ జీవితంలో విలువైన ప్రతి నిమిషాన్ని ,సంతోషం సగం బలం అంటూ హాయిగా నవుతూ బ్రతికితే ఈ జీవితం సఫలము రాగసుధ మధురము అవుతుంది
1060)తనను తాను మలచుకొని సర్దుకు పోగాలగినవాడే ఈ ప్రపంచములో బ్రతకటం తెలిసినవాడు
1061)మంచిని తలపెట్టి ఆశయ సాధనకై అడుగు ముందుకు వేస్తే జయం వెన్నంటేవుంటుంది.అపజయం ఆమడ దూరం పారిపోతుంది
1062)ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పనిని నిజాయితీగా చెయ్యాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే.
1063)విజయం తలుపు తెరిచేవరకు విసుగే చెందకు...విసుగే చెంది నిస్పౄహతో నీ వెనుకే చూడకు ...చిందే చమట చుక్కకు సైతం ఉంది ఫలితమే...అది అందే వరకు సహనంతో సాగాలి మన జీవిత పయనమే
1064)కాయలు కాచిన చెట్టు కొమ్మలు వంగి వేలాడుతుంటాయి. గొప్పవాడివి కావాలనుకుంటే వినయంగా, నిరాడంబరంగా ఉండాలి
1065)ఒక మంచి వాక్యం రాస్తే దానిని ఎంతోమంది చదువుతారు. వాళ్లు చదివేటప్పుడు చదువు రాని వాళ్లు విని తెలుసుకుంటారు. వాళ్లు చెప్పగా మరికొంతమందికి తెలుస్తుంది. అలా అది లక్షలమందికి తెలిసే అవకాశం ఉంటుంది. అంటే ఆ మంచివాక్యంలోని విషయం అన్ని మెదళ్లకు చేరుతుంది. ఆలోచింప చేస్తుంది. ఆ మేరకు వాళ్ల ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. అక్షరం అంత విలువైనది
1066)మంచిని తలపెట్టి ఆశయ సాధనకై అడుగు ముందుకు వేస్తే జయం వెన్నంటేవుంటుంది.అపజయం ఆమడ దూరం పారిపోతుంది
1067)సుఖం - దుక్కం , వేడుక-వేదన ,గెలుపు -ఓటమి ,లాభం -నష్టం వీటి సమ్మేళనమే జీవితం .గెలుపు వచ్చినప్పుడు పొంగిపోకుండా,ఓటమి వచ్చినప్పుడు కుంగిపోకుండా సమతుల్యతతో జీవితం సాగించే ప్రతి మనిషి గొప్పవాడే అన్నాడో మహా కవి.
1068)మేఘంనుంచి జాలువారిన ప్రతి చినుకూ ముత్యం కాకపోయినా- ఏ చిన్ని మొలకకో ప్రాణం పోస్తుంది. ఎండు ఆకైనా ఒకరి కడుపు నింపేందుకు విస్తరిగా మారుతుంది. ఈ విశాల సృష్టిలో పుట్టిన ప్రతీ జీవి బతుక్కీ ఒక అర్థమూ, పరమార్థం ఉంటాయి. అది తెలుసుకున్నవారి జీవితం చరితార్థమవుతుంది
1069)హరివిల్లులో ఏడు రంగులుంటాయి. ఆ సప్తవర్ణాల సమ్మేళనంతో ఆహ్లాదం, ఆనందం వెల్లివిరుస్తాయి. ఆ హరివిల్లు ఏర్పడాలంటే ఎండావానా రెండూ కావాలి. సంతోషం దుఃఖం, మంచి చెడు, ఆశ నిరాశల సమ్మేళనమే జీవితం. అలా ప్రతికూల, అనుకూల పరిస్థితులతోనే ప్రతి జీవి బతుక్కీ స్థిరత్వమూ, సార్థకతా! అవే మనిషిని స్థితప్రజ్ఞుడిగా నిలబెడతాయి. అందుకే జీవితం ఒక హరివిల్లు
1070)మనం ఇతరులకు ఏమి ఇస్తామో, అదే మనకు దక్కుతుంది. ఆనందం ఇస్తే ఆనందం, బాధ కలిగిస్తే బాధ. ఈ లోకం నుంచి ఏది కావాలని కోరుకుంటామో అదే లోకానికి ఇవ్వాలి. మనం కోరుకున్నదే మనకు దక్కుతుంది. 'యద్భావం తద్భవతి'. మనం శుభం జరగాలని మనసా వాచా కర్మణా వాంఛిస్తే అదే జరుగుతుంది. అంచేత అందరికీ మంచే జరగాలని కోరుకుందాం. సమస్త మానవాళి సుఖసంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో సుఖంగా జీవించాలని దీవించే పవిత్ర వేదప్రవచనాన్ని మననం చేసుకుందాం.
సర్వే జనాః సుఖినోభవంతు... లోకాః సమస్తాః సుఖినో భవంతు!
1071)కష్టాలు ..కన్నీళ్లు ..సంబరాలు …కేరింతఃలు....ఇవి అన్ని ఒక మనిషి జీవితం లో ఉంటేనే కదా ఆది పరిపూర్ణం అవుతుంది ….!! :)
1072)తీసుకోవడం కన్నా ఇవ్వడంలోనే సంతృప్తి వుంది. అధికారం కన్నా సేవే పవిత్రం
1073)ఒక లక్ష్యసాధనకై శ్రమిస్తునప్పుడు ఫలితాలు అనుకూలంగా లేవని,దానినొక అవమానంగా భావిస్తూ క్రుంగిపోవడం కంటే స్థిరచిత్తంతో అవమానాల్ని సైతం ఎదుర్కుంటూ సాగిపోయినవారే జీవితంలో విజేతలుగా మిగులుతారు.
1074)మంచి ఆలోచనలకి మనస్సు తలుపులెప్పుడు తెరిచే ఉంచాలి.చెడు ఆలోచనలకు తావివ్వకుండా స్థిరచిత్వంతో మనస్సును అడుపులో పెట్టుకున్నవాడికి ప్రతి కార్యంలోను విజయం చేకూరుతుంది.శ్రమకు తగ్గ ఫలితం వచ్చి మనిషి యొక్క వ్యక్తిత్వానికి పరిపూర్ణం వస్తుంది
1075)పట్టుదలా , పరిశ్రమా ఉంటే సాధించలేనిదేమీ లేదు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనుకున్నది సాధించండి. కష్టపడితే విజయం మీ కోసం ఎదురుచూస్తుంటుందని మరిచిపోకండి
1076)మంచి ఆలోచనలకి మనస్సు తలుపులెప్పుడు తెరిచే ఉంచాలి.చెడు ఆలోచనలకు తావివ్వకుండా స్థిరచిత్వంతో మనస్సును అడుపులో పెట్టుకున్నవాడికి ప్రతి కార్యంలోను విజయం చేకూరుతుంది.శ్రమకు తగ్గ ఫలితం వచ్చి మనిషి యొక్క వ్యక్తిత్వానికి పరిపూర్ణం వస్తుంది
1077)సంపదలు కోల్పోతే తిరిగి సాధించుకోవచ్చు కానీ ఆత్మ విశ్వాసం, ధైర్యం కోల్పొతే మాత్రం తిరిగి సాధించుకోలేము,అందుకని నీలోని ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు.
1078)కష్టాలనేవి గురువు వంటివి. మనకు జీవిత సత్యాలను బోధించదానికి, ఓర్పు, సహనం, విశ్వాసం వంటి సద్గుణాలను నేర్పడానికే వస్తాయి. వాటిని చిరునవ్వుతో ఎదుర్కొని అధిగమించాలే కాని బెంబేలెత్తి పారిపోకూడదు
1079)ఎదుటివారి గొప్పదనాన్ని తెలుసుకోకుండా అయిన దానికి, కానిదానికి అహంకారం తో విర్రవీగడం, ప్రతీవారు తన కంటే అల్పులని భావించి మిడిసిపడితే అది వారి పతనానికే నిదర్శనం అని గుర్తుంచుకోవాలి. వినయ విధేయతలు మనిషికి అందానిచ్చే ఆభరణాలు..
1080)ఆడదాన్ని గౌరవించడం పురుష లక్షణం, అలా గౌరవించని మగాడు పురుషుడూ కాడు మానవుడూ కాలేడు...
1081)విజయం సాధించుటకు తగిన మూల రహస్యం,సూత్రం తమలోనే వున్నదని గ్రహించి పట్టుదల, దీక్ష తపనలతో క్రమబద్ధమైన ప్రణాళికతో ధైర్యే సాహసే లక్ష్మీ అంటూ ముందుకు సాగిన వారికే అనితర సాధ్యమైన విజయాలు సొంతమవుతాయి
1082)ప్రేమించాలనే కోరిక అందరికీ ఉంటుంది కాని ప్రేమించగలిగే అర్హత కొందరికే ఉంటుంది...! విశ్వ..!
1083)నిజాయితీగా పని చేసేవారికి కాలం తప్పక అనుకూలిస్తుంది .కాకపోతే సహనం తో వేచి వుండాలి.
1084)పాలకులు నిష్పక్షపాతం గా తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తూ, బంధుప్రీతికి, అవినీతికి తావ్వివక నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుపడితే దేశం అత్యున్నతం గా పురోగమిస్తుంది.
1085)జీవితానికొక గమ్యం, లక్ష్యం చాలా ముఖ్యం.ఆ లక్ష్య సాధనకు నిర్ధుష్ట్యమైన ప్రణాళిక ఉండి శక్తి సామర్ధ్యాలను కూడ గట్టుకొని కష్టాలకు,సమస్యలకు చెదరక చెక్కు చెదరని ఆత్మ విశ్వాసం తో కార్య సాధనే ధ్యేయం గా ఏకోన్ముఖం గా
ముందుకు సాగితే అనితర సాధ్యమైన కార్యములను సాధించుట సాధ్యం." కృషితో నాస్తి దుర్భిక్షం."
1086)మనిషి ఓ పని మొదలు పెట్టాక ఒక్కోసారి ఫలితం కనపడకపోవచ్చు.అయినా మనోబలంతో అదే పనిని తదేకంగా చేస్తూపోతే తప్పక ఫలితం చేకూరుతుంది .మనిషి తన మార్గాన్ని మార్చుకోవచ్చు కానీ,లక్ష్యాన్ని మార్చుకోకూడదు ..అదే విజేతల లక్షణం.
1087)ప్రయత్నిచకుండా,శ్రమించకుండా కీర్తిశికరాలను అధిరోహించినవారు ఎవ్వరు చరిత్రలో లేరు ,కాబట్టి కష్టే ఫలి:,నువ్వు ఎంత కష్టపడతావో అంతే ఫలితం
1088)రేవులో వుండడం ఓడకి క్షేమమే .కానీ ఓడ తయారుయ్యింది రేవులో ఉండడానికి కాదు కదా కాబట్టి ప్రతి ఒక్కరు వారి వారి లక్ష్యాలని మర్చిపోకుండా గమ్యాలని చేరుకునేల ప్రయత్నించాలి.
1089)ఉన్నవాడికి ఎన్ని మేడలున్న చాలదు,ఎంత బంగారమున్న తృప్తి చాలదు ,ఎంత ఆదాయం వస్తున్న సరిపోదు ,వారెవరికో ఇంత వుంది కనుక తనకు రావట్లేదన్న బాధతో అశాంతి తో తను సంతోషంగా వుండలేకున్నాడు.
ఉన్న స్థితిలో నువ్వు సంతోషంగా లేకపోతే నువ్వెక్కడికి వెళ్ళినా ,ఎలా మారినా సంతోషంగా ఉండలేవు. ,ఉన్నంతలోనే ప్రతిఫలం ఆశించకుండా ఇతరులు యొక్క కష్టాలని తమ కష్టాలు అని పంచుకున్నప్పుడే పరిపూర్ణ ఆనందం దక్కుతుంది.సంతోషమనేది ఒక మానసిక స్థితి మాత్రమే అది ఎక్కడ నుంచో రాదు.
ప్రతి రాయిలోను ఒక శిల్పం దాచుకొని ఉంటుంది. సుత్తితో బద్దలు కొడితే శిల్పం రాదు.. ఉలి తొ చెక్కాలి. అప్పుడే ఆ రాయిలోనుంచి అపురూపమైన శిల్పం బయటపడుతుంది.. అలాగే ప్రతి మనిషి జీవితం లొ అతీతమైన శక్తి దాగుంటుంది. దాన్ని ఎప్పుడైతె గుర్తిస్తామో మనమంటే ఏమిటో నిరూపించుకోవచ్చు..
జీవితం అంటే అర్దం-పరమార్దం; ఈ రెండు కలిస్తేనే జీవితం. మనిషి పుట్టడం అర్దం, జీవించడం పరమార్దం.
ఆకలేస్తుంది అని అన్నం తినడం ప్రకృతి; ఆకలేస్తుంది అని ఎదుటివాడిని దోచుకొని తినడం వికృతి; ఆకలేస్తుంది అని ఎదుటివారికి పెట్టి తినడం సంస్కృతి.
లక్ష్యం అని నిర్దేశించుకున్నాక అది సాధించే తీరాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎదురొడ్డి నిలవడమే కాని తలొగ్గి మడమ తిప్పవద్దు.
మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు.
ఆత్మ విశ్వాసంతో ఆశించేదేదైనా నిత్య జీవీతంలొ నిజమౌతుంది.
జీవితం లొ సర్వం కోల్పోయినా ఒకటి మాత్రం మిగిలే ఉంటుంది, అదే భవిష్యత్తు.
పూలలొ సువాసన, మనిషిలొ యోగ్యత దాచినా దాగవు.
అవకాశం రావడం గొప్ప కాదు, అవకాశం నిరూపించుకోవడం గొప్ప .
ఆలోచన వికసించే పుష్పం, ఆలాపన దానికి అంకురం, ఆచరణయే ఫలం.
వైఫల్యం నిరాశకు కారణం కాకుడదు, క్రొత్త ప్రేరణకు పునాది కావాలి.
వెలిగే దీపమే ఇతరులను వెలిగించగలదు, నిరంతరం నేర్చుకునేవారే ఇతరులకు నేర్పగలరు.
చివరగా మరొకటి,
సద్వచనాలు విని ప్రయోజనం లేదు. వాటిని నిత్యజీవితంలో ఎంతవరకు ఆచరణలోనికి తెస్తున్నామనేదే ముఖ్యం.[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము