ధర్మ సాధనం
శరీరమాధ్యం ఇధం ఖలు ధర్మసాధనం" : ధర్మమును సాధించుటకు ఈ శరీరము ఒక మాధ్యమముగా ఉన్నది. ఎవరైనా ఒక వ్యక్తిగాని, సంఘటితమైన శక్తిగాని, సంస్థగాని, ధర్మమును చేపట్టుటకు మైదటగా కావలసినది క్షాత్రబలము. ప్రతిఒక్కరు ధర్మమును చేపట్టవలనంటే శరీర దారుఢ్యమును పెంచుకొన వలెను. తనను తాను సంరక్షించుకొనగల కౌశలమును నేర్చుకొన వలసివుంటుంది. అందువలన శరీరమును ఆరోగ్యముగాను, దృఢముగాను, శక్తివంతముగాను, మలచుకొనడం మన ప్రథమ కర్తవ్యము.
"ధర్మో రక్షతి రక్షితః" : ఎవ్వరు ధర్మమును రక్షించెదరో వారని ధర్మమే రక్షించును. ఇది సనాతన సత్యము. ధర్మము అనగా దైవీగుణములతో జీవితము గడుపుట. ( అనగా ప్రేమ, దయ, నిజాయితీ, శారీరకముగా, మానసికముగా హింస చేయకుండుట, త్యాగము, ఒప్పుకొన్న పనులను సక్రమమైన మార్గములో అంకిత భావముతో చేయుట, నమ్మిన వారిని కాపాడుట, మానవసేవయే మాధవసేవగా భావన చేయుట, ప్రకృతి ధర్మములను ఉల్లంఘించకుండుట, మంచి చేయుట, మంచిగా వుండుట, ప్రకృతిని పరిరక్షించుట, మొదలైనవి) ధర్మము సుఖశాంతులను ప్రసాదించును. అధర్మము వినాశనమునకు దారి తీయును. అధర్మమును ఖండించుటకు, ఎదిరించుటకు, పోరాడే వ్యక్తి గాని, సంఘటిత శక్తిగాని, సంస్థగాని, మొదట ధర్మమువైపుగా ఉండాలి.( They must be just and the cause must be just).
"మనోబలం, దైవబలం, పూర్ణబలం": ఎంత క్షాత్ర బలము వున్ననూ, ధర్మము వైపు వున్ననూ, మనోబలం, దైవబలము లేని పోరాటము, జయము పోందుట సంశయాస్పదము. అందువల్ల ధర్మమును ప్రతిపాదించు వారికి అచంచల మనోబలము ఉండవలెను. ఈ అచంచల మనోబలము దైవబలము (అనుగ్రహము) వలననే సాధ్యముగును. ఏ ధర్మ పోరాటంలో దైవబల సహాయం ఉన్నదో ఆ పోరాటం జయప్రదం అవుతుందనడంలో సందేహము లేదు. ఇదంతా ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో చూడవచ్చును.
పాండవులు సంపూర్ణ క్షాత్రబల సంపన్నులైనను, వారికి యుద్ధనైపున్యము తెలిసియున్నను, వారి యుద్ధము ధర్మయుద్ధమైయున్నది, అధర్మమును ప్రతిపాదించబోయిన దుర్యోధనుని, ఆతని బలమును ఖండించడం పాండవుల క్షాత్ర ధర్మమై ఉన్నది (They faught for just cause). పాండవులకు మనోబలము పరిపూర్ణముగా ఉన్ననూ, వారు ధర్మయుద్ధము చేయుట వలన, ధర్మస్థాపనకై పోరాడుట వలన సాక్షాత్ దైవమే వారికి సహాయముగా నిలిచెను. అందువలన పాండవులు ధర్మబలం, మనోబలం, దైవబలం మూడింటిని కలిగి యున్నందువల్ల యుద్ధంలో అతిరథ మహారథులను, ఎక్కువ సైన్యసంపత్తిని కలిగిన దుర్యోధనుని ఓడించి విజయము సాధించినారు. చివరికి ధర్మమే జయించినది.
ఈ కారణము వలన దైవబలములేని మానవ ప్రయత్నాలు, పోరాటములు ఎంత శక్తివంతమైనము జయము లభించదని తెలియుచున్నది. మనోబలము, దైవబలము పోందుటకు ప్రతి ధార్మిక వ్యక్తిగాని, సంఘటిత శక్తికిగాని, సంస్థకుగాని అతి సులువువైన సాధనామార్గము తపస్సు(ధ్యానము) మాత్రమే. పూర్వములో మన మునులు, ఋషులు ఈ తపోబలము వలననే సర్వమునూ జయించిరని మన పురాణాల వల్ల తెలియుచున్నది. ప్రస్తుతము చరిత్రలో మనకు కనిపించునది విద్యారణ్యులవారు. వీరి తపోబలము వలననే విజయనగర సామ్రాజ్యమును స్థాపించబడినది. స్వకళ్యాణమునకు, మానవ కళ్యాణమునకు, విశ్వకళ్యాణమునకు తపస్సు మూలధనము (Capital). కావున ఈ తపోబలము పోందుటకు కేవలం ధ్యానం వలన మాత్రమే సాధ్యముగును. ధ్యానం చేయండి. ధర్మాన్ని నిలపండి. జీవిత సాపల్యం పొందండి.

Comments
Post a Comment